పంజాబ్
జానపద హీరో దుల్లా భట్టి క్రీ.శ. 1547లో తోలా బాదర్‌లోని ఫరీద్ భట్టి ఇంట్లో రాయ్ అబ్దుల్లా ఖాన్
భట్టిగా జన్మించాడు. తోలా బాదర్ లాహోర్‌కు వాయువ్యంగా 128 కిలోమీటర్ల దూరంలో ఉంది.
మొఘల్ చక్రవర్తి అక్బర్ తన ఆదాయాన్ని పెంచుకునే
లక్ష్యంతో పంజాబ్‌తో సహా తన రాజ్యంలో కొత్త పన్నుల విధానాన్ని ప్రవేశపెట్టినాడు. చక్రవర్తి అక్బర్ ఫౌజ్దార్
లేదా మొఘల్ నిర్వాహకుడిని కూడా నియమించాడు.
మొఘల్
అధికారులు అతి క్రూరంగా నిరంకుశంగా పన్నులు వసూలు చేసేవారు. దుల్లా భాటి తాత సందల్
భట్టి మరియు తండ్రి ఫరీద్ భట్టి రైతులను మరియు సమాజంలోని బాధితులను సంఘటితం చేసి
వారి హక్కుల కోసం పోరాడేవారు.
దుల్లా
భట్టి తల్లి మొఘలుల క్రూరత్వం,
దౌర్జన్యాలను
లాలిపాటల రూపంలో చెబుతూ దుల్లా భట్టి పెంచింది. ఇది దుల్లా భట్టి వ్యక్తిత్వం పై ప్రభావాన్ని
కల్పించినది.
దుల్లా భట్టి మొఘల్ సామ్రాజ్య అధికారానికి వ్యతిరేకంగా రైతులను ఏకం చేయడం
ద్వారా తన ప్రతిఘటనను ప్రారంభించాడు. మొఘల్ అధికారులను దోచుకోవడం
ద్వారా దుల్లా భట్టి పంజాబ్
లోని స్థానిక ప్రజలకు, రైతులకు
స్వాతంత్ర్యం మరియు ఆశను తెచ్చిపెట్టాడు.మొఘల్ అధికారుల వేధింపులకు
గురైన వెనకబడిన వర్గాల మహిళలను రక్షించే బాధ్యత దుల్లా
భట్టి స్వీకరించాడు.
పంజాబీ
గ్రామీణ ప్రజల కధనాల ప్రకారం,
దుల్లా
భట్టి మొఘల్ చక్రవర్తి అక్బర్‌కు వ్యతిరేకంగా గెరిల్లా తిరుగుబాటుకు నాయకత్వం
వహించాడు మరియు పేదలపాలిటి జానపద హీరో అయ్యాడు. మొఘల్ అధికారానికి వ్యతిరేకంగా గెరిల్లా యుద్దం కొనసాగించినాడు..దుల్లా భట్టి మొఘలుల నుంచి దోచుకొన్న ధనమును పేదల మధ్య తిరిగి పంపిణీ చేసేవాడు .
ప్రచారం లో ఒక జానపద కధనం ప్రకారం దుల్లా భట్టి కాలంలో ఒక సిక్కు అమ్మాయి ‘ముండ్రి’ ని బానిసగా విక్రయించడానికి మొఘల్ సైనికులు అపహరించారు. దుల్లా భట్టి ముండ్రిను రక్షించి తన సొంత ఖర్చులతో తగిన వరుడితో లోహ్రీ పండుగ శుభ సందర్భంగా వివాహం జరిపించారు.
విజయవంతమైన తిరుగుబాటుకు నాయకత్వం వహించిన తరువాత, దుల్లా భట్టి చివరికి బంధించబడ్డాడు మరియు లాహోర్‌కు తీసుకెళ్లబడ్డాడు, అక్కడ మొఘల్ పాలకుడు అక్బర్ ఆదేశాల మేరకు 1599 ADలో ఉరితీయబడ్డాడు. దుల్లా భట్టి లాహోర్‌లోని చారిత్రాత్మక మియాని సాహిబ్ స్మశానవాటికలో ఖననం చేయబడినాడు.
ప్రసిద్ద పంజాబీ రచయితలు కిషన్
సింగ్, బల్దేవ్
సింగ్, మరియు
మన్‌ప్రీత్ రాతియన్ తమ తమ పుస్తకాలలో దుల్లా భట్టి యొక్క మౌఖిక చరిత్రను సంకలనం
చేసారు.
దుల్లా
భట్టి యొక్క శౌర్యం మరియు ధైర్యం బాధలో ఉన్న సమాజం పట్ల అతని కనికరం అతన్ని గొప్ప
వ్యక్తిత్వం ఉన్న
వర్గంలో
ఉంచుతుంది. దుల్లా భట్టి దోపిడీల కథలు, జానపద కథలు మరియు లోహ్రీ
పాటల ద్వారా నేటికీ
కొనసాగుతున్నాయి.
సందర్శకులు దుల్లా భట్టి సమాధని
సందర్శించి దానిపై పూలు లేదా
చాదర్ ఉంచుతారు. దుల్లా భట్టి మొఘల్ పాలనను భారీ రైతు తిరుగుబాటు ద్వారా సవాలు
చేసిన వీరుడు. దుల్లా భట్టి స్థానిక రైతులు మరియు అణగారిన ప్రజల తరపున పోరాడారు
మరియు దుల్లా భట్టి సాహసాలు అన్నీ గ్రామీణ
ప్రజలలో గొప్ప కీర్తిని
పొందాయి.
సాటిలేని ధైర్యసాహసాల కారణంగా, పంజాబ్‌లోని మొఘల్‌లపై తిరుగుబాటుకు అతిపెద్ద చిహ్నంగా
దుల్లా భట్టి ఉద్భవించినాడు. ఉరితీసిన తర్వాత, దుల్లా భట్టి కీర్తి మరింత పెరిగింది మరియు పంజాబ్‌లోని
ప్రతి వీధి మరియు ఇంటిలో దుల్లా భట్టి పరాక్రమానికి సంబంధించిన కథలు మరియు పాటలు
పాడారు..
పంజాబ్
మరియు ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో జనవరి 13న
జరుపుకునే లోహ్రీ పండుగ, పంజాబ్ జానపద హీరో దుల్లా
భట్టి జ్ఞాపకాన్ని సజీవంగా తీసుకువస్తుంది, ఎందుకంటే
లోహ్రీ పండుగ రోజు పాడే ప్రతి పాటలో దుల్లా భట్టి గొప్ప పనులు ప్రస్తావించబడ్డాయి.
సంప్రదాయం ప్రకారం
దుల్లా
భట్టికి దుల్లా భట్టికి స్తుతులు పాడటం, నివాళులు
అర్పించడం జరుగుతుంది.
లోహ్రీ
పండుగ పంజాబీ నీతి మరియు పంజాబ్ యొక్క భాగస్వామ్య వారసత్వానికి శక్తివంతమైన
చిహ్నం.ప్రముఖ లోహ్రీ పాట 'సుందర్ ముందరియే..' దుల్లా భట్టి కథను చెబుతుంది. దుల్లా భట్టి మౌఖిక
చరిత్ర పంజాబ్
లోని గ్రామీణ ప్రజల
హృదయాలలో సజీవంగా ఉంటుంది.
No comments:
Post a Comment