31 May 2020

ఇబ్న్ ఫిర్నాస్ (అర్మెన్ ఫిర్మాన్) (810–887 A.D.) - మొదటి ఏవియేటర్ Ibn Firnas (Armen Firman) – The First Aviator




Ibn Firnas (Armen Firman) – The First Aviator | Science & Faith 
Muslim He 


అబ్బాస్ ఖాసిమ్ ఇబ్న్ ఫిర్నాస్ అని కూడా పిలువబడే అబ్బాస్ ఇబ్న్ ఫిర్నాస్ (810–887 A.D.) ఒక ముస్లిం పాలిమత్: ఒక ఆవిష్కర్త, ఇంజనీర్, ఏవియేటర్, వైద్యుడు, అరబిక్ కవి మరియు అండలూసియన్ సంగీతకారుడు.
బెర్బెర్ సంతతికి చెందిన అతను అల్-అండాలస్ (నేటి రోండా, స్పెయిన్) లోని ఇజ్న్-రాండ్ ఒండాలో జన్మించాడు మరియు కార్డోబా లో నివసించాడు. అతను విమానయాన ప్రయత్నం కోసం ప్రసిద్ది చెందాడు.

ఇబ్న్ ఫిర్నాస్ అల్-మకాటా (Al-Maqata) అనే నీటి గడియారాన్ని రూపొందించాడు, రంగులేని గాజును తయారు చేయడానికి పద్దతిని రూపొందించాడు, అతను వివిధ గాజు ప్లానిస్పియర్లను కనుగొన్నాడు, దిద్దుబాటు కటకములను (పఠనం రాళ్ళుreading stones) అభివృద్ధి చేశాడు. గ్రహాలు మరియు నక్షత్రాలు కదలికలను అనుకరించటానికి రింగుల గొలుసును అభివృద్ధి చేశాడు.  రాక్ క్రిస్టల్‌ను కత్తిరించే ప్రక్రియను అభివృద్ధి చేశాడు.

తన ఇంట్లో అతను ఒక గదిని నిర్మించాడు, దీనిలో ప్రేక్షకులు నక్షత్రాలు, మేఘాలు, ఉరుములు మరియు మెరుపులను చూశారు, వీటిని అతని నేలమాళిగ ప్రయోగశాలలో ఉన్న యంత్రాంగాల ద్వారా ఉత్పత్తి చేశాడు. అతను "ఒక విధమైన మెట్రోనొమ్ metronome." ను కూడా రూపొందించాడు.



విమానయానం /ఏవియేషన్:
అతను రెక్కల ను ఉపయోగించి ఎగరటానికి లో ప్రయత్నం చేశాడు. దీనిని  తరువాతి కాలం లో మొరాకో చరిత్రకారుడు అహ్మద్ మొహమ్మద్ అల్-మక్కారీ (1632) ద్రువపరిచాడు.


"అతను చేసిన ఆసక్తికరమైన ప్రయోగాలలో, ఒకటి ఎగరడానికి ప్రయత్నిoచటం. అతను ఈ ప్రయోగం  కోసం ఈకలతో తనను తాను కప్పుకున్నాడు, తన శరీరానికి రెండు రెక్కలను జత చేశాడు, మరియు పై నుంచి గాలిలోకి ఎగరాడు, అతను గణనీయమైన ఎత్తులో ఒక పక్షిలాగా ఎగిరాడు కానీ దిగడంలో అతని వెనుకభాగం దెబ్బతింది.
.
గ్లైడర్ తో  ఇబ్న్ ఫిర్నాస్ చేసిన ప్రయత్నం ఇంగ్లండ్‌లో 1000 మరియు 1010 మధ్య మాల్మెస్‌బరీకి చెందిన ఐల్మర్ చేసిన ప్రయత్నాన్ని ప్రేరేపించింది

·       రైట్ సోదరుల కన్నా వెయ్యి సంవత్సరాల ముందుఇబ్న్ ఫిర్నాస్ ఎగరటానికి ప్రయత్నం చేసాడు

·       లిబియా అతని గౌరవార్ధం ఒక  తపాలా బిళ్ళ జారి చేసింది.  తయారు చేశారు. బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో ఇరాకీలు అతని జ్ఞాపకార్థం ఒక విగ్రహాన్ని నిర్మించారు.

·       బాగ్దాద్కు ఉత్తరాన ఉన్న ఇబ్న్ ఫిర్నాస్ విమానాశ్రయం ఆయన పేర  పెట్టబడింది.

·       "ఇబ్న్ ఫిర్నాస్ చరిత్రలో ఎగిరేందుకు శాస్త్రీయ ప్రయత్నం చేసిన మొదటి వ్యక్తి."- ఫిలిప్ హిట్టి, అరబ్బుల చరిత్ర.

·       చంద్రునిపై ఉన్న బిలం కు ఇబ్న్ ఫిర్నాస్ పేరు పెట్టబడింది.


30 May 2020

ఖురాన్లో యేసు/జీసస్ Jesus in Quran



Be opened!" | Get Up With God 
మరియం మరియు ఈసా (స) యొక్క కథ దివ్య ఖురాన్ లో  19వ అధ్యాయం సూరా మర్యం లో 16వ ఆయత్ నుండి వివరించబడినది. జన్మించినప్పుడు యేసు (స) మాట్లాడిన మొదటి మాట: ఇన్నీ అబ్దుల్లా..నేను అల్లాహ్ యొక్క దాసుణ్ణి (అబ్దుల్లా)19:30.


ఇస్లాం యేసు మరియు అతని తల్లిని చాలా గౌరవప్రదమైన స్థితిలో ఉంచింది. దివ్య ఖుర్ఆన్ లో  మొదటి అద్భుతం ఏమిటంటే, అతను య్యాలలో ఉన్నప్పుడు మాట్లాడాడు మరియు తన తల్లి గొప్ప చరిత్ర్రకు సాక్షం ఇచ్చాడు. బైబిల్ ఈ అద్భుతాన్ని చేర్చలేదు.


ఇస్లాం లో వ్యక్తి యొక్క నడత తల్లిదండ్రుల పట్ల అతని వైఖరితో వర్గీకరించబడుతుంది. దివ్య ఖురాన్ లో యేసు ప్రవక్త (స) ఇలా అంటారు: “నేను అల్లాహ్ దాసుణ్ణి, అయన నాకు గ్రంధాన్ని యిచ్చాడు. నన్ను ప్రవక్తగా నియమించాడు. నేను ఎక్కడున్నా సరే, అయన నన్ను శుభవంతునిగా చేసాడు.నేను జీవించి ఉన్నంతకాలం నమాజును, జకాతును నేరవేర్చేవానిగా నన్ను చేసాడు. నా తల్లి హక్కును నేరవేర్చేవానిగా నన్ను చేసాడు”.

ఇస్లాం మేరీ (మర్యం )ను  సంపూర్ణ విశ్వాసంఉన్న నలుగురు మహిళలలో ఒకరుగా గుర్తించినది.


ఆధ్యాత్మికంగా ఆరాధనలో ఉన్నత స్థాయికి మర్యం జీవితం ఒక ఉదాహరణ. సనాతన యూదు సమాజం తమ గ్రంథాలలో ముందే చెప్పిన మెస్సయ్యా (యేసు) అతడు అనే వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆ సమయంలో అతిపెద్ద చర్చపెళ్లికాని కన్యకు మెస్సయ్యా  ఎలా జన్మింస్తాడు?”. "తాము ఎదురుచూస్తున్న మెస్సయ్యా అతనా, కాదా?

యేసు శిష్యులు క్రైస్తవులు కాదు, వారు తోరా మరియు ఇంజిల్ పుస్తకాన్ని అధ్యయనం చేశారు. యేసును ఆదరించిన వ్యక్తి దివ్య ఖుర్ఆన్ లో యాహ్యా అని పిలువబడే జాన్ బాప్టిస్ట్ మరియు అతను కూడా ఎప్పుడూ బాప్తిస్మం తీసుకోలేదు

బని ఇజ్రాయెల్ యేసును మెస్సయ్యా గా గుర్తించడానికి నిరాకరించింది, వారు యాహ్యా మరియు జకారియాను చంపారు. ఖుర్ఆన్ మరియు బైబిల్ రెండూ ఈ విషయం లో అంగీకరిస్తాయి. వారు యేసును చంపడానికి ప్రయత్నించారు, కాని అల్లాహ్ అతన్ని రక్షించాడు.

దివ్య ఖురాన్ ప్రకారం “ మేము మసీహా, మర్యం కుమారుడైన ఈసా అనే దైవ ప్రవక్తను చంపాము అని అన్నారు. వాస్తవానికి వారు ఆయనను చంపనూ లేదు, శిలువ పైకి ఎక్కించను లేదు.కాని ఆ విషయం లో వారు బ్రమకు గురిచేయబడ్డారు.అల్లాహ్ ఆయనను తన వైపుకు లేపుకొన్నాడు.    
దివ్య ఖురాన్ 4:157-162


యూదులు అతనిని మెస్సయ్యా గా గుర్తించలేదు అతని ప్రవక్త స్థానం ను తిరస్కరించారు.  అతను దైవత్వాన్ని చెప్పుకుంటున్నారని ఆరోపించారు, క్రైస్తవులు యేసును దేవుడు లేదా త్రిమూర్తులలో ముగ్గురిలో ఒకరిగా  తీసుకొన్నారు.  

ఇస్లాం యేసు యొక్క అసలు స్థితిని కొనసాగిస్తుంది, అతను అద్భుతంగా జన్మించాడని మరియు అతను యలలో శిశువుగా మాట్లాడాడని మరియు అతను అల్లాహ్ అనుమతితో కుష్ఠురోగులను మరియు అంధులను నయం చేసి, చనిపోయినవారిని తిరిగి బ్రతికించాడు.

యేసు మరియు మేరీ ఇద్దరూ ఆహారం తిన్నారు మరియు వారు అల్లాహ్ ను ఆరాధించారు.

యూదులు మెస్సయ్యా  కోసం ఇంకా ఎదురుచూస్తున్నారు మరియు క్రైస్తవులు యేసు తిరిగి వచ్చే రోజుకోసం వేచి ఉన్నారు మరియు ముస్లింలు  కూడా ఆయన తిరిగి రావడం గురించి ముందే చెప్పబడ్డారు.

ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం  ముస్లింలు యేసు తన మిగిలిన జీవితాన్ని పూర్తి చేయడానికి తిరిగి వస్తాడని మరియు అతను ఖుర్ఆన్ చేత పాలించబడతాడని నమ్ముతారు. ముస్లింలు క్రిస్తును  నమ్ముతారు. యేసును ఆదరిస్తారు.

ఇతనే మర్యం కుమారుడు ఈసా; ఇదే అతనికి సంభందించిన అసలు నిజం. (దివ్య ఖురాన్ సూరా మర్యాం, 19:34)

ఇబ్న్ యూనుస్ Ibn Yunus (950 – 1009)



 Ibn Yunus | Science & Faith



ఇబ్న్ యూనుస్950 - 1009 జన్మించినాడు. అతను గౌరవనీయమైన కుటుంబం నుండి వచ్చాడు ఇతను ఈజిప్టు ముస్లిం మరియు గణిత శాస్త్రజ్ఞుడు. ఇబ్న్ యూనుస్  ఖచ్చితమైన సమయ కొలతలకు ప్రసిద్ది గాంచినాడు.

ఇబ్న్ యూనుస్ పూర్తి పేరు అబూల్-హసన్ అలీ ఇబ్న్ అబ్దుల్-రహమాన్ ఇబ్న్ అహ్మద్ ఇబ్న్ యూనుస్ అల్-సదాఫీ అల్-మిస్రి. అతని ముత్తాతను యూనస్ అని పిలుస్తారు అతని ముత్తాత ప్రముఖ న్యాయ విద్వాంసుడు ఇమామ్ షఫీకి సహచరుడు.

అతని తాత అహ్మద్ మరియు అతని తండ్రి అబ్దుల్ రెహ్మాన్. ఇబ్న్ యూనుస్ ది  పండితుల కుటుంబం, అతని తండ్రి అబ్దుల్ రెహమాన్ ప్రసిద్ధ చరిత్రకారుడు, జీవిత చరిత్ర రచయిత మరియు హదీసు పండితుడు. ఇతడు ఈజిప్ట్ చరిత్ర గురించి రెండు సంపుటాలు రాశాడు-ఒకటి ఈజిప్షియన్ల గురించి మరియు మరొకటి ఈజిప్టుపై యాత్రికుల వ్యాఖ్యానం.

ఫాతిమిడ్ ఖలీఫాలు 10 వ శతాబ్దం మొదటి భాగంలో ఉత్తర ఆఫ్రికా మరియు సిసిలీని పరిపాలించారు, 969 లో నైలు లోయను జయించి ఈజిప్ట్ దేశంలోకి ప్రవేశించారు. వారు తమ కొత్త సామ్రాజ్యానికి రాజధానిగా కైరో నగరాన్ని స్థాపించారు.

ఇబ్న్ యూనస్ ఫాతిమిడ్ ఖలిఫాలతో  సన్నిహితంగా సంబంధం కలిగి ఉన్నాడు. కైరోలోఅతను ఫాతిమిడ్ రాజవంశానికి ఖగోళ శాస్త్రవేత్తగా ఇరవై ఆరు సంవత్సరాలు పనిచేశాడు.ఇబ్న్ యూనస్ గణిత శాస్త్రవేత్త మరియు ఒక కవి. మొదట ఖలీఫా  అల్-అజీజ్ మరియు తరువాత ఖలీఫా అల్-హకీమ్ కోసం పనిచేసాడు.

977AD  ఖలీఫా అల్-అజీజ్ కాలంలో  ఇబ్న్ యూనస్ ఖగోళ పరిశీలనలు చేయడం ప్రారంభించాడు. ఇబ్న్ యూనస్ కు ఖలీఫా అల్-అజీజ్ ఖగోళ పరిశోదనకు కావలసిన పరికరాలు అందించాడు.

ఇబ్న్ యూనస్ ఒక జ్యోతిష్కుడు అతడు తన ఖగోళ పరిశీలనలకు ప్రసిద్ధి చెందినాడు. అతను  అనేక త్రికోణమితి మరియు ఖగోళ పట్టికలను రుపొందిoచి నాడు. ఇబ్న్ యూనస్ ఖగోళ పరిశోధనలకు ఖలీఫా మద్దత్తు ఇచ్చినాడు.  

ఖలీఫా అల్-అజీజ్ 996 లో మరణించాడు. అతని తరువాత అతని కుమారుడు అల్-హకీమ్ ఖలీఫా  అయ్యాడు ఇబ్న్ యూనస్ తన ఖగోళ పరిశీలనలలో ఖగోళ పట్టికలను తయారు చేయడంలో ప్రొఫెషనల్ కాలిక్యులేటర్లు వాడాడు.  


అల్-హకీమ్ జ్యోతిషశాస్త్ర అంచనాలను రూపొందించడానికి గణనీయమైన సమయాన్ని కేటాయించినట్లుగా తెలుస్తుంది.ఇబ్న్ యూనస్ అల్-హకీమ్ ఇంటి నుండి శుక్రుడిని గమనించాడని మనకు తెలుస్తుంది.

ఇబ్న్ యూనుస్ జ్యోతిషశాస్త్రంలో, అంచనాలు తయారుచేసినాడు  మరియు “కితాబ్ బుల్లగ్ అల్-ఉమ్నియా ("ఆన్ ది అటైన్మెంట్ ఆఫ్ డిజైర్"("On the Attainment of Desire") అను గ్రంధంను రచించినాడు.  ఇది సిరియస్ నక్షత్రం  యొక్క హెలియాల్ రైసింగ్‌heliacal risings of Siriusలకు సంబంధించిన రచన మరియు కాప్టిక్ సంవత్సరం వారంలో ఏ రోజు ప్రారంభమవుతుందనే దానిపై అంచనాలు ఉన్నాయి.

ఇబ్న్ యూనుస్ యొక్క ప్రధాన రచన, “అల్-జిజ్ అల్-హకీమి అల్-కబీర్ al-Zij al-Hakimi al-kabir.అల్-కబీర్అంటే పెద్దది ఇది ఖగోళ పట్టికల హ్యాండ్‌బుక్. ఇందులో చాలా ఖచ్చితమైన పరిశీలనలు ఉన్నాయి. ఇబ్న్ యూనస్‌ తన ఈ గ్రంధమును  ఖలీఫా అల్-హకీమ్‌కు అంకితం ఇచ్చాడు. ఈ పుస్తకం లో 81 అధ్యాయాలు ఉన్నాయి. యూనస్ చేసిన పరిశీలనల జాబితాలు మరియు అతని పూర్వీకులు చేసిన పరిశీలనలు కూడా ఉన్నాయి. గణిత చిహ్నాలు లేకుండా యూనస్ తన జిజ్‌లో పరిష్కారాలను చూపాడు.
  
ఇబ్న్ యూనస్ 40 గ్రహ సంయోగాలు మరియు 30 చంద్ర గ్రహణాలను వివరించాడు. ఉదాహరణకు, అతను 1000 సంవత్సరంలో సంభవించిన గ్రహ సంయోగాన్ని ఖచ్చితంగా వివరించాడు:

993 మరియు 1004 యొక్క సూర్యగ్రహణాలతో పాటు 1001 మరియు 1002 యొక్క చంద్ర గ్రహణాల గురించి ఇబ్న్ యూనస్ రికార్డు చేసినాడు.

గ్రహాల స్థానాల గురించి ఇబ్న్ యూనస్ వర్ణన సరిగ్గా ఉందని మరియు అతను డిగ్రీలో మూడింట ఒక వంతు దూరం లెక్కించడం ఖచ్చితంగా సరైనదని ఆధునిక పరిశోధనలు తెల్పుతున్నాయి. అతను చంద్రుని గ్రహణాలను  కూడా ఖచ్చితంగా వివరించాడు

హకీమి జిజ్ యొక్క మొదటి అధ్యాయం ముస్లిం, కోప్టిక్, సిరియన్ మరియు పెర్షియన్ క్యాలెండర్లకు క్యాలెండర్ పట్టికలను వివరిస్తుంది. ఈ క్యాలెండర్ల మధ్య తేదీలను మార్చడానికి ఇబ్న్ యూనస్ పట్టికలు ఇస్తాడు. ఈస్టర్ తేదీని లెక్కించడానికి పట్టికలు కూడా ఇవ్వబడ్డాయి. త్రికోణమితి విధులు Trigonometric functions కోణాల angles కంటే ఆర్క్లు arcs గా ఇవ్వబడతాయి. గోళాకార త్రికోణమితి Spherical trigonometry ఈ పనిలో ఉన్నత స్థాయికి చేరుకుంటుంది.


చంద్రుని రేఖాంశాన్ని కనుగొనటానికి పట్టికలు ఇబ్న్ యూనస్ చేత రుపొందిచబడినవి.  ఇబ్న్ యూనస్ పట్టికలలో  34000 ఎంట్రీలు ఉన్నాయి. అధునాతన టోలెమిక్ సిద్ధాంతం ప్రకారం చంద్ర స్థానాన్ని నిర్ణయించే గణన సమస్యను పరిష్కరించడానికి మధ్యయుగ పండితుడు చేసిన తొలి ప్రయత్నంగా పట్టికలు ఆసక్తిని కలిగి ఉన్నాయి.


ఇబ్న్ యూనస్ సూర్యోదయం నుండి సమయం కనుగొనటానికి చాలా ఉపయోగకరమైన పట్టికలు, గంట కోణం hour angle మరియు సౌర ఎత్తు solar altitude నుండి సౌర అజిముత్ వివరించబడింది. హకీమి జిజ్ కోసం తాను సేకరించిన డేటాను ఈ పట్టికల కోసం ఇబ్న్ యూనస్ ఉపయోగించాడు.. ఈ పట్టికలు ప్రదర్శించే అధిక స్థాయి ఖచ్చితత్వం ఇబ్న్ యూనస్ నాన్ లీనియర్ ఇంటర్‌పోలేషన్ వ్యవస్థలను ఉపయోగించినట్లు సూచిస్తుంది.

ఇబ్న్ యూనస్ సమయ కొలతల కోసం ఒక లోలకాన్ని ఉపయోగించాడని సూచించడానికి ఎటువంటి ఆధారాలు లేవని చెప్పవచ్చు.

ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏడు రోజుల వ్యవధిలో ఇబ్న్ యూనస్ తన మరణ తేదీని ఊహించాడు. అతను ఊహించిన రోజున చనిపోయే వరకు తన ఇంటిలో తాళం వేసుకొని  ఖుర్ఆన్ పఠించాడు.

 

చంద్రునిపై ఉన్న బిలం ఇబ్న్ యూనస్ పేరు పెట్టబడింది.