బిజ్నూర్ -(మొరాదాబాద్ డివిజన్), ఉత్తర ప్రదేశ్ :
1912లో మహమ్మద్ మజీద్ హసన్ స్థాపించిన ద్వివార
పత్రిక ‘మదీనా’, వాయువ్య సంయుక్త ప్రావిన్సులలోని (ప్రస్తుత ఉత్తర ప్రదేశ్) బిజ్నూర్ ప్రాంతం
లో ప్రారంభమైంది. ‘మదీనా’ పత్రిక త్వరలోనే భారత ఉపఖండం అంతటా భారీ సర్క్యులేషన్‌ను సాధించింది.
మజీద్ హసన్
లాహోర్‌లో పాత్రికేయుడిగా పనిచేస్తూనే, న్యాయమూర్తి వృత్తికి తన శిక్షణను మధ్యలోనే
వదిలేసి, కుటుంబ పత్రిక 'సహీఫా'లో పనిచేయడానికి బిజ్నోర్‌కు తిరిగి వచ్చినాడు.
మజీద్ హసన్
మొదటి భార్య, ముహతర్మా కనీజ్ ఫాతిమా, పత్రికను ప్రారంభించడంలో ఆర్ధికంగా సహాయపడింది.
‘మదీనా’, పత్రిక తన
చివరి పేజీలలో ఒకదానిలో 'అఖ్బార్-ఇ-నిస్వాన్' అనే పేరుతో ఒక ప్రత్యేక మహిళా విభాగాన్ని చేర్చడానికి కనీజ్ ఫాతిమా నే
ప్రేరణగా నిలిచారు. 1912 నుండి 1915 వరకు, ‘మదీనా’, పత్రిక
మొదటి మూడు సంవత్సరాలలో ఈ మహిళా విభాగం తరచుగా ప్రచురితమయ్యేది. పురుషులు, మహిళలు
ఇద్దరూ రాసిన సంపాదకీయాలు, సృజనాత్మక రచనలను చేర్చడం ద్వారా ముస్లిం మహిళల ప్రయోజనాలకు సేవ చేయడమే
దీని ఉద్దేశం.
త్వరలోనే, ‘మదీనా’
పత్రిక తన పాఠకులలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ముస్లిం మహిళలు
తమ సమస్యలను చర్చించుకోవడానికి ఒక వేదికను
సృష్టించింది.
మదీనా
పత్రిక ప్రారంభమైన 1912 సంవత్సరంలోనే, మౌలానా ఆజాద్ తన 23వ ఏట కలకత్తాలో 'అల్-హిలాల్' అనే పత్రికను ప్రారంభించారు. త్వరలోనే 'అల్-హిలాల్' పాఠకుల సంఖ్యలో శిఖరాగ్రానికి చేరుకుంది. అయితే ఆజాద్
యొక్క 'అల్-హిలాల్' వలస ప్రభుత్వం నుండి తీవ్రమైన పరిశీలనకు గురై, 1914 చివరి
నాటికి ప్రచురణను నిలిపివేయవలసి వచ్చింది.
'మదీనా' వంటి పత్రికలు 'ఖస్బాహ్' (చిన్న పట్టణాలు) అని పిలువబడే సామాజిక
ప్రాంతాలలో ఫలవంతం అయ్యాయి
బాల్కన్
యుద్ధాల తరువాత, మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో మదీనా పత్రిక తన రాజకీయ పరిధిని విస్తృతం
చేసుకుంది.మదీనా పత్రిక ఖిలాఫత్ ఉద్యమాన్ని ప్రోత్సహించడం ద్వారా మరియు జమియత్
ఉలేమా-ఎ-హింద్‌తో తన అనుబంధం ద్వారా ప్రపంచ ఇస్లామిక్ చైతన్యాన్ని కాపాడిందని
భావిస్తారు. భారత జాతీయ కాంగ్రెస్‌కు మదీనా తన మద్దతు మరియు జిన్నాకు
వ్యతిరేకంగా వేర్పాటువాద వ్యతిరేక వైఖరి ప్రదర్శించినది.
పండితుడు
జ్ఞానేంద్ర పాండే ప్రకారం, ముస్లిం ప్రజాభిప్రాయానికి మదీనా ఒక కీలకమైన సూచికగా పనిచేసింది. సహాయ
నిరాకరణ మరియు ఖిలాఫత్ ఉద్యమాల సమయంలో హిందూ-ముస్లిం ఐక్యతతో ప్రేరేపించబడి, మదీనా పత్రిక
1922 నాటికి 12,500 కాపీల అద్భుతమైన గరిష్ట సర్క్యులేషన్‌ను సాధించింది. అయితే వలస ప్రభుత్వం
నుండి ముఖ్యంగా 1919 జలియన్‌వాలా బాగ్ మారణకాండపై మదీనా పత్రిక ధైర్యమైన మరియు స్పష్టమైన
రిపోర్టింగ్ కారణంగా పంజాబ్‌లో మదీనా పత్రిక నిషేధించబడింది. నిషేధం తరువాత, మదీనా పత్రికను
ఆగష్టు 1919లో 'యస్రాబ్' (అరబిక్‌లో మదీనా) అనే కొత్త పేరుతో తిరిగి ప్రారంభించారు.
అయితే 1920ల ప్రారంభం
నాటికి పత్రిక పాఠకుల సంఖ్య తగ్గింది. 1927 నాటికి సర్క్యులేషన్ 6,500కు, 1931 నాటికి మరో
6,000కు పడిపోయింది.ఈ విధంగా సర్క్యులేషన్ తగ్గుతున్నప్పటికీ, 'మదీనా' పత్రిక మత
వేర్పాటువాదాన్ని నిరంతరం, శక్తివంతంగా విమర్శిస్తూనే ఉంది. 1930లు మరియు 1940ల కాలంలోని వివాదాస్పద రాజకీయ ఇతివృత్తాలతో
మమేకమవుతూ, మదీనా పత్రిక ముస్లిం లీగ్ విభజన రాజకీయాలను వ్యతిరేకిoచినది.
1942 నాటికి, మదీనా వార్తాపత్రిక సమర్థవంతంగా ఒక బహిరంగ సభగా
రూపాంతరం చెందింది. ఇది సాధారణ పౌరులు తమ కస్బా ప్రాంగణం నుండే, సమీపిస్తున్న
పాకిస్తాన్ ఉద్యమాన్ని చర్చించడానికి మరియు చాలా వరకు ప్రతిఘటించడానికి వీలు
కల్పించింది.
1940వ దశకం నాటికి, మదీనా పత్రిక లీగ్ వేర్పాటువాద వైఖరిని
ప్రతిఘటించడానికి నిరంతరం ప్రయత్నించినప్పటికీ, భారత ఉపఖండం రెండు భాగాలుగా విభజించబడటాన్ని అది
చూసింది. మదీనా పత్రిక వేలుబడుటకు మరియు సంపాదకీయాలకు నిరంతరం సహకరించిన ముస్లిం
సమాజంలోని సంపన్న సభ్యులు సరిహద్దుకు అవతలి వైపుకు వెళ్ళిపోవడంతో, ఆర్ధిక ఇబ్బందులను
ఎదుర్కొంది.
1951 నాటి భాషా చట్టం ప్రకారం ఉత్తర ప్రదేశ్‌లో
హిందీని రాష్ట్ర భాషగా స్వీకరించారు. దీని ప్రకారం అధికారులు, ప్రభుత్వ
కార్యాలయాలు తమ సమాచారాన్నంతా హిందీలోనే నిర్వహించాలని తప్పనిసరి చేశారు. క్రమంగా మదీనా
పత్రిక యొక్క సర్క్యులేషన్ తగ్గడం జరిగింది. దీనికి తోడూ పత్రిక యజమాని మజీద్ హసన్ ఆరోగ్యం
క్షీణించడం చివరికి ఆయన మరణానికి దారితీసింది; మజీద్ హసన్ 1972లో కన్నుమూశారు. ఆ వార్తాపత్రిక నిర్వహణ హసన్
కుటుంబం చేతిలోనే కొనసాగింది, అయితే చివరి సంపాదకుడైన సయ్యద్ హసన్ 1975లో ప్రచురణను నిలిపివేసి, ఆ
ముద్రణాలయాన్ని నిశ్శబ్దంగా మూసివేశారు.
డిజిటలీకరణ ప్రక్రియ ప్రారంభమయ్యేనాటికే, మదీనా పత్రిక మూతపడింది. 1976లో మదీనా పత్రిక తన చివరి సంచికతో ముద్రణాలయాన్ని మూసివేసింది. మదీనా పత్రిక మనుగడ సాగించిన ఏడు దశాబ్దాల కాలంలో, మదీనా పత్రిక సంచికలు కేవలం కాలిగ్రాఫర్లు మరియు కళాకారుల చేత చేతితోనే ముద్రించబడ్డాయి.
No comments:
Post a Comment