23 April 2021

భారతదేశంలోని ముస్లింలు తమను తాము శక్తివంతం చేసుకోవాలి’ ‘Muslims in India need to empower themselves’

 


భారత దేశం లో ముస్లిములు అతి పెద్ద మైనారిటీ వర్గం. దేశ జనాభా లో ముస్లిం జనాభా దాదాపు 200 మిలియన్లు.  ముస్లిం సమాజం పట్ల అనుసరిస్తున్న  ప్రభుత్వ విధానాలు "సరిపోవు" కాబట్టి భారతదేశంలోని ముస్లింలు తమను తాము సాధికారత సాధించడానికి కృషి చేయాలి.ముస్లింలు తమ సమాజ అభివృద్ధి కోసం ముందుకు సాగాలి. ధనవంతులు మరియు అధికారం కలిగిన ముస్లింలు సమాజంలో అవసరమైన వారికి విద్య మరియు ఉపాధి అవకాశాలను సులభతరం చేయడానికి ముందుకు రావాలి.

 మంచి విద్య వారిని ఉపాధి రంగంలో పోటీదారునిగా చేస్తుంది. ప్రధాన జీవన స్రవంతిలో కలిసిపోవడానికి సహాయపడుతుంది.

చాలామంది ముస్లింలు అభద్రత అనుభవిస్తున్నారు. ఇది మతతత్వ రాజకీయాల పెరుగుదలతో ముడిపడి ఉన్న దృగ్విషయం. ముస్లింలు  తమ పేలవమైన విద్యా మరియు ఉపాధి కారణంగా, ద్వేషానికి మరియు హింసకు గురిఅవుతున్నారు.

కొందరు ముస్లింలు. ఉలేమా [పండితులను] తమ స్వభావం లేదా ఇంగితజ్ఞానం కంటే ఎక్కువగా విశ్వసిస్తారు, ఇది ఫత్వా కుటీర పరిశ్రమ సృష్టికి దారితీస్తుంది. ఆధునికత మరియు పరస్పర సహజీవనాన్ని స్వీకరించడం వారి విశ్వాసానికి విరుద్ధం కాదని ముస్లిములకు తెలియజేయాలి.

ముస్లిమేతరులు కూడా ఇస్లాం గురించి వారు ఆలోచించేవన్నీ సరైనవి కాదని, ఇస్లాం అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి వారు ముస్లింలతో కలిసి మెలగాలి. ముస్లింలు మరియు ఇతరుల మధ్య సంభాషణ వారధి నిర్మించబడాలి.,


దేశంలో ముస్లింల పట్ల  "అవగాహన మరియు వాస్తవికత" మధ్య చాలా అంతరం ఉంది.

"భారత ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ముస్లింలు సామాజికంగా,విద్యాపరంగా  భారతదేశంలో అత్యంత వెనుకబడిన వర్గాలలో ఉన్నారు. వాస్తవికత ఇలా ఉన్నప్పటికీ, ముస్లింలు మెప్పించిన మైనారిటీ appeased minority అని విస్తృతమైన అభిప్రాయం ఉంది. . దీనికి తోడు, ముస్లింలకు వ్యతిరేకంగా చేస్తున్న  ప్రచారం - రాడికల్, అసహనం, ఉగ్రవాది – ఇవ్వన్ని పూర్తి అబద్ధం మీద ఆధారపడినవి మరియు  వాస్తవాలు కాదు

అవగాహన మరియు వాస్తవికత మధ్య ఉన్న ఈ భారీ అంతరం మనం తగ్గించాల్సిన అవసరం ఉంది."


No comments:

Post a Comment