9 January 2025

కేంద్ర సాయుధ పోలీసు బలగాల నిర్వహణలో ముస్లింల ఉనికి Muslim Presence In Management of Central Armed Police Forces

 



న్యూఢిల్లీ -

ఇటివల ప్రచురింపబడిన కొత్త పుస్తకం భారతదేశంలో ముస్లింలు 1947-2024 – ఫేక్ నేరేటివ్స్ వర్సెస్ గ్రౌండ్ రియాలిటీస్ Muslims in India 1947-2024  Fake Narratives versus Ground Realities. డేటా ప్రకారం ఏడు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (CAPF) - సరిహద్దు భద్రతా దళం (BSF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), సశాస్త్ర సీమా బాల్ (SSB), జాతీయ సెక్యూరిటీ గార్డ్ (NSG) మరియు అస్సాం రైఫిల్స్ (AR) - కలిపి 10 లక్షల మంది సిబ్బంది ఉన్నారు అందులో కీలక నిర్వహణ స్థాయిలలో ముస్లింలు 'సింబాలిక్'/నామమాత్ర  సంఖ్యలో ఉన్నారు.

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF:

·       డిసెంబరు 1965లో స్థాపించబడిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF లోని  30 మంది డైరెక్టర్ జనరల్‌లలో ఎవరూ ముస్లిం కాదు.

·       20 మంది BSF టాప్ మేనేజ్‌మెంట్‌లలో ఒకరు మాత్రమే ముస్లిం

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), మార్చి 1969లో ప్రారంభమైనది.

జనవరి 2020 నాటికి, CISF అధికారులలో ఐదుగురు IGPలు మరియు 52 DIGలు ఉన్నారు కాని రెండింటిలో ముస్లిం అధికారులు  లేరు.

·       65 మంది సీనియర్ కమాండెంట్లలో ఇద్దరు ముస్లింలు మాత్రమే ఉన్నారు - .

·       59 మంది కమాండెంట్లలో ఒక ముస్లిం ఉన్నారు.

·       366 డిప్యూటీ కమాండెంట్లలో 10 మంది ముస్లింలు ఉన్నారు

·       116 మంది అసిస్టెంట్ కమాండెంట్లలో ముగ్గురు ముస్లింలు ఉన్నారు

·       ఐజీపీ నేతృత్వంలో 80 మంది అధికారులు పనిచేస్తున్న CISF అగ్నిమాపక శాఖలో ఎవరూ ముస్లిం కాదు.

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)

·       CAPFలో అతిపెద్దదైన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)లో 247 బెటాలియన్లలో 3,13,678 మంది సిబ్బంది ఉన్నారు.

·       CRPF యొక్క 37 మంది DGలలో కేవలం ఒక ముస్లిం మాత్రమే ఉన్నారు.

·       1969-1973లో. CRPF టాప్ మేనేజ్‌మెంట్ బృందంలోని 33 మంది అధికారులలో ముగ్గురు ముస్లింలు

·       CRPF అంతర్గత భద్రతా అకాడమీలో, DIG మరియు అసిస్టెంట్ కమాండెంట్ ర్యాంక్‌ల ఫ్యాకల్టీ సభ్యులలో  ముస్లింలు లేరు.

·       CRPF అకాడమీలో 2005 నుండి 16 మంది డైరెక్టర్లలో ఒక  ముస్లింకూడా లేరు.

·       CRPF 14 మంది జాయింట్ డైరెక్టర్లలో ఒక  ముస్లిం కూడా  లేరు.

ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP)

·       అక్టోబరు 1962లో స్థాపించిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), కలిగి ఉన్న 37 మంది డైరెక్టర్ జనరల్‌లలో ఒకరు ముస్లిం

·       ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP)23 మంది టాప్ మేనేజ్‌మెంట్ బృందంలో ఒక మహిళతో సహా ఇద్దరు ముస్లింలు మాత్రమే ఉన్నారు

సశాస్త్ర సీమా బల్ (SSB)

·    1963 నుండి సశాస్త్ర సీమా బల్ (SSB) 46 మంది డైరెక్టర్ జనరల్‌లలో ఎవరూ ముస్లిం లేరు.

·       సశాస్త్ర సీమా బల్ (SSB) ప్రధాన కార్యాలయంలోని 26 మంది సీనియర్ అధికారులలో ఒకరు ముస్లిం - నయ్యర్ హస్నైన్ ఖాన్, IGP, సెప్టెంబర్ 2024లో ఐదేళ్లపాటు నియమితులయ్యారు.

·       ఫ్రాంటియర్ హెడ్‌క్వార్టర్స్‌లోని ఆరుగురు సభ్యుల బృందంలో లేదా సెక్టార్ హెడ్‌క్వార్టర్స్‌లోని 15 మంది సభ్యులలో ముస్లిం అధికారి ఎవరూ లేరు.

·       సశాస్త్ర సీమా బల్ (SSB) శిక్షణ ప్రధాన కార్యాలయంలోని 14 మంది అధికారులలో ముస్లిం అధికారి ఎవరూ లేరు

·       సశాస్త్ర సీమా బల్ (SSB)  ఆసుపత్రుల్లోని ఐదుగురు అధికారులు మరియు వివిధ యూనిట్లలోని 71 మంది సభ్యులలో  ముస్లిం అధికారి ఎవరూ లేరు.

నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG)

·       నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG), 1984లో ఏర్పడింది,

·       నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) 27 మంది డైరెక్టర్ జనరల్స్ లో ఎవరూ ముస్లిం కాదు.

·       నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) 12 మంది IGలు మరియు DIGలలో ప్రస్తుతం ఎవరూ ముస్లిం కాదు.

అస్సాం రైఫిల్స్ (AR)

·       సెప్టెంబరు 1947 నుండి అస్సాం రైఫిల్స్‌ 33 మంది డైరెక్టర్ జనరల్‌లలో ముస్లింలు ఎవరు లేరు.

·       అస్సాం రైఫిల్స్‌ బ్రిగేడియర్ ర్యాంక్ నంబర్ 16 వరకు ఉన్న ప్రస్తుత సీనియర్ అధికారులు లో  కూడా ముస్లింలు లేరు.

ఇతర పోలీసు సంస్థల్లో కూడా ముస్లింలు తక్కువ ప్రాతినిధ్య స్థాయిలో ఉన్నారు.

·       హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క ప్రత్యక్ష నియంత్రణలో ఉన్న బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (BPR&D). 115 మంది BPR&D అధికారులలో, జూన్ 2024 నాటికి ఒకరు మాత్రమె ముస్లిం షరీక్ వలీ ఖాన్, రీసెర్చ్ అండ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ R&CA) విభాగంలో ఉన్నారు.

·       నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) 18 మంది సభ్యుల నిర్వహణ బృందంలో ముస్లిం అధికారులు లేరు.

·       నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ 40 మంది సీనియర్ అధికారులలో ముస్లింలు లేరు.

·       సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (SVPNPA) కల  31 మంది చీఫ్‌లలో  ఒకరు మాత్రమే  ముస్లిం - AA అలీ, మధ్యప్రదేశ్ కేడర్ IPS అధికారి.

·       SVPNPA యొక్క ప్రస్తుత సీనియర్ ఫ్యాకల్టీలో 24 మంది సభ్యులు ఉన్నారు, అందులో ముస్లింలు ఎవరూ లేరు.

·       1984 నుండి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ క్రింద పనిచేస్తున్న నార్త్ ఈస్టర్న్ పోలీస్ అకాడమీ (NEPA)కి 13 మంది కమాండెంట్‌లు నాయకత్వం వహిస్తున్నారు, వీరిలో ఒకరు ముస్లిం - దీని వ్యవస్థాపకుడు-చీఫ్ AA అలీ జూలై 1978 నుండి నవంబర్ 1984 వరకు దీనికి నాయకత్వం వహించారు.

·       హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), 12 మంది చీఫ్ లలో ఒకరు మాత్రమే ముస్లిం- ఏడవ చీఫ్, IPS అధికారి అయిన మహబూబ్ ఆలమ్‌.

·       నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), ప్రధాన కార్యాలయంలో దాని 18 మంది అధికారులలో ఒక ముస్లిం - మొహసేన్ షాహిదీ,

 

 

మూలం:క్లారియన్ ఇండియా, జనవరి 8, 2025 తేదీ

No comments:

Post a Comment