24 January 2025

నేతాజీ సుభాస్ కు గ్రేట్ ఎస్కేప్ లో సహాయం చేసిన మహిళలు Women who helped Netaji Subhas in the Great Escape

 

 

సుభాస్ చంద్రబోస్ గొప్ప ఎస్కేప్’, అంటే 1941లో కోల్‌కతాలో (అప్పటి కలకత్తా) బ్రిటిష్ ప్రభుత్వ గృహ నిర్బంధం నుండి బెర్లిన్‌కు తప్పించుకోవడం. బోస్ పఠాన్ వేషంలో తప్పించుకుని ఢిల్లీ, పెషావర్ మరియు కాబూల్ మీదుగా బెర్లిన్ చేరుకున్నారు..

చరిత్రకారులు ఈ చారిత్రక సంఘటనలలో సహాయపడిన మహిళల పాత్రను విస్మరించారు

బెర్లిన్‌ కు ప్రయాణంలో నేతాజీ కు మియాన్ అక్బర్ షా, సిసిర్ బోస్, భగత్ రామ్ తల్వార్ అలియాస్ రహమత్ ఖాన్, ఉత్తమ్ చంద్, హాజీ అమీన్ మొదలైనవారు సహాయం చేసినారు. కాని చరిత్రకారులు నేతాజీ చేసిన గొప్ప ఎస్కేప్ లో బివాబతి దేవి, రామో దేవి, లారిస్సా ఖరోని మరియు శ్రీమతి హాజీ అబ్దుల్ శోభన్ చేసిన కృషిని గమనించడంలో విఫలమయ్యారు.

నేతాజీ సుభాస్ చంద్రబోస్ తన అన్నయ్య శరత్ చంద్ భార్య బివాబతి దేవిని ఎంతో గౌరవించారు. పెషావర్ మరియు ఆఫ్ఘనిస్తాన్ గుండా సుభాస్ ప్రయాణంలో నేతాజీ పాటు వచ్చిన భగత్ రామ్ తల్వార్ ఇలా వ్రాశారు, " బోస్ తన వదిన బివాబతి దేవి ను తన రెండవ తల్లిగా భావించారు. కష్ట సమయాల్లో, సలహా మరియు మార్గదర్శకత్వం కోసం ఎల్లప్పుడూ వదిన బివాబతిదేవి సూచనలు పాటించేవారు. శరత్ చంద్రబోస్ మరియు వారి కుమారుడు సిసిర్ బోస్ కూడా ఆమెను విశ్వాసంలోకి తీసుకున్నారు. వారి సహాయంతో, బోస్ పోలీసుల నుండి  తప్పించుకోవడంలో విజయం సాధించారు."

సుభాస్ పారిపోయిన తర్వాత కూడా బివాబటి దేవి,  నేతాజీ భోజనాలన్నీ నేతాజీ గదికి చేరేలా మరియు ఖాళీ గిన్నెలు తొలగించబడేలా చూసుకున్నది తద్వారా 1941 జనవరి 27 వరకు నేతాజీ లేడని పోలీసులకు తెలియకుండా బివాబటి దేవి చూసుకున్నారు  మరియు అప్పటికి నేతాజీ కాబూల్ చేరుకున్నారు.

బివాబటి దేవి సామర్థ్యం గురించి బోస్ నాతో మాట్లాడారు  మరియు బివాబటి బోస్ కు ఎంతగానో సహాయపడింది" అని తల్వార్ పేర్కొన్నారు.

కాబూల్‌లో ఒక దుకాణం కలిగి ఉన్న భారతీయుడైన ఉత్తమ్ చంద్ భార్య రామో దేవి, నేతాజీకి తన తప్పించుకునే ప్రయత్నంలో సహాయం చేసిన మరొక మహిళ. ఉత్తమ్ ఒక విప్లవకారుడు, 1930లలో జాతీయవాద కార్యకలాపాల కోసం భారతదేశంలో జైలు శిక్ష పొందాడు.. సుభాష్ కొన్ని రోజులు కాబూల్‌లోని ఉత్తమ్ చంద్ ఇంట్లోనే ఉన్నారు.

కాబూల్‌లో ఉన్న సమయంలో కష్ట రోజుల్లో రక్షణ కల్పించడంలో రామో దేవి గొప్ప పాత్ర పోషించింది. పరిస్థితిని నిర్వహించడంలో రామో దేవి అద్భుతమైన చాకచక్యం మరియు సంయమనాన్ని ప్రదర్శించింది. మేము అక్కడ గడిపిన సమయంలో, పొరుగువారు లేదా సందర్శకులు ఎప్పుడూ మమ్మల్ని అనుమానించలేదు అనే వాస్తవం రామో దేవి కు దక్కుతుంది. నేతాజీ తన ఇంట్లో ఉండే సమయాన్ని వీలైనంత సౌకర్యవంతంగా చేయడానికి రామో దేవి తోడ్పడారు. రామో దేవి ఎల్లప్పుడూ నేతాజీకి మంచి ఆహారం అందించింది మరియు చాలా జాగ్రత్తగా చూసుకుంది, ముఖ్యంగా నేతాజీ అనారోగ్యంతో ఉన్నప్పుడు. రామో దేవి నమ్మదగినదిగా నిరూపించబడినది.  రామో దేవి తన భర్తకు చాలా విలువైన మద్దతు ఇచ్చిందని భావిస్తున్నాను." అని భగత్ రామ్ తల్వార్ అలియాస్ రహమత్ ఖాన్ అన్నారు.

లారిస్సా ఖరోని కాబూల్‌లోని ఇటలీ రాయబారి శ్రీ ఆల్బర్టో పియట్రో ఖరోనిని వివాహం చేసుకున్నారు. USSR మరియు జర్మన్ రాయబార కార్యాలయాల నుండి సహాయం పొందడానికి నేతాజీ చేసిన విఫల ప్రయత్నాల తర్వాత, ఇటాలియన్ రాయబారి నేతాజీ కాబూల్ నుండి బయటపడి బెర్లిన్ చేరుకోవడానికి అన్ని సహాయం అందించాడు. ఇటాలియన్ రాయబారి నేతాజీకి ఇటాలియన్ ఆర్లాండో మజోట్టా యొక్క నకిలీ గుర్తింపుతో కొత్త పాస్‌పోర్ట్ ఇచ్చాడు.

కాబూల్‌లోని ప్రభుత్వం దాని గడ్డపై బ్రిటిష్ వ్యతిరేక కార్యకలాపాలకు మద్దతు ఇవ్వదు. ఇటాలియన్ రాయబార కార్యాలయం మరియు సుభాస్ మధ్య లారిస్సా దూతగా వ్యవహరించింది. లారిస్సా రాయబార కార్యాలయం నుండి సందేశాలను ఉత్తమ్ చంద్ దుకాణానికి తీసుకెళ్లేది. లారిస్సా బోస్ కు  కొత్త ఇటాలియన్ పాస్‌పోర్ట్‌ను అందించినది  చేసింది మరియు బోస్ ప్రయాణానికి అవసరమైన బట్టలు కూడా ఏర్పాటు చేసింది.

కాబూల్‌లో స్థిరపడిన మరొక భారతీయ విప్లవకారుడు హాజీ అబ్దుల్ శోభన్ గదర్ పార్టీ సభ్యుడిగా జైలు జీవితం గడిపాడు. అబ్దుల్ శోభన్ ఒక జర్మన్ మహిళను వివాహం చేసుకున్నాడు. కాబూల్‌లో నేతాజీ బసను, అబ్దుల్ శోభన్ మరియు ఉత్తమ్ చంద్ చూసుకున్నారు.

శోభన్ భార్య నేతాజీ కు జర్మనీతో లింక్. అంతా అనుకున్నట్లు జరిగితే జర్మన్ దళాలు ఆరు నెలల్లో ఆఫ్ఘనిస్తాన్‌కు చేరుకోగలవని మరియు వారి సహాయంతో గిరిజనులు భారతదేశంలోని బ్రిటిష్ వారిపై దాడి చేయవచ్చని శోభన్ భార్య సూచించింది. నేతాజీ బెర్లిన్‌లో నివసిస్తున్నప్పుడు, శోభన్ భార్య తన సోదరి ద్వారా నేతాజీకి బట్టలు మరియు సందేశాలు పంపుతూనే ఉంది.

నేతాజీ సుభాస్ చంద్రబోస్ కు గ్రేట్ ఎస్కేప్ లో సహాయపడిన మహిళలు ఎంతో వీరోచితంగా పనిచేశారు.  ఈ మహిళలు అక్కడ లేకుంటే నేతాజీ తప్పించుకోవడం విజయవంతమై ఉండేదని ఊహించలేము.

No comments:

Post a Comment