14 July 2021

మర్చిపోయిన వీరులు - రెండు ప్రపంచ యుద్ధాల సమయంలో బ్రిటన్ కోసం పోరాడిన ముస్లింలు The Forgotten Heroes – The Muslims Who Fought for Britain during both World Wars

 




 

భారత ఉపఖండంలోని ముస్లింలు, హిందువులు, సిక్కులు, అందరు రెండు ప్రపంచ యుద్ధాలలో బ్రిటన్ తరుపున  పాల్గొన్నారు. 1858 నుండి 1947 వరకు భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగం మరియు బ్రిటన్ ప్రపంచంలోని మొట్టమొదటి పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి భారత దేశం సహాయపడింది.

ముస్లిం, హిందూ, మరియు సిక్కుల దళాలతో కూడిన భారతీయ సైన్యం రెండు ప్రపంచ యుద్ధాలలో గొప్ప ధైర్యంతో మరియు నైపుణ్యంతో పోరాడినది. భారతదేశ కర్మాగారాలు బ్రిటన్ మరియు మిత్రదేశాలకు యుద్ధ సామాగ్రిని ఉత్పత్తి చేసినవి.  భారతదేశం సైన్యానికి అవసమైన కాఫీ, జనపనార, టీ, వస్త్రాలు మరియు కలపను అందించాయి.

ఇక్కడ కొన్ని వాస్తవాలు తెలుసుకొందాము:

మొదటి ప్రపంచ యుద్ధంలో భారత దేశం జనాభా 315 మిలియన్ల అందులో భారతదేశం నుండి 1.5 మిలియన్ వాలంటీర్లు యుద్దంలో పాల్గొనారు. 140,000 మంది వెస్ట్రన్ ఫ్రంట్ లో యుద్ద సేవలను అందించారు. మధ్యప్రాచ్యం, ఆఫ్రికా మరియు చైనాలో 700,000 వేల మంది మరణించారు. భారతీయ సైనికులు 13,000 మెడల్స్/పతకాలు గెలుచుకున్నారు, 12 విక్టోరియా క్రాస్లు పొందారు. 48,000 మంది యుద్ధంలో మరణించారు మరియు అన్ని విశ్వాసాలకు చెందిన 65,000 మంది భారతీయ సైనికులు గాయపడ్డారు.

2వ ప్రపంచ యుద్ధంలో, 384 మిలియన్ల జనాభాగల భారతదేశం నుండి   2.5 మిలియన్ల వాలంటీర్లు యుద్దంలో పాల్గొన్నారు. భారతీయులు ఉత్తర ఆఫ్రికాలో జర్మనీలకు వ్యతిరేకంగా మరియు ఎరిట్రియా మరియు అబిస్నియాలో ఇటాలియన్లకు వ్యతిరేకంగా బ్రిటిష్ వారి తరుపున పోరాడారు. మధ్యప్రాచ్యం, దూర ప్రాచ్యంలోని  ఇరాన్ మరియు ఇరాక్లలో భారతీయ సైనికులు పోరాటం లో పాల్గొన్నారు.  రాయల్ ఇండియన్ నేవీలో 30,000 మంది భారతీయులు ఉన్నారు, మరియు అనేక వేల మంది వ్యాపారి నావికులుగా పనిచేశారు. రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో 55,000 మంది ఉన్నారు, మరియు భారతీయ మహిళలు WRENS (ఉమెన్స్ రాయల్ ఇండియన్ నావల్ సర్వీస్) లేదా WACS (ఉమెన్స్ ఆక్సిలరీ కార్ప్స్: ఇండియన్) గా పాల్గొన్నారు. భారతీయ మహిళలు  యుద్ధo లో నర్సులు, ఆయుధ కార్మికులు మరియు ఇతర ముఖ్య విధులు నిర్వహించారు.

బ్రిటన్ తరుపున  మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న దాదాపు అర మిలియన్ ముస్లింలు నిర్వహించిన  పాత్రను జ్ఞాపకం చేసుకొందాము. దాదాపు 400,000 ముస్లిం సైనికులు బ్రిటన్ తరుపున యుద్దంలో పోరాడితే వారి త్యాగాలను పాశ్చాత్య చరిత్రకారులు గుర్తించవలసి ఉన్నది. యుద్ధ రంగంలో ముస్లిం సైనికుల పాత్ర చరిత్ర ప్రధాన స్రవంతిలో గుర్తింపు పొందక పోవటం కడు శోచనీయం.

 

ముస్లిం యుద్ధ వీరులు

·       ఖుదాదాద్ ఖాన్ Khudadad Khan తన ధైర్యసాహసాలతో  విక్టోరియా క్రాస్ సంపాదించిన మొదటి భారతీయ సైనికుడు. అతను సిపాయి మరియు 1914 అక్టోబర్ 31, వైప్రెస్ యుద్ధంలో జర్మన్ దాడిని నిలువరించడం లో  ప్రసిద్ది చెందాడు. మరణానంతరం అతనికి అత్యుత్తమ సైనిక చిహ్నం విక్టోరియ క్రాస్ లబించినది. చనిపోయి తన  తన రెజిమెంట్‌కు కు విక్టోరియ క్రాస్ ఇవ్వగలిగాడు. అతని వీరత్వ చర్యతో జర్మన్లను నిలువరించడానికి సమయం లభించి  ​​అదనపు  బలగాలు రాగలిగాయి. అతను ఒక యుద్ధ వీరుడుగా జీవించాడు మరియు వృద్ధాప్యంలో 1971 లో పాకిస్తాన్లో మరణించాడు.

యుద్ధభూమికి దూరంగా ఉన్న ముస్లిం యుద్ధ వీరలు --పారిస్‌లోని టర్కీ రాయబారి బెహిక్ ఎర్కిన్ Behiç Erkin,, వేలాది మంది యూదులకు  పౌరసత్వ పత్రాలు మరియు పాస్‌పోర్ట్‌లను అందించారు మరియు సురక్షితమైన మార్గo  ద్వారా చాలా మంది ప్రాణాలను రక్షించారు. మార్సెయిల్లోని టర్కిష్ కాన్సుల్ జనరల్ నెక్డెట్ కెంట్Necdet Kent బెహిక్ ఎర్కిన్‌తో కలిసి పనిచేశారు. అతను 80 మంది టర్కిష్ యూదులను రైలులో నిర్బంధ శిబిరాలకు పంపకుండా కాపాడాడు.

  పారిస్ లోని  ఇరాన్ కాన్సుల్ జనరల్ అబ్దుల్-హుస్సేన్ సర్దారీ, ఇరాన్ యూదులను ఆర్యన్ అని పేర్కొంటూ వారిని సామూహిక మారణకాండ నుండి కాపాడటానికి జర్మన్ స్వచ్ఛత చట్టాలను ఉపయోగించాల్సి వచ్చింది. అతను ఇరానియన్ కాని యూదులకు పాస్పోర్ట్ లు జారీ చేశాడు మరియు వారి తప్పించుకోవటానికి  సురక్షిత మార్గాన్ని ఏర్పాటు చేశాడు.

 నూర్ ఇనాయత్ ఖాన్ భారతీయ రాచరిక కుటుంభం లో జన్మించి బ్రిటన్ మరియు పారిస్‌లో పెరిగారు. నాజీల దాడి తరువాత పారిస్ నుండి పారిపోయిన ఆమెను  ఫ్రెంచ్ బాగా వచ్చిన కారణంగా విన్స్టన్ చర్చిల్ స్పెషల్ ఆపరేషన్స్ కోసం వైర్‌లెస్ ఆపరేటర్‌గా పారిస్‌లో నియమించారు. ఫ్రెంచ్ అండర్ గ్రౌండ్ కోసం నూర్ పనిచేస్తున్నప్పుడు ఇతర మహిళా నిరోధక యోధుల బృందంతో కలిపి  జర్మన్ గూడచారి దళం గెస్టపో కి పట్టుబడ్డది. ఆమె మిత్రదేశాలకు ద్రోహం చేయడానికి నిరాకరించింది, తరువాత నాజీలు ఆమెను తీవ్రంగా హింసించి చివరకు కాల్చి చంపారు.  

రెండు ప్రపంచ యుద్ధాల యుద్దాలలో బ్రిటన్ తరుపున పనిచేసిన లక్షలాది మంది ముస్లింలను జ్ఞాపకం చేసుకొందాము.  ముస్లింలు మాత్రమే కాకుండా, భారతదేశం నుండి హిందువులు, సిక్కులు, క్రైస్తవులు మరియు ఇతర విశ్వాసాల ప్రజల సహకారం ఈ రోజు బ్రిటన్ అనుభవిస్తున్న స్వేచ్ఛలు, విజయాలు మరియు శక్తికి దోహదం చేసింది. 

No comments:

Post a Comment