చెన్నై:
తవాయిఫ్‌ల (సంగీతం మరియు నృత్యం చేసె వేశ్యలు) జ్ఞాపకాలను సేకరిస్తూ చెన్నై నడిబొడ్డున ఉన్న కంచెన్‌వాడ —కాంచెన్‌లు-తవాయిఫ్‌లలోని ప్రముఖులు నివసించే ప్రాంతం) లోగల తవాయిఫ్‌ల చరిత్రను మరియు దాదాపు మూడు శతాబ్దాల పాటు మద్రాస్ నగరం యొక్క సాంస్కృతిక ఫాబ్రిక్‌లో కాంచెన్‌లు ఎలా అంతర్భాగంగా మారారు అనేదానిపై ఒక పరిశోధనా వ్యాసం..
1848లో కర్ణాటక/ఆర్కాట్ చివరి నవాబు అయిన నవాబ్ గులాం
ఘౌస్ ఖాన్, తవాయిఫ్ లేదా కంచెన్ అయిన జహంగీర్ బక్ష్‌ను తన రెండవ
భార్యగా రాజ వివాహం చేసుకొన్నారు. నవాబ్ కు తవాయిఫ్ లేదా కంచెన్ తో జరిగిన రాజ
వివాహం తవాయిఫ్‌ల గురించి మరింత తెలుసుకోవడానికి పరిశోధనకు దారి తీసింది.
18వ శతాబ్దంలో, నవాబ్ ముహమ్మద్ అలీ ఖాన్ వల్లజా తన దర్బార్‌ను ఆర్కాట్ నుండి మద్రాసుకు
మార్చాడు. ఆర్కాట్ నవాబ్ ఆస్థానం లోని హిందుస్థానీ సంగీతకారులు మరియు నృత్యకారులు
కూడా ఆర్కాట్ నవాబ్ ని అనుసరించి మద్రాస్ నగరానికి చేరుకున్నారు, ఇది మద్రాస్ నగరంలో తవైఫ్ సంస్కృతికి నాంది పలికింది.
కాలక్రమేణా, అమీర్ మహల్ పక్కన ఉన్న ప్రాంతం అనేక కంచెన్‌లకు నివాసస్థలం
గా మారింది. "అధిక సంఖ్యలో
నృత్యకారులు మరియు సంగీతకారులు హుబ్లీ-ధార్వాడ్ నుండి ఉద్భవించారు మరియు బహుశా
మరాఠీ నుంచి కాంచెన్ వాడ అనే పేరు
వచ్చింది. మరాఠీ లో కాంచెన్ వాడ అనగా ఒక ప్రాంతం లేదా సాంప్రదాయ సముదాయం అని అర్ధం,"
1855 తర్వాత బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కర్ణాటక రాజ్యాన్ని జయించి ( అప్పటి నవాబుల అధికారిక నివాసం - చెపాక్ ప్యాలెస్‌ని వేలం వేసింది) 1855 తర్వాత దాదాపు రెండు దశాబ్దాల వరకు గాని ఆర్కాట్ నవాబులు అమీర్ మహల్‌లోకి మారలేదు.
నృత్యం, సంగీతం, పద్యాలు మరియు
వారి అదాబ్ (మర్యాదలు)కు ప్రసిద్ధి చెందిన కంచెన్‌లు సమాజం లో చాలా గౌరవంగా ఉండేవారు, కొన్నిసార్లు
సంపన్న కుటుంబాలకు చెందిన వారు తమ పిల్లలను మర్యాదలు నేర్చుకోవడానికి కంచెన్‌వాడకు
పంపేవారు.
“కమలా బాయి, హసీనా, రాధా బాయి, నయాబ్ జాన్ బాయి, నజీరా బాను మరియు బేబీ బాయి, ఆ నాటి తవాయిఫ్‌లలో
కొందరు, వీరిని
పాత కాలపువారు ఎంతో ప్రేమగా గుర్తుంచుకుంటారు. మరియు తమ పోషకుల వలె, తవాయిఫ్‌లు కూడా
విభిన్న విశ్వాసాలు మరియు మతాలకు చెందినవారు.
ఒకప్పుడు కంచెన్‌వాడలు ఫైజ్ అహ్మద్ ఫైజ్, సాహిర్ లుధియాన్వి మరియు మీర్జా గాలిబ్ గజల్స్‌తో ప్రతిధ్వనించేవి. చలనచిత్రాలు సమాజాన్ని ప్రభావితం చేయడం ప్రారంభించడంతో కొంతమంది కంచెన్‌లు మారుతున్న అవసరాలకు అనుగుణంగా మొఘల్-ఎ-ఆజం (1960) నుండి కోహినూర్ (1960) లోని ప్రసిద్ధ హిందీ పాటలను పాడేవారు..
సినిమా వినోదం కోసం ఒక కొత్త మార్గంగా ఎదుగుతుండడంతో, కంచెన్‌లకు ఆదరణ క్షీణించడం ప్రారంభించింది, దీని కారణంగా చాలా మంది కంచెన్‌లు సెల్యులాయిడ్‌లోకి అడుగుపెట్టారు. విభజన తర్వాత
ఢిల్లీ నుండి మద్రాసుకు వలస వచ్చిన నస్రీన్ బాను అనే కంచెన్ నుండి, పైగామ్ (1959)లో నృత్యం చేసింది; ఘరానా (1961)లో బేబీ బాయి అతిథి పాత్రలో
కనిపించినది. తమిళ చలనచిత్ర సంగీత స్వరకర్తల కోసం ఉస్తాద్ అహ్మద్ హుస్సేన్ ఖాన్
వంటి హిందుస్థానీ సంగీత విద్వాంసులు సితార్ వాయించారు, కంచెన్‌వాడ
కళాకారులు కాలక్రమేణా అభివృద్ధి చెందడానికి వివిధ వేదికలను కనుగొనడం
ప్రారంభించారు. అయితే, షోబిజ్ విజృంభించడం మరియు
సామాజిక విలువలు మారడంతో, కంచెన్‌వాడ మనుగడకు ముప్పు
కలిగింది
19వ మరియు 20వ శతాబ్దాల చివరలో జరిగిన నాచ్ వ్యతిరేక ఉద్యమం, దేవదాసీ వ్యవస్థ
రద్దు ఉద్యమం తవాయిఫ్‌లపై కూడా ప్రభావం చూపింది. కంచెన్ ప్రాక్టీస్‌ను దూరం
చేయడానికి కొంతమంది కేసులు వేసినారు. 1958లో మద్రాస్‌కు
చెందిన కంచెన్ కమలా బాయి న్యాయస్థానం లో వేసిన కేసు లో ఉన్నత న్యాయస్థానం వారికి
అనుకూలంగా తీర్పునిచ్చింది
న్యాయపరమైన విజయం ఉన్నప్పటికీ, గులాం ఘౌస్ ఖాన్ మరణానంతరం ఒక శతాబ్దానికి పైగా వృద్ధి చెందిన మద్రాస్‌లోని తవైఫ్ సంస్కృతి, ప్రముఖ ప్రదర్శనకారులలో ఒకరైన బేబీ బాయి వివాహం చేసుకుని కుటుంబాన్ని ప్రారంభించడానికి కంచెన్‌వాడ నుండి బయటకు వెళ్లడంతో ముగిసింది. "చాలా మంది కంచెన్‌లు బేబీ బాయి ని అనుసరించారు మరియు 1970ల నాటికి, మద్రాసులో 250-ఏళ్ల కంచెన్ పాత సంప్రదాయం ముగిసింది"
ఒకప్పుడు సంపన్న పోషకులచే
శోభాయమానంగా ఉన్న మీర్ బక్షి అలీ స్ట్రీట్, మహ్మద్ హుస్సేన్ స్ట్రీట్ మరియు జానీ జహాన్ ఖాన్ రోడ్‌లు, నేడు మారిపోయి
బ్రహ్మచారి భవనాలు మరియు దుకాణాలతో నిండి ఉన్నాయి. కంచెన్‌వాడ జాడ లేకుండా
పోయింది..
మద్రాసులోని తవాయిఫ్‌ల జీవితాలు
దాదాపుగా తుడిచిపెట్టుకుపోయాయి, పరిశోధకుల
ప్రయత్నాలు, బహుశా, కోల్పోయిన గతాన్ని
వెతకడానికి మరియు డాక్యుమెంట్ చేయడానికి జరిగే సుదీర్ఘ ప్రయాణానికి నాంది కావచ్చు.
మూలం: ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్,
జనవరి 19, 2021
No comments:
Post a Comment