19 July 2021

110 మసీదులు, 4 చర్చిలు మరియు ఒక ఆలయాన్ని నిర్మించిన వాస్తుశిల్పి గోవిందన్ గోపాలకృష్ణన్ Govindan Gopalakrishnan, an architect, who constructed 110 mosques, 4 churches and a temple

 


 

 

దక్షిణ కేరళతీర ప్రాంతంలోని ప్రతి ప్రధాన పట్టణoలో  ప్రముఖ వాస్తు శిల్పి గోవిందన్ గోపాలకృష్ణన్ రూపొందించిన మస్జిద్ మినార్లు లేదా  డోమ్ లను చూడవచ్చు.

తిరువనంతపురంలో లోని బీమాపల్లి మసీదు నుండి కరుణగప్పల్లిలోని తాజ్ మహల్-ప్రేరేపిత షేక్ మసీదు వరకు, అనేక మసీదులను 85 ఏళ్ల, స్వయం-బోధన వాస్తుశిల్పి గోవిందన్ గోపాలకృష్ణన్ రూపకల్పన చేసారు. ఆరు దశాబ్దాలకు పైగా, గోవిందన్ గోపాలకృష్ణన్ 110 మసీదులు, 4 చర్చిలు, ఒక ఆలయం మరియు అనేక ఇళ్లకు రూపకల్పన చేసారు    మరియు మసీదు మనిషిఅనే పేరు సంపాదించాడు

గోవిందన్ గోపాలకృష్ణన్ పనిచేసుకొనే టేబుల్ పై భగవద్గీత, ఖురాన్, బైబిల్ మరియు ఇతర మత గ్రంథాల కాపీలు ఉన్నాయి మరియు అవి అతని నిర్మాణ రూపకల్పనలకు ప్రేరణ గా  ఉన్నాయి..అతని నిర్మాణ రూపకల్పనా  నైపుణ్యం 1940లలో పాఠశాలకు వెళ్ళే సమయంలో తన తండ్రి  ప్రసిద్ద కాంట్రాక్టర్ అయిన శ్రీ  కె. గోవిందన్ వద్ద ప్రారంభం అయినది.

గోపాల కృష్ణన్ నిర్మాణంలో మెలుకువలు నేర్చుకోవటానికి తన తండ్రి పని సైట్‌లను సందర్శించేవారు.. బిల్డింగ్ డ్రాయింగ్ యొక్క ప్రాథమిక సూత్రాలను  గోపాల కృష్ణన్ ఆంగ్లో-ఇండియన్ డ్రాఫ్ట్స్‌మన్ అయిన ఎల్.ఎ.సాల్దాన్హా నుండి నేర్చుకున్నారు .గోపాలకృష్ణన్. ఇంజనీరింగ్ లేదా ఆర్కిటెక్చర్ చదవ లేదు. AMIE కోర్సులో చేరినప్పటికీ దానిని పూర్తి చేయలేదు. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ బిల్డింగ్ డివిజన్లో వేతనం లేని అప్రెంటిస్‌గా SAT హాస్పిటల్ బిల్డింగ్ ప్రాజెక్ట్‌ లో పనిచేశాడు. ఇది క్రాఫ్ట్ మరియు టెక్నిక్‌లను నేర్చుకోవడానికి నాకు సహాయపడింది అని గోపాల కృష్ణన్ అన్నారు.

 ‘మసీదు మనిషి గా ఆప్యాయంగా పిలబడే గోపాల కృష్ణన్   నిర్మాణ ప్రయాణం తిరువనంతపురంలోని పాలయం నుండి ప్రారంభమైంది, పాలయం ధార్మిక సామరస్యంకు నెలవు.  అక్కడ ఒక మసీదు, ఒక ఆలయం మరియు ఒక చర్చి ఒకదానికొకటి పక్కన ఉన్నాయి.

1960ప్రారంభంలో పాలయం మసీదు కమిటీ మసీదును పునర్నిర్మించాలని నిర్ణయించినప్పుడు, గోపాల కృష్ణన్   తండ్రి మసీదు నిర్మాణ కాంట్రాక్ట్ తీసుకొన్నారు. కేరళ యొక్క మొట్టమొదటి చీఫ్ ఇంజనీర్ టి.పి.కుట్టియము మసీదు డిజైన్ సమకూర్చారు. మసీదు నిర్మాణం లో గోపాల కృష్ణన్     తన తండ్రికి పనిచేయడం ద్వారా సహాయం చేశాడు.

ఆరోజులలో నిర్మాణాలకు ముందుగా అడ్వాన్సు చెల్లించే పద్దతి లేదు.  మస్జిద్ నిర్మించడానికి గోపాల కృష్ణన్ తండ్రి వద్ద తగినంత డబ్బు లేదు దానితో వారు  తాము ఇల్లు నిర్మిస్తున్న పి.పి.చమ్మర్ అనే క్రైస్తవుడి సహాయం కోరారు.. అతను వెంటనే అంగీకరించాడు. ఆ విధంగా, హిందూ వాస్తుశిల్పులచే  ఒక క్రైస్తవుడి ఆర్థిక సహాయంతో పాలియం మసీదు నిర్మాణం ప్రారంభమైంది. అప్పటి భారత అధ్యక్షుడు జాకీర్ హుస్సేన్ 1967 లో మసీదును ప్రారంభించారు.

అప్పటి వరకు ఈ ప్రాంతంలోని చాలా మసీదులు కేరళ నిర్మాణ శైలిలో టైల్డ్ పైకప్పులతో నిర్మించబడ్డాయి. డిల్లి లోని సఫ్దర్‌జంగ్ సమాధి నుండి ప్రేరణ పొంది డోమ్  మరియు మినార్‌లతో పాలయం మసీదు రూపకల్పన జరిగింది.

1967లో, బీమపల్లి మసీదు కమిటీ, మసీదు పునర్నిర్మాణానికి డిజైనర్‌గా ఉండటానికి గోపాల కృష్ణన్ ను సంప్రదించింది.పెర్సీ బ్రౌన్ యొక్క ఇండియన్ ఆర్కిటెక్చర్ (ఇస్లామిక్ పీరియడ్) నుండి ఇండో-సారాసెనిక్ ఆర్కిటెక్చర్ యొక్క ప్రాథమిక పాఠాలను నేర్చుకొని గోపాల కృష్ణన్ మసీదు పని ప్రారంభించాడు. నిర్మాణానికి 17 సంవత్సరాలు పట్టింది. మసీదు నిర్మాణం పూర్తిగా విరాళాలపై ఆధారపడి జరిగినది.  

లోటస్/తామర ఆకారంలో, భారీ ముఖభాగం మరియు భారీ గోపురాలతో గోపాల కృష్ణన్ నిర్మించిన పింక్ పాస్టెల్ రంగు-నిర్మాణం ఇప్పటికీ అనేకులచే  ప్రశంసించబడుతుంది..

అతను చేపట్టిన మరో ప్రధాన మసీదు పునర్నిర్మాణ పనులలో ఎరుమెలీలోని వావర్ మసీదు ఉంది. ఇక్కడ శబరిమల అయ్యప్ప ఆలయానికి వెళ్ళే యాత్రికులు నివాళులు అర్పిస్తారు.. నమాజ్‌కు ఇబ్బంది కలగకుండా మసీదును ప్రదక్షిణ చేయడానికి హిందూ యాత్రికులకు అనువుగా పైకప్పు గల వరండాతో సహా డిజైన్ ట్వీక్‌లను  గోపాల కృష్ణన్ చేసారు. గోపాల కృష్ణన్ రూపొందించిన కొన్ని మసీదులు తిరునెల్వేలి, దిండిగల్ మరియు మలబార్ ప్రాంతంలో ఉన్నాయి

మసిడులతో పాటు పతనమిట్ట జిల్లాలోని చందనాపల్లిలోని సెయింట్ జార్జ్ ఆర్థోడాక్స్ చర్చిని కూడా రూపకల్పన చేసి గోపాల కృష్ణన్ నిర్మించాడు. దీని కోసం అతను వాటికన్లోని సెయింట్ పీటర్స్ బసిలికా నుండి ప్రేరణ పొందాడు. తిరువనంతపురం లోని లెనిన్ నగర్ లో తన ఇంటికి సమీపంలో రథం ఆకారంలో ఉన్న అలుంకండం భద్రకళి ఆలయం కూడా నిర్మించాడు..

గోపాల కృష్ణన్ మత సామరస్యం కు ప్రతినిధి. అతని భార్య ఎన్.జయ క్రిస్టియన్. అతని ముగ్గురు పిల్లలలో ఇద్దరు ఇతర మతాలు లేదా కులాలకు చెందిన వారిని వివాహం చేసుకున్నారు. వివిధ వర్గాల మధ్య సహనం మరియు సోదర సంబంధాలను ప్రోత్సహించడానికి 2002 లో గోపాల కృష్ణన్ మానవ మైత్రిఅనే సామాజిక సంస్థను ప్రారంభించారు. ప్రస్తుతం గోపాల కృష్ణన్  న్జన్ కంద ఖురాన్’ (ది ఖురాన్ ఐ సా(The Quran I Saw),)అనే  పుస్తకం  యొక్క మొదటి భాగాన్ని పూర్తి చేశాడు.

దివ్య ఖురాన్ బోధలను  గురించి ఎక్కువ మంది తెలుసుకోవడానికి వీలుగా గోపాల కృష్ణన్ డిజైన్ చేసిన షేక్ మసీదులో అరబిక్ అoదమైన కాలిగ్రఫీలు  మలయాళంలో కూడా చిత్రిoచబడినవి.  గోపాల కృష్ణన్ ఆశయం సంఘాల మధ్య దూరాన్ని తగ్గించడం మరియు అపార్థాలను తొలగించడం. మతం మీద చాలా అనవసర పోరాటం ఉంది, ”అని గోపాలకృష్ణన్ అంటారు..

No comments:

Post a Comment