27 January 2025

రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల అధిపతులలో కేవలం 22 మంది ముస్లింలు మాత్రమే Only 22 Muslims Among 474 Heads of State Public Service Commissions

 

 

 

 

 





474 రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల అధిపతులలో కేవలం 22 మంది ముస్లింలు మాత్రమే

Only 22 Muslims Among 474 Heads of State Public Service Commissions

 

 

న్యూఢిల్లీ

రాజ్యాంగంలోని ఆర్టికల్ 315 నుండి 323 వరకు స్థాపించబడిన రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ల (SPSCలు)కు నాయకత్వం వహించే అవకాశం కొద్దిమంది ముస్లింలకు మాత్రమే లభించింది.

2024 మధ్య నాటికి మొత్తం 474 స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్/SPSCలకు 22 మంది ముస్లింలు నాయకత్వం వహించగా, వివిధ SPSC 967 మంది మొత్తం సభ్యులలో 91 మంది ముస్లిం మైనారిటీ వర్గానికి చెందినవారు అని "Muslims in India 1947-2024 - Fake Narratives vs Ground Realities" అనే కొత్త పుస్తకంలోని డేటా ప్రకారం తెలిసింది.

   ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌

·       1956 నవంబర్‌లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఏర్పాటు చేయడం జరిగింది.  

·       ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ మొత్తం 21 మంది చైర్‌పర్సన్‌లను చూసింది. వారిలో ఎవరు ముస్లిము కాదు.

·       ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ మొత్తం 50 మంది సభ్యులను చూసింది,

·       ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ ఇంతవరకు ఇద్దరు ముస్లింలు - 2015లో డాక్టర్ మొహమ్మద్ అలీ రఫత్ మరియు 2019లో ఎస్ సలాం బాబు.

అరుణాచల్ ప్రదేశ్ PSC

·       అరుణాచల్ ప్రదేశ్ మొత్తం PSC 10 మంది చైర్‌పర్సన్‌లను చూసింది, వారిలో ఎవరు ముస్లిము కారు.

·       అరుణాచల్ ప్రదేశ్ PSC ఇంతవరకు గల మొత్తం 27 మంది కార్యదర్శులలో ఎవరు  ముస్లిము కారు.

·       అరుణాచల్ ప్రదేశ్ PSC మొత్తం 26 మంది సభ్యులు కలరు వారిలో ఎవరు ముస్లిము కారు. 

అస్సాం PSC

·       1937లో  ఏర్పడిన అస్సాం PSC మొత్తం 32 మంది చైర్‌పర్సన్‌లలో ఒకరు ముస్లిం - ఆసిఫ్ అలీ, రిటైర్డ్ IAS అధికారి (మార్చి 1984 నుండి జూలై 1989 వరకు).

·       అస్సాం PSC మొత్తం 89 మంది సభ్యులలో ఒక మహిళ -2016లో  నఫీసా అహ్మద్ తో కలిపి మొత్తం 18 మంది ముస్లింలు ఉన్నారు.

·       అస్సాం PSC మొత్తం 38 మంది కార్యదర్శులలో  ఒకరు  ముస్లిం - MU అహ్మద్ చౌదరి - మార్చి 1941లో మూడు సంవత్సరాలు ఉన్నారు.

·       అస్సాం PSC 10 మంది పరిక్షల ప్రిన్సిపల్ కంట్రోలర్‌ Principal Controller of Examinations గా ఒక్క ముస్లిం కూడా లేరు.

బీహార్‌ PSC

·       బీహార్‌ PSCను ఏప్రిల్ 1949లో PSC  స్థాపించినారు.

·       బీహార్‌ PSCకు మొత్తం  29 మంది చైర్‌పర్సన్‌లు ఉన్నారు, వీరిలో ముగ్గురు ముస్లింలు - 1985-89లో AKM హసన్, 2003లో డాక్టర్ రజియా తబస్సుమ్ మరియు 2024లో ఇంతియాజ్ అహ్మద్ కరీమి

·       బీహార్‌ PSC సభ్యులలో ఇద్దరు ముస్లింలు - 2013-17లో షానవాజ్ ఖాన్ మరియు 2024లో ఇంతియాజ్ అహ్మద్ ఖాన్.

ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, మహారాష్ట్ర, హర్యానా మరియు హిమాచల్ ప్రదేశ్‌లలో, PSCలకు చైర్‌పర్సన్‌లుగా లేదా సభ్యులుగా ముస్లింలు లేరు.

·       ఛత్తీస్‌గఢ్‌లో PSC కు ఇప్పటివరకు 11 మంది చైర్‌పర్సన్‌లు మరియు 17 మంది సభ్యులు ఉండగా కాని వారిలో ఎవరు ముస్లిములు లేరు

·       గోవాలో PSC కు ఇప్పటివరకు 12 మంది చైర్‌పర్సన్‌లుగా మరియు తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు కాని వారిలో ఎవరు ముస్లిములు లేరు.

·       గుజరాత్‌లో PSC కు ఇప్పటివరకు 12 మంది చైర్‌పర్సన్‌లు మరియు 40 మంది సభ్యులు ఉన్నారు కాని వారిలో ఎవరు ముస్లిములు లేరు

·       హర్యానాలో PSC కు నలుగురు చైర్‌పర్సన్‌లు/చీఫ్‌లు మరియు 21 మంది సభ్యులు ఉన్నారు కాని వారిలో ఎవరు ముస్లిములు లేరు.

·       హిమాచల్ ప్రదేశ్‌ PSC కు 17 మంది చైర్‌పర్సన్‌లు/చీఫ్‌లు మరియు ఐదుగురు సభ్యులు ఉన్నారు కాని వారిలో ఎవరు ముస్లిములు లేరు

మహారాష్ట్ర స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్

·       మహారాష్ట్రలో PSC చైర్‌పర్సన్‌గా మొత్తం 10 మంది  లేదా సబ్యులు గా మొత్తం 25 మంది ఉన్నారు.కాని  వారిలో ఒక్క ముస్లిం కూడా లేరు.

·       మహారాష్ట్రలో ప్రస్తుతం, PSC ఛైర్‌పర్సన్‌తో సహా దాని ఆరుగురు సభ్యులలో ముస్లిములు ఎవరు  లేరు.

పంజాబ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్

·       1956లో ఏర్పడిన పంజాబ్ PSC మొత్తం 11 మంది చీఫ్‌లు మరియు 15 మంది సభ్యులు ఉన్నారు. కాని వారిలో ముస్లిములు ఎవరు లేరు.

సిక్కిం స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్

·       1978లో స్థాపించబడి 1982 నుండి పనిచేస్తున్న సిక్కిం స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (SPSC) మొత్తం  తొమ్మిది మంది చైర్‌పర్సన్‌లు  మరియు 20 మంది సభ్యులు కలరు. కాని  వీరిలో ఎవరూ ముస్లింలు కాదు.

త్రిపుర స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్

·       త్రిపుర స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్  19 మంది చైర్‌పర్సన్‌లు  మరియు 28 మంది సభ్యులు కలరు  కాని వారిలో ఎవరు ముస్లిం కాదు.

ఉత్తరాఖండ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్

·       ఉత్తరాఖండ్ లో మొత్తం తొమ్మిది మంది స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్‌పర్సన్‌లు  మరియు 29 మంది సభ్యులు కలరు. కాని వారిలో ఎవరు ముస్లిం కాదు.

మిజోరాం స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్

·       మిజోరాం స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఒక చైర్‌పర్సన్ మరియు ముగ్గురు సభ్యులు కలరు కాని వారిలో  ముస్లింలు ఎవరు లేరు.

నాగాలాండ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్

·       నాగాలాండ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొత్తం ఐదుగురు PSC చైర్‌పర్సన్‌లను మరియు తొమ్మిది మంది సభ్యులను చూసింది, వీరిలో ఎవరూ ముస్లిం కాదు.  

మణిపూర్ PSC

·       మణిపూర్ PSCలో మొత్తం 28 మంది చైర్‌పర్సన్‌లు ఉండగా వీరిలో ఎవరూ ముస్లిం కాదు

·       మణిపూర్ PSCలో మొత్తం 24 మంది సభ్యులలో వారిలో ఒకరు మాత్రమే ముస్లిం - MA సత్తార్ 2011లో మూడు సంవత్సరాలుగా ముస్లింగా ఉన్నారు 

మేఘాలయ PSC

·       మేఘాలయ PSC లోని 16 మంది చైర్‌పర్సన్‌లలో ఒకరు ముస్లిం.

·       మేఘాలయ PSC లోని 37 మంది సభ్యులలో ముగ్గురు ముస్లింలు, చివరి వ్యక్తి 1991లో ఉన్నారు

జార్ఖండ్ PSC

·       జార్ఖండ్ PSCకి నలుగురు చీఫ్‌/ చైర్‌పర్సన్‌లు కలరు కాని  వీరిలో ఎవరూ ముస్లిం కాదు

·       జార్ఖండ్ PSC లో ముగ్గురు సభ్యులు కలరు. వారిలో ఒకరు ముస్లిం - డాక్టర్ జమాల్ అహ్మద్.

·       జార్ఖండ్ PSC ఆరుగురు సీనియర్ అధికారులలో ఒకరు ముస్లిం - ఇష్తియాక్ అహ్మద్, జాయింట్ సెక్రటరీ.

మధ్యప్రదేశ్‌ PSC

·       మధ్యప్రదేశ్‌PSCలో మొత్తం 18 మంది చీఫ్‌/ చైర్‌పర్సన్‌లు కలరు కాని వారిలో  ఎవరు   ముస్లిం కాదు.

·       మధ్యప్రదేశ్‌PSCలో మొత్తం 66 మంది సభ్యులలో ఆరుగురు ముస్లింలు, చివరి వ్యక్తి 2003లో ఉన్నారు.

 

.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్

·       ఆగస్టు 2014లో స్థాపించబడిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, నలుగురు చైర్మన్‌లు కాని వారిలో  ఎవరు   ముస్లిం కాదు

·       తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొత్తం 22 మంది సభ్యులను చూసింది, అందులో ఇద్దరు ముస్లింలు - డాక్టర్ మొహమ్మద్ మతీన్ ఉద్దీన్ క్వాద్రీ, 2014 నుండి 2020 వరకు, మరియు డాక్టర్ అమీర్ ఉల్లా ఖాన్, ఆర్థికవేత్త - 2024 జనవరి నుండి ఉన్నారు.

కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్

·       కర్ణాటకలో  మొత్తం 13 మంది PSC/పిఎస్‌సి చీఫ్‌లు/చైర్మన్‌లు కలరు, కాని వారిలో ఎవరూ ముస్లిం కాదు,

·       కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొత్తం 67 మంది సభ్యులలో ఒకరు ముస్లిం – సయీద్ అహ్మద్ ఖాన్ 2016 నుండి 2019 వరకు.

·       2019 మరియు 2024 మధ్య, కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ 16 మంది సభ్యులను చూసింది, వారిలో ఒకరు ముస్లిం - ముస్తఫా హుస్సేన్ సయ్యద్ అజీజ్, సెప్టెంబర్ 2023 నుండి.

·       కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ఉన్న 29 మంది డిప్యూటీ సెక్రటరీలు, 98 మంది అసిస్టెంట్ సెక్రటరీలు మరియు 15 మంది డిఇఓDEOలలో ఇద్దరు మాత్రమే ముస్లింలు.

కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్

·       కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (KPSC) 1956లో ఏర్పడింది

·       కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 17 మంది చీఫ్‌లలో ఇద్దరు మాత్రమే ముస్లింలు - 2006 నుండి 2011 వరకు KV సలావుద్దీన్ మరియు 2016 నుండి 2022 వరకు MK షకీర్.

·       కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (KPSC) కు ఇంతవరకు గల మొత్తం 139 మంది సభ్యులలో 16 మంది ముస్లింలు.

·       ప్రస్తుతం కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (KPSC) లోని  19 మంది సభ్యులలో ముగ్గురు ముస్లింలు ఉన్నారు,

·       కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (KPSC) లోని మొత్తం దాని 20 మంది కార్యదర్శులలో ఎవరూ ముస్లింలు కాదు.

·       KPSC లో ముగ్గురు అదనపు కార్యదర్శులు, 12 మంది జాయింట్ సెక్రటరీలు, 22 మంది డిప్యూటీ సెక్రటరీలు మరియు 64 మంది అండర్-సెక్రటరీలు. వారిలో 12 మంది మాత్రమే ముస్లింలు.

తమిళనాడు PSC

·       1932 నుండి తమిళనాడు PSC చీఫ్‌లుగా ముగ్గురు ముస్లింలు ఉన్నారు, చివరివారు  2001 నుండి 2007 వరకు - యాస్మిన్ అహ్మద్, ఒక మహిళ,

·       తమిళనాడు PSC సభ్యులలో ఇంతవరకు ముస్లిం ఎవరూ లేరు.

ఒడిశా PSC

·       ఒడిశాలో మొత్తం 35 మంది PSC చీఫ్‌లలో ముస్లింలు ఎవరు లేరు,

·       ఒడిశా PSC మొత్తం 58 మంది సభ్యులలో ఒకరు ముస్లిం - మొహమ్మద్ ఫిదా రసూల్-1993 నుండి 1999 వరకు.

రాజస్థాన్‌ PSC

·       రాజస్థాన్‌ PSC లో మొత్తం 38 మంది చీఫ్‌/చైర్మన్ లలో ముగ్గురు ముస్లింలు చివరిగా -2012 నుండి 2014 వరకు,

·       రాజస్థాన్‌ PSC లో మొత్తం 66 మంది సభ్యులలో ముగ్గురు ముస్లింలు-చివరిది 2001 నుండి 2006 వరకు ఉన్నారు.

ఉత్తరప్రదేశ్‌ PSC

·       ఉత్తరప్రదేశ్‌ PSC కి ఇంతవరకు ముస్లింలు ఎవరూ చీఫ్‌/చైర్మన్ కాలేదు.

·       ఉత్తరప్రదేశ్‌ PSC లోని మోత్హం 30 మంది సభ్యులలో ఐదుగురు ముస్లింలు ఉన్నారు 

పశ్చిమ బెంగాల్‌ PSC

·       పశ్చిమ బెంగాల్‌ PSC కు మొత్తం 28 మంది చీఫ్‌/చైర్మన్ లు కలరు వారిలో ఇద్దరు ముస్లింలు

·       పశ్చిమ బెంగాల్‌ PSC కు మొత్తం 35 మంది సభ్యులలో ఏడుగురు ముస్లింలు ఉన్నారు.

జమ్మూ కాశ్మీర్‌ PSC

·       జమ్మూ కాశ్మీర్‌ PSC కు గల మొత్తం 21 మంది చీఫ్‌/చైర్మన్లలో ఎనిమిది మంది ముస్లింలు

·       జమ్మూ కాశ్మీర్‌ PSC కు గల మొత్తం 52 మందిసబ్యులలో లో 20 మంది ముస్లిం సభ్యులుగా  ఉన్నారు.

 


మూలం: క్లారియన్ ఇండియా, జనవరి 26, 2025

No comments:

Post a Comment