14 January 2025

ప్రముఖ సోషలిస్ట్ మహిళా నాయకురాలు -మృణాల్ గోర్ (24 జూన్ 1928 – 17 జూలై 2012 Mrinal Gore24 June 1928 – 17 July 2012

 


ప్రముఖ సోషలిస్ట్ నాయకురాలు. మార్గదర్శకురాలు మరియు దార్శనికురాలు అయిన మృణాల్ గోర్ మహారాష్ట్రలోని సోషలిస్ట్ స్తంభాలలో చివరి వ్యక్తి.

మృణాల్తాయ్ అని గౌరవంగా పిలువబడే మృణాల్ గోర్ మహిళలు ప్రజాసేవలో పాల్గొనడం దాదాపు ఊహించలేని కాలంలో రాజకీయాల్లోకి వచ్చిన ప్రత్యేక మహిళల సమూహంలో మృణాల్ గోర్ ఒకరు.

మృణాల్ గోర్ ప్రజా లక్ష్యాల కోసం పోరాడిన అత్యుత్తమ నాయకులలో ఒకరు. మృణాల్ గోర్ ఆవేశపూరిత సోషలిస్ట్ నాయకురాలు మరియు మహిళా సమస్యల పోరాట యోధురాలు.

మృణాల్ గోర్ ఒక వైద్య విద్యార్థిని మరియు మహాత్మా గాంధీ ప్రారంభించిన క్విట్ ఇండియా ఉద్యమ ప్రభావం తో పేదలు మరియు హక్కులను కోల్పోయిన వారిని సంఘటితం చేయడానికి, జీవితాంతం సామాజిక కార్యకలాపాల కోసం తన వైద్య వృతిని త్యాగం చేయడం జరిగినది.

అర్ధ శతాబ్దానికి పైగా, మృణాల్ గోర్ మహిళల హక్కులు, పౌర హక్కులు, మత సామరస్యం మరియు ట్రేడ్ యూనియన్ కార్యకలాపాలపై దృష్టి సారించి వీధుల్లో మరియు అధికార కారిడార్లలో నిరసనలకు నాయకత్వం వహించినది. ,

ప్రారంభ జీవితం

మృణాల్ గోర్ మరాఠీ CKP కుటుంబంలో మృణాల్ మోహిలేగా జన్మించారు మృణాల్ గోర్ పాఠశాల విద్య ముగిసిసే నాటికి  సోషలిస్ట్ పార్టీ యొక్క సాంస్కృతిక మరియు సామాజిక విభాగం అయిన రాష్ట్ర సేవా దళ్‌ లో సబ్యురాలు అయ్యారు.. సానే గురూజీ తో ప్రేరణ పొందిన మృణాల్  మోహిలే రాష్ట్ర సేవా దళ్‌ లో ప్రముఖుడు అయిన కేశవ్ గోర్ ను  వివాహం చేసుకున్నారు మరియు వారికి ఒక కుమార్తెను కలిగినది.  దురదృష్టవశాత్తు, కేశవ్ మరణించినప్పుడు మృణాల్ గోర్  30 సంవత్సరాల వయస్సులో భర్తను కోల్పోయినది. అప్పుడు మృణాల్ గోర్   కుమార్తె వయస్సు కేవలం 5 సంవత్సరాలు.

సామాజిక కార్యకలాపాలకు  ప్రసిద్ధి చెందిన మృణాల్ గోర్, మహిళా సాధికారత మరియు పేదలు మరియు అణగారిన వర్గాలకు న్యాయం చేయడం వంటి అంశాలపై ఆసక్తి చూపారు. ధరల పెరుగుదల, నీటి హక్కులు మరియు మహిళా సాధికారత వంటి అంశాలపై ఆసక్తి చూపిన ప్రముఖ సోషలిస్ట్ నాయకురాలు మృణాల్ గోర్  

రాజకీయ జీవితం:

మృణాల్ గోర్ వైద్య కోర్సును మానేసిన తర్వాత, మృణాల్ గోర్ 1947లో రాష్ట్రీయ సేవా దళ్‌లో చేరినప్పుడు రాజకీయాల్లో తన కెరీర్‌ను ప్రారంభించారు. మృణాల్ గోర్ మొదట్లో కాంగ్రెస్‌లో చేరారు కానీ ఒక సంవత్సరం తర్వాత పార్టీని వీడి సోషలిస్ట్ పార్టీలో భాగమయ్యారు

1950లో, మృణాల్ గోర్, గోరేగావ్ మహిళా మండల్ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి, బొంబాయి శివారు ప్రాంతంలోని మహిళల అభ్యున్నతి కోసం కృషి చేశారు; మరుసటి సంవత్సరం, గోరేగావ్ మహిళా మండల్ ఒక కుటుంబ నియంత్రణ కేంద్రాన్ని స్థాపించింది.

1961లో, మృణాల్ గోర్ పౌర ఎన్నికలలో పోటీ చేసి బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికైనప్పుడు, నగరంలోని పేదలు మరియు దిగువ-మధ్యతరగతి నివాసితులకు నీటి సరఫరా మరియు తగినంత నీటి కోటా కోసం సుదీర్ఘమైన, కఠినమైన పోరాటాన్ని ప్రారంభించింది. . కఠినమైన పోరాటం చేసి, చివరికి మృణాల్ గోర్ గోరేగావ్   ప్రాంతానికి క్రమం తప్పకుండా మరియు తగినంత తాగునీటి సరఫరాను తీసుకువచ్చింది. దీని కోసం మృణాల్ గోర్ "పానివాలి బాయి" అనే మారుపేరును సంపాదించింది.

1972లో, మృణాల్ గోర్ గోర్ సోషలిస్ట్ పార్టీ టికెట్‌పై మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచారు. ఎమ్మెల్యేగా, మృణాల్ గోర్ సన్నకారు రైతులు, దళితులు, గిరిజన ప్రజలు మరియు మహిళలపై జరిగిన దారుణాలు వంటి అంశాలను చేపట్టింది మరియు నిజమైన ఫైర్‌బ్రాండ్‌గా పరిగణించబడింది

.1972లో ధరల పెరుగుదల వ్యతిరేక కమిటీని ఏర్పాటు చేయడంలో మృణాల్ గోర్ కీలక పాత్ర పోషించారు, అత్యధిక సంఖ్యలో మహిళలను సమీకరించి ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నిరసనగా, మృణాల్ గోర్ దక్షిణ ముంబైలోని చర్చిగేట్ నుండి ఆజాద్ మైదాన్ వరకు రోలింగ్ పిన్నులను పట్టుకుని వందలాది మంది మహిళలతో కలిసి మృణాల్ గోర్ బొంబాయిలోని ఆజాద్ మైదాన్‌కు కవాతు చేసింది.

విద్యుత్ రంగంలోకి అమెరికా దిగ్గజం ఎన్రాన్ ప్రవేశానికి వ్యతిరేకంగా మృణాల్ గోర్ నిరసనలకు నాయకత్వం వహించింది మరియు నర్మదా ఆనకట్ట కారణంగా నిర్వాసితులైన ప్రజలకు మద్దతు ఇచ్చింది.

1975లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ విధించిన క్రూరమైన అత్యవసర పరిస్థితిని తీవ్రంగా వ్యతిరేకించిన మృణాల్ గోర్ 1977లో పార్లమెంటుకు ఎన్నికయ్యారు.

1983లో, గృహ హింస బాధితులైన మహిళలకు మద్దతు ఇచ్చే కేంద్రమైన స్వధార్‌ను మరియు మహిళలపై అత్యాచారాల కమిటీని మృణాల్ గోర్ స్థాపించారు. మృణాల్ గోర్ నాయకత్వంలో శ్రమజీవి మహిళా సంఘ్ కూడా స్థాపించబడింది, ఇది జనరల్ యూనియన్ కార్యకలాపాల్లో పాల్గొనని మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది.

1985లో, మృణాల్ గోర్ మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికైనప్పుడు, మహిళలు మరియు సమాజంలోని ఇతర అణగారిన వర్గాలకు సంబంధించిన సమస్యలను చేపట్టడం జరిగింది. మహారాష్ట్ర శాసనసభలో స్త్రీ భ్రూణ హత్యలకు దారితీసే లింగ నిర్ధారణ పరీక్షలను నిరోధించడానికి ఒక బిల్లును ప్రవేశపెట్టడం. 1986లో ఒక తీర్మానం ద్వారా, ప్రభుత్వం చివరకు ఈ పరీక్షలను నిషేధించింది.

మృణాల్ గోర్ జీవనశైలి నిరాడంబరంగా ఉండేది మృణాల్ గోర్  ట్రేడ్‌మార్క్ తెల్ల చీర మరియు భుజం బ్యాగ్. మృణాల్ గోర్ - దళితుల తరపున, నర్మదా ఆనకట్టల వల్ల నిర్వాసితులైన ప్రజల తరపున మరియు స్త్రీ భ్రూణ హత్యలకు దారితీసే లింగ నిర్ధారణ పరీక్షలను నిరోధించడ౦, ఆడ శిశువులకు మద్దతు ఇవ్వడం వంటి సమస్యలపై పోరాట యోధురాలుగా కొనసాగింది.

ఉత్తర ముంబై శివారు ప్రాంతమైన గోరేగావ్‌కు తాగునీటి సరఫరాను తీసుకురావడానికి మృణాల్ గోర్   చేసిన కృషికి గాను ఆమెను పానివాలి బాయి (వాటర్ లేడీ) అనే మారుపేరు పొందినది.. మృణాల్ గోర్   తన సమకాలీనులైన సోషలిస్ట్ మహిళలు అహల్య రంగ్నేకర్ మరియు ప్రమీలా దండావతేలతో కలిసి అనేక నిరసనలకు నాయకత్వం వహించింది.

మృణాల్ గోర్   మహారాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకురాలు మరియు  ఎమర్జెన్సి సమయంలో మృణాల్ గోర్  ను డిసెంబర్ 21, 1975న అరెస్టు చేసి, MISA కింద బాంబే సెంట్రల్ జైలులో నిర్బంధించారు. తరువాత అకోలా జైలుకు తరలించారు.

1977లో ముంబై నార్త్ (లోక్‌సభ నియోజకవర్గం) నుండి 6వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1977 ఎన్నికలలో ఇందిరా గాంధీ ఓడిపోవటం జరిగింది.  1977 ఎన్నికలలో లో మృణాల్ గోర్   ఎంపీగా ఎన్నికైనప్పుడు, పానివాలి బాయి దిల్లీ మే, దిల్లీవాలి బాయి పానీ మే, అనే నినాదం ప్రచారం పొందినది. 1977లో అప్పటి ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మృణాల్ గోర్   కు ఇచ్చే ప్రతిపాదనను మృణాల్ గోర్   తిరస్కరించారు.

మృణాల్ గోర్ మరియు ఆమె భర్త, కేశవ్ గోర్ కూడా సోషలిస్ట్, ప్రజలకు మెరుగైన పౌర మౌలిక సదుపాయాలను నిర్మించడానికి కృషి చేశారు. ఈ జంట గోవా విముక్తి ఉద్యమం మరియు సంయుక్త మహారాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నారు మరియు నిరసనలు మరియు సత్యాగ్రహాలకు నాయకత్వం వహించినందుకు జైలు శిక్ష అనుభవించారు.

మృణాల్ గోర్ సమాజ-కేంద్రీకృత కార్యకలాపాలు మరియు సామాజిక అవగాహన ప్రచారాలు మరియు చర్యలకు మద్దతు ఇచ్చే కేశవ్ గోర్ స్మారక్ ట్రస్ట్‌ను స్థాపించారు

మృణాల్ గోర్ జూలై 17, 2012న దాదాపు 84 సంవత్సరాల వయసులో మరణించారు. మృణాల్ గోర్  మరణం తో ముంబై తన పానివాలి బాయిని కోల్పోయింది.

మృణాల్ గోర్ మరణానికి భారత ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మరియు అనేక మంది ఇతర భారతీయ ప్రముఖులు సంతాపం తెలిపారు

మహారాష్ట్ర గవర్నర్ కె శంకరనారాయణన్ మృణాల్ గోర్ మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఒక సంతాప సందేశంలో శంకరనారాయణన్ ఇలా అన్నారు: "మృణాల్ గోర్ పేదలు మరియు సమాజంలోని అణగారిన వర్గాల హక్కుల కోసం తన మరణం వరకు పోరాడిన గొప్ప మహిళా సామాజిక కార్యకర్తలలో ఒకరు.దివంగత అహల్య రంగ్నేకర్ మరియు ఇతరులతో కలిసి, మృణాల్ గోర్ దాదాపు నాలుగు దశాబ్దాలుగా వివిధ ఆందోళనలలో ముందంజలో ఉండి, మహిళలకు మరియు పట్టణ పేదలకు న్యాయం చేకూర్చింది. మృణాల్ గోర్ తన జీవితమంతా, గాంధీయిజం విలువలను పూర్తిగా ఆచరించారు. మృణాల్ గోర్ మరణంతో, మహారాష్ట్ర ఒక గొప్ప సామాజిక కార్యకర్తను మరియు మహిళా హక్కుల పోరాట యోధుడిని కోల్పోయింది" అని అన్నారు

 మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మరియు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కూడా మృణాల్ గోర్ మరణానికి సంతాపం తెలిపారు.

" మృణాల్ గోర్ ఒక అనుభవజ్ఞుడైన సోషలిస్ట్ నాయకురాలుమృణాల్  దేశ నిర్మాణానికి చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది" అని శ్రీ చవాన్ అన్నారు.

సమాజంలోని అణగారిన వర్గాలకు సహాయం అందించడానికి మృణాల్ గోర్ చేసిన కృషి ఆదర్శప్రాయమైనదని పవార్ అన్నారు.

గోరేగావ్ తూర్పు వైపును దాని పశ్చిమ అర్ధభాగానికి అనుసంధానించే ఫ్లైఓవర్‌కు మృణాల్ గోర్  పేరు పెట్టడం జరిగింది

 అరవైలు, డెబ్బైలు మరియు ఎనభైలలో పూర్తి మహిళల నిరసనలు నిర్వహించడం ద్వారా అలలు సృష్టించిన మృణాల్ గోర్ సదా చిరస్మరణియురాలు 

No comments:

Post a Comment