మొఘల్ చక్రవర్తి హుమాయూన్ మొదటి
భార్య హాజీ బేగం లేదా బేగా బేగం అని
పిలుస్తారు. బేగా బేగం ఖొరాసన్ నుండి
వచ్చిన పర్షియన్ వనిత మరియు హుమాయున్ మామ
కుమార్తె. హుమాయున్ పాలనలో మక్కాకు హజ్‌కి వెళ్లినందున బేగా బేగం ను హాజీ బేగం అని కూడా పిలుస్తారు..
చౌసా యుద్ధం లో హుమాయున్ పై షేర్ ఖాన్ విజయం సాదించెను చౌసా యుద్ధ సమయం లో మొఘల్ అంతఃపుర మహిళలు ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది మరియు హాజీ బేగం చిన్న కుమార్తె అకికా బేగం మునిగిపోయింది.. బేగా బేగంకు ఇక పిల్లలు లేరు. హుమాయున్ మరణం తరువాత బేగా బేగం తన సవతి కొడుకు అక్బర్ ప్రోత్సాహం తో ఢిల్లీలో హుమాయూన్ సమాధిని నిర్మించినది
హుమాయున్ భార్యలందరిలో బేగా బేగం స్వాతంత్ర్యంతో జీవించింది. బేగా బేగం హజ్‌కు వెళ్లి, సమాధి నిర్మించే అరబ్ కళాకారులతో కలిసి తిరిగి వచ్చింది. అక్బర్ పాలనలో గుల్బదన్ బేగం మరియు హమీదా బాను బేగం మక్కా వెళ్ళడానికి చాలా ముందు ఇది జరిగింది.
బేగా బేగం ఆగ్రాలోని అంతఃపురంలో చేరకుండా ఢిల్లీలోనే ఉండి భవన నిర్మాణ పనులను పర్యవేక్షి౦చినది. .
సమకాలీన చరిత్రకారుడు బదౌని అక్బర్
మరియు బేగా బేగం చాలా సన్నిహితంగా ఉండేవారని మరియు బేగా బేగంను 'అక్బర్‌కు రెండవ
తల్లి' అని
వర్ణించాడు.
బేగా బేగం తరచుగా అక్బర్‌ని కలవడానికి ఆగ్రాకు వెళుతూ ఉంటుంది మరియు బేగా బేగం తన భత్యాన్ని దానధర్మాలు చేస్తూ గడిపింది. జెస్యూట్ ఆంటోయిన్ డి మోన్సెరేట్ ప్రకారం ' బేగా బేగం తన అంతిమ కాలం లో మొత్తం ప్రార్థనకు మరియు దానధర్మాలకు తనను తాను అంకితం చేసుకుంది మరియు తన భిక్షతో ఐదు వందల మంది పేదలను పోషించింది.
బేగా బేగం బిల్డర్‌గా మారిన మొఘల్ మహిళల్లో మొదటిది. మొఘల్ మహిళల్లో చాలామంది సమాధులు, మసీదులు, మదర్సాలు, సెమినరీలు, బజార్లు మరియు ఉద్యానవనాలు నిర్మించారు. బేగా బేగం నిర్మించిన . హుమాయున్ సమాధి భారతదేశానికి పర్షియన్ శైలిలో ఒక గోపురంతో కూడిన సమాధిని పరిచయం చేసింది. హుమాయున్ సమాధి పర్షియన్ శైలిలో ల్యాండ్‌స్కేప్ చేయబడిన చార్-బాగ్ ఉద్యానవనం మధ్యలో ఉన్న గోపుర సమాధిని కలిగి ఉంది. .
సూఫీ సన్యాసి షేక్ నిజాముద్దీన్
ఔలియా యొక్క దర్గా (సమాధి) సమీపంలో నిర్మించబడిన హుమాయున్ సమాధి సముదాయం మొఘల్ రాజవంశంలోని
చాలా మంది సభ్యులకు స్మశాన వాటికగా మారింది. బేగా బేగం తన భర్త హుమాయున్ సమాధి సమీపంలో
ఖననం చేయబడింది మరియు సమీపంలోనే మొఘల్ యువరాజులలో
ఒకరైన దారా షుకో యొక్క సమాధి కూడా ఉంది.
No comments:
Post a Comment