సుజౌ నగరం
పాత నగరమైన సుజౌలోని ప్రాంతాలు చైనాలో ఇస్లాం
యొక్క సుదీర్ఘ చరిత్ర యొక్క చారిత్రక శకలాలు. ఇవి ఇస్లాంను ఒకప్పుడు చైనా చక్రవర్తులు ఎక్కువగా
గౌరవిoచారనే వాస్తవాన్ని స్పష్టం చేస్తాయి.
వ్రాతపూర్వక రికార్డులు మరియు చక్రవర్తులు వేయించిన శిలా పలకాల ద్వారా ఇస్లామిక్ సమాజాలు ముఖ్యంగా
టాంగ్ (క్రీ.శ. 618-907), యువాన్ (1271-1368), మింగ్ (1368) -1644) మరియు క్వింగ్ (1644-1912) (Tang
(618-907 AD), Yuan (1271-1368), Ming (1368-1644) and Qing (1644-1912) dynasties) రాజవంశాల చక్రవర్తుల అభిమానాన్ని పొందాయని
స్పష్టమవుతోంది - ఇస్లాంను దాని నైతికత కారణంగా ఇంపిరియల్ కోర్ట్స్ ఆదరించగా చక్రవర్తులు
సామ్రాజ్య భూభాగాల్లోని విభిన్న ప్రజల
మధ్య సామరస్యపూర్వక మరియు శాంతియుత సంబంధాల దృష్ట్యా ప్రోత్సహించారు.
పశ్చిమ చైనాలో 19 వ శతాబ్దం రెండవ భాగంలో పాంథే మరియు తుంగన్Panthay and Tungan తిరుగుబాటులకు
ముందు, మిలియన్ల మంది ముస్లింలు చంపబడినప్పుడు లేదా
పునరావాసం పొందినప్పుడు, ఇస్లాంను దేశంలోని క్రైస్తవ మిషనరీలు - మరియు
ముఖ్యంగా రష్యన్ పండితులు - పెరుగుతున్న ముప్పుగా భావించారు. చైనాలో ఇస్లాం జాతీయ
మతంగా మారే అవకాశం ఉందని-ఇది చైనాను ప్రపంచంలోనే అతిపెద్ద ఇస్లామిక్ దేశంగా మారుస్తుందని
పడమటి పండితులు చాలామంది భావించారు
ఇస్లాం మరియు చైనా:
13 వ శతాబ్దంలో సుజౌ నగరాన్ని పింగ్జియాంగ్ అని
పిలిచేవారు.సుజౌ అనేది షాంఘై నుండి కేవలం 20 నిమిషాల దూరం(హై స్పీడ్ రైల్లో) గల 12 మిలియన్ల జనాభా కలిగిన సంపన్న నగరం.
"ఇస్లామిక్ సుజౌ" యొక్క అవశేషాలు నగర గోడ వెలుపల వాయువ్య దిశలో ఉన్నాయి.
ఉత్తర వాణిజ్య మరియు వినోద జిల్లా షిలు Shilu లో ప్రస్తుతం పనిచేసే ఒకే ఒక మసీదు తైపింగ్‌ఫాంగ్ Taipingfang ఉంది.
తైపింగ్ఫాంగ్ Taipingfang మసీదు 2018 లో పునరుద్ధరించబడింది మరియు స్థానిక మరియు
సందర్శించే ముస్లింలు ప్రార్థన కోసం వెళ్ళే ప్రదేశంగా నిలిచింది. . తైపింగ్‌ఫాంగ్ ప్రాంతం
లో సుజౌనగరంలోని ముస్లిం మైనారిటీలు అధికంగా నివసిస్తారు.
1949 కి ముందు, సుజౌలో వివిధ
పరిమాణాలు మరియు సామాజిక ప్రాముఖ్యత కలిగిన కనీసం పది మసీదులు ఉన్నాయి. వాటిలో
చాలా విలువైన ఫర్నిచర్ మరియు అధునాతన అలంకరణలతో కూడిన విస్తారమైన భవనాలు, మరికొన్ని చిన్న ఆత్మీయ ప్రార్థన గదులు. వాటిలో
ఒకటి మహిళా ఇమామ్ అధ్యక్షతన మహిళల మసీదు.
మహిళల మసీదు, బయోలిన్కియాన్ Baolinqian, క్వింగ్ రాజవంశం సమయంలో నిర్మించిన నాలుగు
మసీదుల సమూహాలలో ఒకటి, ఇవన్నీ నగరం యొక్క వాయువ్య భాగంలో నగర గోడల లోపల
సంపన్న యాంగ్ కుటుంబంతో అనుసంధానించబడి ఉన్నాయి. 1923 లో నిర్మించిన ఇది యాంగ్ కుటుంబానికి చెందిన
ముగ్గురు వివాహిత మహిళల చొరవతో స్థాపించబడింది, వారు ఈ భవనాన్ని
విరాళంగా ఇచ్చారు మరియు ఇతర ముస్లిం కుటుంబాల నుండి నిధులను సేకరించారు, దీనిని మహిళల మసీదుగా మార్చారు. సాంస్కృతిక
విప్లవం సమయంలో (1966 నుండి 1976 వరకు), పవిత్ర గ్రంథాలను కలిగి ఉన్న మసీదు యొక్క
లైబ్రరీ దెబ్బతింది మరియు భవనం ప్రైవేట్ గృహాలుగా మార్చబడింది. ఈనాడు మసీదు అని
చూపించడానికి అక్కడ ఏమీ లేదు.
1879 నుండి 1881 వరకు క్వింగ్
చక్రవర్తి గ్వాగ్క్సు Qing emperor Guagxu మూడేళ్ళ పాలనలో మరొక యాంగ్ కుటుంబ మసీదు నిర్మించబడింది.
ఇది ఏడు ప్రాంగణాలను కలిగి 3,000 చదరపు మీటర్ల
విస్తీర్ణంతో సుజౌలో అతిపెద్ద మసీదు. శుక్రవారం ప్రార్థనల ప్రధాన హాలులో పది గదులు
ఉన్నాయి మరియు 300 మందికి పైగా ప్రార్ధన చేయవచ్చు. ప్రాంగణంలో ఒక
మినార్ మరియు పెవిలియన్ ఉన్నాయి, ఇక్కడ ఒక ఇంపీరియల్ శాసనం imperial stele కూడా కలదు.
డా టిజునుంగ్ Da Tiejunong లోని పూర్వ మసీదు భవనం సాంస్కృతిక విప్లవం
సందర్భంగా మిడిల్ స్కూల్ గా మార్చబడింది. పూర్వం
చెట్లతో నిండిన ప్రధాన ప్రాంగణం
ఇప్పుడు ఒక భారీ ఫుట్‌బాల్ మైదానం గా మారింది. నీలిరంగు పలకలతో కప్పబడిన అబ్ల్యూషన్
ప్రాంతం/వజూ ఖానా మసీదు యొక్క గత ఉనికిని
స్పష్టంగా చూపిస్తుంది.
టియాన్‌కుకియన్ మసీదు Tiankuqian Mosque 1906 లో నిర్మించబడింది మరియు ఇప్పుడు అక్కడ పేద నగరవాసులు నివసిస్తున్నారు ఈ మసీదు దాదాపు 2 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రధాన హాల్, గెస్ట్ హాల్ మరియు అబ్లూషన్ గదిని కలిగి ఉంది. ప్రధాన హాలు యొక్క నిర్మాణం ఒక పెద్ద ఉపన్యాస స్థలం లాగా ఉంది - స్థానిక చారిత్రక రికార్డుల ప్రకారం ఈ మసీదు మొత్తం చైనాలో అత్యంత సంపన్న మసీదు. అయితే 1920 లలో, ఇస్లామిక్ మరియు కన్ఫ్యూషియన్ గ్రంథాలను బోధించే పాఠశాల అక్కడ ప్రారంభించబడింది.
ఇక్కడి అనేక మసీదులలో ముస్లిం పిల్లలకు అరబిక్
భాష మరియు ఇస్లామిక్ రచనలను బోధించే అనుబంధ పాఠశాలలు ఉన్నాయి. చైనీస్ భాషలో
ఇస్లామిక్ గ్రంథాలు ప్రచురించబడిన మొదటి సాంస్కృతిక కేంద్రాలలో సుజౌ ఒకటి. 16 వ శతాబ్దపు సుజౌ పండితులు, జాంగ్ జోంగ్ Zhang Zhong మరియు జౌ
షికి Zhou Shiqi పెర్షియన్ నుండి చైనీస్లోకి అనువాదాలు
చేశారు, ఈ నగరాన్ని ఇస్లామిక్ మేధో సంస్కృతికి
ప్రారంభ కేంద్రంగా మార్చారు.
మరొక పురాతన సుజౌ నగర మసీదు, జిగువాన్ Xiguan,, 13 వ
శతాబ్దంలో యువాన్ రాజవంశం సమయంలో నిర్మించబడింది మరియు ఇది
ప్రముఖ ముస్లిం సయ్యద్ కుటుంబం మరియు
ప్రభావవంతమైన యున్నాన్ యొక్క ప్రాంతీయ గవర్నర్ సయ్యద్ అజల్ షామ్స్ అల్-దిన్ ఒమర్
అల్-బుఖారీ (1211–1279) చేత ఆర్ధిక సహాయం చేయబడింది.ఈ మసీదు తరువాత
మింగ్ రాజవంశం సమయంలో ప్రభుత్వ భవనంగా మార్చబడినది అని స్థానిక చైనీస్ రికార్డులు చెబుతున్నాయి.
యువాన్ రాజవంశం తన పరిపాలన మరియు ప్రభుత్వ సేవలలో
మధ్య ఆసియా నుండి వచ్చిన ముస్లింల పట్ల మొగ్గు చూపింది. ఈ గణనీయమైన జనాభా సమూహం తరువాత, 1950లలో, చైనాలో హుయ్ మైనారిటీగా వర్గీకరించబడింది మరియు
వారు ఈ రోజు చైనా ముస్లింలలో సగం మంది వరకు ఉన్నారు
సాంస్కృతిక విప్లవం చైనాలో ఇస్లాంను
నిషేధించింది, తత్ఫలితంగా, ఈ మత భవనాల శిధిల అవశేషాలు నేడు గత
జీవితానికి ప్రతీకలుగా నిలిచినవి. ఈ
ప్రదేశాలు విభిన్న సామాజిక మరియు ఆధ్యాత్మిక భౌగోళికానికి ఆధారాలు.
అమెరికన్ సినాలజిస్ట్ sinologist, ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో చరిత్ర
ప్రొఫెసర్ అయిన ఫ్రెడరిక్ మోట్Frederick Mote, ప్రకారం సుజౌ యొక్క గతం పదాలలో ఉంది మరియు సుజౌ ఇస్లామిక్ సమాజాల శకలాలు
చారిత్రక వ్రాతపూర్వక రికార్డుల లో ఉంటాయి.భవిష్యత్తుకు ఈ రికార్డులు ముఖ్యమైనవి.
No comments:
Post a Comment