7 September 2024

కింగ్ అబ్దుల్ అజీజ్ లైబ్రరీ: అరబ్ మరియు ఇస్లామిక్ హెరిటేజ్ పరిరక్షణకు కేంద్ర స్థానం King Abdulaziz Library: A Global Hub for Preserving Arab and Islamic Heritage

 

 

రియాద్‌లోని కింగ్ అబ్దుల్ అజీజ్ పబ్లిక్ లైబ్రరీ అరబ్ మరియు ఇస్లామిక్ వారసత్వాన్ని సంరక్షించడానికి మరియు పంచుకోవడానికి ఒక మూలస్తంభం వంటిది.. 3మిలియన్లకు పైగా పుస్తకాలను కలిగి మరియు డిజిటల్ ఆర్కైవ్‌తో, కింగ్ అబ్దుల్ అజీజ్ పబ్లిక్ లైబ్రరీ ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు, పండితులు మరియు విద్యార్థులకు ప్రధాన వనరుగా మారింది.

1987లో ప్రారంభమైన కింగ్ అబ్దుల్ అజీజ్ పబ్లిక్ లైబ్రరీ 8,000 మాన్యుస్క్రిప్ట్‌లు, 32,000 అరుదైన పుస్తకాలు, 700 పురాతన పటాలు, 7,600 అరుదైన నాణేలు మరియు ముఖ్యమైన ఫోటోగ్రాఫిక్ ఆర్కైవ్‌ల అద్భుతమైన సేకరణను కలిగి ఉంది. ముఖ్యంగా, కింగ్ అబ్దుల్ అజీజ్ పబ్లిక్ లైబ్రరీ పవిత్ర ఖురాన్ యొక్క 350 కంటే ఎక్కువ అరుదైన కాపీలకు నిలయం మరియు వాటిని వివిధ ప్రదర్శనలలో  ప్రదర్శిస్తుంది.

అరబిక్ యూనియన్ కేటలాగ్ మరియు గ్లోబల్ ఎగ్జిబిషన్‌ వంటి కార్యక్రమాలకు  ప్రపంచ నిబద్ధత ప్రదర్శిస్తూ కింగ్ అబ్దుల్ అజీజ్ పబ్లిక్ లైబ్రరీ అరబ్ మరియు ఇస్లామిక్ నాగరికతల యొక్క గొప్ప వారసత్వం పై ప్రపంచవ్యాప్తంగా సాంస్కృతిక అవగాహనను కలిగిస్తూనే ఉంటుంది. .

No comments:

Post a Comment