న్యూఢిల్లీ:
కార్గిల్, భారత సైన్యం యొక్క అద్భుతమైన విజయానికి మాత్రమే
కాకుండా మాతృభూమి కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన కొంతమంది భారత వీరులకు కూడా
గుర్తుండిపోతుంది. కార్గిల్ హీరోలలో ప్రముఖుడు 11రాజ్‌పుతానా రైఫిల్స్‌కు చెందిన
25ఏళ్ల యువ కెప్టెన్ హనీఫుద్దీన్. వీర చక్ర అవార్డు
గ్రహీత(మరణాంతరం) Vir Chakra(P) అమరవీరుడు
కెప్టెన్ హనీఫుద్దీన్ డిల్లీకి చెందినవాడు.
కార్గిల్ యుద్ధం ప్రారంభ రోజులలో శత్రు సేనల గురించి ఎటువంటి సమాచారం
అందుబాటులో లేదు. జూన్ 6, 1999న కెప్టెన్ హనీఫుద్దీన్
నేతృత్వంలో 11రాజ్‌పుతానా రైఫిల్స్‌తో కూడిన కంపెనీ 18,000 అడుగుల ఎత్తులో ఉన్న టర్టుక్
ప్రాంతంలో ఆపరేషన్ థండర్‌బోల్ట్ చేపట్టింది.. మిషన్ లక్ష్యం: శత్రు సేనల కదలికలను
మెరుగ్గా పర్యవేక్షించేందుకు కీలకమైన వ్యుహత్మకమైన ఒక స్థానాన్ని భారత సైన్యం స్వాధీనం
చేసుకోవడం. ఈ కీలకమైన స్థానాన్ని స్వాధీనం చేసుకోవడం యుద్ధం యొక్క ప్రారంభ దశలలో భారత
దళాలకు వ్యూహాత్మక ప్రయోజనాన్ని ఇస్తుంది.
కెప్టెన్ హనీఫ్ ఆపరేషన్ థండర్ బోల్ట్ ను స్వచ్ఛందంగా ముందుండి నడిపించాడు.. కెప్టెన్
హనీఫ్ ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ మరియు మరో ముగ్గురుతో కలసి కీలకమైన ఆపరేషన్ కోసం
బయలుదేరాడు. వారు 4వ మరియు 5 జూన్ 1999 రాత్రులలో సమీప స్థానాలను స్వాధీనం
చేసుకున్నారు. మరియు వారు కోరుకున్న ముందస్తు స్థానాన్ని కైవసం చేసుకోవడానికి 6
జూన్ 1999న బయలుదేరారు. 18,500 అడుగుల ఎత్తు మరియు అతి శీతల
ఉష్ణోగ్రతలకు వారు భయపడలేదు. అయితే వారిని
శత్రువులు గుర్తించి భారీ ఫిరంగితో కాల్పులు జరిపారు.
కెప్టెన్ హనీఫుద్దీన్ తన కంటే తన
జట్టు భద్రత గురించి ఆందోళన చెందాడు. కెప్టెన్ హనీఫుద్దీన్ పొజిషన్ తీసుకోని నిర్భయంగా
శత్రువుపై బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఎదురు కాల్పులలో కెప్టెన్ హనీఫుద్దీన్ తీవ్రంగా
గాయపడ్డాడు. కానీ నిర్భయంగా శత్రువుపై బుల్లెట్ల వర్షం కురిపిస్తునే ఉన్నాడు.. దురదృష్టవశాత్తు
కెప్టెన్ హనీఫుద్దీన్ వద్ద బుల్లెట్స్/మందుగుండు సామగ్రి అయిపోయినాయి మరియు కెప్టెన్
హనీఫుద్దీన్ శత్రు సైన్యం యొక్క బుల్లెట్స్ కు బలి అయినాడు. కెప్టెన్ హనీఫుద్దీన్ శత్రువులపై అసాధారణమైన పరాక్రమాన్ని ప్రదర్శించాడు మరియు తన
కంటే తన జట్టు భద్రత గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకున్నాడు.
కెప్టెన్ హనీఫుద్దీన్ 25 సంవత్సరాల
చిన్న వయస్సులో సైన్యంలోకి ప్రవేశించిన సరిగ్గా రెండు సంవత్సరాల తరువాత అమరవీరుడు
అయ్యాడు. కానీ భారీ కాల్పుల కారణంగా కెప్టెన్ హనీఫుద్దీన్ మృతదేహాన్నిభారత సైన్యం తిరిగి పొందలేకపోయారు could not be retrieved. కాని 43 రోజుల తర్వాత జులై 18న ఒక కల్నల్
భాటియా మరియు అతని బృందం కెప్టెన్ ఎస్‌కే ధీమాన్, మేజర్ సంజయ్ విశ్వాస్ రావ్, లెఫ్టినెంట్
ఆశిష్ భల్లా, హవల్దార్
సురీందర్, రైఫిల్‌మ్యాన్
ధరమ్‌వీర్‌లు కెప్టెన్ హనీఫుద్దీన్ మృతదేహాన్ని వెలికితీయుటకు ముందుకు వచ్చారు.
కల్నల్ భాటియా మరియు అతని బృందం
ఘోరమైన కొండచరియల మద్య అమరవీరులు కెప్టెన్
హనీఫుద్దీన్, పర్వేష్‌ల
ఆచూకీని గుర్తించింది. కల్నల్ భాటియా మరియు అతని బృందం ఘనీభవించిన మృత శరీరాలను
వెలికితీశారు. కెప్టెన్ హనీఫుద్దీన్, పర్వేష్‌ల శవాలను కల్నల్ భాటియా మరియు అతని బృందం తమ
వీపులపై మోసుకొంటూ రాత్రిపూట నిశ్శబ్దంగా నడిచి, తెల్లవారుజామున జాంగ్‌పాల్ చేరుకున్నారు.. అక్కడనుంచి
భారత సైనిక హెలికాప్టర్ కెప్టెన్ హనీఫుద్దీన్, పర్వేష్‌ల మృతదేహాలను తీసుకువెళ్లింది.
వీర చక్ర అవార్డు గ్రహీత కెప్టెన్
హనీఫుద్దీన్ తల్లి హేమా అజీజ్ అమరవీరుడు అయిన తన కుమారుడికి ఈ విధంగా నివాళులర్పించారు: “ఒక సైనికుడిగా, కెప్టెన్ హనీఫ్ తన
దేశానికి గర్వంగా మరియు అంకితభావంతో సేవ చేశాడు. తరువాత, బ్యాటిల్ జోన్ లో ఒక సబ్‌సెక్టర్‌కు “సబ్‌సెక్టర్
కెప్టెన్ హనీఫుద్దీన్” అని పేరు
పెట్టారు.
కెప్టెన్ హనీఫుద్దీన్ 11రాజ్‌పుతానా
రైఫిల్స్ తరుపున పోరాడారు. 11రాజ్‌పుతానా రైఫిల్స్ యుద్ధ కేక war cry ‘రాజా రామ్
చంద్ర కీ జై’.
కార్గిల్ యుద్ధ వీరుడు వీర చక్ర అవార్డు
గ్రహీత(మరణాంతరం) Vir Chakra(P) కెప్టెన్
హనీఫుద్దీన్ మరియు ఇతర వీరులను మనం మరచిపోకూడదు!
మూలం: http://www.beyondheadlines.in / బియాండ్
హెడ్‌లైన్స్ / జూలై 27, 2024
No comments:
Post a Comment