1914లో, మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు, “ది టైమ్స్” ప్రఖ్యాత లండన్ వార్తాపత్రిక “ది ఛాయిస్ ఆఫ్ ది టర్క్స్” అనే శీర్షికతో ఒక కథనాన్ని ప్రచురించింది మరియు టర్కులను మిత్రరాజ్యాల వైపు ఉండాలని కోరింది.. దీనికి ప్రతిస్పందనగా, భారతదేశంలో టర్కీకి తీవ్ర మద్దతుదారుడైన ముహమ్మద్ అలీ జౌహర్ (10 డిసెంబర్ 1878 - 4 జనవరి 1931) అదే శీర్షికతో ఒక ప్రతివాద కథనాన్ని రాశారు. అందులో, ముహమ్మద్ అలీ జౌహర్ “ది టైమ్స్”ను తీవ్రంగా విమర్శించాడు మరియు“ది టైమ్స్” వాదనలను ఖండించాడు.
“ది టైమ్స్”లో వ్యాసం ప్రచురించబడటానికి ఆరు వారాల ముందు, ముహమ్మద్ అలీ జౌహర్ మధుమేహంతో మంచం పట్టాడు. తన ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పటికీ, అప్పుడప్పుడు కాఫీ తాగడం మినహా నిద్రా, ఆహరం,విశ్రాంతి లేకుండా వరుసగా నలభై గంటలు కూర్చుని తన ప్రతిస్పందనను ముహమ్మద్ అలీ జౌహర్ రాసినాడు. ఈ కఠినమైన కాలంలో, ముహమ్మద్ అలీ జౌహర్ వ్యక్తిగత విషాదాన్ని కూడా ఎదుర్కొన్నాడు. భారతదేశంలోని ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌కు తన ఏకైక సోదరి, భర్త ఖననం కోసం వెళుతూ, రైలులో తన వ్యాసం పై పని చేస్తూ, రైలులో దాని ముసాయిదాను ముహమ్మద్ అలీ జౌహర్ జాగ్రత్తగా సవరించాడు.
ముహమ్మద్ అలీ జౌహర్ రాసిన ప్రతిస్పందన వ్యాసం సెప్టెంబర్ 26, 1914న ఆంగ్ల వారపత్రిక “కామ్రేడ్”లో ప్రచురించబడినప్పుడు, దేశవ్యాప్తంగా గణనీయమైన సంచలనాన్ని సృష్టించింది.
ప్రతిస్పందనగా బ్రిటిష్ ప్రభుత్వం సెప్టెంబర్ 26, 1914 నాటి ‘కామ్రేడ్’ యొక్క అన్ని కాపీలను ప్రెస్ నుండి తొలగించినది.. కొన్ని రోజుల తర్వాత, ‘కామ్రేడ్’ మరియు ఉర్దూ దినపత్రిక ‘హమ్‌దర్డ్’ రెండింటి బెయిల్ బాండ్‌లను జప్తు చేశారు. ముహమ్మద్ అలీ జౌహర్ బ్రిటిష్ ప్రభుత్వ నిర్ణయాన్ని అప్పీల్ చేసుకుని కోర్టులో తనను తాను వాదించాడు కానీ ‘కామ్రేడ్’ బెయిల్‌ను జప్తు చేయాలనే బ్రిటిష్ ప్రభుత్వ ఆదేశాన్ని కోర్ట్ సమర్థించినది. . కొంతకాలం తర్వాత, ఢిల్లీ జిల్లా మేజిస్ట్రేట్, అలీ సోదరులు - ముహమ్మద్ అలీ జౌహర్ మరియు అతని అన్నయ్య షౌకత్ అలీలను గృహ నిర్బంధంలో ఉంచారు.
ముహమ్మద్ అలీ జౌహర్ నిర్బంధంలో ఉన్నప్పటికీ, “హమ్‌దార్డ్” కోసం వ్యాసాలు రాయడం కొనసాగించినాడు మరియు తుర్కియేకు మద్దతును కొనసాగించాడు దీనికి సంబంధించి బ్రిటిష్ ప్రభుత్వం నుండి వచ్చిన అనేక లేఖలు ఇప్పటికి నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియాలో భద్రపరచబడ్డాయి.
తుర్కియేకు మద్దతు ఇచ్చే ముహమ్మద్ అలీ జౌహర్ వ్యాసాలు భారతీయ ముస్లిం ప్రజలకు చేరకుండా నిరోధించాలని బ్రిటిష్ ప్రభుత్వం నిశ్చయించుకుంది. ఈ రచనలు బ్రిటిష్ ప్రయోజనాలకు హాని కలిగిస్తాయని బ్రిటిష్ ప్రభుత్వం భయపడింది. ముహమ్మద్ అలీ జౌహర్ ని నాలుగు సంవత్సరాలపాటు జైలుకు పంపారు, అక్కడ ముహమ్మద్ అలీ జౌహర్ రచనా స్వేచ్ఛ మరింత పరిమితం చేయబడింది.
ముహమ్మద్ అలీ జౌహర్ టర్కిష్ ముస్లింలకు మద్దతు ఇచ్చినందుకు బ్రిటిష్ వారు జైలులో పెట్టిన బ్రిటిష్ ఇండియా నుండి వచ్చిన మొదటి జర్నలిస్ట్ అయ్యాడు. అయినప్పటికీ, ముహమ్మద్ అలీ జౌహర్ తుర్కియేకు మద్దతుగా మాట్లాడటం మరియు రాయడం కొనసాగించాడు.
ముహమ్మద్ అలీ జౌహర్ ప్రఖ్యాత భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, జర్నలిస్ట్ మరియు ఇస్లామిక్ ప్రపంచంలో ప్రముఖ వ్యక్తి. ముహమ్మద్ అలీ జౌహర్ ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి చట్టం మరియు చరిత్రలో పట్టభద్రుడయ్యాడు. ప్రతిభావంతుడైన రచయిత మరియు అసాధారణ వక్త అయిన ముహమ్మద్ అలీ జౌహర్ భారతీయ మరియు ప్రపంచ చరిత్ర రెండింటిలోనూ చెరగని ముద్ర వేశాడు. ప్రముఖ ఆంగ్ల రచయిత హెచ్.జి. వెల్స్ ముహమ్మద్ అలీ జౌహర్ ను ప్రశంసిస్తూ, "ముహమ్మద్ అలీకి మెకాలే కలం, బర్కే నాలుక మరియు నెపోలియన్ హృదయం ఉన్నాయి" అని అన్నారు.
ముహమ్మద్ అలీ జౌహర్ టర్కీ పట్ల ప్రేమ గలవాడు మరియు మొదటి నుంచీ టర్కిష్ ప్రజల అమిత అభిమాని మరియు తన జీవితాంతం టర్కీ కి అనుకూలంగా ఉన్నాడు. ముహమ్మద్ అలీ జౌహర్ బాల్కన్ యుద్ధాల సమయంలో టర్కీకి మద్దతుగా 1912లో పంపిన వైద్య మిషన్‌కు ప్రచారకర్తగా మరియు నిధుల సేకరణదారుగా కీలక పాత్ర పోషించారు.
ముహమ్మద్ ఇక్బాల్ చౌదరి అనే పరిశోధకుడు తన పరిశోధనా పత్రం "ముహమ్మద్ అలీ జౌహర్ యొక్క టర్కిష్ అనుకూల భావాలు-అతని లేఖలలో ప్రతిబింబించాయిPro-Turkish Feelings of Muhammad Ali Jauhar as Reflected in His Letters " లో టర్కిష్ వైద్య మిషన్‌ను కు ముహమ్మద్ అలీ రెండు లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చాడని పేర్కొన్నారు.
1913లో, ముహమ్మద్ అలీ జౌహర్ తుర్కీప్రజలకు జరుగుతున్న అన్యాయాల గురించి బ్రిటిష్ ప్రభుత్వ అధికారులలో అవగాహన పెంచడానికి గ్రేట్ బ్రిటన్‌కు వెళ్లారు. తన పర్యటన సందర్భంగా, ముహమ్మద్ అలీ జౌహర్ బ్రిటిష్ అధికారులను కలుసుకుని, బహిరంగ సమావేశాలలో ప్రసంగాలు చేశాడు. బ్రిటన్‌లోని కీలక వ్యక్తులతో చర్చలు జరపడానికి ప్రయత్నించారు, కానీ ముహమ్మద్ అలీ జౌహర్ చేసిన ప్రయత్నాలు విఫలమై తిరిగి వచ్చారు
మొదటి ప్రపంచ యుద్ధంలో గ్రేట్ బ్రిటన్‌కు వ్యతిరేకంగా జర్మనీతో జతకట్టాలనే తుర్కియే నిర్ణయం భారతదేశ ముస్లింలను తీవ్రంగా కలవరపెట్టింది. బ్రిటిష్ విజయం తుర్కియేకు వినాశకరమైన పరిణామాలను కలిగిస్తుందని భారతీయ ముస్లిములు భయపడ్డారు.
బ్రిటిష్ మద్దతును పొందడానికి, భారత ముస్లింలు బ్రిటిష్ ప్రధాన మంత్రి లాయిడ్ జార్జ్ నుండి ‘ముస్లిం పవిత్ర స్థలాలు యుద్ధ సమయంలో తాకబడకుండా ఉంటాయని మరియు యుద్ధం తర్వాత ముస్లిం ఖలీఫాత్ రక్షించబడుతుందని’ ప్రతిజ్ఞ(pledge) పొందారు..
అయితే, జర్మనీ ఓటమి మరియు బ్రిటన్ విజయం తర్వాత, బ్రిటన్ మరియు దాని మిత్రదేశాలు బస్రా మరియు జెడ్డాలో ప్రవేశించడం ద్వారా తమ వాగ్దానాలను ఉల్లంఘించాయి. ఈ ద్రోహం బ్రిటిష్ వారిని తమ వాగ్దానాలకు జవాబుదారీగా ఉంచడానికి మరియు ఖిలాఫత్ ను రక్షించడానికి భారతదేశ ముస్లింలు ఖిలాఫత్ ఉద్యమాన్ని ప్రారంభించడానికి దారితీసింది. ఖిలాఫత్ ఉద్యమం యొక్క అత్యంత ప్రముఖ నాయకుడు ముహమ్మద్ అలీ జౌహర్
ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో తుర్కియే శాశ్వత ప్రతినిధి బురాక్ అక్కాపర్ తన “పీపుల్స్ మిషన్ టు ది ఒట్టోమన్ ఎంపైర్ People’s Mission to the Ottoman Empire” పుస్తకంలో ఇలా రాశారు - “మహమ్మద్ అలీ ‘జౌహర్’ ఒక అరుదైన రత్నం. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక హీరో. భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజ హక్కులను కాపాడటంలో ‘మౌలానా’. కాని టర్కిష్ విప్లవాన్ని ఆయన సరిగా అర్థం చేసుకోలేకపోయారు. సున్నీ ముస్లిం ప్రపంచానికి టర్కుల నాయకత్వం తర్వాత శూన్యం ఏర్పడుతుందని, ముస్లింలలో గందరగోళం ద్వారా అది పూరించబడుతుందని ఆయన చెప్పింది నిజమే…”
అయితే, ఇటివల లబించిన కొన్ని పత్రాలు ముహమ్మద్ అలీ జౌహర్ కి టర్కిష్ విప్లవం గురించి బాగా తెలుసునని సూచిస్తున్నాయి. ఫలితంగా, ఒట్టోమన్ సామ్రాజ్యం అంతమై, తుర్కియేలో ప్రజాస్వామ్యం స్థాపించబడిన తర్వాత కూడా, భారతీయ ముస్లింలలో తుర్కియే పట్ల ప్రేమ బలంగా ఉంది.
భారతీయ ముస్లిములు కెమాల్ అటాతుర్క్ ను తుర్కుల నాయకుడిగా చూడటం కొనసాగించారు మరియు అందుబాటులో ఉన్న పత్రాల ప్రకారం, 1928 వరకు ముహమ్మద్ అలీ జౌహర్ మరియు అతని సహచరులు స్థాపించిన జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో కెమాల్ అటాతుర్క్ చిత్రపటం ప్రదర్శించబడింది. అదనంగా, ముహమ్మద్ అలీ జౌహర్ జనవరి 1929 వరకు తన ఉర్దూ దినపత్రిక ‘హమ్‌దార్డ్’లో తుర్కియేకు సంబంధించిన వార్తలను ప్రచురించడం కొనసాగించాడు. ఆ తర్వాత, కొంతకాలానికి వార్తాపత్రిక ‘హమ్‌దార్డ్’ శాశ్వతంగా మూసివేయబడింది.
జనవరి 6న టర్కిష్ దినపత్రిక ‘వాకిట్’లో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం, “ఎం. అలీ ఎవెల్కీ సెనే బిర్ టెట్ కిక్ సెయాహతినే సికరాక్ ఇస్తాంబుల వె అంకరాయ ద గేలమిస్తి M. Ali evelki sene bir tet kik seyahatine çıkarak Istanbula ve Ankaraya da gelmişti” (ముహమ్మద్ అలీ జౌహర్ ఒక సంవత్సరం క్రితం ఒక చిన్న పర్యటన చేసాడు, ఆ సమయంలో ఇస్తాంబుల్ మరియు అంకారాను సందర్శించాడు).
ముహమ్మద్ అలీ జౌహర్ నవంబర్ 20, 1928న యూరప్ పర్యటన నుండి తిరిగి వస్తుండగా పాలస్తీనాకు చేరుకున్నాడు. దీనికి ముందు, ముహమ్మద్ అలీ జౌహర్ అంకారా మరియు ఇస్తాంబుల్‌లో కొన్ని రోజులు గడిపాడు. బైత్-ఉల్-ముకాద్దస్‌లో తన ప్రసంగంలో ముహమ్మద్ అలీ జౌహర్ దీనిని స్వయంగా ప్రస్తావించారు.
ఖచ్చితంగా చెప్పాలంటే, భారతదేశంలో ఖిలాఫత్ ఉద్యమం యొక్క ప్రధాన లక్ష్యాలలో ఒకటి అల్-అక్సా మసీదును సంరక్షించడం. ముహమ్మద్ అలీ సన్నిహిత మిత్రుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ప్రకారం తుర్కియాలో ఖలీఫత్ రద్దుతో, ఖిలాఫత్ ఉద్యమం యొక్క నిజమైన లక్ష్యం పాలస్తీనాకు అయినదని స్పష్టంగా పేర్కొన్నాడు. అందుకే ఖిలాఫత్ కమిటీ నేటికీ భారతదేశంలో ఉంది.
ముహమ్మద్ అలీ జౌహర్ జనవరి 4, 1931న లండన్‌లో కన్నుమూశారు.
జనవరి 23, 1931న, ముహమ్మద్ అలీ
జౌహర్ అల్-అక్సా మసీదు సముదాయంలోని సమాధిలో ఖననం చేశారు.
మూలం: బియాండ్ హెడ్‌లైన్స్, జనవరి 04, 2025
No comments:
Post a Comment