13 April 2021

జీవితంలో బలమైన ప్రేరణ పొందడానికి సహాయపడే 10 దివ్య ఖురాన్ ఆయతులు 10 Holy Quran Reflections to Get Strong Motivation in Life

 


పవిత్ర ఖురాన్ మనం జీవితంలోని ప్రతి దశలో మనకు  ఆశను మరియు అంతర్గత బలాన్ని పెంచడానికి కావలసిన సానుకూల ధృవీకరణలను అందిoచును. జీవితం లోని కొన్ని సమయాల్లో, మనమందరం ప్రతికూల ఆలోచనలు మరియు నిరుత్సాహాన్ని ఎదుర్కొంటాము. ఆ సమయం లో దివ్య ఖురాన్ పఠనం నిరాశను తొలగించి జీవితం పట్ల సానుకూల వైఖరిని ఏర్పరుచును.

పవిత్ర ఖురాన్ ఆయతులు మనకు ఉత్తమ మార్గదర్శక విధానం సూచించును.  ఖురాన్ ఆయతుల పారాయణం  ప్రతికూలతను పూర్తిగా అదృశ్యం చేస్తాయి మరియు హృదయ శాంతిని ఇస్తాయి



అల్లాహ్ స్మృతితో  జీవితంలో  బలమైన ప్రేరణ పొందడానికి సహాయపడే 10 పవిత్ర ఖురాన్ ఆయతులు:

·       1:" మేము నిన్నే ఆరాధిస్తాము, సహాయం కొరకు నిన్నే అర్దిస్తాము. " (1: 5).

పైన వివరించిన ఆయత్ మనకు అన్ని ఆశలను ఇస్తుంది మరియు జీవితంలోని ప్రతి దశలో అల్లాహ్‌పై మన నమ్మకాన్ని బలపరుస్తుంది.

 

·       2:నమాజును స్థాపించండి. జకాత్ ఇవ్వండి. మీ భవిష్యత్తుకోసం మీరు చేసి ముందుగా పంపించే సత్కార్యాలను మీరు అల్లాహ్ వద్ద చూస్తారు. మీరు చేసేదంతా అల్లాహ్ దృష్టిలో ఉంది.”(2: 110).

మనం చేసే మంచి పనులను అల్లాహ్ చూస్తాడు.అల్లాహ్  నుండి ఏ పని దాచబడదు. ప్రతి చిన్న పనికి తగిన  ప్రతిఫలం లభిస్తుంది మరియు ఈ ఆలోచన దయతో జీవించడానికి సానుకూల మార్గాన్ని ఇస్తుంది.

 

·       3:“మానవుల పట్ల అల్లాహ్ కు ఎంతో కరుణ, వాత్సల్యం ఉన్నాయనే విషయం నిశ్చయంగా నమ్మండి.” (2: 143)

సర్వశక్తిమంతుడైన అల్లాహ్ అత్యంత దయగలవాడు, కరుణగలవాడు.సర్వశక్తిమంతుడైన అల్లాహ్ మనలను అమితంగా  ప్రేమిస్తున్నాడు మరియు అతను మన తప్పులను పట్టించుకోడు.

 

·       4:“కనుక మీరు నన్ను జ్ఞాపకం పెట్టుకోండి. నేను మిమ్మల్లి జ్ఞాపకం పెట్టుకొంటాను.”(2: 152)

మనం అల్లాహ్‌ను స్మరిస్తే, అతను మనలను గుర్తుంచుకుంటాడు.ఈ ఆయత్ మనం అల్లాహ్‌ను స్మరించే స్థితిలో ఉండటానికి ప్రేరేపిస్తుంది.

 

·       5.“కష్టకాలం దాపురించినప్పుడు, మేమoతా అల్లాహ్ కు చెందినవారము, అల్లాహ్ వైపునకే మరలిపోవలసిన వారము” అని అనేవారికి శుభవార్తలు తెలుపు.”(2: 156)

మనం ఒక సమస్యను ఎదుర్కొన్నప్పుడు, మనమంతా  అల్లాహ్ కు చెందినవారమని  మరియు ఆయన వైపునకు మరలిపోవలసినవారము అని తెలుసుకోవడం చాలా ఓదార్పునిస్తుంది. మన జీవిత సమస్యలన్నీ తాత్కాలికమేనని, మనమందరం సర్వశక్తిమంతుడైన అల్లాహ్‌ వద్దకు తిరిగి వస్తామని, పరలోక జీవితం శాశ్వతంగా ఉంటుందని గుర్తు చేసుకోవడం ఎంత మధురంగా ఉంది.

 

·       6:నా దాసులు నన్ను గురించి నిన్ను అడిగితే నేను వారికి అత్యంత సమీపంలోనే ఉన్నానని, పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు నేను అతని పిలుపును వింటాను. సమాధానం పలుకుతాను అని, ఓ ప్రవక్తా నీవు వారికి తెలుపు. కనుక వారు నా సందేశం విని దానిని స్వికరించాలి.  నన్ను విశ్వసించాలి.(ఈ విషయం నీవు వారికి వినిపించు) వారు ఋజుమార్గం పొందే అవకాశం ఉంది.”(2: 186).

అల్లాహ్ మనకు దగ్గరగా ఉన్నాడు మరియు అతను మన ప్రార్థనలకు ప్రతిస్పందిస్తాడు.మనం సంతోషంగా ఉన్నాము లేదా విచారకరమైన సమయాన్ని ఎదుర్కొంటున్నాము, మనం అల్లాహ్‌ను ప్రార్ధించి మన విషయాలన్నీ ఆయనకు చెప్పాలి మరియు ఆయన మాత్రమే మన మాట వింటాడు మరియు వారికి పరిష్కారాలను అందిస్తాడు.

·       7:"అల్లాహ్ విశ్వాసులకు సంరక్షకుడు,సహాయకూడును. ఆయన వారిని కటిక చికట్లనుంది వెలికి తీసి వెలుగు చూపిస్తాడు." (2: 257)

అల్లాహ్ మన  మిత్రుడు మరియు మనకు మార్గనిర్దేశం చేస్తాడు. జీవితంలోని ప్రతి దశలో, మనకు ఆయన మార్గదర్శకత్వం అవసరం మరియు సర్వశక్తిమంతుడైన అల్లాహ్  తప్ప మరెవరూ సహాయం చేయలేరు. ఈ ఆలోచన నిజంగా అల్లాహ్ సహాయంపై మన నమ్మకాన్ని పెంచుతుంది.

 

·       8:ఇలా అను: “ఓ అల్లాహ్! విశ్వసామ్రాజ్యదిపత్యానికి ప్రభూ! నీవుకోరినవారికి ప్రభుత్వాదికారాన్ని ప్రసాదిస్తావు. నీవు కోరిన వారినుండి దానిని లాక్కుoటావు. నీవు కోరినవారికి గౌరవాన్ని ప్రసాదిస్తావు. నీవు కోరిన వారిని ఫరాభవం పాలు చేస్తావు. శుభాలు నీ ఆధీనం లో ఉన్నాయి. నిస్సందేహంగా నీకు అన్నిoటిపైన అధికారం ఉంది.  ”(3:26).

అల్లాహ్ నియంత్రణాదికారి. ప్రతిదానిపై ఆయనకు అధికారం ఉంది.అల్లాహ్ అన్నింటికీ బాధ్యత వహిస్తున్నాడు మరియు ఈ జ్ఞాపకం నిత్య ఆశను ఇస్తుందని  గుర్తు చేసుకోండి.

 

·       9:"ముస్లిములారా! మీరు ధన ప్రాణాలకు సంభందించిన పరీక్షను తప్పకండా ఎదుర్కొంటారు. గ్రంధ ప్రజలనుండి, ముష్రికులనుండి మీరు కష్టం కలిగించే అనేక మాటలు వింటారు. ఈ పరిస్థితులలో మీరు గనుక సహనం తో, భయభక్తులతో నిలకడగా ఉంటె, ఇది ఎంతో సహనం కూడుకొన్నకార్యం.  (3: 186). ”

మనమందరం జీవితంలో పరీక్షలను ఎదుర్కొంటాము మరియు మనం ఓపికగా ఉండి అల్లాహ్‌ను స్మరించుకుంటే అంతా బాగానే ఉంటుంది.

ఈ ఆయత్ మనం ఎదుర్కోబోతున్న పరీక్షల గురించి వివరిస్తుంది మరియు గొప్ప సహనంతో మరియు ఆశతో అల్లాహ్ వైపు తిరిగేటప్పుడు జీవిత వాస్తవికతను అంగీకరించడానికి మనకు  సహాయపడుతుంది.

 

·       10:అల్లాహ్ ఇలా సెలవిస్తాడు. “ఈ రోజు సత్యవంతులకు వారి సత్యం లాభాన్ని ఇస్తుంది. క్రింద కాలువలు ప్రవహించే ఉద్యానవనాలు వారికి లబిస్తాయి. అక్కడ వారు ఎల్లప్పుడూ ఉంటారు. వారు అల్లాహ్ అంటే ఇష్టపడతారు. అల్లాహ్ వారంటే ఇష్టపడతాడు. ఇదే గొప్ప విజయం. ”(5: 119).

సర్వశక్తిమంతుడైన అల్లాహ్ నిజాయితీపరులను ప్రేమిస్తాడు మరియు సత్యవంతుడు కావడం వలన మనకు మనశ్శాంతి మరియు హృదయ శాంతి లభిస్తుంది.

పైన వివరించిన అన్ని ఆయతులు అన్ని మనకు సానుకూల ధృవీకరణలు మరియు ధర్మబద్ధమైన మార్గానికి మార్గనిర్దేశం చేస్తాయి. పవిత్ర ఖురాన్ పారాయణం మన విశ్వాసాన్ని బలోపేతం చేస్తుంది  మరియు జీవిత సమస్యలనుండి  ఎదుర్కోవటానికి సర్వశక్తిమంతుడైన అల్లాహ్ దయ మనకు లబించుగాక.

 

ముగింపు: జీవితం పట్ల నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంపొందించే హదీసు ఇక్కడ ఉంది.

·       ప్రవక్త ఇలా అన్నారు, “నిజమే, అల్లాహ్ ఆరాధన పరిపూర్ణత, అల్లాహ్ గురించి మంచి ఆలోచనలు కలిగి ఉండటం.-(తిర్మిజి , 48/240)

 

 

 

.

 

No comments:

Post a Comment