యునైటెడ్ స్టేట్స్
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వారి గదిలో కూర్చున్నప్పుడు, వారి కుడి, ఎడమ మరియు ముందు
వైపు ప్రపంచంలోని 18 గొప్ప న్యాయవేత్తలను వర్ణించే ఫ్రైజెస్/friezes ఉన్నాయి.
కుడి వైపున ఉన్న
రెండవ ఫ్రైజ్/frieze లో ఇస్లామిక్
పవిత్ర గ్రంథమైన దివ్య ఖురాన్ కాపీని పట్టుకున్న వ్యక్తి ఉన్నారు. ఇది మోసెస్, సోలమన్, కన్ఫ్యూషియస్ మరియు
హమ్మురాబి వంటి గొప్ప న్యాయ వేత్తలతో బాటు ప్రవక్త ముహమ్మద్(స)ను ప్రపంచంలోని
గొప్ప న్యాయ వేత్తలలో ఒకరిగా గుర్తించడానికి ఉద్దేశించబడింది’
ఈ ఫ్రైజ్/frieze గురించి అమెరికన్
సుప్రీం కోర్ట్ వెబ్‌సైట్ ఇలా చెబుతుంది:
“ముహమ్మద్(స) 570 – 632 -ఇస్లాం ప్రవక్త.
అతను దివ్య ఖుర్ఆన్ పట్టుకొని చిత్రీకరించబడ్డాడు. దివ్య ఖురాన్ ఇస్లామిక్ చట్టం
యొక్క ప్రాథమిక మూలాన్ని అందిస్తుంది. ప్రవక్త ముహమ్మద్ బోధనలు దివ్య ఖుర్ఆన్
సూత్రాలను వివరిస్తాయి మరియు అమలు చేస్తాయి. ముహమ్మద్(స)ని గౌరవించడానికి శిల్పి
అడాల్ఫ్ వెయిన్‌మన్ చేసిన మంచి ఉద్దేశ్యంతో చేసినది పై చిత్రంలో చూపబడింది మరియు ఇది ముహమ్మద్(స)తో
ఎలాంటి పోలికను కలిగి ఉండదు. ముస్లింలు సాధారణంగా తమ ప్రవక్త(స) యొక్క శిల్పకళ
లేదా చిత్రపటాలపై తీవ్ర అసహనాన్ని కలిగి ఉంటారు.”
ప్రవక్త ముహమ్మద్(స)
యొక్క ఫ్రైజ్ ఏర్పాటు చేయబడిన సంవత్సరంలో, ఫ్రాంక్లిన్ డి.
రూజ్‌వెల్ట్ అధ్యక్షుడిగా ఉన్నారు మరియు చార్లెస్ ఎవాన్స్ హ్యూస్ Charles Evans Hughes సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా
ఉన్నారు. ముహమ్మద్ ప్రవక్త(స)ను యునైటెడ్ స్టేట్స్ సుప్రీంకోర్టు గదులలో
ప్రపంచంలోని గొప్ప న్యాయవేత్తలలో ఒకరిగా చేర్చడం ఆ సమయంలో ఎవరూ అనుచితం గా భావించలేదు.
ముహమ్మద్ ప్రవక్త(స)
న్యాయమైన మరియు ప్రశాంతమైన సమాజాన్ని ఊహించారు. ముహమ్మద్ ప్రవక్త(స) యుద్ధాన్ని
అసహ్యించుకున్నారు మరియు తన ప్రత్యర్థులతో
శాంతి ఒప్పందాన్ని ఎల్లప్పుడూ ఇష్టపడతారు. ముహమ్మద్ ప్రవక్త(స) తన మొదటి శాంతి
అభయారణ్యాన్ని మదీనా నగరంలో ఎలాంటి యుద్ధం లేకుండా స్థాపించారు. ముహమ్మద్ ప్రవక్త(స)
ఆ శాంతి అభయారణ్యాన్ని రక్షించడానికి పోరాడినప్పటికీ, తన ప్రజలను రక్షించే
వాస్తవ పోరాట సమయం మొత్తం 63 సంవత్సరాల ముహమ్మద్ ప్రవక్త(స) జీవితంలో ఆరు రోజుల కంటే ఎక్కువ కాదని
గమనించడం చాలా ముఖ్యం. ప్రజలందరికీ, ప్రత్యేకించి అత్యంత
అట్టడుగున మరియు అణగారిన వారికి న్యాయం మరియు విముక్తిని నిర్ధారించే శాంతిని
సాధించడానికి ముహమ్మద్ ప్రవక్త(స) కష్టపడ్డారు.
ముహమ్మద్ ప్రవక్త(స)
ప్రవచిoచిన కొన్ని ముఖ్యమైన బోధనలు:
·
మానవులందరికీ ఒకే దేవుడు ఉన్నాడని ఆయన
బోధించారు.
· ముస్లింలకు
ప్రవక్తలందరినీ, పూర్వం వెల్లడించిన అన్ని గ్రంథాలను, విశ్వసించాలని
నేర్పించారు.
· ప్రవక్త మక్కా నుండి
వలస వచ్చిన తరువాత మదీనా అనే శాంతి అభయారణ్యాన్ని స్థాపించినప్పుడు, అతను యూదులు మరియు
మదీనా లోని అన్యమతస్థులతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు.. ముస్లింలు ఈ ఒప్పందాలను
ప్రపంచంలో మొట్టమొదటిగా వ్రాసిన రాజ్యాంగంగా భావిస్తారు. రాజ్యాంగం అన్ని విషయాలలో
మత స్వేచ్ఛ, స్వయం పాలన మరియు చట్టపరమైన స్వయంప్రతిపత్తికి హామీ ఇచ్చింది. ఇది మదీనా
యొక్క సాధారణ రక్షణ కోసం పిలుపునిచ్చింది మరియు ఆ ఒప్పందంలోని యూదులు, అన్యమతస్థులు మరియు
ముస్లింలను ఒకే దేశం లేదా "ఒక ఉమ్మా" గా ప్రకటించింది.
· ముహమ్మద్ ప్రవక్త
(స)మదీనాలోని శాంతి అభయారణ్యంలో వేట మరియు చెట్లను నరకడాన్ని నిషేధించాడు.
· ముహమ్మద్ ప్రవక్త
(స)
యుద్ధం లో అసైనిక పోరాట యోధులను non-combatants చంపడం చట్టవిరుద్ధమని ప్రకటించారు, యుద్ధం ఎలా
నిర్వహించవచ్చనే దానిపై తీవ్రమైన ఆంక్షలు విధించారు మరియు కొన్ని కుక్కలను తన
కమాండర్లలో ఒకరు చంపినందుకు పరిహారం కూడా చెల్లించారు.
· ప్రవక్త(స)నైతిక
ప్రవర్తన: వ్యక్తిగత పరిశుభ్రత ప్రాధాన్యత ఇచ్చారు.
· మొక్కలు మరియు
జంతువులతో సహా అన్ని జీవన రూపాల సంరక్షణ మరియు పోషణకు ప్రాధాన్యత ఇవ్వడం; ఆచారాలు మరియు
ప్రార్థనల ఆధ్యాత్మికత; ఉపవాసం మరియు దాతృత్వం; ధర్మబద్ధమైన ప్రవర్తన మరియు మంచి పనులు
చేయడం మరియు తల్లిదండ్రులు, పిల్లలు, జీవిత భాగస్వాములు
మరియు పొరుగువారి హక్కులు కాపాడమని అన్నారు..
· వ్యక్తుల మధ్య
సంబంధాలు-మానవ సంబంధాలను మెరుగుపరచడం మరియు సంబంధాలను విచ్ఛిన్నం చేయడాన్ని
నివారించడం; అన్ని వ్యవహారాల్లో పరస్పర సంప్రదింపులను ప్రోత్సహించడం; మతోన్మాదం మరియు
జాత్యహంకారాన్ని నిషేధించడం; మరియు ఇతరుల పట్ల, ముఖ్యంగా బలహీనులు
మరియు పేదల పట్ల దయ మరియు ఆతిథ్యాన్ని నొక్కి చెప్పడం చేసారు..
· ఆర్థిక
మార్గదర్శకాలు:-దాతృత్వాన్ని ప్రోత్సహించడం, పేదల హక్కులు, కార్మికుల పట్ల
గౌరవం మరియు దోపిడీని తిరస్కరించడం; మరియు అన్ని వర్గాల
మధ్య సంపద పంపిణి జరగాలని అన్నారు,.
· గోప్యత, లింగ సంబంధాలు, వివాహం, విడాకులు మరియు
వారసత్వం గురించి వ్యక్తిగత నియమాలు మరియు చట్టాలు రూపొందించారు.
· ప్రవక్త(స) తన
న్యాయనిర్ణేతలను న్యాయం ప్రజలకు కష్టతరం కాకుండా సులభతరం చేయాలని కోరారు.
·
ఒక వ్యక్తి అల్లాహ్ ను మరియు
అన్యాయానికి గురైన వ్యక్తిని క్షమాపణను
అడిగిన అతని అన్ని పాపాలను
క్షమించదగినదిగా ప్రకటించారు ఒప్పందాలను గౌరవించడం, న్యాయం
కోసం నిలబడటం మరియు అణచివేతను వ్యతిరేకించడం వంటి వాటికి ప్రవక్త(స) ప్రత్యేక
ప్రాధాన్యత ఇచ్చారు.
“అమెరికా భూమిపై గొప్ప దేశం. ముస్లింలు మొదటి నుంచీ ఆఫ్రికన్ ముస్లింలతో పాటు, అమెరికాను నిర్మించడంలో సహాయపద్దారు.. జూలై 4, 1776 న స్వాతంత్ర్యం ప్రకటించిన తరువాత, యునైటెడ్ స్టేట్స్ యొక్క సార్వభౌమత్వాన్ని గుర్తించిన మొదటి మూడు దేశాధినేతలలో ఇద్దరు ముస్లింలు, వారిలో ఒకరు భారతదేశానికి చెందిన ముస్లిం. ”
యునైటెడ్ స్టేట్స్
ఆఫ్ అమెరికా యొక్క స్వాతంత్ర్యాన్ని గుర్తించిన మొట్టమొదటి దేశం మొరాకో. మొరాకో-అమెరికన్ స్నేహ ఒప్పందం (ట్రిపోలీ మధ్య
శాంతి మరియు స్నేహ ఒప్పందం) పై మొరాకో సంతకం చేసింది,. రెండోవది డచ్
రిపబ్లిక్ యొక్క ఏడు యునైటెడ్ ప్రావిన్సులలో ఒకటైన ఫ్రైస్లాండ్ Friesland మరియు మూడవది మైసూర్ స్టేట్ (భారతదేశం) రాజు టిప్పు సుల్తాన్.
అమెరికా రాజ్యాంగ
నిర్మాతలు తెలివైన వ్యక్తులు. యునైటెడ్ స్టేట్స్ మరియు ట్రిపోలీ మధ్య శాంతి మరియు
స్నేహ ఒప్పందంలో (1796) అమెరికన్ నాయకులు ఇలా పేర్కొన్నారు:
"యునైటెడ్
స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రభుత్వం క్రైస్తవ మతం మీద ఏ విధంగానూ స్థాపించబడలేదు,
ముస్సెల్మెన్
(ముస్లింల) యొక్క చట్టాలు, మతం లేదా ప్రశాంతతకు
వ్యతిరేకంగా అమెరికా కు శత్రుత్వం లేదు."
అమెరికన్ ముస్లింలు యు.ఎస్.
రాజ్యాంగంలో పొందుపరచబడిన విలువలను సమర్థిస్తారు, రక్షించుకుంటారు మరియు అమలుపరచు కుంటారు. మా విశ్వాసం “దేవుని క్రింద ఒక
దేశం, అందరికీ స్వేచ్ఛ మరియు న్యాయం One Nation under God, with liberty
and justice for all.”
No comments:
Post a Comment