14 July 2021

బాగ్దాద్ సంక్షిప్త చరిత్ర-అద్భుత పెరుగుదల మరియు పతనం A Short History of Baghdad: Magnificent Rise and it’s Tragic Fall

 

 

ఇరాక్ ను చారిత్రాత్మకంగా నాగరికత యొక్క యలఅని పిలుస్తారు. ఇది మానవులు మొదటిసారిగా ఒకే చోట స్థిరపడిన ప్రదేశం. టైగ్రిస్ మరియు యూఫ్రటీస్ నదుల చుట్టూ సారవంతమైన భూమి ఉన్నందున ఇది సాధ్యమైంది. మెసొపొటేమియా అని కూడా పిలువబడే ఈ భూమి బాబిలోనియా, అస్సిరియా మరియు అక్కాడియన్ సామ్రాజ్యం వంటి గొప్ప ప్రాచీన సామ్రాజ్యాల పెరుగుదల మరియు పతనం చూసింది. ఇస్లాం విస్తరణలో భాగంగా, క్రీ.శ 638 లో ముస్లిం సైన్యం అప్పటి సస్సానిడ్ సామ్రాజ్య పాలకుడిని  ఓడించి  బాగ్దాద్ ను ఆక్రమించినది.

 

ప్రారంభంలో  విస్తారమైన ముస్లిం సామ్రాజ్యంలో ఇరాక్ ఒక ప్రావిన్స్‌గా ఉండేది.  కాని 8వ శతాబ్దంలో అబ్బాసిడ్ కాలిఫేట్ విస్తరణతో అబ్బాసిద్ ఖలీఫా  అల్-మన్సూర్ తన రాజధానిని జూలై 30, 762 పశ్చిమ టైగ్రిస్ ఒడ్డున మదీనాట్-అల్-సలామ్ (శాంతి నగరం) అని అధికారికంగా పిలువబడే కొత్త నగరం బాగ్దాద్‌కు తరలించినాడు.

 

మధ్యయుగ ప్రపంచంలోని అతిపెద్ద పట్టణ కేంద్రంగా బాగ్దాద్ వేగంగా అభివృద్ధి చెందింది మరియు ఆర్థిక మరియు మేధో శక్తి కేంద్రంగా మారింది. బాగ్దాద్ నగరం అనేక పుస్తకాల షాపులు మరియు పబ్లిక్ లైబ్రరీలను కలిగి జ్ఞానం కోసం వెతుకుతున్న విద్యార్థులకు కేంద్రంగా మరియు ప్రపంచ విజ్ఞానికి కేంద్రబిందువుగా మారింది. బాగ్దాద్  నగరం రాబోయే ఐదువందల సంవత్సరాలు వివిధ గొప్ప సంప్రదాయాలకు మరియు సంస్కృతులకు కేంద్రంగా మారింది.

 

చెంఘిజ్ ఖాన్ మనవడు మంగోల్ పాలకుడు హులాగుఖాన్ చేత జయించబడటానికి ముందు, ఈ కాలాన్ని ముస్లిం స్వర్ణయుగం అని పిలుస్తారు..

 

11 వ శతాబ్దం ఖతీబ్ అల్-బాగ్దాదీ (అక్షరాలా బాగ్దాద్ నుండి లెక్చరర్ అని అర్ధం) నగరం చుట్టూ ఉన్న అద్భుత భావాన్ని ఉత్తమంగా వివరించాడు: "మొత్తం ప్రపంచంలో, పరిమాణం మరియు వైభవంతో బాగ్దాద్‌తో పోల్చదగిన నగరం ఏదీ లేదు,  విద్వాంసులు మరియు గొప్ప వ్యక్తులు,  రహదారులు, మార్కెట్లు, దారులు, మసీదులు, స్నానపు గృహాలు మరియు దుకాణాలు  ఇవన్నీ నగరాన్ని ఇతర నగరాలనుండి నుండి వేరు చేస్తాయి.

బాగ్దాద్ నగరం యొక్క రూపకల్పన పట్టణ ప్రణాళికలో ఒక అద్భుతం మరియు దీనిని "ఇస్లామిక్ ప్రపంచంలో గొప్ప నిర్మాణ ప్రాజెక్ట్" అని పిలుస్తారు. టైగ్రిస్ ఒడ్డున ఉన్న బాగ్దాద్ శాంతితో సందడిగా ఉండే మహానగరం మరియు యుద్ధంలో బలమైన కోట రెండింటినీ అందిస్తుంది అని అల్-మన్సూర్ గ్రహించారు. జ్యామితి యొక్క యూక్లిడియన్ సూత్రాలలో బాగా ప్రావీణ్యం ఉన్న అల్-మన్సూర్ బాగ్దాద్ నగర నిర్మాణాన్ని నిశితంగా పర్యవేక్షించారు.

అబ్బాసిడ్ రాజధాని బాగ్దాద్ నడిబొడ్డు 'రౌండ్ సిటీ', ఇందులో రాజభవనం, ప్రధాన మసీదు మరియు కొన్ని పరిపాలనా భవనాలు మరియు సైనిక దళాల గృహాలు  ఉన్నాయి అదనపు భద్రత కోసం బాగ్దాద్ నగర బయటి గోడలు లోతైన నీటి మార్గంతో బలపరచబడ్డాయి మరియు రింగ్ చేయబడ్డాయి. కేంద్రం నుండి సమానమైన నాలుగు ద్వారాలు నిర్మించబడ్డాయి, ఇవి కేంద్రంతో సరళమైన రహదారుల ద్వారా అనుసంధానించబడి, నగరం లోపల లేదా వెలుపల ఏవైనా ఇబ్బందులను సులభంగా గుర్తించడానికి సెంట్రీలకు అవకాశాన్ని కల్పిస్తాయి. యూఫ్రటీస్‌ను టైగ్రిస్‌తో అనుసంధానించే శరత్ Sarat కెనాల్ నగరం నుండి మురుగు నీటి పారుదలకి కూడా సహాయపడింది. నాలుగు ప్రధాన రహదారులు నగరానికి ప్రధాన బజార్లు (మార్కెట్లు) గా పనిచేశాయి. మధ్యలో గ్రేట్ మసీదుతో రాయల్ ప్రాంగణం మరియు రాయల్ ప్యాలెస్ 130 అడుగుల ఎత్తైన పచ్చని గోపురం చుట్టూ మైళ్ళ దూరం  నుండి కనిపిస్తుంది.

 

మధ్య ఆసియాను తూర్పు భూములతో అనుసంధానించే వాణిజ్య మార్గంలో బాగ్దాద్ నిర్మించబడినందున, ఇది ముస్లిం ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుండి మాత్రమే కాకుండా యూరప్ మరియు భారతదేశం మరియు చైనా వంటి దూర దేశాల నుండి వస్తువులను అందించే మార్కెట్లతో వాణిజ్య కేంద్రంగా మారింది. అబ్బాసిడ్ కాలిఫేట్ యొక్క రాజధాని కావడంతో, ఇది ప్రపంచంలో కేంద్ర స్థానాన్ని పొందింది. ఇది అన్ని రకాల ప్రజలను నగరానికి ఆకర్షించడానికి దారితీసింది, మరియు నగరం లో సాహిత్యం మరియు జ్ఞానం ప్రవహించింది.

 

అబ్బాసిడ్ బాగ్దాద్ నగరంలో ప్రఖ్యాత హౌస్ ఆఫ్ విజ్డమ్ (బైతుల్ -హిక్మా) తో సహా ప్రపంచంలోని అత్యుత్తమ విద్యాసంస్థలు ఉన్నాయి మరియు 'లెర్నింగ్ సెంటర్' గా ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని పొందాయి. నగరంలో బహుళ జాతి మరియు బహుళ మతపరమైన వాతావరణం కూడా ఉంది.

ఖలీఫా  హరూన్ అల్-రషీద్ ప్రఖ్యాత బైతుల్- హిక్మా (హౌస్ ఆఫ్ నాలెడ్జ్) Bayt-al Hikma (House of knowledge) ను స్థాపించాడు, ఇది ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న అన్ని విజ్ఞానాల కేంద్రంగా మారింది. గ్రీకు, సిరియాక్, భారతీయ మరియు పెర్షియన్ మూల గ్రంధాలకు  ఇక్కడ అనువాదం జరిగేది. బైతుల్- హిక్మా ముస్లింలకు మాత్రమే కాకుండా యూదు మరియు క్రైస్తవ పండితులకు కూడా శాస్త్రాలు మరియు మానవీయ శాస్త్రాల యొక్క అసమానమైన అధ్యయనాన్ని అందించింది మరియు తొమ్మిదవ శతాబ్దం నాటికి, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విజ్ఞాన/పుస్తకాల కేంద్రంగా మారింది. బాగ్దాద్ ఒక పెద్ద కాస్మోపాలిటన్ నగరంగా మారింది. మైఖేల్ కూపర్సన్ తన బాగ్దాద్ ఇన్ రెటోరిక్ అండ్ నేరేటివ్‘Baghdad in Rhetoric and Narrative’’ లో బాగ్దాద్ ను ప్రపంచ కేంద్రంగా పేర్కొన్నాడు. మరొక పండితుడు అబూ-అల్ ఖాసిం (11 వ శతాబ్దం) ప్రకారం బాగ్దాద్ నగరం ప్రపంచవ్యాప్తంగా  ప్రశంసాలు పొందినది అన్నాడు.

 

క్రీ.శ 809 లో ఖలీఫా హరున్ మరణించిన తరువాత, అతని కుమారుడు అల్-మామున్ తన సోదరుడు అల్-అమీన్ చేత అధికారం కోసం జరిగిన పోరాటంలో చంపబడ్డాడు. ఈ అంతర్గత పోరాటాలు బాగ్దాద్‌లోని కాలిఫేట్ బలహీనపడింది బాగ్దాద్ వైభవాన్ని క్షిణిoపజేసినాయి.

  

చెంఘిజ్ ఖాన్ కాలం నుండి బాగ్దాద్ తూర్పున ఉన్న  మంగోలుల  ముప్పును ఎదుర్కొంటోంది, చెంఘిజ్ ఖాన్ వారసులు మధ్య ఆసియా మరియు చైనాలో గొప్ప భాగాన్ని పాలించారు.క్రీస్తుశకం 1254లో రెండు లక్షల భారీ సైన్యంతో మంగోలు ప్రభువు హులగు ఖాన్ మధ్యప్రాచ్యంలో నైలు నది వరకు జయించటానికి బయలుదేరాడు.,

 

1258 లో, బాగ్దాద్‌ను ఇల్ఖనేట్ మంగోల్ దళాలు మంగోల్ కమాండర్ హులగు ఖాన్ నేతృత్వంలో ముట్టడించారు. ఈ ముట్టడి జనవరి 29 నుండి ఫిబ్రవరి 10 వరకు 13 రోజుల పాటు కొనసాగింది. ఖలీఫా  అల్-ముస్తాసిమ్ మంగోలు ప్రభువు హులగుఖాన్ ను ఎదిరించడానికి సిద్దమయ్యాడు. మోసుల్ పాలకుడు, బదర్ అల్-దిన్ ను మంగోలులు యుద్ధ సామగ్రి సహాయంగా కోరినారు.

చివరకు బాగ్దాద్ రక్షణకవచం  బలహీనమైనది మరియు   బాగ్దాద్ నగరo  మంగోల్ నియంత్రణలోకి వచ్చింది.  ఫిబ్రవరి 10న, ఖలీఫా అల్-ముస్తాసిమ్  నగరాన్ని రక్షించే ప్రయత్నంలో హులాగుఖాన్ కు లొంగిపోయాడు మరియు ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. ముస్లిం సైన్యాన్ని నిరాయుధులను చేసి నగరం నుండి బయటికి వెళ్ళమని హులాగుఖాన్  కోరాడు. నిరాయుధ సైనికులను మంగోల్ సైన్యం కనికరం లేకుండా వధించింది. ఖలీఫా  నిస్సహాయడు అయ్యాడు, బాగ్దాద్ నగర ఆక్రమణ ప్రారంభమైంది. రెండు నుంచి  ఎనిమిది లక్షల మంది  బాగ్దాదీలను మంగోలు సైన్యం ఉచకోత కోసింది.

 

మంగోల్ సైనికులు మసీదులు, రాజభవనాలు, గ్రంథాలయాలు మరియు ఆసుపత్రులను లూటీ చేసి ధ్వంసం చేశారని సమకాలీన కథనాలు పేర్కొన్నాయి. బాగ్దాద్ యొక్క ముప్పై ఆరు పబ్లిక్ లైబ్రరీల నుండి వెలకట్టలేని పుస్తకాలు చిరిగిపోయాయి, దోపిడీదారులు పుస్తకాల తోలు కవర్లను తమ చెప్పులుగా ఉపయోగిస్తారు. తరతరాలుగా పని చేసిన గొప్ప భవనాలు నేలమట్టమయ్యాయి.


షధం నుండి ఖగోళశాస్త్రం వరకు లెక్కలేనన్ని విలువైన చారిత్రక పత్రాలు మరియు పుస్తకాలతో కూడిన ప్రసిద్ధ హౌస్ ఆఫ్ విజ్డమ్ కాలిపోయింది బైత్  అల్-హిక్మాలోని  చాలా పుస్తకాలను టైగ్రిస్ నదిలో పడేశారు. గ్రంధాల సిరాతో టైగ్రిస్ నల్లగా పారింది. జేమ్స్ రావెన్, తన పుస్తకం 'ది రెసొనెన్స్స్ ఆఫ్ లాస్, ఇన్ లాస్ట్ లైబ్రరీస్ The Resonances of Loss, in Lost Libraries’,' పరిచయంలో, పుస్తకాల విధ్వంసం గురించి మాట్లాడుతాడు, టైగ్రిస్‌లోకి విసిరి,న గ్రందాల  సిరా తో టైగ్రిస్ నది నీరు నల్లగా మారుతుంది. చంపబడిన శాస్త్రవేత్తలు మరియు తత్వవేత్తల రక్తం నుండి టైగ్రిస్ నది ఎర్రగా ప్రవహిస్తుందని చరిత్రకారులు పేర్కొన్నారు.


బాగ్దాద్ చుట్టుపక్కల సారవంతమైన పొలాలకు కారణమైన కాలువ వ్యవస్థ ధ్వంసమైంది. శిథిలమైన మృతదేహాల దుర్గంధం కారణంగా ఫిబ్రవరి 20న హులాగుఖాన్  తన సైన్యాన్ని నగరం నుండి తరలించారు.


బాగ్దాద్ ఖలీఫా అల్-ముస్తాసిమ్ హింసాత్మక చావుకు లోనయ్యాడు. అతని ఖజానా కొల్లగొట్టబడింది. బాగ్దాద్ పతనం పూర్తి అయ్యింది.


క్రీ.శ 1258లో బాగ్దాద్ పతనం ఇస్లామిక్ స్వర్ణయుగం ముగింపుగా పరిగణించబడుతుంది, ఈ సమయంలో ఖలీఫాలు ఐబీరియన్ ద్వీపకల్పం నుండి సింధు వరకు తమ పాలనను విస్తరించారు, మరియు విభిన్న రంగాలలో అనేక సాంస్కృతిక విజయాలు సాధించారు

ఇస్లామిక్ చరిత్రలో ఒక ప్రధాన శకం ముగిసింది. ఇస్లామిక్ స్వర్ణయుగం ముగిసినది. 

 

 

 

No comments:

Post a Comment