బిర్సైట్
తిరుగుబాటుకు ముందు చోటనాగ్పూర్ పీఠభూమి మరియు దాని ముందు ప్రాంతాలలో కోల్
తిరుగుబాటు (1830-33), సంతల్ తిరుగుబాటు (1855) వంటి గిరిజన తిరుగుబాట్లు, భూమి, శ్రమ మరియు గిరిజన
వర్గాల జీవనోపాధి విషయం లో బ్రిటిష్
సామ్రాజ్యవాదులు మరియు స్థానిక భారతీయ
పాలకులు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా
ప్రారంభం అయినాయి.
ఈ తిరుగుబాట్లకు
ప్రధాన కారణం శాశ్వత పరిష్కార చట్టం (1793) విధించడం. పలితంగా జమిందారి పద్ధతి అమలులోకి
వచ్చింది. ఇది గిరిజన వర్గాలను వారు సాగు చేసిన భూమి నుండి
దూరం చేసింది. జమీందారీ పద్ధతి బలవంతపు శ్రమ మరియు గిరిజన రైతులపై విధించే అనేక
ఏకపక్ష పన్నులు మరియు అద్దెలు వంటి పద్ధతులను తీసుకువచ్చింది.
దీనికి తోడూ, గిరిజన ప్రాంతాలలో మహాజన్లు మరియు థెకెదార్ల Thekedars వంటి ఉన్నత కులాల వారు గిరిజన వర్గాల ఆర్థిక వ్యవస్థలో వడ్డీ పద్ధతిని
ప్రవేశపెట్టారు, వారి ఆర్థిక దోపిడీ వలన గిరిజనులకు కష్టాలకు
లోను అయ్యారు.
బిర్సైట్
తిరుగుబాటు యొక్క పూర్వగామి ఉద్యమo సర్దారీ ఉద్యమం, దీని ఆశయం "చోటా-నాగపూర్ భూములను క్లియర్
చేసిన మొదటి వ్యక్తులు ఆదివాసులు అందువల్ల వారికి చోటా-నాగపూర్ భూములలో తిరుగులేని హక్కులు ఉన్నాయి". సర్దార్లు
లేదా గిరిజన వర్గాల నాయకులు ప్రధానంగా తమ ఫిర్యాదులను పలువురు బ్రిటిష్ ప్రభుత్వ
అధికారులకు పిటిషన్ల ద్వారా శాంతియుత పద్ధతిలో విన్నవించారు. డికుస్‌ను తొలగిస్తూ భూమిపై
తమ హక్కులను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
1858 నుండి 1895 వరకు, సర్దార్లు పదేపదే
భారత వైస్రాయ్ మరియు లండన్లోని భారత దేశ కార్యదర్శితో సహా ఉన్నతాధికారులకు పిటిషన్లు
సమర్పించారు. ఈ ‘చట్ట పరిధిలో నిరసన’ పర్వం లో, సర్దార్లకు బ్రిటిష్ క్రైస్తవ మిషనరీలు సహాయం చేశారు.
వాస్తవానికి, గిరిజన జనాభాలో అనేక మది క్రైస్తవ మతాన్ని
బలవంతంగా లేదా ఆర్ధిక బహుమతులను ఊహించి స్వికరించ లేదు ప్రగతి కోరి అనగా మిషనరీలు
తమతో పాఠశాలలు మరియు కొత్త వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకువచ్చినందున స్వికరించినారు..
పిటిషనింగ్ పద్ధతి
నిరాశకు గురైంది, ఎందుకంటే ఇది గిరిజన వర్గాల సామాజిక-ఆర్ధిక
స్థితిలో ఎటువంటి మార్పును తెచ్చిపెట్టలేదు. ఈ నిరాశ సర్దార్లు మరియు మిషనరీల మధ్య
సంబంధాన్ని కూడా మార్చివేసింది, సర్దార్లు
బ్రిటిష్ వారి తరపున కోర్టులో హాజరైన మిషనరీలు మరియు క్రిస్టియన్ ఆదివాసిలపై
కోర్టు దావాలు వేయడం ప్రారంభించారు. అణచివేత,
ఆర్ధిక దోపిడీ నేపథ్యంలో బిర్సా ముండా
సర్దారీ ఉద్యమాన్ని సమూలంగా మార్చిఒక సామాజిక సంస్కర్త మరియు విప్లవాత్మక
నాయకుడిగా ఉద్భవించారు
నవంబర్ 15, 1874 న చల్కాడ్ అనే గ్రామంలో జన్మించిన బిర్సా తన
ప్రాధమిక విద్యను మిషనరీ పాఠశాలలో పొందాడు మరియు అతనిపై ఒక వైష్ణవ
బోధకుడి ప్రభావo కలదు. 16వ శతాబ్దంలో స్వామీ చైతన్య ప్రారంభించిన వైష్ణవ
ఉద్యమం ప్రభావం బెంగాల్ మరియు ఒరిస్సా మధ్య ఉన్న చోటా-నాగపూర్ ప్రాంతం పై పడింది.
1893-94లో, గ్రామ బంజరు భూములను అటవీ శాఖ స్వాధీనం
చేసుకున్నందుకు నిరసనగా బిర్సా స్థానిక ఉద్యమంలో పాల్గొన్నారు. 1895 లో, సర్దార్ ఉద్యమం
క్షీణించినప్పుడు, బిర్సా ముండా దేవుని విజన్/దర్శనాన్ని చూసినట్లు
పేర్కొన్నాడు మరియు తన్ను తాను ప్రవక్తగా ప్రకటించుకున్నాడు.
సామాజిక సంక్షోభ
సమయంలో ‘ప్రవక్తలు’ ఉద్భవిస్తారని సామాజిక శాస్త్రవేత్త మాక్స్ వెబెర్ ప్రముఖంగా
సిద్ధాంతీకరించారు. నూతనంగా అమలులోనికి వచ్చిన
వ్యవసాయ-రాజకీయ వ్యవస్థ ప్రభావం గిరిజన సమాజం యొక్క సామాజిక-ఆర్ధిక –సంస్కృతిక
వ్యవస్థ పై అమితంగా ప్రభావాన్ని కల్పించినది.
ఆర్థిక మరియు సాంస్కృతిక దోపిడీకి వీలు కల్పించే
డికస్ యొక్క భారీ ప్రవాహంతో గిరిజన ప్రపంచం, గిరిజన సంస్కృతి సామాజిక-ఆర్థిక-సాంస్కృతిక
సంక్షోభం ఎదుర్కొంది.
అటువంటి సమాజంలో, బిర్సా యొక్క ప్రవచనాత్మక వాదనలు మరియు రాడికల్
సందేశం అధిక సంఖ్యలో అనుచరులను ఆకర్షించింది. అతను అనేక పురాతన ఆచారాలు, నమ్మకాలు మరియు అభ్యాసాలను విమర్శించాడు మరియు
మూడనమ్మకాలను తొలగించాలని, మత్తు మరియు జంతు బలిని వదులుకోవాలని, యాచనను నిషేధించమని మరియు ఒకే దేవుడిని
ఆరాధించమని ప్రజలను కోరాడు.
బిర్సా ముండా తన
సొంత ‘మతాన్ని’ ప్రచారం చేయడానికి
వైష్ణవిజం, క్రైస్తవ మతం మరియు ముండారి మతం నుండి అంశాలను
తీసుకున్నాడు, అదే సమయంలో అతని మతం ఈ మూడింటికి భిన్నంగా ఉంది.
ఆదివాసీ వర్గాల మధ్య సామాజిక సంస్కరణ ఉద్యమాన్ని ప్రారంభించిన సేంద్రీయ మేధావిగా
బిర్సాను చూడాలి.వివిధ ఆదివాసీ వర్గాల మధ్య ఉన్న తేడాలను తగ్గించి, వాటిని ఏకతాటిపైకి తీసుకురావడం బిర్సా లక్ష్యం; మొదట మత ఉద్యమం క్రింద ప్రారంభమయిన ఉద్యమం తరువాత ఒకే రాజకీయ సమాజం ఏర్పాటును కొరుకొంది.
ఫ్రెడరిక్
ఎంగెల్స్ జర్మన్ రైతు యుద్ధం (1594-95) పై చేసిన
అధ్యయనంలో, మతం చాలావరకు సాంప్రదాయిక శక్తి అయినప్పటికీ, విప్లవాత్మక పాత్ర కూడా పోషిస్తుందని అన్నాడు. బ్రిటీష్
సామ్రాజ్యవాదం మరియు వారి సహచరుల బారి నుండి తన సమాజాన్ని విముక్తి చేయాలనే
లక్ష్యంతో బిర్సా ముండా తనను తాను కొత్త మతం యొక్క ప్రవక్తగా ప్రకటించినప్పుడు, ఆర్థిక మరియు సాంస్కృతిక అణిచివేతకు గురిఅయిన గిరిజన
వర్గాలు ఆయనకు తోడూ నిచ్చాయి,
బిర్సా తన కొత్త
మతాన్ని ప్రకటించిన తరువాత, అన్ని గిరిజన వర్గాల ప్రజలను ఆకట్టుకొన్నాడు. దీర్ఘకాలంగా కోల్పోయిన రాజ్యాన్ని
స్థాపించడానికి తిరిగి వచ్చిన ప్రవక్త-రాజుగా బిర్సా తనను తాను ప్రకటించుకున్నాడు.
అతను ఇలా ప్రకటించాడు: "రాణి రాజ్యం ముగియనివ్వండి మరియు మన రాజ్యం
స్థాపించబడాలి" మరియు రైతులు మరియు వాటాదారులను sharecroppers అద్దెలు మరియు ఇతర పన్నులు చెల్లించవద్దని
కోరారు. అయితే త్వరలోనే అతన్ని బ్రిటిష్ పోలీసులు అరెస్టు చేసి రెండేళ్ల కఠిన జైలు
శిక్ష విధించారు.
జనవరి 1898 లో విడుదలైన తరువాత, బిర్సా తన ఉద్యమాన్ని పునర్వ్యవస్థీకరించినాడు. త్వరలోనే అతనికి పెద్ద సంఖ్యలో అనుచరులు ఏర్పడినారు. ఈసారి, మిషనరీలు బిర్సాకు
అతిపెద్ద శత్రువుగా అవతరించారు, అతను వారి
కార్యకలాపాలకు ప్రధాన అవరోది గా మారాడు. మిషనరీలు
బిర్సైట్లపై దాడులను పెంచడంతో, బిర్సైట్లు ఎదురు
దాడి చేయాలని నిర్ణయించుకున్నారు
ఉల్గులాన్
(తిరుగుబాటు /గందరగోళం) డిసెంబర్ 24, 1899 న ప్రారంభమైంది.
సాంప్రదాయ ఆయుధాలతో ఆయుధాలు కలిగిన పురుషులు మరియు మహిళలు దాదాపు 7,000 మంది బిర్సైట్లు క్రైస్తవ మత ముండాస్, మిషనరీలు, చర్చి, దుకాణదారులు మరియు స్థానిక పోలీసు స్టేషన్‌పై
దాడి చేశారు. ఈ ఉద్యమం ఖుంటి నుండి ఇప్పుడు జార్ఖండ్ లోని అనేక జిల్లాలకు
వ్యాపించింది. రాంచీలో, తిరుగుబాటుదారులు డిప్యూటీ పోలీసు కమిషనర్ పై కూడా దాడి చేశారు. క్రైస్తవీకరించిన ముండాస్
మరియు యూరోపియన్లు, మిషనరీలు మరియు బ్రిటిష్ ప్రభుత్వానికి
"మద్దతుదారులు లేదా ఏజెంట్లు" అని నమ్ముతున్న స్థానిక క్రైస్తవులు పై దాడి
చేశారు.
బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం బలగాలను
సమీకరించడంతో, బిర్సైట్స్ సమీపంలోని సెయిల్ రాకాబ్
కొండ, దొంబారికి తిరిగి వెళ్లారు, అక్కడ నుండి వారు బ్రిటిష్ ఇండియా పోలీసులతో
గెరిల్లా యుద్ధానికి పాల్పడ్డారు. జనవరి 9, 1900 న, ఇద్దరి మధ్య తీవ్ర యుద్ధం జరిగింది, ఇది ఇరవై మంది బిర్సైట్ల మరణానికి
దారితీసింది, బిర్సా ముండా మరింత అడవిలోనికి తప్పించుకొన్నాడు,
బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం అతనిపై రూ .500 బహుమతిని ప్రకటించినది మరియు చివరకు
మార్చి3న అతన్ని అరెస్టు చేశారు. ఆరోగ్యం క్షీణించిన కారణంగా బిర్సా జూన్ 9న జైలులో కన్నుమూశారు.
బిర్సా ముండా మరణం తరువాత మరియు బిర్సా ముండా తిరుగుబాటు యొక్క పలితం గా బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం చోటా-నాగపూర్ అద్దె
చట్టాన్ని ఆమోదించింది. బిర్సా ముండాను ఒక సామాజిక సంస్కర్తగా
మాత్రమే కాకుండా, ఒక వలస రాజ్యం, మిషనరీలు మరియు భూస్వాముల విజయాలను
సవాలు చేసిన ఒక విప్లవకారుడిని కూడా గుర్తుంచుకోవాలి. ఇది వలవవాదానికి వ్యతిరేకంగా గిరిజన వర్గాల పోరాటాలకు ప్రేరణగా
నిలిచింది.
No comments:
Post a Comment