16 September 2026

2026 బ్యాలన్ డి'ఓర్ షార్ట్‌లిస్ట్‌లో పదకొండు మంది ముస్లిం స్టార్స్ చోటు దక్కించుకున్నారుEleven Muslim Stars Make 2026 Ballon d’Or Shortlist in a Historic Year for Representation

 


పారిస్:


ప్రపంచ ఫుట్‌బాల్ 2026 పురుషుల బ్యాలన్ డి'ఓర్ కోసం ప్రకటించిన 30 మంది షార్ట్‌లిస్ట్‌ లో ఏడాది కాలంలో తమ ప్రతిభ, క్రమశిక్షణ, మరియు ప్రపంచ వేదికపై చూపిన ఆటకు గాను ఐదుగురు అగ్రశ్రేణి ముస్లిం ఫుట్‌బాల్ క్రీడాకారులు అధికారిక గుర్తింపు పొందారు.

ఈ జాబితాలో పారిస్ సెయింట్-జెర్మైన్ ఫార్వర్డ్ ఉస్మాన్ డెంబెలె ముందున్నాడు. ఉస్మాన్ 2025 బ్యాలన్ డి'ఓర్ ట్రోఫీని గెలుచుకుని చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు వరుసగా రెండోసారి నామినేషన్ సంపాదించి, ఫుట్ బాల్ ఆట యొక్క అత్యున్నత స్థాయిలో తన నిలకడను చాటుకున్నాడు.

ఉస్మాన్ తో పాటు బార్సిలోనాకు చెందిన లామిన్ యమాల్ కూడా ఈ జాబితాలో చేరాడు. లామిన్ యమాల్ అద్భుతమైన క్రీడా ప్రదర్శనలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. యువ ఫార్వర్డ్ లామిన్ యమాల్ యూరోపియన్ ఫుట్‌బాల్‌లో అత్యంత ఆశాజనకమైన యువ క్రీడాకారులలో ఒకరిగా ఎదిగాడు.

ఈ షార్ట్‌లిస్ట్‌లో పారిస్ సెయింట్-జెర్మైన్ తరఫున మొరాకో ఫుల్-బ్యాక్ అయిన అష్రాఫ్ హకీమీ కూడా ఉన్నారు. అష్రాఫ్ హకీమీ అతన గినియాకు చెందిన, సెర్హౌ గిరాస్సీతో పాటు నామినేషన్‌ను పొందాడు.

ఈ ఐదుగురిలో చివరిగా అల్ నస్ర్ జట్టుకు చెందిన సాడియో మానే ఉన్నారు. సెనెగల్ దిగ్గజం సాడియో మానే, మైదానంలో అద్భుతమైన స్కోరింగ్ రికార్డుతో పాటు, తన సొంత గ్రామంలో మౌలిక సదుపాయాలను నిర్మించడం మరియు తన సమాజానికి అవకాశాలను కల్పించడం వంటి పరోపకార కార్యక్రమాలను కొనసాగిస్తున్నాడు.

బాలన్ డి'ఓర్ 2026: మెన్స్ యంగ్ టాలెంట్ ఆఫ్ ది ఇయర్ నామినీలలో పైన పేర్కొన్న వారితో పాటు, కెరిమ్ అలజ్‌బెగోవిచ్, అయ్యూబ్ బౌవాడి, యాన్ డియోమాండే మరియు ఇబ్రహీం మాజా కూడా ఉన్నారు.

ఈ సంవత్సరపు ఉత్తమ గోల్ కీపర్‌కు ఇచ్చే యాచిన్ ట్రోఫీకి మొరాకో గోల్ కీపర్ యాస్సిన్ బౌనౌ మరియు సెనెగల్ గోల్ కీపర్ ఎడ్వర్డ్ మెండీ ఇద్దరూ నామినేషన్లు అందుకున్నారు. వారిని చేర్చడం వల్ల, ఫుట్‌బాల్‌లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యక్తిగత పురస్కారాలలో ముస్లింల ప్రాతినిధ్యం ఈ సంవత్సరం మరింత బలంగా నిలిచింది.

ప్రపంచ ఫుట్‌బాల్‌లోని అత్యున్నత వేదికలపై వారు వినయాన్ని, కృతజ్ఞతను ప్రదర్శిస్తూ, లక్షలాది మంది యువ ముస్లిం అభిమానులకు ఒక శక్తివంతమైన ఆదర్శాన్ని అందిస్తున్నారు.

 

మూలం: రేడియన్స్ న్యూస్ బ్యూరో

2026 జాతీయ ఉపాధ్యాయ పురస్కారం గెలుచుకున్న నలుగురు ముస్లిములు 04 Muslims who have won the 2026 National Teachers Award

 

 

న్యూఢిల్లీ: 

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో సేవలందిస్తున్న ముస్లిం వర్గానికి చెందిన నలుగురు విశిష్ట ఉపాధ్యాయులకు 2026 జాతీయ ఉపాధ్యాయ పురస్కారాన్ని ప్రదానం చేశారు.

ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 05, 2026న జరుపుకునే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా, రాష్ట్రపతి ముర్ము భారతదేశం నలుమూలల నుండి 48 మంది ఉపాధ్యాయులను అభినందించి, సత్కరించారు.

పురస్కారం పొందిన 48 మంది ఉపాధ్యాయులలో నలుగురు - మహ్మద్ ముస్తఫా కమల్, మహ్మద్ జాఫర్ ఆలం, డాక్టర్ ఇఫ్తికార్ ఖాన్ మరియు మహ్మద్ అయాజ్ రైనా, ముస్లిం వర్గానికి చెందినవారు.

1958వ సంవత్సరంలో స్థాపించబడిన జాతీయ ఉపాధ్యాయ పురస్కారం, దేశంలోని అత్యుత్తమ ఉపాధ్యాయుల విశిష్ట సేవలను గౌరవించడానికి మరియు ప్రశంసించడానికి ఉద్దేశించబడింది.

మొహమ్మద్ ముస్తఫా కమల్

లడఖ్‌లోని కార్గిల్ జిల్లా, సంకూలో గల ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల జ్గాంగ్జింగ్‌కు చెందిన మొహమ్మద్ ముస్తఫా కమల్‌కు, అనుభవపూర్వక, సందర్భోచిత, మరియు సాంకేతికత ఆధారిత సాంఘిక శాస్త్ర విద్యకు చేసిన గణనీయమైన కృషికి గాను పురస్కారం లభించింది.

కమల్ ప్రస్తుతం సంకూలోని లనక్రచీ థాంగ్ మాధ్యమిక పాఠశాలలో పనిచేస్తున్నారు. కమల్ కార్గిల్ లడఖ్ జనరల్ లైన్ టీచర్స్ ఫోరమ్‌కు జిల్లా అధ్యక్షుడిగా కూడా సేవలందిస్తున్నారు.

"2011 నుండి, కమల్ కేవ్ క్లాస్‌రూమ్, మ్యూజియం క్లాస్‌రూమ్ మరియు క్లాస్‌రూమ్ పార్లమెంట్ వంటి వినూత్న పద్ధతుల ద్వారా స్థానిక పరిసరాలను అభ్యసన వనరులుగా మార్చారు. చరిత్ర, భూగోళశాస్త్రం, అర్థశాస్త్రం మరియు పౌరశాస్త్రాలను స్థానిక వారసత్వం, జీవనోపాధి మరియు సామాజిక జీవితంతో అనుసంధానించారు" అని విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది.

" కమల్ స్కూల్ భువన్, గూగుల్ ఎర్త్, స్టెల్లారియం, కహూట్ మరియు క్విజిజ్‌లను అనుసంధానించారు మరియు పీఎం ఇవిద్యా ద్వారా డిజిటల్ పాఠాలను అందించారు" అని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ముస్తఫా కమల్ గతంలో 2020లో ఆసియన్ ఎడ్యుకేషన్ అవార్డును కూడా గెలుచుకున్నారు. 2020లో జాతీయ ఉపాధ్యాయ అవార్డు కోసం జిల్లా ఎంపిక కమిటీ నామినేట్ చేసిన కార్గిల్ జిల్లాకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులలో కమల్ కూడా ఒకరు.

ఇఫ్తికార్ ఖాన్

ఉత్తర ప్రదేశ్‌లోని బల్లియా ప్రభుత్వ ఇంటర్ కళాశాలకు చెందిన ఇఫ్తికార్ ఖాన్, వందలాది మంది విద్యార్థులకు, ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి, ఉచిత ఆదివారం కళా/పెయింటింగ్  విద్యను అందించినందుకు గాను 2026 జాతీయ ఉపాధ్యాయ అవార్డును గెలుచుకున్నారు. ఈ విద్య ద్వారా ఆ విద్యార్థులు నాణ్యమైన శిక్షణ, వృత్తి మార్గదర్శకత్వం మరియు పోటీ అవకాశాలను పొందేందుకు వీలు కల్పించారు.

ఇఫ్తికార్ ఖాన్ వేసవి సెలవుల్లో ప్రత్యేక పెయింటింగ్ వర్క్‌షాప్‌లను కూడా నిర్వహిస్తారు, దీని ద్వారా పిల్లలకు నిరంతర సాధన మరియు వ్యక్తిగత మార్గదర్శకత్వం అందిస్తారు. బల్లియాలోని ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన పిల్లలకు లలిత కళలలో అధికారిక శిక్షణ పొందడానికి లేదా ప్రముఖ సంస్థల ప్రవేశ పరీక్షలకు సిద్ధం కావడానికి పరిమిత అవకాశాలు ఉన్నాయని ఇఫ్తికార్ ఖాన్ గుర్తించినప్పుడు, 2000వ సంవత్సరంలో విద్యార్థులకు కోచింగ్ ఇవ్వడం ప్రారంభించారు.

" ఇఫ్తికార్ ఖాన్ మార్గదర్శకత్వంలో, విద్యార్థులు రాష్ట్ర, జాతీయ కళల పోటీలలో రాణించి, ఐఐటి, ఎన్ఐడి, బిహెచ్‌యు, జామియా మిలియా ఇస్లామియా మరియు ఎఫ్‌డిడిఐ వంటి సంస్థలలో ప్రవేశం పొందారు. ఇఫ్తికార్ ఖాన్ విద్యార్థులు డిజైన్, ఫోటోగ్రఫీ, మల్టీమీడియా మరియు సృజనాత్మక పరిశ్రమలలో వృత్తిని చేపట్టారు" అని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది.

మహ్మద్ అయాజ్ రైనా

జమ్మూ & కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లా, దల్హోరిలో గల ప్రభుత్వ ఉన్నత సెకండరీ పాఠశాలకు చెందిన మహ్మద్ అయాజ్ రైనాకు, మారుమూల మరియు సరిహద్దు ప్రాంతాలలో సాంకేతికత ఆధారిత, అనుభవపూర్వక మరియు సమానత్వ విద్యను అభివృద్ధి చేయడానికి 30 సంవత్సరాలకు పైగా చేసిన సేవలకు గాను జాతీయ ఉపాధ్యాయ పురస్కారం ప్రదానం చేయబడింది.

"మహ్మద్ అయాజ్ రైనా ఒక మారుమూల పాఠశాలలో కంప్యూటర్ ప్రయోగశాలను స్థాపించడం ద్వారా ఐసిటి వినియోగానికి మార్గదర్శకత్వం వహించారు మరియు స్మార్ట్ బోర్డులు, వర్చువల్ ప్రయోగశాలలు, డిజిటల్ మూల్యాంకనాలు, విద్యా యాప్‌లు మరియు ఇంటరాక్టివ్ ఇ-కంటెంట్‌ను తరగతి గది బోధనలో అనుసంధానించారు. మహ్మద్ అయాజ్ రైనా తక్కువ ఖర్చుతో కూడిన విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరణలు మరియు కార్యాచరణ-ఆధారిత బోధనా పద్ధతి సంక్లిష్టమైన భావనలను ఆసక్తికరంగా మరియు సులభంగా అర్థమయ్యేలా చేశాయి" అని విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది.

రైనా చేసిన కృషికి గతంలో అనేక గౌరవాలు లభించాయి, వాటిలో 2017లో జాతీయ సమాచార మరియు ప్రసార సాంకేతిక పురస్కారం, 2021లో జమ్మూ మరియు కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతపు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం ఉన్నాయి.

రైనా గ్లోబల్ టీచర్ అవార్డు 2021 మరియు గ్లోబల్ బెస్ట్ ఎడ్యుకేషనల్ పోస్టర్ అవార్డు 2020 కూడా అందుకున్నారు.

మహ్మద్ జాఫర్ ఆలం

ఒడిశాలోని కరంజియాలో ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (EMRS) ప్రిన్సిపాల్ అయిన మహమ్మద్ జాఫర్ ఆలం, 20 ఏళ్లకు పైగా సేవ చేసి గిరిజన విద్యలో పరివర్తన తీసుకువచ్చినందుకు గాను జాతీయ ఉపాధ్యాయ పురస్కారం 2026తో సత్కరించబడ్డారు. సాంకేతికత, క్రీడలు మరియు అనుభవపూర్వక అభ్యాసాన్ని గిరిజన వారసత్వంతో మేళవించి, మహ్మద్ జాఫర్ ఆలం EMRS కరంజియాను 100% పదవ తరగతి ఫలితాలు మరియు 16 జాతీయ క్రీడా పతకాలు సాధించేలా నడిపించారు.

బనురియా (టాటో)లో ఉన్న నివాసిత మరియు సహ-విద్యా పాఠశాల, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 6 నుండి 12వ తరగతుల కోసం 2017-18లో స్థాపించబడింది. ఇందులో సుమారు 410 మంది విద్యార్థులు ఉండగా, మొత్తం సామర్థ్యం సుమారు 480గా ఉంది.

"విద్యార్థుల నమోదు కార్యక్రమాలు, వ్యసన నివారణ ప్రచారాలు మరియు ఉన్నత విద్య కోసం ఆర్థిక సహాయం అందించడం ద్వారా, జాఫర్ ఆలం అట్టడుగు వర్గాల విద్యార్థుల సామాజిక-విద్యాపరమైన పురోగతికి కృషి చేస్తున్నారు" అని విద్యా మంత్రిత్వ శాఖ పేర్కొంది.

డాక్టర్ రోషన్ జహాన్ షేక్: ప్రతికూలతను ధైర్యసాహసాలతో ఎదిరించిన వనిత Dr. Roshan Jahan Sheikh: An Woman Turning Adversity into an Extraordinary Journey of Courage

 


 

ముంబై, మహారాష్ట్ర:

 

రెండు కాళ్లు కోల్పోవడం, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబం నుండి MBBS డాక్టర్‌గా, MD పాథాలజిస్ట్‌గా, ప్రేరణా వక్తగా, అవార్డులు గెలుచుకున్న వ్యక్తిగా డాక్టర్ రోషన్ షేక్ ప్రయాణం  అద్భుతం.

డాక్టర్ రోషన్ షేక్ ఇప్పుడు విద్యా రంగంలో ఒక ప్రముఖ పేరుగా, వేలాది మంది విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. డాక్టర్ రోషన్ షేక్ ను అస్సాంలోని మౌలానా అజ్మల్ విద్యా సంస్థ, కర్ణాటకలోని బీదర్‌లో ఉన్న షాహీన్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్, ముంబైలోని అంజుమన్-ఎ-ఇస్లాం, ఇంకా మహారాష్ట్ర మరియు ఉత్తర ప్రదేశ్‌లోని డజన్ల కొద్దీ ఇతర ప్రతిష్టాత్మక సంస్థలు ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాయి.

ముంబైలో సామాన్య ఆర్ధిక శక్తీ కుటుంబంలో జన్మించిన రోషన్ జహాన్, డాక్టర్ కావాలని కలలు కన్నారు. రోషన్ జహాన్ పదకొండవ తరగతిలో ఉన్నప్పుడు జరిగిన ఒక ఘోర రైలు ప్రమాదంలో తన రెండు కాళ్లను కోల్పోవడంతో మూడు నెలలకు పైగా మంచానికే పరిమితమైంది.

నాలుగో తరగతి వరకు మాత్రమే చదువుకున్న రోషన్ జహాన్ ను తల్లి, తదుపరి విద్యాబ్యాసం కోసం వీల్‌చైర్‌లో పాఠశాలకు తీసుకువెళ్ళేది. తీవ్రమైన శారీరక, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, రోషన్ జహాన్ 12వ తరగతిని పూర్తి చేసి, రాష్ట్ర వైద్య ప్రవేశ పరీక్షలో దివ్యాంగుల విభాగంలో మూడవ ర్యాంకును సాధించింది.

అయితే, రోషన్ జహాన్ వైకల్యం 96 శాతంగా నిర్ధారించబడటంతో వైద్య ప్రవేశం నిరాకరించబడినప్పుడు పోరాటం కొనసాగింది. ఎందుకంటే, అప్పటి నిబంధనల ప్రకారం 70 శాతానికి పైగా వైకల్యం ఉన్న అభ్యర్థులకు మాత్రమే ప్రవేశం పరిమితం చేయబడింది. తన కలను సాకారం చేసుకోవాలనే పట్టుదలతో, రోషన్ జహాన్ 2011లో ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సంజయ్ కోఠారియా, న్యాయవాది పి.బి. పాటిల్ మద్దతుతో బొంబాయి హైకోర్టును ఆశ్రయించింది. కోర్టు రోషన్ జహాన్ సామర్థ్యాలను గుర్తించి, వైద్య విద్యను అభ్యసించడానికి అనుమతించింది.

ఆ తర్వాత రోషన్ జహాన్ ముంబైలోని కెఇఎం మెడికల్ కాలేజీలో ప్రవేశం పొందింది. 2016లో తన MBBS పూర్తి చేసి, ఆ తర్వాత రోషన్ జహాన్ 2021లో ముంబై నుండి పాథాలజీలో MD పట్టా పొందారు.

 విద్యా పొందడం లో చాలా  మంది రోషన్ జహాన్ కుసహాయం చేసారు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే అమీన్ పటేల్ వైద్య విద్యకు ఆర్థిక సహాయం చేయగా, పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువులు అభ్యసించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు బీజేపీ ఎంపీ కిరీట్ సోమయ్య రోషన్ జహాన్ కు అండగా నిలిచారు.

MD పూర్తి చేసిన తర్వాత, రోషన్ కన్సల్టెంట్ పాథాలజిస్ట్ మరియు సైటోపాథాలజిస్ట్‌గా పనిచేశారు. 2022 అక్టోబర్ 28న రోషన్ జహాన్ ముంబైకి చెందిన వ్యాపారవేత్త సల్మాన్ అబ్దుల్ లతీఫ్‌ను వివాహం చేసుకుని, 2026లో తల్లి అయ్యారు.

రోషన్ జహాన్ ప్రేరణా వక్తగా కూడా మారి, మహారాష్ట్ర, కర్ణాటక మరియు ఇతర రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు పర్యటిస్తూ, తన జీవిత కథతో వేలాది మంది విద్యార్థులను ప్రేరేపించారు.

రోషన్ జహాన్ సాధించిన విజయాలకు జాతీయ స్థాయిలో హిందుస్థాన్ టైమ్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు (2018)తో సహా అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలు లభించాయి. ఇతర గుర్తింపులలో శూర్వీర్ అవార్డు, భారత్ ప్రేరణ అవార్డు, బాంబే హైకోర్టు నుండి శౌర్యం మరియు ధైర్యసాహసాలకు అవార్డు, ఇంక్లాబ్ అవార్డు, గల్లీ న్యూస్ గ్రిఫిన్ అవార్డ్ ఫర్ ఉమెన్ ఇంపాక్ట్, కావిన్‌కేర్ ఎబిలిటీ అవార్డు, డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం అవార్డు, సాహస్ ఎబిలిటీ అవార్డు, మైక్రోసాఫ్ట్ బ్రేవరీ అవార్డు మరియు టాటా నుండి సబల్ అవార్డు వంటి అనేక పురస్కారాలను రోషన్ జహాన్ అందుకున్నారు.

డాక్టర్ రోషన్ జహాన్ షేక్ ప్రతికూలతను ఒక లక్ష్యంగా మార్చుకున్నారు. శారీరక పరిమితులు మానవ కలలను పరిమితం చేయవని, ధైర్యం, విద్య మరియు పట్టుదల అసాధ్యంగా కనిపించే లక్ష్యాలను కూడా సాకారం చేయగలవని రోషన్ జహాన్ జీవితం ఒక శక్తివంతమైన సందేశంగా నిలుస్తుంది.

మూలం: ముస్లిం మిర్రర్, 8 సెప్టెంబర్ 2026