నేను ఒక ముఖ్యమైన ప్రశ్నతో ఈ వ్యాసాన్ని ప్రారంభిస్తాను
మీరు ఈ
ప్రపంచంలో ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తారు?
తల్లిని ఎక్కువగా ప్రేమిస్తున్నానని అందరూ
చెబుతారని నేను అనుకుంటున్నాను.
ఇప్పుడు ఇక్కడ ఒక హదిసును ప్రస్తావిస్తాను:
·
ఒక వ్యక్తి తన వద్దకు వచ్చి అడిగినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో
ఇలా అన్నారు:
ఓ దేవుని దూత! నా
మంచితనం కు ఎవరు అర్హులు?
ప్రవక్త (స): నీ తల్లి.
ఆ వ్యక్తి మళ్ళిఅడిగాడు?:
ప్రవక్త (స),:“నీ తల్లి.
ఆ వ్యక్తి మరల అడిగాడు,ఆ తరువాత ?
ప్రవక్త (స),: “నీ తల్లి”
ఆ వ్యక్తి అడిగాడు, ఆ తరువాత ఎవరు?
అప్పుడు మాత్రమె “నీ తండ్రి” అని ప్రవక్త (స) అన్నారు.. -(అల్-బుఖారీ మరియు ముస్లిం).
ఇక్కడ మరొక
హదీసును కూడా పరిశీలిద్దాము:
ఇది ప్రవక్త(స) యొక్క మరొక అంత్యంత ప్రసిద్ధ హదీసు.
·
“తల్లి పాదాల క్రింద స్వర్గం ఉంది.” (అల్’నిసా’యి, ఇబ్న్ మజా, అహ్మద్).
పై హదీసుల ఆధారంగా మనమందరం మన తల్లిని ఎక్కువగా ప్రేమిస్తున్నామని చెప్పగలను.
కానీ నన్ను ఇంకో ప్రశ్న అడగనివ్వండి?
మన తల్లి కంటే మనం ఎక్కువగా ప్రేమించే వారు ఎవరైనా
ఉన్నారా?
దీనికి సమాధానంగా తల్లి కంటే అల్లాహ్ ను ఎక్కువగా ప్రేమిస్తాము
అని అంటాము.అందరు నాతో అంగీకరిస్తారని అనుకుంటున్నాను.
ఒక రోజు ఉదయం మీరు మీ ఇంటిని వదిలి, పనికి
వెళ్ళారని అనుకుందాం మరియు మీరు తిరిగి వచ్చినప్పుడు మీ పొరుగువారు మీ తల్లిని తిట్టారని/వేధించారని abused
తెలిసింది.
అప్పుడు మీరు ఏమి చేస్తారు? అనే ప్రశ్న నేను
అడుగుతున్నాను.
నేను చాలా మందికి ఈ ప్రశ్న వేసాను మరియు ప్రతిఒక్కరి సమాధానం లో దూకుడు ఉంది (మేము వారిని కొట్టాము / కొడతాము / తిడతాము మొదలైనవి).
ఇది సహజo ఎందుకంటే మనo మన తల్లి
ని ప్రేమిస్తున్నo కాబట్టి
మనం
ఎందుకు ఈ డబుల్ స్టాండర్డ్ కలిగి ఉన్నాము?
ఒక వైపు మనం మన తల్లి కన్నా అధికంగా అల్లాహ్ ను
ప్రేమిస్తున్నామని చెప్తున్నాం కాని ఎవరైనా అల్లాహ్ ను తిడితే/ఆగౌరవపరుస్తే
ఉరుకొంటాము ? కాని, ఎందుకు?
కొందరు అల్లాహ్ కు ఒక
కుమారుడు పుట్టాడని అంటున్నారు.
దివ్య ఖుర్ఆన్ లో పేర్కొన్నట్లు ఇది అల్లాహ్
పట్ల ఘోరమైన అపవాదు:
·
“కరుణామయుడు ఎవరినో కుమారరునిగా చేసుకొన్నాడు అని
వారు అంటారు- ఎంత ఘోరమైన విషయాన్ని మీరు కల్పించి తెచ్చారు. కరుణామయునికి సంతానం ఉన్నదని
వారు చేసే వాదం కారణంగా. త్వరలోనే ఆకాశాలు పగిలిపోతాయేమో, భూమి బ్రద్దలవుతుందేమో, పర్వతాలు పడిపోతాయేమో!
ఎవరినైనా కుమారునిగా చేసుకోవటం అనేది కరుణామయుని ఔనత్యానికి తగినది కాదు.- (19: 88-91]
మనం దీనికి తగిన సమాధానం ఇవ్వగలం.మన చేతుల్లో సోషల్
మీడియా (ఇంటర్నెట్, వాట్సప్ మొదలైనవ )
సాధనాలు ఉన్నాయి. సమాధానం ఇవ్వటం కోసం దయచేసి వాటిని ఉపయోగించండి!
దావా యొక్క అవసరాన్ని మీరు ఇప్పుడు అర్థం
చేసుకున్నారని ఆశిస్తున్నాను.
దివ్య ఖుర్ఆన్ చెప్పినట్లు:
·
“మీలో మంచివైపునకు పిలిచేవారూ, మేలు చెయ్యండి అని
ఆజ్ఞాపించేవారూ, చెడు నుండి వారించే వారూ కొందరు తప్పక ఉండాలి. ఈ పనిని చేసే వారే సాఫల్యం పొందుతారు.”-(3: 104]
అల్లాహ్ మనందరికీ మార్గనిర్దేశం చేస్తాడు. (అమీన్)
No comments:
Post a Comment