17 January 2025

హరి విష్ణు కామత్ (13 జూలై 1907 – 1982)

 



సుభాష్ చంద్రబోస్ కు సన్నిహితుడైన హెచ్.వి. కామత్, అత్యంత ప్రముఖ మరియు అనుభవజ్ఞులైన పార్లమెంటేరియన్లలో ఒకరు. హెచ్.వి. కామత్ భారత రాజ్యాంగ సభ సభ్యుడు, సామాజిక కార్యకర్త మరియు ఫ్రీలాన్స్ జర్నలిస్ట్.

హరి విష్ణు కామత్ మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురం (హోషంగాబాద్) నుండి లోక్‌సభకు మూడుసార్లు (1952 మరియు 1962లో, ప్రజా సోషలిస్ట్ పార్టీ సభ్యుడిగా 1977లో, జనతా పార్టీ సభ్యుడిగా) ఎన్నికయ్యారు.

హరి విష్ణు కామత్ 1907 జూలై 13న కర్ణాటకలోని మంగళూరులో జన్మించారు. హరి విష్ణు కామత్ తన ప్రారంభ విద్య కెనరా హై స్కూల్ నందు తరువాత మద్రాస్‌లోని ప్రెసిడెన్సీ కాలేజీలో విద్యనభ్యసించాడు. హరి విష్ణు కామత్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, యూనివర్సిటీ కాలేజ్ లండన్ మరియు స్కూల్ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్ నుండి డిగ్రీలను పొందారు.

H.V.కామత్ సామాజిక కార్యకర్త మరియు ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. 1930లో H.V.కామత్ ఇండియన్ సివిల్ సర్వీస్‌కు అర్హత సాధించి బ్రిటిష్ ప్రభుత్వం కింద అసిస్టెంట్ కమిషనర్ (1931-1932), అదనపు జిల్లా న్యాయమూర్తి (1934-35), అండర్ సెక్రటరీ (1936) మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (1937-38) గా పనిచేసాడు.

H.V.కామత్ 1938లో అప్పటి చైర్మన్ జవహర్‌లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో జాతీయ ప్రణాళిక కమిటీ కార్యదర్శి; 1939లో ఫార్వర్డ్ బ్లాక్ ఆర్గనైజింగ్ సెక్రటరీ; 1940-41 మరియు 1942-45లో జైలు శిక్ష అనుభవించారు

రెండవ ప్రపంచ యుద్ధంలో భారతదేశం పాల్గొనడాన్ని నిరసిస్తూ H.V కామత్‌ను అరెస్టు అయినాడు. ప్రభుదయాళ్ విద్యార్థితో కలిసి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నందుకు హరి విష్ణు కామత్ సియోని సెంట్రల్ జైలులో ఖైదు చేయబడ్డారు మరియు విడుదలైన తర్వాత బ్రిటిష్ వారి దురాగతాలకు వ్యతిరేకంగా తీవ్రంగా మాట్లాడారు.

H.V.కామత్ 1946-49లో రాజ్యాంగ సభ సభ్యుడు, H.V కామత్ కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై సెంట్రల్ ప్రావిన్స్‌లు మరియు బేరార్ నుండి రాజ్యాంగ సభకు ఎన్నికయ్యారు.

H.V.కామత్ 1950-52లో తాత్కాలిక పార్లమెంటు సభ్యుడు 1950 తర్వాత, H.V కామత్ కాంగ్రెస్‌తో విభేదించి ప్రజా సోషలిస్ట్ పార్టీలో చేరాడు.., ప్రజా సోషలిస్ట్ పార్టీ బ్యానర్ కింద భారతదేశపు మొదటి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేశాడు మరియు భారతదేశపు మొదటి లోక్‌సభలోకి ప్రవేశించాడు. H.V కామత్ మరో రెండు పర్యాయాలు (1955-57, 1962-67) పార్లమెంట్ కు తన సేవలందించాడు.

పార్లమెంటులో H.V కామత్ చేసిన ప్రతిపాదనలలో కొన్ని, మరిన్ని సవరణలను నిషేధించే రాజ్యాంగ సవరణ, 1966లో పాకిస్తాన్ ఆక్రమిత-కాశ్మీర్ ప్రజలకు పార్లమెంటులో రిజర్వేషన్లు మరియు ఉచిత విద్యుత్, నీరు మరియు ఫర్నిచర్ వంటి మంత్రులకు ప్రయోజనాలను తొలగించే బిల్లు ఉన్నాయి.

H.V కామత్ 1966-70లో పరిపాలనా సంస్కరణల కమిటీ సభ్యుడు; 1977-78లో పిటిషన్లపై కమిటీ ఛైర్మన్ Chairman, Committee on Petitionsగా వ్యవరించారు.

H.V.కామత్  లండన్‌లో జరిగిన ప్రపంచ ప్రభుత్వ సమావేశం World Government Conference (1952), ఇజ్రాయెల్‌లో జరిగిన సోషలిస్ట్ ఇంటర్నేషనల్ సమావేశం (1960) మరియు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సెషన్ (1977) వంటి అంతర్జాతీయ వేదికలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశాలను పొందినాడు.

1975 లో H.V.కామత్ అత్యవసర విధించిన సమయంలో అరెస్టు చేయబడ్డారు

హెచ్.వి. కామత్ రచనలు:

·       కమ్యూనిస్ట్ చైనా టిబెట్‌ను వలసరాజ్యం చేస్తుంది, భారతదేశాన్ని ఆక్రమించింది Communist China Colonizes Tibet ,Invades India.1959

·       పరిపాలన సూత్రాలు మరియు పద్ధతులు Principles and Techniques of Administration (1971)

·       జవహర్‌లాల్ నెహ్రూ చివరి రోజులు The Last Days of Jawaharl Nehru (1977) 

1982 అక్టోబర్ 9న నాగ్‌పూర్‌లో హెచ్.వి. కామత్ మరణించారు

 

 


No comments:

Post a Comment