ముంబై:
మహారాష్ట్రలోని ముస్లిం సమాజానికి గర్వకారణంగా, డాక్టర్ సారా షేక్ మహారాష్ట్రలోని అన్ని మెడికల్ కాలేజీలలో ప్రసూతి మరియు గైనకాలజీలో మాస్టర్స్‌లో అగ్రస్థానాన్ని పొందారు.
నాసిక్‌లో జరిగిన మహారాష్ట్ర యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (MUHS) స్నాతకోత్సవం సందర్భంగా ప్రతిష్టాత్మకమైన గోల్డ్ మెడల్‌తో డాక్టర్ సారా షేక్ సత్కరింపబడినారు. వైస్ ఛాన్సలర్, మహారాష్ట్ర వైద్య విద్య మంత్రి హసన్ ముష్రిఫ్‌తో సహా విశిష్ట అతిథులు కాన్వొకేషన్ వేడుకకు హాజరయ్యారు.
డాక్టర్ సారా షేక్, ప్రసిద్ద వైద్య కుటుంబం నుండి వచ్చింది. డాక్టర్ సారా షేక్ పూణేలోని MIMER మెడికల్ కాలేజీ నుండి పట్టభద్రురాలు అయ్యాక NEET PG పరీక్షలో ఆల్ ఇండియా కోటాలో విజయం సాధించి గ్రాంట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మరియు సర్ JJ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, ముంబైలో ప్రసూతి శాస్త్రం మరియు గైనకాలజీలో స్పెషాలిటి ను ఎంచుకుంది.
డాక్టర్ సారా DNB, ప్రసూతి శాస్త్రం మరియు గైనకాలజీలో అంతర్జాతీయ ప్రచురణలకు ప్రశంసలు పొందింది. గత సంవత్సరం, రాయల్ కాలేజ్ ఆఫ్ ఇంగ్లాండ్ నుండి MRCOG పార్ట్ 1లో ఉత్తీర్ణత సాధించడం జరిగింది.
డాక్టర్. సారా షేక్ తన విజయానికి అచంచలమైన సంకల్పం మరియు కుటుంబం మద్దతు కారణమని పేర్కొన్నారు.
హిజాబ్ ధరించడ౦ తన విజయ పథాన్ని ఎన్నడూ అడ్డుకోలేదని డాక్టర్. సారా షేక్ నొక్కి చెప్పింది.
డాక్టర్ సారా ఔత్సాహిక వైద్య
నిపుణులకు స్ఫూర్తిగా నిలుస్తుంది అంకితభావం మరియు పట్టుదల అద్భుతమైన విజయాలు
సాధించగలవని నిరూపించింది.
మూలం: రేడియన్స్ న్యూస్, మార్చి 14, 2024
No comments:
Post a Comment