5 February 2024

ఎంబ్రాయిడరీలో దివ్య ఖురాన్, ఇద్దరు బెంగళూరు సోదరీమణుల అద్భుతం Quran in embroidery, the miracle of two Bengaluru sisters

 



 

బెంగళూరు -

 

కొన్ని రోజుల క్రితం బెంగళూరు నగరంలో ఇద్దరు సోదరీమణులు- బీబీ తబస్సుమ్ మరియు సురైయా ఖురైషి- పవిత్ర ఖురాన్‌ను 604 పేజీల ఖరీదైన వెల్వెట్ క్లాత్‌పై ఎంబ్రాయిడరీ చేశారు. ఇదొక అద్భుతం.

అద్భుతమైన హస్తకళను ప్రదర్శిస్తూ, ఎంబ్రాయిడరీ చేసిన పవిత్ర ఖురాన్‌ అలిమ్-ఎ-దీన్ (మత పండితుడు) మార్గదర్శకత్వంలో సులభంగా చదవగలిగే విధంగా  తయారు చేయబడింది.

ఇద్దరు సోదరీమణులలో చిన్నదైన బీబీ తబస్సుమ్‌కు చిన్నప్పటి నుంచి ఎంబ్రాయిడరీ చేయడం అంటే చాలా ఇష్టం. ప్రారంభంలో, బీబీ తబస్సుమ్‌ దివ్య ఖురాన్‌లోని చిన్న చిన్న  ఆయతులను మాత్రమే ఎంబ్రాయిడరీ చేసేది, కానీ ఒక రోజు, బీబీ తబస్సుమ్ మనస్సులో మొత్తం పవిత్ర ఖురాన్‌ను ఎంబ్రాయిడరీ చేయడం అనే ఒక ఆలోచన వచ్చింది మరియు దానిని నెరవేర్చింది.

ఎంబ్రాయిడరీ ఖురాన్‌ను సిద్ధం చేయడానికి తమకు అవకాశం ఇచ్చినందుకు అల్లాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, బీబీ తబస్సుమ్ ఈ ఎంబ్రాయిడరీ పవిత్ర ఖురాన్‌ను పవిత్ర మదీనాలోని లైబ్రరీకి బహుమతిగా ఇవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

అక్క సురైయా ఖురైషీతో కలిసి బీబీ తబస్సుమ్,  ఖురాన్ ఎంబ్రాయిడరీ వర్క్ ను పవిత్ర ఖురాన్ యొక్క మొదటి ప్రారంభ సూరాతో అంటే సూరా అల్-ఫాతిహాతో ప్రారంభించి,. చివరి సూరా- సూరా అన్-నాస్ వరకు శ్రద్ధగా కొనసాగించారు

ఎంబ్రాయిడరీ పవిత్ర ఖురాన్ ఐదు వాల్యూమ్‌లుగా విభజించబడింది మరియు ప్రతి వాల్యూమ్ ఆరు అధ్యాయాలను కలిగి ఉంటుంది.

ఎంబ్రాయిడరీ ప్రక్రియ ప్రారంభంలో బీబీ తబస్సుమ్ ఖురాన్ యొక్క ఆయతులను వెల్వెట్ గుడ్డపై పెన్సిల్‌తో చెక్కేవారు, ఆ తర్వాత సోదరీమణులిద్దరూ ఆ పవిత్ర రేఖల వెంట దారాలను నేయడం చేసేవారు. ప్రతిరోజు అచంచలమైన అంకితభావంతో సోదరీమణులిద్దరూ తమ ఇంటి పనులను పూర్తి చేసి, పవిత్ర ఖురాన్ యొక్క ఎంబ్రాయిడరీ పనిలో నిమగ్నమయ్యారు.

ఎంబ్రాయిడరీ పని యొక్క అత్యంత ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి, ఒక మత పండితుడు ఒక పేజీ పూర్తయిన తర్వాత ప్రతి ఆయతును నిశితంగా పరిశీలించాడు. 'ఎంబ్రాయిడరీ చేసిన పవిత్ర ఖురాన్‌లోని ప్రతి పేజీని పూర్తి చేసిన తర్వాత, మేము దానిని పండితుడికి చూపుతాము మరియు అవసరమైతే ఏదైనా దిద్దుబాటు చేస్తాము' అని బీబీ తబస్సుమ్ చెప్పారు.

ఇద్దరు సోదరీమణుల భక్తి మరియు కళాత్మకత యొక్క అందమైన సమ్మేళనానికి నిదర్శనంగా నిలిచే మనోహరమైన పవిత్ర ఖురాన్ యొక్క ఎంబ్రాయిడరీ పని కి వారి కుటుంభ సబ్యులు అల్లాకు తమ కృతజ్ఞతలు తెలిపారు.

 

No comments:

Post a Comment