స్వాతంత్ర్య పోరాటంలో ‘జుగంతర్’ అనే భారతీయ విప్లవకారుల సమూహం బ్రిటిష్ వలసవాదులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో బాంబు-సంస్కృతిని ప్రారంభించింది.బాఘా జతిన్, అరబిందో ఘోష్ మరియు బరీంద్ర ఘోష్ వంటి విప్లవకారులు జుగంతర్ వ్యవస్థాపకులు .
మౌలానా అబుల్ కలాం ఆజాద్‌ను జుగంతర్
ద్వారా అరబిందో ఘోష్ స్వాతంత్ర్య పోరాటంలోకి తీసుకువచ్చారు. మౌలానా అబుల్ కలాం
ఆజాద్ యొక్క మదర్సా “దారుల్ ఇర్షాద్”
బాంబుల తయారీ మరియు విప్లవకారులకు ఆయుధ శిక్షణ ఇవ్వసాగింది.
జుగంతర్ విప్లవకారులలో ఒకరు అయిన కాజీ
అహ్మద్ హుస్సేన్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ యొక్క సన్నిహిత
సహచరుడు,.
1889లో
గయాలో జన్మించిన కాజీ అహ్మద్ హుస్సేన్, విద్యార్థిగా కోల్‌కతా
సందర్శించిన సమయంలో బెంగాలీ విప్లవకారులతో పరిచయం ఏర్పడింది. బెంగాల్ ఆ సమయంలో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఆందోళన
విప్లవాత్మక భావాలతో నిండిపోయింది.
షా ముహమ్మద్ ఉస్మానీ,
కాజీ
అహ్మద్ హుస్సేన్ పై రాసిన తన వ్యాసంలో, “కాజీ
అహ్మద్ హుస్సేన్ భారతదేశంలోని ఇతర ప్రాంతాల నుండి యువకులను రిక్రూట్ చేసుకున్నాడని
మరియు విప్లవకారుల కోసం తుపాకీలను అక్రమంగా తరలించాడని”
పేర్కొన్నాడు. ఈ సమయంలోనే కాజీ అహ్మద్ హుస్సేన్ కోల్‌కతాలో మౌలానా అబుల్ కలాం
ఆజాద్‌ను కలిశాడు.
మౌలానా అబుల్ కలాం ఆజాద్ జుగంతర్‌తో
సన్నిహితంగా పనిచేస్తున్నాడు. కోల్‌కతా వెలుపల విప్లవోద్యమాన్ని తీసుకెళ్లడంలో
మౌలానా అబుల్ కలాం ఆజాద్ ముఖ్యమైన పాత్ర పోషించారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి
వ్యతిరేకంగా పోరాడేందుకు కాజీ అహ్మద్ హుస్సేన్ మరియు మౌలానా అబుల్ కలాం ఆజాద్
చేతులు కలిపారు.
భారతీయులలో విప్లవాత్మక ఆలోచనలను
వ్యాప్తి చేయడానికి కాజీ అహ్మద్ హుస్సేన్ మరియు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఒక
వార్తాపత్రికను ప్రారంభించాలని అనుకున్నారు. మౌలానా. 1912లో
అబుల్ కలాం ఆజాద్ ఎడిటర్ గా ప్రారంభించబడిన - అల్-హిలాల్ - జర్నల్‌కు కాజీ అహ్మద్
హుస్సేన్,
నిధులు
సమకూర్చారు.
‘అల్-హిలాల్’
ముస్లింలలో విప్లవాత్మక పోకడలకు నాంది పలికింది. . కాజీ అహ్మద్ హుస్సేన్ మరియు
మౌలానా అబుల్ కలాం ఆజాద్ దారుల్ ఇర్షాద్ అనే విప్లవాత్మక విద్యా సంస్థను మరియు
హిజ్బుల్లా అనే సాయుధ సమూహాన్ని స్థాపించారు.
అల్-హిలాల్ యొక్క పాఠకుల సంఖ్య 26,000కి
పెరిగింది, ఆ కాలంలో ఇది చాలా ఎక్కువ. మరియు,
హిజ్బుల్లాకు
1700
కంటే ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు; అందరూ దేశ స్వేచ్ఛ
కోసం తమ జీవితాన్ని త్యాగం చెయదానికి సిద్దంగా ఉన్నారు
1916లో
మౌలానా అబుల్ కలాం ఆజాద్‌ని అరెస్టు చేయడంతో విప్లవ కార్యకలాపాలన్నీ నిలిపివేయవలసి
వచ్చింది. కాజీ అహ్మద్ హుస్సేన్ మహాత్మా గాంధీ యొక్క అహింసా రాజకీయాలలో చేరాడు
మరియు బీహార్‌లో సహాయ నిరాకరణ మరియు ఖిలాఫత్ నాయకుడు అయ్యాడు. 1921లో
కాజీ అహ్మద్ హుస్సేన్ ని అరెస్టు చేసినప్పుడు నిరసనగా గయాలోని మార్కెట్‌లు మూతబడినాయి.
ధనిక కుటుంబంలో జన్మించిన కాజీ అహ్మద్ హుస్సేన్ తన పూర్వీకుల ఆస్తిని వదులుకున్నాడు, ఖాదీని నేయడం ప్రారంభించాడు మరియు తన జీవితంను మహాత్మా గాంధీకి అంకితం చేశాడు. కాజీ అహ్మద్ హుస్సేన్ జాతీయోద్యమం లో గాంధీజీని అనుసరించాడు.
1931లో,
సర్
అలీ ఇమామ్ వంటి ఇతర నాయకులతో కలిసి, కాజీ అహ్మద్ హుస్సేన్
ప్రత్యేక ఓటర్లను వ్యతిరేకించడానికి లక్నోలో ఆల్-ఇండియన్ నేషనలిస్ట్ ముస్లింల
సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
కాజీ అహ్మద్ హుస్సేన్ 1952లో రాజ్యసభ
సభ్యునిగా ఎన్నికైనాడు;
కాజీ అహ్మద్ హుస్సేన్ నిబద్ధత కలిగిన గాంధేయవాది,
విప్లవకారులతో
కలిసి పనిచేశాడు. గదర్ పార్టీ కి చెందిన రాజ మహేంద్ర ప్రతాప్‌తో కూడా స్నేహం
చేసాడు...
కాజీ అహ్మద్ హుస్సేన్ తన చివరి వరకు
హిందూ-ముస్లిం ఐక్యత మరియు అంటరానివారి అభ్యున్నతి కోసం నిలిచాడు. భారతదేశంలో
ప్రజలు శాంతియుతంగా జీవించి సామాజిక మరియు ఆర్థిక సమానత్వాన్ని ఆస్వాదించినప్పుడే
నిజమైన స్వాతంత్ర్యం లభిస్తుందని కాజీ అహ్మద్ హుస్సేన్ విశ్వసించారు
No comments:
Post a Comment