మొఘల్ పాలన సాగిన శతాబ్దాలు ముఖ్యంగా అక్బర్ ఆస్థానం సంస్కృత విద్యా కేంద్రాలకు, చురుకైన మేధోపరమైన కార్యకలాపాలకు మరియు పర్షియన్, సంస్కృత ప్రపంచాల మధ్య శక్తివంతమైన పరస్పర మార్పిడికి వేదికగా నిలిచింది..
మొఘల్ అధికారం ఉచ్ఛస్థితిలో ఉన్న 16-17వ శతాబ్దాలలో, సమాజంలో
సంస్కృత భాష మరియు హిందూ తత్వశాస్త్రం బాగా వికసించాయి,
మొఘల్ ఆస్థానం లో సంస్కృతం మరియు పర్షియన్ భాషలకు ఆదరణ
లబించినది. భారతీయ సంస్కృతి, తత్వశాస్త్రంపై అవగాహన మరియు
సంస్కృత పండితులకు ఆదరణ కూడా లభించినది. 1190ల
నుండి 1720ల వరకు సాగిన సుదీర్ఘ 'ముస్లిం' పాలనలో సంస్కృత పండితులు ఆదరించబడినారు. ఆ కాలంలో మేధోపరమైన జీవితంలో వివిధ కోణాల ద్వారా
నూతన ఆవిష్కరణలు మరియు ప్రయోగాలు రూపుదిద్దుకున్నాయి.
సంస్కృత భాష, సంస్కృతి మరియు దానికి సంబంధించిన తాత్విక విద్యాసంప్రదాయాలు గౌరవించబడినవి. మొఘల్ చక్రవర్తులు మరియు ఉన్నత వర్గాలు సంస్కృత పండితులకు విస్తృతమైన పోషణ అందించినారు.
అక్బర్ చక్రవర్తి చే ఆదరించబడి పోషణ పొందిన వారిలో 36 మంది ప్రముఖ బ్రాహ్మణ మరియు 17 మంది జైన సంస్కృత పండితులు కలరు. వారిలో అక్బర్ చక్రవర్తి పోషణ పొందిన ఏడుగురు ముస్లిం సంస్కృత పండితులు కూడా ఉన్నారు. బ్రాహ్మణ పండితులలో, చాలామంది హిందూ తత్వశాస్త్రం మరియు వేదాంతంలో నిపుణులు.
మిథిలా పండితుల సమూహంలో అత్యంత ప్రసిద్ధుడు మహామహోపాధ్యాయ పండిట్ మహేష్ ఠక్కూర్ పాండిత్యానికి ఎంతగానో ముగ్ధుడైన అక్బర్, బీహార్‌లోని హాజీపూర్ నుండి తిర్హుత్ సర్కార్ (ప్రభుత్వం) అనే పరిపాలనా విభాగాన్ని వేరు చేసి, దానికి అధిపతిగా పన్ను వసూలు చేసే హక్కులను మహేష్ ఠక్కూర్‌కు అప్పగించారు. తదనంతరం ఇదే దర్భంగా సంస్థానానికి కేంద్రంగా మారింది.
16వ శతాబ్దం చివరలో, అక్బర్
'రామాయణం' యొక్క
పర్షియన్ అనువాదాన్ని చేయించారు. అక్బర్ ఆధ్వర్యంలో పర్షియన్ భాషలోకి అనువదించబడిన
సంస్కృత గ్రంథాల సుదీర్ఘ జాబితా కలదు. ఇందులో వాల్మీకి రామాయణం, మహాభారతం, గీత, శ్రీమద్భాగవత మహాపురాణం, యోగ వాసిష్ఠం, అధర్వ
వేదం, రాజతరంగిణి వంటి గ్రంథాలు ఉన్నాయి; అనేక పర్షియన్ గ్రంథాలు కూడా సంస్కృతంలోకి
అనువదించబడ్డాయి. వీటిలో అబుల్ ఫజల్ యొక్క అక్బర్ నామా కూడా కలదు..
No comments:
Post a Comment