ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి
వసల్లం) అల్లాహ్ ప్రవక్త మరియు రాజనీతిజ్ఞుడు. ప్రవక్త ముహమ్మద్(స) నాయకత్వం
సమగ్రమైనది మరియు చైతన్యవంతమైనది, సద్గుణాలు మరియు ఆధ్యాత్మికతను ప్రతిబింబిస్తుంది. ప్రవక్త
ముహమ్మద్(స) దయగల ఉపాధ్యాయుడు, మార్గదర్శకుడు మరియు సంస్కర్త, అలాగే అంకితభావంతో కూడిన కుటుంబ వ్యక్తి
మరియు రాజకీయ నాయకుడు. రాజకీయ నాయకుడిగా, ప్రవక్త ముహమ్మద్(స) అరేబియా ద్వీపకల్పాన్ని ఏకం చేశాడు. మదీనా రాజధాని గా శక్తివంతమైన
రాజ్యాన్ని స్థాపించాడు మరియు అనేక సైనిక విజయాలు సాధించాడు. అయినప్పటికీ, ప్రవక్త ముహమ్మద్(స)
నిజమైన రాజకీయ నాయకత్వం అతని నైతిక మరియు ఆధ్యాత్మిక ప్రవర్తనలో ప్రకాశించింది మరియు బలహీనత మరియు బలం రెండింటిలోనూ
తప్పుపట్టలేని ప్రవర్తనను ప్రదర్శించింది. మక్కా మరియు మదీనాలో ప్రవక్త ముహమ్మద్(స)
చర్యలు అసాధారణమైన రాజకీయ చతురతను ప్రతిబింబిస్తాయి.
ప్రవక్త ముహమ్మద్(స) ఎల్లప్పుడూ
ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు మరియు వివాదాలను పరిష్కరించే సామర్థ్యాన్ని
అతనికి అల్లాహ్ ప్రసాదించారు. తను ప్రవక్త కావాడానికి ముందు కూడా, ముహమ్మద్ మక్కా ప్రజల మధ్య ఒక ముఖ్యమైన వివాదాన్ని
పరిష్కరించారు. కాబా గోడలను మరమ్మతు చేస్తున్నప్పుడు నల్ల రాయిని ఎవరు ఉంచాలనే
దానిపై భిన్నాభిప్రాయాలు తలెత్తాయి. మొహమ్మద్ చాతుర్యంతో రాయిని తన అంగీపై ఉంచి, ప్రతి తెగకు
చెందిన ప్రతినిధులతో దానిని పైకి లేపడం
ద్వారా సమస్యను పరిష్కరించారు.
చిన్నప్పటి నుండి, ప్రవక్త ముహమ్మద్(స) శాంతిని
స్థాపించడానికి ప్రయత్నించారు . ప్రవక్త ముహమ్మద్(స) హిల్ఫ్ అల్-ఫుదుల్ Hilf al-Fudul అనే కమిటీలో చేరారు. ఇది మక్కాలో
హింసను అణిచివేసేందుకు మరియు సుగుణాన్ని ప్రోత్సహించడానికి అంకితం చేయబడింది.
ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి
వసల్లం) ఆచరణాత్మకంగా మరియు అందరినీ కలుపుకొని, సమాజం నుండి తనను తాను వేరుకాకుండా తన సందేశాన్ని వ్యాప్తి చేశారు. ఇస్లాంను
అంగీకరించనప్పటికీ, ప్రవక్త
ముహమ్మద్ (స) తన పెదనాన్న uncle, అబూ తాలిబ్ యొక్క
మద్దతును పొందారు మరియు ఆ నాటి సమాజం లోని ప్రయోజనకరమైన ఆచారాలు మరియు
సంప్రదాయాలను ఉపయోగించుకున్నారు.. తన పెదనాన్న అబూ తాలిబ్ మరణం తరువాత, ప్రవక్త(స) ఇస్లాం
పట్ల తన అంకితభావాన్ని ప్రదర్శిస్తూ ఇతర తెగలతో పొత్తులు పెట్టుకున్నారు.
ప్రవక్త ముహమ్మద్ (స) రాజకీయ
నైపుణ్యం హిజ్రా నుండి ఇథియోపియాలో స్పష్టంగా కనిపిస్తుంది. మక్కా లో ప్రవక్త ముహమ్మద్
(స) అనుచరులు తీవ్రమైన హింస ఎదుర్కొంటున్న సమయంలో అబిసీనియా/యుదోపియా లోని క్రైస్తవ
రాజు దగ్గిర అతని అనుచరులు ఆశ్రయం పొందారు.
ఈ చర్య వారి భద్రతకు హామీ ఇచ్చింది మరియు సానుకూల సంబంధాలను పెంపొందించింది మరియు అబిసీనియా/యుదోపియా
రాజు మరణానికి ముందు ఇస్లాం స్వీకరించేలా చేసింది. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు
అలైహి వసల్లం) ధైర్యవంతుడు మరియు సూత్రప్రాయమైన రాజకీయ నాయకుడు, బెదిరింపులు లేదా
ప్రలోభాలకు ఎన్నడూ లొంగలేదు. మక్కా ప్రజలు ముహమ్మద్ ను తన మిషన్/దైవ దౌత్యం ను విడిచిపెట్టడానికి లంచం
ఇవ్వడానికి ప్రయత్నించారు,
కానీ
ముహమ్మద్ దానిని గట్టిగా తిరస్కరించారు.
మదీనాలో, ప్రవక్త ముహమ్మద్
(స) సమానత్వం, సంప్రదింపులు
మరియు న్యాయం ఆధారంగా రాజ్యాన్ని స్థాపించారు, అక్కడ ముస్లిమేతరులను కూడా న్యాయంగా చూసేవారు. తు'మాహ్ ఇబ్న్ అబ్రక్ Tu’mah ibn Abraq, ఒక యూదుని
దొంగతనం చేశాడని తప్పుగా ఆరోపించగా, యూదుని నిర్దోషిగా మరియు తుమాను దోషిగా ప్రకటిస్తూ
(సూరత్ అన్-నిసా’:
110-112) వచనాలను అల్లాహ్ అవతరింపజేశాడు. ఇది న్యాయం పట్ల ప్రవక్త
ముహమ్మద్ (స) నిబద్ధతను చూపుతుంది.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)
తన ప్రజల మతపరమైన మరియు ఆర్థిక శ్రేయస్సు కోసం శ్రద్ధ వహించారు. ప్రవక్త ముహమ్మద్
(స) ఒప్పందాలు మరియు పొత్తులు చేసుకున్నాడు, తన దౌత్య నైపుణ్యాలను మరియు నైతిక మరియు నిజాయితీ
దౌత్యానికి నిబద్ధతను ప్రదర్శి౦చారు.
ప్రవక్త ముహమ్మద్ (స) అన్ని
ఒప్పందాలను గౌరవించారు మరియు తన ప్రజలను
రక్షించారు మరియు
ప్రతికూల పరిస్థితులకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారు.
ప్రవక్త ముహమ్మద్ (స) ఎప్పుడూ సంఘర్షణను ప్రారంభించనప్పటికీ, దాడి జరిగినప్పుడు
మాత్రం దానిని దృఢంగా ఎదుర్కొన్నారు మరియు
ఎల్లప్పుడూ శాంతిని నొక్కి చెప్పారు.
ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి
వసల్లం) సహనం మరియు త్యాగాన్ని మూర్తీభవించారు, మనకు ప్రవక్త(స)జీవితం అనేక పాఠాలను అందిస్తుంది..
ప్రవక్త(స) నిజాయితీ మరియు నిందలకు అతీతంగా ఉన్నారు, ప్రవక్త(స) నిజాయితీ శత్రువులచే కూడా గుర్తించబడినది..
బైజాంటైన్ చక్రవర్తి హెరాక్లియస్
ప్రవక్త(స) గురించి ప్రశ్నించినప్పుడు, ఆ సమయంలో ప్రవక్త(స) యొక్క శత్రువు అయిన అబూ సుఫ్యాన్ ప్రవక్త(స)
యొక్క కుటుంబ౦, నిజాయితీ
మరియు పెరుగుతున్న అనుచరుల గురించి
అనుకూలంగా సాక్ష్యమిచ్చాడు. హిరేరలియస్ ముహమ్మద్ ప్రవక్త(స) యొక్క సత్యాన్ని
అంగీకరించాడు, అతనిని
కలవాలని మరియు అతనిని గౌరవించాలనే కోరికను వ్యక్తం చేశాడు.
No comments:
Post a Comment