ఇస్లామిక్ స్టడీస్ రంగం లో విశిష్ట
పండితుడైన ప్రొఫెసర్ వేల్ హల్లాక్ ను రియాద్‌లో జరిగిన ఉత్సవం లో ఇస్లామిక్ స్టడీస్ విభాగం లో ప్రతిష్టాత్మక
2024 కింగ్
ఫైసల్ ప్రైజ్‌తో సత్కరించారు.
US జాతీయుడు మరియు కొలంబియా విశ్వవిద్యాలయంలో హ్యుమానిటీస్‌లో
అవలోన్ ఫౌండేషన్ ప్రొఫెసర్ అయిన ప్రొఫెసర్ వేల్ హల్లాక్ ఇస్లామిక్ చట్టాల
అభివృద్ధికి మార్గనిర్దేశం చేయడంలో మరియు ఇజ్తిహాద్ రంగంలో చేసిన అద్భుతమైన కృషికి
గుర్తింపు పొందారు.. ఇస్లామిక్ స్టడీస్ రంగంలో ప్రొఫెసర్ వేల్ హల్లాక్ చేసిన కృషి ప్రపంచ
గుర్తింపును పొందింది.
60కి పైగా పుస్తకాలు మరియు అనేక భాషల్లోకి అనువదించబడిన
వ్యాసాలను కలిగి ఉన్న ప్రొఫెసర్ వేల్ హల్లాక్ సున్నీ ఫిఖ్ (న్యాయశాస్త్రం) పై విశేష
కృషి చేసారు.. ఇజ్తిహాద్ రంగము లో ప్రొఫెసర్ వేల్ హల్లాక్ విస్తృతమైన ప్రశంసలను
పొందారు మరియు ఇజ్తిహాద్ రంగంలో ప్రొఫెసర్ వేల్ హల్లాక్ అగ్రగామి పాండిత్యం
కలిగిన పండితులలో ఒకరిగా గుర్తింప బడ్డారు.. .
కింగ్ ఫైసల్ ప్రైజ్, 1977లో స్థాపించబడింది మరియు వివిధ
శాస్త్రాలు మరియు కారణాలకు విశేష కృషి చేసిన వ్యక్తులు మరియు సంస్థలను గౌరవించడం
లక్ష్యంగా పెట్టుకుంది.
కింగ్ ఫైసల్ ప్రైజ్ ప్రారంభమైనప్పటి
నుండి, ఇస్లాం కు
సేవ, మెడిసిన్ మరియు సైన్స్ రంగాలలో 45 దేశాల నుండి 295 గ్రహీతలను సత్కరించినది..
సర్వీస్ టు ఇస్లాం/ ఇస్లాం కు సేవ
బహుమతిని జపాన్ ముస్లిం అసోసియేషన్ మరియు లెబనాన్‌కు చెందిన డాక్టర్ మొహమ్మద్
అల్-సమ్మక్ సంయుక్తంగా పొందారు.
వైద్యం/మెడిసిన్ మరియు విజ్ఞాన రంగాల/సైన్స్ లో, US జాతీయులైన డాక్టర్
జెర్రీ రాయ్ మెండెల్ మరియు డాక్టర్ హోవార్డ్ యువాన్-హావో చాంగ్ వరుసగా ప్రతిష్టాత్మక
కింగ్ ఫైసల్ ప్రైజ్ అవార్డుతో సత్కరింపబడినారు..
కింగ్ ఫైసల్ ప్రైజ్‌ని పొందిన ప్రతి
గ్రహీతకి $200,000 ఉదారమైన
ఎండోమెంట్‌తో పాటు 200 గ్రాముల
బరువున్న 24
క్యారెట్ల బంగారు పతకం మరియు వారి సంబంధిత రంగాలలో వారు చేసిన విశిష్ట సేవలను
గుర్తుచేసే ధృవీకరణ పత్రం అందించబడుతుంది.
No comments:
Post a Comment