ఖేరోడా
గ్రామం (ఉదయ్‌పూర్ జిల్లా), రాజస్థాన్:
జూలై 5, 2024న రాష్ట్రపతి భవన్‌లో జరిగినకార్యక్రమంలో
ఇండియన్ ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్ అధికారి మేజర్ ముస్తఫా బోహారా కు మరణానంతరం posthumously శౌర్య చక్ర అవార్డు ను ప్రదానం చేయబడింది..
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రతిష్టాత్మకమైన శౌర్య చక్ర అవార్డు (మరణానంతరం) ను
మేజర్ ముస్తఫా తల్లిదండ్రులు ఫాతిమా, జకిఉద్దిన్ బోహరా కు అందజేశారు..
మే 14, 1995న రాజస్థాన్‌లోని ఉదయపూర్ జిల్లా
ఖేరోడా గ్రామంలో జన్మించిన మేజర్ ముస్తఫా బోహారా ఖేరోడాలోని ఉదయ్ శిక్షా మందిర్
హయ్యర్ సెకండరీ స్కూల్‌లో మరియు తరువాత ఉదయపూర్‌లోని సెయింట్ పాల్స్ స్కూల్‌లో
చదువుకున్నాడు. ఆ తరువాత ముస్తఫా బోహారా సాయుధ
దళాలలో సేవ చేయాలనే చిన్ననాటి కల మేరకు నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) లో ప్రవేశించినాడు.
నేషనల్
డిఫెన్స్ అకాడమీ లో ముస్తఫా బోహారా 128వ కోర్సులో రాణించాడు మరియు విశిష్ట
నవంబర్ స్క్వాడ్రన్‌లో భాగంగా ఉన్నాడు. ముస్తఫా బోహారా డెహ్రాడూన్‌లోని ఇండియన్
మిలిటరీ అకాడమీ (IMA) నుండి
పట్టభద్రుడయ్యాడు, ముస్తఫా
బోహారా ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్‌లో హెలికాప్టర్ పైలట్‌గా నైపుణ్యం సాధించడానికి
ముందు లెఫ్టినెంట్‌గా నియమించబడినాడు.
అక్టోబరు
21, 2022న, మేజర్ ముస్తఫా మరియు మేజర్ వికాస్ భంభు, ముగ్గురు సిబ్బందితో కలిసి అరుణాచల్
ప్రదేశ్‌లోని వాతావరణ ప్రతికూల భూభాగంలో ఒక మిషన్‌ను చేపట్టారు. దురదృష్టవశాత్తు, వారి హెలికాప్టర్ ప్రతికూల వాతావరణం
మరియు క్లిష్ట పరిస్థితుల మద్య ఎగువ
సియాంగ్ జిల్లాలోని ముగుంగ్ సమీపంలో అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంది, విస్తృతమైన శిక్షణ మరియు అనుభవం
ఉన్నప్పటికీ, హెలికాప్టర్‌లో
మంటలు చెలరేగాయి, మేజర్
ముస్తఫా మరియు మేజర్ వికాస్‌లు జనసాంద్రత ఉన్న ప్రాంతాలు మరియు మందుగుండు సామాగ్రి
డిపోలకు దూరంగా హెలికాప్టర్ను ల్యాండ్
చేయడానికి ప్రయత్నం చేసారు. కాని వారి సాహసోపేత ప్రయత్నం విఫలమయి చివరకు అది వారి
ప్రాణాలను బలిగొంది.
రాష్ట్రపతి
భవన్‌లో జరిగిన వేడుకలో ఉపరాష్ట్రపతి శ్రీ జగ్‌దీప్ ధన్‌ఖర్, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్, ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ
పాల్గొన్నారు. మేజర్ ముస్తఫా, మేజర్ వికాస్ భంబు ఇద్దరినీ శౌర్యచక్ర (మరణానంతరం) తో సత్కరించారు.
భయంకరమైన ప్రమాదంలో వారి ఆదర్శప్రాయమైన ధైర్యసాహసాలు గుర్తించబడ్డాయి, విధి పట్ల వారి నిస్వార్థ
అంకితభావాన్ని నొక్కిచెప్పబడింది..
మేజర్
ముస్తఫా బోహారా విధినిర్వహణలో చూపిన ధైర్యం మరియు అంకితభావం త్యాగానికి శాశ్వత
చిహ్నంగా మిగిలిపోయింది. మేజర్ ముస్తఫా బోహారా వీరోచిత చర్యలు భారతదేశ సాయుధ బలగాల
యొక్క అచంచలమైన స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ ఒక ప్రగాఢమైన ప్రేరణగా పనిచేస్తాయి.
మేజర్
ముస్తఫా తల్లి ఫాతిమా బోహరా గర్వంతోనూ, బాధతోనూ ఇలా అన్నారు, “బలిదానం అనేది కేవలం ఒక పదం కాదు, నిజమైన నిదర్శనం. ముస్తఫా ఎల్లప్పుడూ
శ్రేష్ఠతను లక్ష్యంగా చేసుకుంటాడు మరియు విజయం వైపు వేగంగా ముందుకు సాగాలని విశ్వసించాడు”
మూలం:
క్లారియన్ ఇండియా / జూలై 07, 2024
No comments:
Post a Comment