15 August 2026

మొయినుద్దీన్ బుర్హానుద్దీన్ హారిస్ (1907–?), Moinuddin Burhanuddin Harris

 

మొయినుద్దీన్ బుర్హానుద్దీన్ హారిస్ లేదా ఎం.బి. హారిస్ మహారాష్ట్రకు చెందిన  భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, సోషలిస్ట్ నాయకుడు, పాత్రికేయుడు మరియు ప్రముఖ సామాజిక కార్యకర్త. ప్రముఖ సోషలిస్టులు యూసుఫ్ మెహెరల్లీ, మినూ మసానీకి ఎం.బి. హారిస్ సన్నిహిత సమకాలికుడు, రాజకీయ మిత్రుడు మరియు తోటి సోషలిస్ట్.

1907లో మహారాష్ట్రలోని థానే జిల్లా, సుపారా (సోపారా)లో జన్మించిన సతారా మదరసా, ఎల్ఫిన్‌స్టోన్ స్కూల్ మరియు అలీగఢ్‌లోని జామియా మిలియా ఇస్లామియాలో విద్యనభ్యసించారు. మొయినుద్దీన్ బుర్హానుద్దీన్ హారిస్, మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమంలో చేరడానికి 1920లో తన చదువును వదిలేశారు. 1928లో జామియా మిలియా ఇస్లామియా నుండి గ్రాడ్యుయేషన్ (BA) పూర్తి చేశారు.   

 మొయినుద్దీన్ బి. హారిస్ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక చురుకైన వ్యక్తి. 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో, మొయినుద్దీన్ బి. హారిస్ ఉషా మెహతా మరియు డాక్టర్ రామ్ మనోహర్ లోహియాలతో కలిసి రహస్య కాంగ్రెస్ రేడియోను నడపడంలో కీలక పాత్ర పోషించారు, అక్కడ ఆయన సెన్సార్ చేయని వార్తలను ఆంగ్లంలో ప్రసారం చేశారు.

మొయినుద్దీన్ బి. హారిస్ (మొయినుద్దీన్ బి. హారిస్‌గా ప్రసిద్ధి చెందిన) గాంధీజీ మరియు సామ్యవాద భావజాలాలచే ఎంతగానో ప్రభావితులై, కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ వేదికపై యూసుఫ్ మెహర్ అలీ, అశోక్ మెహతా మరియు ఇతర ప్రముఖ నాయకులతో కలిసి పనిచేశారు.

భారత స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో బుర్హానుద్దీన్ హారిస్ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ (CSP) లో చేరారు. అందులో అత్యంత ప్రముఖ ముస్లిం నాయకులలో ఒకరిగా ఎదిగి, కీలక సోషలిస్ట్ నిర్వాహకుడిగా ఎదిగారు. బుర్హానుద్దీన్ హారిస్ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ (CSP)లో ఉన్నత స్థాయి సభ్యుడిగా ఉంటూ, అచ్యుత్ పట్వర్ధన్ మరియు మధు లిమాయే వంటి నాయకులతో పాటు దాని జాతీయ కార్యవర్గంలో పనిచేశారు.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, 1951 లో జరిగిన మొదటి బాంబే రాష్ట్ర శాసనసభ (Bombay Legislative Assembly) ఎన్నికలలో బుర్హానుద్దీన్ హారిస్ సోషలిస్ట్ పార్టీ (SP) తరపున 'ఉమర్ఖాడి డోంగ్రీ వాడి బందర్' నియోజకవర్గం నుండి పోటీ చేశారు.

బుర్హానుద్దీన్ హారిస్ 'డైలీ ఖిలాఫత్' మరియు 'బాంబే క్రానికల్' (ఢిల్లీ ఎడిషన్) పత్రికలలో జర్నలిస్టుగా పనిచేశారు.1928లో బుర్హానుద్దీన్ హారిస్ 'అజ్మల్' (Ajmal) అనే ఉర్దూ వార్తాపత్రికను ప్రారంభించి, 1971 వరకు దానికి యజమానిగా, సంపాదకుడిగా (Editor) వ్యవహరించారు. ముంబై మరియు భారతదేశంలోని ముస్లింలలో రాజకీయ, సామాజిక చైతన్యాన్ని మేల్కొల్పడంలో అజ్మల్ వార్తాపత్రిక కీలక పాత్ర పోషించింది.

 బుర్హానుద్దీన్ హారిస్ మహారాష్ట్రలో శాసన మండలి సభ్యునిగా (ఎమ్మెల్సీ) పనిచేశారు మరియు భారత కేంద్ర హజ్ కమిటీకి చైర్మన్ పనిచేసారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో పవర్‌లూమ్ పరిశ్రమ కార్మికుల కనీస వేతనాల కమిటీకి (Minimum Wages Committee) చైర్మన్‌గా కూడా సేవలందించారు. అజ్మల్ డైలీకి సంపాదకుడిగా పనిచేశారు మరియు బొంబాయి పురపాలక వ్యవహారాలు, ప్రజా గృహనిర్మాణ ప్రచారం, మరియు విద్యా ట్రస్టులలో చురుకుగా పాల్గొన్నారు.

మొయినుద్దీన్ హరిత్ చాలా కాలం పాటు ముంబై పురపాలక కార్పొరేషన్‌లో చురుకైన కౌన్సిలర్‌గా ఉన్నారు.ముంబైలోని దిగువ మరియు మధ్య తరగతి ప్రజల సమస్యలైన విద్య, ఆరోగ్యం, పరిశుభ్రత మరియు గృహవసతి కోసం కార్పొరేషన్ ఛాంబర్‌లో నిరంతరం గళం విప్పారు. నగరాభివృద్ధికి మరియు మత సామరస్యానికి ఆదర్శప్రాయమైన సేవలను అందించారు

బుర్హానుద్దీన్ హారిస్ ముంబైలోని చారిత్రాత్మక విద్యాసంస్థ 'అంజుమన్-ఎ-ఇస్లాం'కు అధ్యక్షుడిగా మరియు ఉన్నత పదవులను నిర్వహించారు. అక్బర్ పీర్ భాయ్ మరియు డాక్టర్ ఇషాక్ జామ్‌ఖానా వాలాలతో కలిసి, ఆయన ముంబై మరియు దాని శివారు ప్రాంతాలలో ఈ సంస్థ యొక్క విద్యా నెట్‌వర్క్‌ను విస్తరించారు.

నల్లాసోపారాలోని మొయినుద్దీన్ బి. హారిస్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ (ముంబై విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంది) వంటి సంస్థలకు ఆయన గౌరవార్థం బుర్హానుద్దీన్ హారిస్ పేరు పెట్టారు.ముంబైలోని మహిమ్‌లో ఉన్న అంజుమన్-ఇ-ఇస్లాం మొయినుద్దీన్ హారిస్ డి.ఎల్.ఎడ్. మహిళా కళాశాల వంటి  అనేక విద్యా సంస్థలకు, దశాబ్దాల అంకితభావంతో సేవ చేసారు..

మొయినుద్దీన్ హరిస్ గాంధేయ, సామ్యవాద సూత్రాలకు కట్టుబడి భారతదేశాన్ని తన ఇల్లుగా భావించారు. ఆధునిక విద్య, విజ్ఞానం, జాతీయ విలువలతో మమేకం కావాలని ముస్లింలకు ఎల్లప్పుడూ బోధించారు

నిజాయితీ, ప్రజా సేవ, సూత్రబద్ధమైన విలువలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే ముంబై గంగా జామ్ని సంస్కృతికి మొయినుద్దీన్ హరిస్ ఒక ప్రతీక.

మొయినుద్దీన్ బుర్హానుద్దీన్ హారిస్ యొక్క  ప్రముఖ రచనలు

మొయినుద్దీన్ బుర్హానుద్దీన్ హారిస్ రాజకీయ, సామాజిక అంశాలపై పలు పుస్తకాలు, వ్యాసాలు రాశారు. వాటిలో ముఖ్యమైనవి:

 

“Gandhi, the Inspirer of Men” (1950)

  • “In the interest of free and fair election” (1956)
  • “The Haj - Islamic Pilgrimage”

 

 

 

 

No comments:

Post a Comment