జూలై27న ఒట్టోమన్ సామ్రాజ్యం స్థాపించిన 719వ వార్షికోత్సవాన్ని జరుపుకొంటారు.ఒట్టోమన్
సామ్రాజ్యం 15-16వ శతాబ్దాలలో మూడు ఖండాలలో విస్తరించింది.
జూలై 27, 1302 న, ఉస్మాన్ బే Osman Bey బైజాoటైన్ సైన్యాన్ని బాఫియస్ Bapheus మైదానంలో ఓడించాడు మరియు ఒట్టోమన్
విజయాలకు నాంది పలికాడు. దీనిని బైజాంటైన్ సామ్రాజ్య సైన్యంపై ఉస్మాన్ బే సాధించిన
మొదటి ప్రధాన విజయంగా చరిత్రకారులు నిర్వచించారు.
ఉస్మాన్ బే “బిలేసిక్, యార్-హిసార్, ఎనెగల్ మరియు యెనిసెహీర్ Bilecik, Yar-Hisar, İnegöl, and Yenişehir” ని జయించిన తరువాత, 1299 లో సెల్జుక్‌ల నుండి తన
స్వాతంత్ర్యాన్ని ప్రకటించు కొన్న తరువాత, ఉస్మాన్ బే బైజాంటైన్ మాజీ రాజధాని నగరం “నిసియా (ఇజ్నిక్) Nicaea (İznik)”. ను ముట్టడించాడు. తత్ఫలితంగా, 1302 వసంతకాలంలో, బైజాంటైన్ చక్రవర్తి ఆండ్రోనికోస్ II పాలయోలోగోస్ Andronikos II Palaiologos తన కుమారుడు మరియు సహ-చక్రవర్తి అయిన మైఖేల్ IXను నిసియా (ఇజ్నిక్) Nicaea (İznik). నగరాన్ని రక్షించడానికి పంపాడు.
కాని మైఖేల్ IXను ఉస్మాన్
బే మరియు అతని సైనిక యోధులు అడ్డుకున్నారు. మైఖేల్ IX పారిపోయి వెనుదిరగవలసి వచ్చింది. తిరిగి జూలై 1302 లో, ఆండ్రోనికోస్ II, ఉస్మాన్ బే కు వ్యతిరేకంగా పోరాడటానికి జార్జ్
మౌజలాన్ George Mouzalon ఆధ్వర్యంలో సైన్యాన్ని పంపాడు. చివరికి, నికోమీడియా
(ఇజ్మిత్) Nicomedia (Izmit). సమీపంలోని బాఫియస్ మైదానంలో ఇరువర్గాలు
కలుసుకున్నాయి
ఇరు పక్షాల మద్య జరిగిన యుద్ధంలో ఉస్మాన్ బే
విజయం సాధించాడు బైజాంటైన్‌లు నికోమీడియాలోకి ఉపసంహరించుకోవలసి వచ్చినది.. ఈ
ఓటమి తరువాత, బైజాంటైన్లు బిథినియా Bithynia గ్రామీణ ప్రాంతాల నియంత్రణను
కోల్పోయారు, ఒట్టోమన్లు వాటిని స్వాధీనం చేసుకోన్నారు.
ఈ విజయం తరువాత, ఉస్మాన్ బే బలవంతుడయ్యాడు.
సమకాలీన
బైజాంటైన్ చరిత్రకారుడు పాచీమెర్స్ Pachymeres, ప్రకారం ఉస్మాన్
బే విజయాల వార్తలు పశ్చిమ అనటోలియాలోని
ఇతర ప్రాంతాలను ఎలా టర్క్‌లు
స్వాదినపరుచుకోన్నారో మరియు నికోమీడియా
(ఇజ్మిట్) సమీపంలో బైజాంటైన్ సైన్యాన్ని ఓడించడానికి అతను ఎలా శక్తి వంతుడు అయ్యాడో వివరిస్తుంది.
హలీల్ ఎనాల్కాక్ ప్రకారం ఒట్టోమన్లు బాఫ్యూస్ Baphues లో ఉస్మాన్ బే విజయాన్ని తరువాతి కాలం లో టర్కులు తమ విశ్వవ్యాప్త సామ్రాజ్య సార్వభౌమత్వ వాదనకు
అనుకూలంగా ఉపయోగించారు.
బాఫ్యూస్ Baphues విజయం ఒట్టోమన్‌లకు సామ్రాజ్యo
ఏర్పడటానికి దారి తీసింది. బైజాంటైన్
చక్రవర్తి, ఆండ్రోనికోస్II, తన భూభాగాన్ని ఒట్టోమన్లకు
కోల్పోవడాన్ని అంగీకరించడానికి నిరాకరించాడు. ఆ విధంగా సుదీర్ఘ ఒట్టోమన్-బైజాంటైన్
యుద్ధాలు ప్రారంభమయ్యాయి,
దీనిలో బైజాంటైన్‌లు క్రమంగా అనటోలియాలోని Anatolia తమ భూభాగాలన్నింటినీ అటోమన్స్ కు కోల్పోయారు.
జూలై 24, 1923 న, మొదటి ప్రపంచ యుద్ధo లో ఓడిన టర్కీ
మరియు మిత్రరాజ్యాల శక్తులు లౌసాన్ ఒప్పందం treaty
of Lausanne పై
సంతకం చేశాయి. ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా 600 సంవత్సరాల పురాతన ఒట్టోమన్ సామ్రాజ్యం
అధికారికంగా ముగిసింది.
No comments:
Post a Comment