25 April 2021

దావా(ధర్మ ప్రచార) ఆవశ్యకత The Need of Daw’ah

 


ఇస్లాం సార్వజనిక ధర్మం  అని చాలా మంది ముస్లింలకు తెలుసు. అల్లాహ్ (swt) మొత్తం విశ్వానికి ప్రభువు, మరియు  ఆయన సందేశాన్ని మానవజాతి అందరికీ తెలియజేసే బాధ్యతను ముస్లింలకు అప్పగించబడినది..

కానీ, చాలా మంది ముస్లింలు ఈ విధి నిర్వహించుట లేదు. ఇస్లాం ఉత్తమమైన జీవన విధానంగా అంగీకరించినప్పటికీ, మనలో చాలామంది దీనిని ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడుట లేదు..

అరబిక్ పదం దావా అంటే పిలుపు  లేదా ఆహ్వానం అని అర్ధం. ఇస్లామిక్ అర్ధం లో, ఇస్లాం ప్రచారం కోసం కృషి చేయడం అని అర్థం.

దివ్య ఖుర్ఆన్ ఇలా చెబుతోంది:

అల్లాహ్ అప్పగించిన సాక్షాన్ని దాచేవ్యక్తి కంటే పరమ దుర్మార్గుడు ఎవరు? మీ చేష్టలను అల్లాహ్ గమనించకుండా ఉండటం లేదు.[ 2: 140]

ఈ శాంతి సందేశాన్ని (ఇస్లాం) తెలియజేయమని అల్లాహ్ (swt)దివ్య  ఖుర్ఆన్ లో ముస్లిములకు) ఆజ్ఞాపించాడు:

దివ్య ఖుర్ఆన్ లో అల్లాహ్ (swt) ఇలా అంటాడు:

మీలో మంచివైపునకు పిలిచేవారూ, మేలు చెయ్యండి అని ఆజ్ఞాపించేవారూ, చెడు నుండి వారించే వారూ కొందరు తప్పకుండా ఉండాలి. ఈ పని చేసేవారే సాఫల్యం పొందుతారు”- [3: 104]

ఇస్లాం సందేశాన్ని అందించడానికి, సంభాషణ మరియు చర్చ అనివార్యం అవుతుంది.

దివ్య  ఖుర్ఆన్ ఇలా చెబుతోంది:

ప్రవక్తా! నీ ప్రభువు మార్గం వైపునకు ఆహ్వానించు, వివేకం తో చక్కని హితబోధతో, ప్రజలతో ఉత్తమోతమైన రీతి లో వాదించు.” -(16: 125]

అల్లాహ్ మనందరికీ మార్గనిర్దేశం చేస్తాడు (అమీన్).


No comments:

Post a Comment