23 July 2021

ఒలింపిక్ బంగారు పతకం సాధించిన మొట్టమొదటి అరబ్ అమ్మాయి నవాల్ ఎల్ మౌతావాకెల్ Nawal El Moutawakel—the first Arab girl to win an Olympic gold medal

 


  

ఆరోజు 1984 ఆగస్టు 8 వ తేదీ. లాస్ ఏంజిల్స్‌లో ఒలింపిక్ క్రీడలు పురోగతిలో ఉన్నాయి మరియు మహిళల 400 మీటర్ల హర్డిల్స్ రేసు ప్రారంభం కానుంది. వాతావరణం ఆహ్లాదకరంగా, ఉత్సాహంగా ఉంది, అందరి కళ్ళు భారతీయ ట్రాక్ స్టార్ పి.టి. మరో బలమైన రన్నర్ 8వ లేన్ లో ఉన్న యుఎస్ఎకు చెందిన ఆరు అడుగుల పొడవైన జుడి బ్రౌన్ లేన్  పై  ఉన్నాయి.

 

లేన్ 3 లోని మొరాకోకు చెందిన నవాల్ ఎల్ మౌతావాకెల్ అనే చిన్న మరియు సన్నని అమ్మాయిని ఎవరూ గమనించలేదు. ఆమె కళ్ళలో ఉన్న దృడమైన విశ్వాసాన్ని ఎవరూ గమనించలేదు. మొదటిసారి తప్పుడు/false స్టార్ట్  జరిగింది మరియు రన్నర్లను స్టార్టింగ్ బ్లాక్‌లకు వెనక్కు పిలవ వలసి వచ్చింది, పిదప  స్టార్టర్ యొక్క తుపాకీ మోగింది. రన్నింగ్ స్టార్ట్ అయింది.

మొదటి నుండి, గట్టి పోటీ జరిగుతుంది. రన్నర్లు మొదటి రెండు అడ్డంకులను దాటారు. కానీ రేసులో సగంలో, నవాల్ ఎల్ మౌతావాకెల్ ముందుకు దూసుకు రావడం ప్రారంభించినది.. వ్యాఖ్యాతలు షాక్ అయ్యారు. మొరాకో నుండి పచ్చటి చొక్కాలో ఉన్న చిన్న అమ్మాయి యూరోపియన్ రన్నర్స్ మరియు పొడవైన అమెరికన్ కంటే ముందు ఉండడటం  వారు మొదటిసారి గమనించారు.

స్థిరంగా మరియు ఖచ్చితంగా, నవాల్ తన ఆధిక్యాన్ని పెంచుకున్నది. చివరి అడ్డంకి తరువాత, ఆమె మిగతావారి కంటే బాగా ముందుంది. మిగతావారు  మొరాకో అమ్మాయిని పరుగులో అందుకోలేకపోయారు. చివరికి, ఆమె తన చేతులను పైకి విసిరి, అందరికంటే ముందుగా  నాలుగు మీటర్ల దూరం తేడా తో ఫినిష్ లైన్/finish line/ ముగింపు రేఖను దాటింది.

భారతదేశానికి చెందిన పి.టి. ఉషా సెకనులో 1/100 వ వంతు తేడా తో  పతకాన్ని కోల్పోయింది. నాల్గవ స్థానంలో నిలిచింది.

నవాల్ టేప్ బ్రెస్ట్ చేసినప్పుడు, చరిత్రను సృష్టించింది! మొరాకో నుండి బంగారు పతకం సాధించిన మొట్టమొదటి అథ్లెట్ మరియు అలా చేసిన మొదటి అరబ్ అమ్మాయి కూడా. పాశ్చాత్య ప్రపంచంలో 54 సెకన్లలో, అరబ్ మహిళల ఇమేజ్‌ను పెంచింది

అరబ్ మరియు ముస్లిం మహిళలు బుర్కా దరించి ఇంటికే పరిమితం అవుతారు యూరోపియన్ మరియు అమెరికన్ ప్రత్యర్ధులతో పోటి చేయలేరు అని భావించిన ప్రజలు, వారి తప్పుడు ఆలోచనలను పునరాలోచించవలసి వచ్చింది. "ఆమెకు అలాంటి దృత్వం ఉందని మేము అనుకోలేదు" అని రేసు తర్వాత ఒక వ్యాఖ్యాత చెప్పారు.

ఆమె అద్భుతమైన విజయం చాలా మంది అరబ్ మహిళలను  క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనడానికి మాత్రమే కాకుండా, అత్యున్నత స్థాయిలో పోటీ పడటానికి మార్గం సుగమం చేసింది. 1984కి ముందు, ఏ అరబ్ మహిళ కూడా ఒలింపిక్ క్రీడల్లో బంగారు పతకం సాధించలేదు.

మొరోకో దేశం మొత్తం వేడుకలు  జరుపుకుంది. ఆమెను అభినందించిన మొదటి వ్యక్తి మొరాకో రాజు.ఆమె విజయం ను మొదట మొరాకో రాజు కింగ్ హసన్ II అభినందించారు. రాజు ఇలా అన్నారు : నేను మీ గురించి చాలా గర్వపడుతున్నాను. దేశం మొత్తం సంతోషంలో ఉంది. నీ  విజయం మా అందరినీ ఎంతో సంతోషంగా, గర్వంగా చేసింది..

మొరాకో సమయం ప్రకారం పరుగు పోటి తెల్లవారుజామున జరిగింది. ఆ రోజు జన్మించిన ప్రతి అమ్మాయిని నవాల్ అని పిలవాలని మొరాకో కింగ్ ఆదేశించారు..

ఆ గొప్ప విజయం వందలాది యువ అరబ్ అథ్లెట్లకు స్ఫూర్తినిచ్చింది. దురద్రుష్టవశాత్తు  ఆమెను క్రీడలలో ప్రోత్సహించిన ఆమె తండ్రి మూడు నెలల ముందే కన్నుమూశారు మరియు తన కుమార్తె బంగారు పతకం సాధించటం చూడలేకపోయారు.  నేను నాన్నకు పతకం సాధించాను. అతను నన్ను నమ్మినందున నేను గెలిచాను అని నవాల్ అన్నారు.ఆమె బంగారు పతకం సాధించిన ఒక సంవత్సరం తరువాత, ఆమె విశ్వవిద్యాలయ సహచరులు విమాన ప్రమాదంలో మరణించారు. ఆమె వెంటనే క్రీడల  నుండి రిటైర్ అయ్యింది

ఆమె మొరాకోలో క్రీడా మంత్రిఅయ్యింది మరియు ప్రపంచ అథ్లెటిక్స్ మరియు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి) లో క్రీడలలో ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్  అయిన మొదటి అరబ్ మహిళ అయ్యింది. ఈ రోజు ఆమె ఐఓసి యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలు మరియు ఆ హోదాలో టోక్యో ఒలింపిక్స్ నిర్వహణ లో చురుకైన పాత్ర వహిస్తుంది.. ఆమె వివిధ ఐఓసి కమీషన్లలో చురుకైన సభ్యురాలు మరియు 1995 నుండి ప్రపంచ అథ్లెటిక్స్ కౌన్సిల్ సభ్యురాలు కూడా.

టోక్యో ఒలింపిక్ క్రీడలను విజయవంతం చేయడానికి మేము తీవ్రంగా కృషి చేస్తున్నాము. కరోనావైరస్ సమస్య కారణంగా ఈసారి కొత్త అడ్డంకులు ఉన్నాయి, కాని మేము వాటిని దైర్యంగా ఎదుర్కొంటాము అని ఆమె ఇటీవల మీడియాతో అన్నారు. "ఈ రోజు, అన్ని దేశాల మహిళలు క్రీడలలో పోటీ పడటం చూసినప్పుడు, నాకు ఎంతో సంతృప్తి కలుగుతుంది" అని ఆమె అన్నారు.

 

No comments:

Post a Comment