23 September 2024

కాఫీయే చరిత్ర The History of the Kaffiyeh

 

ఒకప్పుడు నైరుతి ఆసియా మరియు ఉత్తర ఆఫ్రికాలో ఎండ వేడిమి నుండి రక్షణ కోసం ఉపయోగించబడిన  కాఫీయే kaffiyeh(తలగుడ్డ), నేడు అమెరికా, యూరప్ కళాశాల శిబిరాల వద్ద విద్యార్థుల మెడపై మరియు పాలస్తీనియన్ అనుకూల మార్చ్‌లలో కార్యకర్తల ముఖాలను కప్పి ఉంచే స్కార్ఫ్‌(కండువా) గా మారింది..

కాఫీయే kaffiyeh ఇటీవలి దశాబ్దాలలో పాలస్తీనా జాతీయవాదం మరియు ప్రతిఘటనకు చిహ్నంగా విస్తృతంగా గుర్తించబడింది. పాలస్తీనియన్లకు, కాఫీయే ప్రతీకవాదంగా నిలిచింది.  "ఇజ్రాయెల్ ఆక్రమణ కు ప్రతిఘటన చిహ్నంగా మాత్రమె కాకుండా, పాలస్తీనా ప్రజలకు తమ మాతృభూమికి సంబంధాన్ని తెలియజేయడానికి, అభివ్యక్తిగా కాఫీయే " నిలిచింది. 

కాఫీయే అనేది చతురస్రాకారంలో చేతితో నేసిన గళ్ళ స్కార్ఫ్/కండువా.   చారిత్రాత్మకంగా అరబ్ మగవాళ్ళ  తల కండువా అయినప్పటికీ, నేడు నైరుతి ఆసియా, ఉత్తర ఆఫ్రికా మరియు వెలుపల ఉన్న అన్ని జాతులు మరియు లింగాల ప్రజలు కఫియేను ధరిస్తారు.

నలుపు-తెలుపు కాఫీయే ను పాలస్తీనియన్లు మరియు గాజా స్ట్రిప్‌లో నివసిస్తున్న ప్రజలకు సంఘీభావంగా ధరిస్తారు. కానీ కొన్ని ఇతర రంగుల కాఫీయే ఇతర ప్రాంతాలలో ప్రసిద్ధి చెందాయి. ఉదాహరణకు, ఎరుపు రంగు కాఫీయే జోర్డాన్‌లో బాగా ప్రాచుర్యం పొందింది.

మెసొపొటేమియా అని పిలువబడే 4500 BCE నాటి పురాతన నాగరికతలో భాగమైన సుమేరియన్లు మొదట కాఫీయేలను ధరించారు. అరేబియా ద్వీపకల్పంలోని ఎడారి ప్రాంతాల్లోని స్థానిక ప్రజలు అయిన బెడౌయిన్‌లు  దుమ్ము తుఫాను లేదా ఇసుక తుఫాను రక్షణగా నోటిని కప్పుకోవడానికి కాఫీయే/ స్కార్ఫ్‌ను ఉపయోగించారు.

20వ శతాబ్దం ప్రారంభం వరకు, గ్రామస్తులు మరియు పట్టణవాసుల నుండి సంచార పురుషులను వేరు చేయడానికి, కాఫీయేలను ప్రధానంగా బెడౌయిన్‌లు ధరించేవారు.

"కాఫీయే శతాబ్దానికి పైగా పాలస్తీనా అరబ్బుల నిరంతర హింసాత్మక తిరుగుబాటు"గా గుర్తించబడింది.

"పాలస్తీనియన్ పురుషులు తమ తలపై మాత్రమే కాకుండా, మెడ చుట్టూ, దాదాపు ఏకరీతిగా కాఫీయే ను ధరిస్తారు" కాఫీయే శ్రామిక తరగతి పాలస్తీనియన్లను ఉన్నత-తరగతితో ఏకం చేసే సంఘీభావానికి చిహ్నంగా మారింది..

ప్రముఖ వ్యక్తులు కూడా కఫీయే/స్కార్ఫ్‌ను వాడారు. పాలస్తీనా అథారిటీ మాజీ అధ్యక్షుడు యాసర్ అరాఫత్, 1968లో TIME మ్యాగజైన్ కవర్‌ను కాఫీయేతో అలంకరించారు, పాలస్తీనా ఆకారాన్ని అనుకరించే త్రిభుజాకార ఆకారంలో తన తలపై కండువా ధరించడంలో యాసర్ అరాఫత్ ప్రసిద్ధి చెందారు..

1960వ దశకంలో, "స్వాతంత్ర్య సమరయోధురాలు" మరియు పాపులర్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా నాయకురాలు లీలా ఖాలీద్- కాఫీయే ధరించింది. "హిజాబ్ లాగా ఒక మహిళ తన తలపై [కఫీయే] ధరించటం ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా పాలస్తీనా కమ్యూనిటీ మరియు డయాస్పోరాలో విస్తృత ప్రజాదరణను పొందింది..

ఇటీవలి దశాబ్దాలలో ఫ్యాషన్ ప్రపంచంలో కాఫీయే/స్కార్ఫ్ బాగా పాపులర్ అయ్యింది. TIME రిపోర్టర్ జే కాక్స్, ఒకప్పుడు "70లు మరియు 80ల ప్రారంభంలో రాజకీయ నిరసనకారులు మరియు యాంటీమిసైల్ వాదులు ఎంపిక చేసుకునే వస్త్రం గా కాఫీయే మారిందని పెర్కొనాడు. కాఫీయే  "రాజకీయంగా తటస్థంగా" మారింది..

క్రమేణా యాంటీవార్" స్కార్ఫ్‌లుగా విక్రయించబడిన కాఫీయే కొన్ని చోట్ల నిషేదించ బడినది.

నేడు, చాలా మంది పాలస్తీనియన్లు చెకర్డ్ కాఫీయే/స్కార్ఫ్ ప్రతిఘటనకు చిహ్నంగా ఉన్నప్పటికీ, అది ఇప్పటికీ వారి స్వంత సాంస్కృతిక వారసత్వంతో ముడిపడి ఉందని గుర్తించారు.

కాఫీయే పాలస్తీనా  ఆక్రమణ కు వ్యతిరేకంగా ప్రతిఘటన యొక్క అర్థాన్ని కలిగి ఉంది. పాలస్తినా నిరసనకారులు  చెడు సమయాలు (నిరసనలు) మరియు మంచి సమయాలు (వివాహాలు లేదా గ్రాడ్యుయేషన్) కోసం దీనిని ధరిస్తారు.

No comments:

Post a Comment