18 July 2021

మీర్ సయ్యద్ అలీ హమ్దానీ (ర) 1314-1384 Mir Syed Ali Hamdani (R.A) 1314-1384

 

 
 

ఇస్లాంను ప్రచారం చేయడం కోసం చాలా మంది గొప్ప ఆద్యాత్మిక  పురుషులు కాశ్మీర్‌కు వచ్చారు.వారిలో సయ్యద్ అలీ హమ్దానీ (R.A) ప్రముఖులు   మరియు వీరు కాశ్మీర్ లోయలో ఇస్లాం వ్యవస్థాపకుడిగా పరిగణించబడుచున్నారు.

సయ్యద్ అలీ హమ్దానీ పూర్వికులు ఇమామ్ హసన్ (AS) యొక్క వారసులు. సయ్యద్ అలీ హమ్దానీ ఇరాన్ లోని హమదాన్ లో 1314 లో జన్మించారు 1384 లో కునార్-ఆఫ్ఘనిస్తాన్ లోని ఒక ప్రావిన్స్ లో మరణించారు, సయ్యద్ అలీ హమ్దానీ ఒక సూఫీ, వేదాంతవేత్త, పండితుడు, సోషలిస్ట్, రచయిత, కవి మరియు శ్రేష్ఠత కల బోధకుడు.

విద్యావంతులైన కుటుంబo లో జన్మించిన సయ్యద్ అలీ హమ్దానీ అలీ సాని', అమీర్-ఇ-కబీర్, షా-ఎ-హమ్దాన్, కుతుబ్-ఉల్-అక్తాబ్” మొదలైన అనేక బిరుదులు కలిగి ఉన్నారు హమ్ధాని తన మేనమామ   అల-ఉద్-దౌలా సెమ్నారి పర్యవేక్షణలో పదమూడు సంవత్సరాల పాటు ప్రాథమిక విద్యలో శిక్షణ పొందారు. తదుపరి ఆధ్యాత్మిక శిక్షణ కోసం షేక్ ష్రాఫుద్దీన్ మహమూద్ మజ్దిగాని వద్దకు వెళ్లారు, వారు అనేక మహాత్ములను కలవాలని, వారి నుండి మార్గదర్శకత్వం పొందాలని మరియు ఇస్లాం సందేశాన్ని వ్యాప్తి చేయాలని హమ్దానీ కు సూచించారు.

సయ్యద్ అలీ హమ్దానీ తరచూ ప్రయాణించేవారు మరియు  తమ ప్రయాణాల ద్వారా  ఇస్లామిక్ సందేశం యొక్క వ్యాప్తికి ఎంతో తోడ్పడ్డారు. హమ్ధాని ప్రపంచవ్యాప్తంగా మూడుసార్లు పర్యటించారు  మరియు చైనా, ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, పాకిస్తాన్ వంటి అనేక దేశాలకు ఇస్లాం బోధనలను తీసుకువెళ్ళారు. హమ్ధాని కాశ్మీర్ లోయలో కూడా ప్రయాణిoచారు మరియు అక్కడ ప్రేమ, శాంతి మరియు విత్తనాలను నాటారు. ప్రవక్త (స) సందేశాన్ని ప్రజలకు అందించారు  మరియు 'అల్లాహ్ తప్ప మరొక దైవం  లేడు. ముహమ్మద్ (స) దేవుని దూత అని చాటారు,.

సయ్యద్ అలీ హమ్దానీ కాశ్మీర్ ను తన  కార్యకలాపాలకు కేంద్రస్థానం గా ఎంచుకొన్నారు. వారు కాశ్మీర్ కు  మూడు సార్లు వచ్చారు. 1372 లో సుల్తాన్ షిహాబ్-ఉద్-దిన్ పాలనలో మొదటిసారి కాశ్మీర్‌కు వచ్చారు  మరియు అక్కడ నాలుగు నెలల కాలం ఉన్నారు. 1379 లో హమ్దానీ యొక్క రెండవ సందర్శనను సుల్తాన్ కుతుబుద్దీన్ (సుల్తాన్ షాహాబుద్దీన్ సోదరుడు) స్వాగతించారు. ఈసారి హమ్దానీతో పాటు వచ్చిన 700 మంది అనుచరులు కాశ్మీర్ లోయ అంతటా ఇస్లామిక్ బోధనా కేంద్రాలను స్థాపించడంలో సహాయపడ్డారు. ఈ పర్యటన కాశ్మీర్ లోయలో ఇస్లాం వ్యాప్తి లో  ఒక మైలురాయి. 2సంవత్సరాలు కాశ్మీర్  లోయ  లో గడిపిన తరువాత, సయ్యద్ అలీ హమ్దానీ లడఖ్ ద్వారా తిరిగి టర్కిస్తాన్ వెళ్ళారు. తిరిగి మూడో సారి 1383 లో కాశ్మీర్ లోయను సందర్శించారు , కాని అనారోగ్యం కారణంగా ముందుగానే  అక్కడి నుండి వెనక్కి రావలసి వచ్చింది. ఈ సందర్శన నుండి తిరిగి వచ్చిన తరువాత, సయ్యద్ అలీ హమ్దానీ కునార్ చేరుకున్నారు మరియు కొద్ది రోజుల తరువాత 1384లో మరణించారు. వారి  భౌతిక అవశేషాలను ఖిట్లాన్ (తజికిస్తాన్) లోని కోలాబ్‌కు తీసుకెళ్లి అక్కడ ఖననం చేశారు.

  

కాశ్మీర్ నుండి బయలుదేరే ముందు, సయ్యద్ అలీ హమ్దానీ తన కుమారుడు మీర్ ముహమ్మద్ హమ్దానీ () ను ఇస్లాం ప్రచారమును ప్రజలలో  ముందుకు తీసుకువెళ్ళమని కోరినారు.  మీర్ ముహమ్మద్ హమ్దానీ కాశ్మీర్లో ఇస్లామిక్ మిషన్ను సంస్థాగతీకరించారు. కాశ్మీర్ చరిత్ర  లో ఆధ్యాత్మిక, సామాజిక,విద్యా  రంగం లో  ముఖ్యమైన పాత్ర పోషించిన “ఖంకా ఇ మౌలా (శ్రీనగర్), ఖంకా ఇ ఫైజ్‌పనా (ట్రాల్), ఖంకా-ఇ-ఆలా (పుల్వామా), ఖంకా, (వాచి షోపియన్) Khankah e Maula (Srinagar), Khankah e Faizpanah (Tral), Khankah-I-Aala (Pulwama), Khanqah, (Wachi Shopian),  వంటి ప్రసిద్ధ సంస్థలను స్థాపించారు.  ఈ సంస్థలు ఇప్పటికి  శ్రేష్ఠత మరియు ఆధ్యాత్మికత యొక్క ప్రముఖ  కేంద్రాలుగా కొనసాగుతున్నాయి.

కశ్మీరీయుల ఆర్ధిక స్థితి పై సయ్యద్ అలీ హమ్దానీ ప్రభావం  చాలా బలంగా ఉంది. కాశ్మీరీలకు  నైపుణ్యాలు అలవార్చడం ద్వారా కశ్మీర్  ను  స్వయం సమృద్ధిగా మార్చాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. మత బోధకులతో పాటు, అనేక మంది కళాకారులను కశ్మీర్‌లో స్థిరపడటానికి  తీసుకువచ్చారు  మరియు స్థానిక జనాభాకు పాష్మినా Pashmina వస్త్ర మరియు కార్పెట్ తయారీ నైపుణ్యాన్ని నేర్పించారు. కశ్మీర్ లో శాలువ పరిశ్రమ స్థాపన వారి వల్ల సాధ్యమైంది.

సయ్యద్ అలీ హమ్దానీ కశ్మీర్‌ ప్రజలకు కళలు, హస్తకళ, కాలిగ్రాఫి, కాపర్ వర్క్, సిల్వర్‌వర్క్ పరిచయం చేశారు, అది వారిని ఆర్థికంగా ఉన్నత స్థితి లో ఉంచింది. కొత్త పద్ధతులను సూచించడం ద్వారా వ్యవసాయ, నీటిపారుదల మరియు పారిశ్రామిక వ్యవస్థలను పునరుద్ధరించారు. ఈ విధంగా, సయ్యద్ అలీ హమ్దానీ కశ్మీరీ ప్రజల జీవన విధానాలను మార్చి, కశ్మీర్ యొక్క అభివృద్ది దశను  రూపొందించారు. కశ్మీర్ లో ఇస్లామిక్ ప్రచారం తో పాటు కశ్మీర్ సామాజిక-ఆర్ధిక మరియు సాంస్కృతిక వికాసం లో సయ్యద్ అలీ హమ్దానీ సహకారాన్ని అల్లామా ఇక్బాల్ తన కవితలలో ప్రశంసించారు.

సయ్యద్ అలీ హమ్దానీ గొప్ప కవి మరియు రచయిత.  కవిత్వంలో “ఉలైమరియు అలీవంటి కలం పేర్లను ఉపయోగించారు. అస్రార్ అనేది ఆధ్యాత్మికతపై ఆధారపడిన 40 కవితలతో కూడిన వారి సంకలనాలలో ఒకటి. సయ్యద్ అలీ హమ్దానీ అరబిక్ మరియు పెర్షియన్ భాషలలో వందలాది కరపత్రాలను వ్రాసారు  మరియు భవిష్యత్ తరాల కోసం తన ఆలోచనలు, తత్వశాస్త్రం మరియు సందేశాన్ని (రాజులు మరియు పాలకులకు మార్గదర్శకత్వాన్ని కలిగి ఉంటుంది) వివరించారు.  ఫతుహాతి కుబ్రవియా పుస్తక రచయిత అబ్దుల్ వహాబ్ నూరి సయ్యద్ అలీ ప్రకారం ఈ కరపత్రాలు పoడిత పామరులకు మార్గదర్శకాలుగా  ఉన్నాయి. వీరి  రచనలు ప్రపంచంలోని వివిధ గ్రంథాలయాలలో బద్రపరిచి ఉన్నాయి మరియు పండితులు మరియు ప్రజలు, వాటి నుండి ప్రయోజనం పొందుతున్నారు. .

సయ్యద్ అలీ హమ్దానీ యొక్క గొప్ప అరబిక్ రచనలలో “అవ్రాద్-ఫాతియా” ఒకటి. ఇది కశ్మీర్ ముస్లింల పట్ల హమ్దానీ యొక్క ఆందోళనకు ప్రతిబింబం. కశ్మీరీ ముస్లింల దుస్థితిని చూసిన సయ్యద్ అలీ హమ్దానీ, విశ్వాసాన్ని బలోపేతం చేయడానికి మరియు సర్వశక్తిమంతుడైన అల్లాహ్‌ను ప్రార్థించడం ద్వారా బాధల నుండి బయటపడటానికి అవ్రద్‌ Awrad ను బిగ్గరగా పఠించాలని కోరారు.

కశ్మీర్ ప్రజల వికాసం లో సయ్యద్ అలీ హమ్దానీ యొక్క సహకారం మరువలేనిది.. ఇస్లాం మత బోధనలో మరియు కశ్మీరీల జీవితంలోని వివిధ కోణాలపై ఆయన చూపిన ప్రభావం అపారం. హమ్దాని సందేశాన్ని అర్థం చేసుకోవడం, అతని బోధనలను ఆచరించడం మరియు రోజువారీ జీవితంలో వాటిని పాటించడం మనందరి కర్తవ్యం. 

No comments:

Post a Comment