9 September 2024

మాలెగావ్‌లోని 110 మసీదులు మరియు మదర్సాలలో సోలార్ ప్యానెల్‌ల కోసం ప్రభుత్వం ₹5 కోట్లు కేటాయించింది Government Allocates ₹5 Crore for Solar Panels in 110 Mosques and Madrasas of Malegaon

 



మలేగాన్-

మదర్సా ఆధునీకరణ కోసం జాకీర్ హుస్సేన్ పథకం కింద మహారాష్ట్ర ప్రభుత్వం మాలెగావ్‌లోని 110 మసీదులు మరియు మదర్సాలలో సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేయడానికి ₹5 కోట్ల ప్రత్యేక గ్రాంట్‌ను ఆమోదించింది.

మాలేగావ్‌లోని చాలా మసీదులు మరియు మదర్సాలు సోలార్ ఎనర్జీ సిస్టమ్‌లను ఏర్పాటుచేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదలనలను  సమర్పించాయి. ప్రతిపాదలనను ఆమోదించి సౌర ఫలకాల కోసం ₹ 5 కోట్ల గ్రాంట్‌ను ఇవ్వడానికి మహారాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది,

ఆమోదించబడిన గ్రాంట్ ద్వారా పెద్ద మసీదులు మరియు మదర్సాలకు ₹5 లక్షలు కేటాయి౦చబడతాయి మరియు  చిన్న సంస్థలకు ఒక్కొక్కటి ₹4 లక్షలు అందుతాయి. ఈ నిధులు రాష్ట్రంలో విద్యా మరియు మతపరమైన సంస్థలను ఆధునికీకరించే విస్తృత లక్ష్యాలకు అనుగుణంగా స్థిరమైన శక్తి పరిష్కారాన్ని sustainable energy solution అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

దశాబ్ద కాలంగా అమలవుతున్న జాకీర్ హుస్సేన్ పథకం ప్రధానంగా మదర్సాల సంక్షేమం మరియు ఆధునికీకరణపై దృష్టి పెడుతుంది

జాకీర్ హుస్సేన్ మదర్సా బోర్డు పథకం అనేది మతపరమైన సంస్థల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఉద్దేశించిన చట్టబద్ధమైన ప్రభుత్వ చొరవ అని దానిలో ఇటివల సోలార్ ప్యానెల్‌లను చేర్చడం జరిగింది..

మాలెగావ్ ప్రజలు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇతర మసీదులు మరియు మదర్సాలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు

సౌర ఫలకాలను అందుకోనే సంస్థలలో 110 ప్రముఖ మదరసాలు మరియు మస్జిద్ లు కలవు, మతపరమైన సంస్థలు తమ విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవడమే కాకుండా పచ్చటి వాతావరణానికి దోహదపడేలా చేయడం ఈ గ్రాంట్ లక్ష్యం.

సోలార్ ప్యానెల్ ఇన్‌స్టాలేషన్‌ చొరవ ఇతర ప్రాంతాలకు ఒక నమూనాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. భారతదేశం అంతటా మతపరమైన మరియు విద్యా సంస్థల ఆధునీకరణలో పునరుత్పాదక శక్తి renewable energy ఎలా  ఉపయోగ పడుతుందో చూడవచ్చు.

 

-క్లారియన్ ఇండియా 9, సెప్టెంబర్, 2024, సౌజన్యం తో 

No comments:

Post a Comment