ఇస్తాంబుల్ సుల్తాన్ అహ్మద్ ట్రామ్
స్టేషన్ నుండి 400 మీటర్ల కాలి నడక దూరం లో గల రెండు
గొప్ప చారిత్రక పర్యాటక ఆకర్షణలు, అయా సోఫియా మరియు
బ్లూ మసీదుకు ప్రవేశ ద్వారంకు సమీపం లోని సుల్తాన్
మహమూద్ హాన్ తుర్బేసి అనబడే రాయల్ స్మశానవాటికలో ఫాజిల్ పాషా (1318)
అనే
పేరు చెక్కబడిన శిలాఫలకంతో సమాధి ఉంది.. ఫాజిల్
పాషా (1318)
అనే
పేరు చెక్కబడిన శిలాఫలకంతో కూడిన సమాధి కథ దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని
తీరప్రాంతమైన మలబార్‌లో ప్రారంభమవుతుంది.
1824 ADలో,
ఫాజిల్
పాషా మలబార్‌లోని మమ్బూరం గ్రామంలో జన్మించాడు. ఫాజిల్ పాషా దక్షిణ భారత౦ గొప్ప
సూఫీ పండితుడు సయ్యద్ 'అలవీ
అల్ మౌలద్దవిలా మమ్బురం యొక్క ఏకైక కుమారుడు.. తన సూఫీ తండ్రి సయ్యద్ 'అలవీ
అల్ మౌలద్దవిలా మమ్బురం వద్ద ఇస్లామిక్ శాస్త్రాలు మరియు ఖాదిరియా తరిఖా యొక్క
మార్గాలలో విద్యాభ్యాసం చేసిన ఫాజిల్ పాషా తన తండ్రి మరణానంతరం 20
ఏళ్ల వయసులో యెమెన్ మరియు మక్కాలో జ్ఞానం కోసం అన్వేషణను ప్రారంభించాడు. ఫాజిల్
పాషా అనేక స్థానిక మరియు ప్రపంచ ఉలమాల నుండి ఇల్మ్ (జ్ఞానం) మరియు తర్బియా
(ఆధ్యాత్మిక పోషణ) కూడా పొందాడు.
మక్కాలో సయ్యద్ ఫజల్ పాషా షేక్ షఫీ అల్
హబాషి యొక్క కుమార్తెలలో ఒకరిని వివాహం చేసుకున్నాడు మరియు అక్కడ కుటుంబాన్ని
ప్రారంభించాడు. మక్కాలో సయ్యద్ ఫజల్ పాషా శిష్యులలో గొప్ప సున్నీ పండితులలో ఒకరైన
షేక్ అహ్మద్ జైనీ దహ్లాన్ ఒకడు. షేక్
అహ్మద్ జైనీ దహ్లాన్ ‘అల్ ఫిత్నాత్ అల్
వహాబియా Al Fitnat al Wahhābiyya’ అనే ప్రసిద్ద గ్రంధం ను రచి౦నాడు.
1848లో,
ఫాజిల్
పాషా తన సూఫీ తండ్రి మంబురామ్ తంగల్ వారసత్వాన్ని కొనసాగించడానికి మలబార్‌కు
తిరిగి వచ్చాడు. ఫాజిల్ పాషా త్వరలోనే ముస్లింల మతపరమైన,
ఆధ్యాత్మిక
మరియు రాజకీయ నాయకత్వాన్ని పొందాడు. ఫాజిల్ పాషా కృషి మరియు
బోధనలు చాలా మంది హిందువులను ఇస్లాంలోకి మార్చడానికి దారితీశాయి. ఫాజిల్ పాషా మస్జిద్‌లను
నిర్మించడం, సూఫీ హద్రాలు (మతపరమైన సమావేశాలు),
ఖాదిరియా
తారీకా యొక్క ఆదర్శాలను వ్యాప్తి చేయడం మరియు వివిధ ఇస్లామిక్ శాస్త్రాలలో
పుస్తకాలు రాయడం వంటి మతపరమైన మరియు ఆధ్యాత్మిక ప్రయత్నాలకు నాయకత్వం వహించాడు.
మలబార్‌లో
ఫాజిల్ పాషా తన
తండ్రి లాగానే బ్రిటిష్ అధికారులు మరియు వలసవాదమునకు
వ్యతిరేకముగా ప్రవర్తించారు. స్థానిక ప్రజలపై వలస అధికారులు విధించిన
క్రూరత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి వెనుకాడలేదు.
బ్రిటీష్ ఇండియన్ ఆర్కైవ్స్‌లో
కనుగొనబడిన రికార్డుల ప్రకారం ఫాజిల్
పాషాను బహిష్కరించడానికి లేదా అరెస్టు చేయడానికి బ్రిటిష్ అధికారులు చేసిన అనేక
ప్రయత్నాలు సఫలం కాలేదు.. మలబార్‌ను విడిచిపెట్టి అరేబియాలో స్థిరపడేందుకు ఫాజిల్
పాషాను ఒప్పించేందుకు బ్రిటన్ అనేక ప్రయత్నాలు చేసింది. చివరకు ఫాజిల్ పాషా
బ్రిటిష్ అధికారుల పిలుపులకు కట్టుబడి
అరేబియాకు బయలుదేరాలని నిర్ణయించుకున్నాడు.
1852లో
ఫాజిల్ పాషా మక్కాలో కొన్ని నెలలు గడిపిన తర్వాత, ఈజిప్టుకు
వెళ్లాడు,
అక్కడ
ఆ సమయంలో ఆ ప్రాంత కమాండ్‌గా ఉన్న ఒట్టోమన్ అధికారి హిడైవ్ అబ్బాస్ పాషా, ఫాజిల్ పాషా కి స్వాగతం పలికాడు. ఫాజిల్ పాషా ఇస్తాంబుల్‌కు
బయలుదేరే ముందు కైరోలో కొంతకాలం ఉండి, ‘ఉద్దత్
అల్ ఉమారై వాల్ హుక్కామ్ Uddat al umarāi
wal hukkām (Equipping the Leaders and Rulers) (నాయకులు మరియు
పాలకులను సన్నద్ధం చేయడం)’ అనే గ్రంధం
ప్రచురించాడు.
ఇస్తాంబుల్‌లో,
ఫాజిల్
పాషా ఒట్టోమన్ సుల్తాన్ అబ్దుల్ మెసిడ్ (d.1861)ని కలిసి ,
అతనితో
ముస్లిం ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రస్తుత సవాళ్లు మరియు బెదిరింపుల గురించి
చర్చించాడు. తిరిగి 1876 లో చాలా సంవత్సరాల తర్వాత ఫాజిల్ పాషా మళ్లీ
ఇస్తాంబుల్‌ను సందర్శించాడు. ఒట్టోమన్ సుల్తాన్ అబ్దుల్ అజీజ్ హాన్ (d.1876) తో
,
హెజాజ్‌లో
జరిగిన పరిణామాల గురించి తెలియజేసాడు.
1876లో,
ఒట్టోమన్ సుల్తాన్
మురాద్ ఎఫెండి యుగంలో, ఒట్టోమన్ ప్రభుత్వం ఫజిల్ పాషాను ఒమన్‌లోని ధోఫర్
Dhofar
ప్రాంతానికి గవర్నర్‌గా నియమించింది. ఫాజిల్ పాషా ధోఫర్ లో
అమలులో ఉన్న కొన్ని ఇస్లామిక్ వ్యతిరేక పద్ధతులను రద్దు చేసాడు మరియు ఇస్లామిక్
సంప్రదాయాన్ని పునరుద్ధరించడం, జకాత్ అమలుపై దృష్టి సారించాడు. ధోఫర్ లో ఫాజిల్
పాషా సిహ్ర్ (బ్లాక్ మ్యాజిక్) ను కూడా నిషేధించాడు మరియు దానిని ఆచరించే వారిని
నిర్బంధించాడు.
హిందూ మహాసముద్రం అంతటా వస్తువులను
దిగుమతి చేయడం మరియు ఎగుమతి చేయడం ద్వారా ధోఫర్ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి
ఫాజిల్ పాషా కృషి చేశారు.
1880లో,
ఫజిల్
పాషా మరోసారి ఇస్తాంబుల్‌కు తిరిగి వచ్చాడు, అక్కడ ఫజిల్ పాషా కి
ఒట్టోమన్ సుల్తాన్ అబ్దుల్ హమీద్ II సాదరంగా స్వాగతం
పలికాడు.ఒట్టోమన్ సుల్తాన్ ఫజిల్ పాషా ని తన మంత్రివర్గంలో నియమించాడు మరియు ఆర్థిక శాఖ
బాధ్యతలను అప్పగించాడు ఒట్టోమన్ ఖలీఫాట్‌లో పాషాగా నియమించబడిన మొదటి భారతీయుడు ఫజిల్
పాషా అయ్యాడు
ఒట్టోమన్ సుల్తాన్ అబ్దుల్ హమీద్ II
యొక్క
మాస్టర్ ప్రాజెక్ట్, ‘హమీదియే
హెజాజ్ రైల్వే Hamidiye Hejaz Railway’ నిర్మాణం లో ఫజిల్ పాషా కీలక పాత్రను పోషించినాడు. ‘హమీదియే
హెజాజ్ రైల్వే’ మొదటి ప్రయాణీకులలో ఫాజిల్ పాషా మరియు
అతని భార్య ఉన్నారు.
ఫజిల్
పాషా యొక్క పంతొమ్మిది రచనలలో ఐదు ఇస్తాంబుల్‌లో ప్రచురించబడ్డాయి. ఫజిల్ పాషా యొక్క
అన్ని రచనల కాపీలు ఇస్తాంబుల్ విశ్వవిద్యాలయ౦ లో లబి౦చును..
ఫాజిల్ పాషా వలసవాద వ్యతిరేక
స్వాతంత్ర్య సమరయోధుడు మరియు సంఘ సంస్కర్త. ఫాజిల్
పాషా 19వ
శతాబ్దపు విద్వాంసులు మరియు మక్కా విద్యార్థులకు పవిత్ర జ్ఞానాన్ని అందించేవాడు ఫాజిల్
పాషా తన జీవితాంతం అనేక పదవులు పొంది ధోఫర్ ఎమిర్‌గా కూడా గుర్తింపు పొందాడు.ఒట్టోమన్ సుల్తాన్
అబ్దుల్ హమీద్ II యొక్క మంత్రిగా పనిచేసాడు.
ఫాజిల్ పాషా 1900లో
మరణించినాడు. ఫాజిల్ పాషా అంత్యక్రియలకు ఒట్టోమన్ సుల్తాన్ అబ్దుల్ హమీద్ హాన్‌తో పాటు పలువురు ఉన్నత స్థాయి ఒట్టోమన్ అధికారులు
మరియు మంత్రులు హాజరయ్యారు.
మలబార్ తీరం నుండి ఇస్తాంబుల్ ఇంపీరియల్
ఛాంబర్‌ల వరకు సాగిన ఫాజిల్ పాషా అద్భుతమైన జీవిత ప్రయాణం ఒట్టోమన్ సుల్తాన్ మహమూద్ సమాధి
సమ్మేళనం mausoleum compound
వద్ద ముగిసింది.
No comments:
Post a Comment