మానవ జీవితంలో నక్షత్రాలు ప్రధాన భాగం. రాశిచక్రాలలో
వారి వ్యక్తిత్వాన్ని శోధించాలన్నా, కొత్త ప్రాంతాలకు వెళ్ళాలన్న లేదా మంచి భవిష్యత్తు కోసం నక్షత్రాలను
చూస్తారు. ఖగోళ శాస్త్రం, నావిగేషన్ నుండి కలల వరకు, నక్షత్రాలు కొంతమందికి వారి జీవితంలో దిశను ఇస్తాయి. 10 వ శతాబ్దపు సిరియాలో, ఒక ముస్లిం మహిళ మరియం “అల్-ఆస్ట్రోలాబి” అల్-ఇజిలియా నక్షత్ర పరిశోధనను తన
వృత్తిగా స్వికరించినది.
మరియం అల్-ఇజిలియా పదవ శతాబ్దం సిరియాలోని
అలెప్పోలో నివసించారు. ఆమె తన కాలపు ప్రధాన ఆస్ట్రోలాబ్ తయారీదారుగా పేరుగాంచినది.
మరియం ఇంజనీర్లు మరియు తయారీదారుల కుటుంబం లో జన్మించినది, ఆమె బస్తులస్ అనే
శాస్త్రవేత్త దగ్గిర అప్రెంటిస్ అయ్యారు.
బస్తూలాస్ బాగ్దాద్‌లోని ప్రసిద్ధ ఆస్ట్రోలాబ్ తయారీదారు మరియు ప్రపంచంలోని పురాతన
ఆస్ట్రోలాబ్‌ను సృష్టించిన శాస్త్రవేత్త. మరియం రూపొందించిన నమూనాలు చాలా
క్లిష్టంగా మరియు వినూత్నంగా ఉన్నాయని గమనించి అలెప్పో యొక్క అమిర్ అయిన
సయెఫ్-అల్-దావ్లా బాగ్దాద్ ప్లానిటోరియం లో ఆమెను నియమించారు, క్రీ.శ 967 నుండి క్రీ.శ 994 వరకు ఆమె అమీర్ కొలువులో కొనసాగింది.
ఖగోళ వస్తువుల శాస్త్రంలో ఆస్ట్రోలాబ్‌లు
ఉపయోగకరమైన సాధనాలు మరియు ఇవి ఖగోళ శాస్త్రం,
జ్యోతిషశాస్త్రం మరియు జాతకచక్రాలలో
శాస్త్రవేత్తల పరిశోధనకు సహాయపడును.. గ్లోబల్ పొజిషనింగ్ సాధనాలు సూర్యుడు మరియు
గ్రహాల స్థానాన్ని నిర్ణయిస్తాయి మరియు అక్షాంశం మరియు రేఖాంశం ద్వారా స్థానాన్ని
కనుగొనడం ద్వారా సమయం మరియు నావిగేషన్‌ను తెలియజేస్తాయి.
ఆస్ట్రోలాబ్‌లను ముస్లిం సమాజంలో, కిబ్లా, ప్రార్థన సమయాలను కనుగొంటానికి మరియు రంజాన్ మరియు ఈద్ ప్రారంభ రోజులను నిర్ణయిoచటం
లో ఉపయోగిస్తారు. సైన్స్ మరియు ఇస్లాం
రెండింటిలోనూ, ఆస్ట్రోలాబ్స్ కీలక పాత్ర పోషిస్తాయి, అందువల్ల, ఇటువంటి
సాధనాలను తయారు చేయడం ప్రతిష్టాత్మక వృత్తి. ఆ వృత్తిలో అగ్రస్థానంలో ఉన్న కారణంగా
1990 లో, పలోమర్ అబ్జర్వేటరీలో హెన్రీ ఇ. హోల్ట్
కనుగొన్న ప్రధాన బెల్ట్ గ్రహశకలం 7060 ‘అల్-ఇజ్లియా’ కు గౌరవార్థం
ఆమె పేరు పెట్టబడినది.
తన సైన్స్ ఫిక్షన్ నవల బింటిలో తన కథానాయకుడికి
మరియమ్ అల్-ఆస్ట్రోలాబి ప్రేరణ అని సైన్స్ ఫిక్షన్ రచయిత న్నెడి ఒకోరాఫోర్ 2016 లో వెల్లడించారు.
మరియం అల్-ఆస్ట్రోలాబి గురించిన చారిత్రక
రికార్డులు చాలా తక్కువగా ఉన్నాయి.
No comments:
Post a Comment