13 September 2024

భారత దేశ ముస్లింలలో కుల ప్రశ్న The Caste Question In Indian Muslims

 


భారతదేశ రాజకీయ వ్యవస్థ లో, ప్రత్యేకించి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి, భారతీయ ముస్లింలు వివక్షతకు గురి అవుతూనే ఉన్నారు. విభజన భారం ముస్లింలపై అధికంగా పడింది. భారతదేశంలో ఉండిపోయిన ముస్లిములు దేశద్రోహులుగా, దేశ వ్యతిరేకులు మరియు అవిశ్వసనీయులుగా చిత్రికరి౦చబడినారు. మతతత్వం, హింస మరియు వేధింపులకు గురి అవుతూనే ఉన్నారు.  దేశం లో ఇస్లామోఫోబియా, ముస్లింలకు వ్యతిరేకంగా పక్షపాతం ప్రబలింది. ఇది విస్తృతమైన మినహాయింపు, ద్వేషపూరిత నేరాలు మరియు అవమానాలకు దారితీసింది.

పెరుగుతున్న హిందూత్వ భావన ముస్లింలపై మరింత తీవ్రమైన రాక్షసత్వానికి ఆజ్యం పోసింది. పెరుగుతున్న ఇస్లామోఫోబియా ముస్లిములలో భయం మరియు హింస వాతావరణాన్ని పెంచింది. మరియు ఉపాధి, రాజకీయ ప్రాతినిద్యం, విద్యా  అవకాశాలలో ముస్లిములు అధికంగా మినహాయించబడినారు.

సచార్ కమిటీ నివేదిక ప్రకారం భారతీయ ముస్లింలు తక్కువ ఆదాయం, అధిక నిరక్షరాస్యత, విసృతపేదరికం, తక్కువ ఆదాయ వనరులు, ఆరోగ్య సదుపాయాలు అందుబాటులో లేనివారిగా నిర్వచించబడ్డారు. ముస్లిముల మార్జినలైజేషన్‌ను/వెనుకబాటుతనం ను  అర్థం చేసుకోవడానికి, వారిలో గల  కుల వ్యవస్థను అర్ధం చేసుకోవడం అత్యవసరం అనగా  సర్కిల్‌ల్లో సర్కిల్‌ను గుర్తించడం ముఖ్యం. భారతదేశంలోని ముస్లింలు ఒకే మతపరమైన మైనారిటీగా ఊహించబడతారు, కానీ అనుభవపూర్వకంగా మానవ శాస్త్ర/సామాజిక కోణంలో వారు చాలా వైవిధ్యభరితమైన మరియు భిన్నమైన సమాజం..

భారతీయ ముస్లిములు జాతి మరియు సామాజిక-సాంస్కృతిక పరంగా వివిధ సమూహాలు మరియు ఉప సమూహాలుగా మరియు కుల మరియు తెగ సమూహాలలో various groups and sub-groups and also in caste and tribe groups విభజించబడ్డారు. వారి క్రమబద్ధమైన సామాజిక క్రమం భారతదేశంలోని ఇతర మత సమాజానికి సమానంగా ఉంటుంది మరియు ఇస్లామిక్ దేశాలు మరియు ఇతర ప్రాంతాలలో ఉన్న ముస్లిములతో పోల్చినప్పుడు ఇది వారిని కొంత ప్రత్యేకంగా చేస్తుంది.

భారతదేశంలోని ముస్లింలు కొన్ని ప్రాథమిక ఇస్లామిక్ సూత్రాలను పంచుకున్నప్పటికీ, తీవ్రమైన మతపరమైన సంక్షోభ సమయాల్లో, వారు ఒకే మతపరమైన సంఘం వలె వ్యవహరిస్తారు, వారు సాధారణ పరిస్థితుల్లో అడ్డంగా మరియు నిలువుగా విభజించబడ్డారు. ఇస్లాం యొక్క పెరుగుదల సమయంలో కూడా, అరబ్ సమాజం 'గౌరవం మరియు హోదా', 'జననం మరియు రక్తం యొక్క ఐక్యత', 'గిరిజన కులీనుల' ప్రాతిపదికన నిర్వహించబడింది, వ్యాపారులు మరియు ముఖ్యులు ఇస్లామిక్ ధర్మం పై విస్తృత నియంత్రణను కలిగి ఉన్నారు.

అరబ్ భూభాగం దాటి ఇస్లామిక్ సామ్రాజ్యం విస్తరించడంతో, అరబ్బులు అరబ్బులు కాని వారిని 'అజామీలు' లేదా మూగ dumb అని పిలవడం ప్రారంభించారు మరియు భారతీయ ముస్లింలను 'మావాలిలు' లేదా విధేయులు అని కూడా పిలిచారు,.

భారతదేశంలో, ముస్లింలు  'అష్రఫ్‌లు' ('విదేశీ పూర్వీకుల' వారసులు) మరియు 'అజ్లాఫ్స్' (స్థానిక మతమార్పిడులు, ప్రధానంగా దళితులు మరియు అంటరానివారు) గా ప్రస్తావించబడినారు.. అష్రాఫ్‌లు మరింత ఉప-వర్గీకరించబడ్డారు, వారి జాతి, నివాసం, తరగతి స్థితి, పౌర మరియు మతపరమైన నాయకత్వం మరియు కులీనుల ఆధారంగా వారికి సయ్యద్, షేక్, మొఘల్ మరియు పఠాన్ అని పేరు పెట్టారు. మొదటి ఇద్దరు (సయ్యద్, షేక్) అరబ్ పూర్వీకుల నుండి వచ్చినట్లు మరియు తరువాతి ఇద్దరు (మొఘల్ మరియు పఠాన్) మొఘల్ (మంగోల్) మరియు ఆఫ్ఘన్ విజేతల నుండి వచ్చినట్లు నమ్ముతారు. అజ్లాఫ్‌లు ప్రధానంగా  ఎటువంటి గొప్ప వంశం లేకుండా అసంఖ్యాకమైన వృత్తి సమూహాలతో శ్రమలో ఉన్న ప్రజానీకం మరియు రైతులు.

అజ్లాఫ్‌లలో సామాజిక స్థాయిలు హిందూ వర్ణ మరియు జాతి వ్యవస్థలతో దగ్గరి సారూప్యతను కలిగి ఉన్న గత కుల లక్షణాల ద్వారా గుర్తించబడ్డాయి. ముస్లింల వర్గ-కుల కూర్పుల దిగువన 'అర్జాల్స్' లేదా 'రైజల్లు'‘arzals’ or ‘raizals’ ఉన్నారు. వీరు ప్రాథమికంగా స్కావెంజింగ్, ఊడ్చడం మరియు ఇతర పనిలో నిమగ్నమై ఉన్నారు.

E A Gait యొక్క Census of India, 1901 ఇండియా సెన్సస్, 1901 (బెంగాల్ నివేదిక), అష్రఫ్‌లు మరియు నాన్-అష్రఫ్‌ల మధ్య వ్యత్యాసం హిందూ కుల-వ్యవస్థలోని 'ద్విజలు' మరియు 'శూద్ర'లకు అనుగుణంగా ఉందని మరియు E A H బ్లంట్ యొక్క పుస్తకం, ది కాస్ట్ సిస్టమ్ ఇన్ నార్తర్న్ ఇండియా (1969) లో ముస్లింలలోని కులాలను మనం కొంత వివరంగా కనుగొంటాము.

పస్మండ, అంటే అక్షరార్థంగా మిగిలి ఉన్నవారు', ఇది ఎక్కువగా అజ్లాఫ్‌లు మరియు అర్జల్‌లను Ajlafs and Arzals మిళితం చేసే సమూహం మరియు మతపరమైన-తటస్థ పదంగా ప్రాచుర్యం పొందింది.

రాజ్యసభ మాజీ ఎంపీ అలీ అన్వర్ నేతృత్వంలోని పస్మాండ ఉద్యమం, పస్మాండ అనేది ఏ నిర్దిష్ట మతానికీ వర్తించదని, కుల వ్యతిరేకత (అంబేద్కరైట్) మరియు సామాజిక-న్యాయం (లోహియైట్-మండలైట్)లో దాని సైద్ధాంతిక మూలాధారాలను గుర్తించడం అని చెప్పింది.  

పస్మాండ-దళితుల మాదిరిగానే పస్మాండ-ముస్లింలు సమానత్వం, గౌరవం మరియు హక్కుల కోసం చూస్తున్నారు. ఇటీవలి దశాబ్దాలలో, ప్రత్యేకించి 1990ల చివరి నుండి, అట్టడుగున ఉన్న ముస్లిం సమూహాలుగా పస్మందాస్ వారి సాధికారత మరియు స్వీయ-అభివృద్ధి కోసం సంఘటితమవుతున్నారు.

విద్య, ఆదాయం, ఉపాధి మరియు పేదరికం వంటి విషయాలలో దళితులు మరియు ఆదివాసీలు కంటే ముస్లిములు చాలా వెనుకబడిఉన్నారని సచార్ కమిటి పేర్కొన్నప్పటికీ  ముస్లింలకు, ప్రత్యేకించి పస్మండ ముస్లింలకు రిజర్వేషన్ విధానాల విషయానికి వస్తే, ఇండియన్ స్టేట్ పెద్దగా ఆసక్తి చూపలేదు..

సచార్ కమిటీ నివేదిక 'ముస్లిం బుజ్జగింపు' అనే అపోహను బద్దలు కొట్టింది. ముస్లింలకు భూమి హోల్డింగ్‌లతో సహా భౌతిక ఆస్తుల విషయం  లో  తక్కువ ప్రాప్యత ఉంది మరియు ముస్లిములు లేబర్ మార్కెట్ సోపానక్రమం hierarchy యొక్క దిగువన  ఉన్నారు.

ముస్లిములకు తక్కువ రాజకీయ మరియు సంస్థాగత ప్రాతినిధ్యం ఉంది-ప్రస్తుత మంత్రి మండలిలో ఒక్క ముస్లిం కూడా లేదు-మరియు వారు మొత్తం సామాజిక-ఆర్థిక వెనుకబాటుకు దారితీసే విస్తృతమైన వివక్షతో బాధపడుతున్నారు.

అటువంటి వాతావరణంలో క్రింది ప్రశ్న తలఎత్తుతుంది?. (ఎ) ఉద్యోగాలు మరియు విద్యా సంస్థల్లో రిజర్వేషన్లతో సహా స్టేట్ యొక్క నిశ్చయాత్మక చర్యలను పస్మందాస్‌కు మాత్రమే లేదా మొత్తం ముస్లిం సమాజానికి వర్తింప చేయవలసిన అవసరం ఉందా? లేదా (బి) పస్మందాస్ లో కొంత భాగమును  వర్గీకరించి  వారికి షెడ్యూల్ కులం (SC) హోదా ఇవ్వాలా ?

భాషాపరమైన మరియు మతపరమైన మైనారిటీలకు సంబంధించిన వివిధ సమస్యలను పరిశీలించేందుకు ఏర్పాటైన రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదిక (2007), (ఎ) మైనారిటీయేతర విద్యాసంస్థల్లో ముస్లింలకు 10 శాతం సీట్లు, ప్రభుత్వ ఉద్యోగాలలో 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసింది., (బి) అన్ని మతాలలో దళితులకు SC హోదా ఇవ్వబడుతుంది-అనగా  ముస్లింలు మరియు క్రైస్తవ దళితులు, (ఇప్పటికే సిక్కులు, హిందువులు మరియు బౌద్ధులలోని దళితులు  SC హోదాలో కలిగి ఉన్నారు) మరియు (సి) 27 శాతం ఇతర వెనుకబడిన తరగతి (OBC) కోటాలో మతపరమైన మైనారిటీలకు ఉప-కోటా religious sub-quota 8.4, అందులో ముస్లింలకు ఆరు శాతం అంతర్గత విభజన internal break-up.

అమితాబ్ కుందు నేతృత్వంలోని పోస్ట్-సచార్ మూల్యాంకన కమిటీ (2014), ప్రధానంగా ఉత్తర భారతదేశంలో విద్యా ప్రవేశం మరియు ఉద్యోగాలు భర్తీ చేయడానికి రిజర్వేషన్ కోటాలతో సహా ముస్లింలకు నిశ్చయాత్మక చర్యలను సిఫార్సు చేసింది.

1978లో మైనారిటీల కమిషన్‌ను ఏర్పాటు చేసినప్పటి నుండి, ముస్లిం అట్టడుగువర్గాల రాజకీయ, సామాజిక-ఆర్థిక సమస్యలను పరిశీలించేందుకు అనేక కమిటీలు ఏర్పాటయ్యాయి. సచార్ కమిటీ నిస్సందేహంగా ముస్లింల లేమి, వివక్ష, ప్రాతినిధ్యం మరియు బహిష్కరణ deprivation, discrimination, representation and exclusion వంటి ముఖ్య సమస్యలను ప్రజల్లోకి తీసుకు వచ్చింది. కాని విధానపరమైన చర్యలు మరియు రిజర్వేషన్ల రూపంలో నిశ్చయాత్మక చర్య యొక్క ప్రశ్న మరియు వర్గీకరణ మరియు ఉప-వర్గీకరణ యొక్క పద్ధతులు చూడవలసి ఉంది. ప్రభాత్ పట్నాయక్ వాదించినట్లుగా, రిజర్వేషన్లు స్వల్పకాలిక మరియు పంపిణీ న్యాయం short run and distributive justice రెండింటిలోనూ సమర్ధత efficiency లక్ష్యాలను సాధిస్తాయని గమనించడం ముఖ్యం.

పస్మందాల రిజర్వేషన్‌ను రాజ్యాంగంలోని అదే సూత్రాలు మరియు ఆర్టికల్‌ల ఆధారంగా SCలు, STలు మరియు OBCలకు లేదా సిక్కులు మరియు బౌద్ధులలో దళితులకు కూడా రిజర్వేషన్లను సమర్థించవచ్చు. దాదాపు అన్ని సామాజిక-ఆర్థిక మరియు రాజకీయ సంస్థలలో పస్మందాస్ తక్కువ ప్రాతినిధ్యం వహిస్తున్నారు మరియు నిరంతరం వివక్షకు గురిఅవుతున్నారు మరియు వారి క్రియాశీల రాజకీయ భాగస్వామ్యం కూడా అవసరం ఉంది..

నయా-సాంప్రదాయ ప్రభుత్వాల అణచివేత మరియు దోపిడీ విధానాలను పరిష్కరించగల సామర్థ్యం ఉన్న ప్రగతిశీల మరియు లౌకిక ఉద్యమాలలో పస్మందాలు  తప్పనిసరిగా పాల్గొనాలి. నయా-ఉదారవాద అధికార ప్రముఖుల మద్దతుతో, అతి-జాతీయవాదుల కోరికను ఎదుర్కోగల సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండాలి.

రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదికను సీరియస్‌గా తీసుకుని, దానిని అమలు చేయాలి, కేజీ బాలకృష్ణన్ కమిషన్-దళితులు ఇస్లాం మరియు క్రైస్తవ మతంలోకి మారిన దళితులకు ఎస్సీ హోదా కల్పించే అవకాశాన్ని పరిశీలిస్తే- మరింత తీవ్రమైన సంస్కరణలు.కొంత మెరుగైన ఫలితాలు వెలువడతాయి.

(వ్యక్తం చేసిన అభిప్రాయాలు వ్యక్తిగతమైనవి)


రచయిత తన్వీర్ ఏజాజ్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ పాలసీ మరియు రాజకీయాలను బోధిస్తున్నారు మరియు న్యూ ఢిల్లీలోని మల్టీలెవల్ ఫెడరలిజం (CMF) కేంద్రానికి గౌరవ ఉపాధ్యక్షులుగా ఉన్నారు.

 


No comments:

Post a Comment