న్యూఢిల్లీ – “ముస్లింలు ఇన్ ఇండియా - గ్రౌండ్ రియాలిటీస్ వర్సెస్ ఫేక్ నేరేటివ్స్ Muslims
in India – Ground Realities versus Fake Narratives” అనే కొత్త పుస్తకం లో పొందుపరచిన వివరాల
ప్రకారం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి భారత దేశం లోని రాష్ట్రాలు
మరియు కేంద్రపాలిత ప్రాంతాలు (UTలు) కి కలిపి మొత్తం 673 మంది గవర్నర్లు,
లెఫ్టినెంట్-గవర్నర్లు/ అడ్మినిస్తేటర్ గా నియమించబడగా వారిలో 61అరవై ఒక్క
మంది ముస్లింలు కలరు.
·
1977 తర్వాత మొదటిసారిగా మూడు కేంద్రపాలిత
ప్రాంతాలు - అండమాన్ మరియు నికోబార్,
ఢిల్లీ మరియు పుదుచ్చేరి
లెఫ్టినెంట్-గవర్నర్లు మరియు ఐదుగురు అడ్మినిస్తేటర్
administrators,లో ముస్లిము ఎవరూ లేరు.
·
2014 నుండి ముగ్గురు ముస్లింలు మాత్రమే
గవర్నర్లుగా నియమించబడినారు. ఇది ఒక దశాబ్దంలో ఇప్పటివరకు అత్యల్ప సంఖ్య.
·
ప్రస్తుతం, 28 మంది
గవర్నర్లలో ఇద్దరు ముస్లింలు మాత్రమే ఉన్నారు - ఆంధ్రప్రదేశ్ జస్టిస్ (రిటైర్డ్)
ఎస్ అబ్దుల్ నజీర్ మరియు బీహార్‌కు చెందిన ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్.
·
ఆరిఫ్
మొహమ్మద్ ఖాన్ 26 సంవత్సరాల తర్వాత బీహార్‌కు మొదటి
ముస్లిం గవర్నర్ అయ్యారరు..
· నజ్మా హెప్తుల్లా తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ రెండవ ముస్లిం గవర్నర్. మూడవవారు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రస్తుత గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్
·
ఆంధ్రప్రదేశ్ కు మొత్తం 24 మంది గవర్నర్లలో ఒకరు మాత్రమే ముస్లిం.
·
అస్సాంలో 28 మంది గవర్నర్లు ఉన్నారు, వీరిలో ముగ్గురు
ముస్లింలు-చివరి
గవర్నర్ 2009లో.
·
బీహార్‌లో ఐదుగురు ముస్లింలతో సహా 30 మంది గవర్నర్లు
ఉన్నారు, చివరి
గవర్నర్ 2024 నుండి
ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్.
·
భారతదేశపు మొట్టమొదటి మరియు ఏకైక ముస్లిం
నావికాదళ అధిపతి ఇద్రిస్ హసన్ లతీఫ్ 1983 మరియు 1984లో రెండుసార్లు ఆ పదవిని అధిష్టించడంతో గోవా 13 మంది లెఫ్టినెంట్
గవర్నర్‌లను చూసింది.
·
మే 1987లో గోవా భారతదేశంలో 25వ రాష్ట్రంగా అవతరించిన తర్వాత, 19 మంది గవర్నర్‌లను
చూసింది, వారిలో
ఇద్దరు ముస్లింలు - ఖుర్షెద్ ఆలం ఖాన్ (1989-1991), మరియు మొహమ్మద్ ఫజల్ (1999-2002).
· గుజరాత్ 20 మంది గవర్నర్లలో ఒక ముస్లిం గవర్నర్ -1960 నుండి ఐదు సంవత్సరాలు మెహదీ నవాజ్ జంగ్.
·
హర్యానాకు 19 మంది గవర్నర్లు ఉన్నారు, వారిలో ఇద్దరు
ముస్లింలు - సయ్యిద్ ముజఫర్ హుస్సేన్ బర్నీ (1984-1988), మరియు అఖ్లాక్ ఉర్ రెహమాన్ కిద్వాయ్ (2004-2009).
· హిమాచల్ ప్రదేశ్ లో లెఫ్టినెంట్ గవర్నర్లు ఉన్నప్పుడు, లెఫ్టినెంట్ గవర్నర్ గా ఒక్క ముస్లిం కూడా లేరు.
·
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ వ్యవస్థను
స్వీకరించినప్పుడు, 21 మందిలో
ఇద్దరు ముస్లింలు మాత్రమే గవర్నర్ గా - AA ఖాన్ (1977-1981), మరియు గుల్ షేర్ అహ్మద్ (1993)నియమించబడ్డారు..
·
జార్ఖండ్‌కు 10 మంది గవర్నర్లు
ఉన్నారు, వారిలో
ముగ్గురు ముస్లింలు, చివరివారు
2011 నుండి 2015 వరకు ఉన్నారు.
·
కర్ణాటకలో మొత్తం 20 మంది గవర్నర్లలో ఒకరు ముస్లిం - ఖుర్షేద్ ఆలం ఖాన్ 1992 నుండి ఏడు
సంవత్సరాలు పనిచేశారు.
·
కేరళలో నలుగురు ముస్లింలతో సహా 23 మంది గవర్నర్లు
ఉన్నారు, చివరి
వ్యక్తి ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ 2019 నుండి 2024 వరకు పనిచేశారు.
·
మధ్యప్రదేశ్‌లో మొత్తం 20 మంది గవర్నర్ల లో
ఇద్దరు ముస్లింలు.
·
మహారాష్ట్ర మొత్తం 23 మంది గవర్నర్లలో
నలుగురు ముస్లింలు ఉన్నారు,
·
మణిపూర్‌లో కూడా 18 మంది గవర్నర్లలో
నలుగురు ముస్లింలు ఉన్నారు.
·
మేఘాలయ మొత్తం 20 మంది గవర్నర్ల లో
ఒకరు ముస్లిము.
·
మిజోరం మొత్తం 16 మంది గవర్నర్ల లో
ఒకరు ముస్లిము.
·
నాగాలాండ్‌లలో 21 మంది గవర్నర్లలలో
ఒకరు ముస్లిము గా ఉన్నారు.
· రాజస్థాన్‌లో పనిచేసిన 22 మంది గవర్నర్లలో ఒక ముస్లిం ఉన్నారు.
· తమిళనాడులోని 16 మంది గవర్నర్లలో ముగ్గురు ముస్లింలు ఉన్నారు.
· త్రిపురo మొత్తం 20 మంది గవర్నర్లలో ఒకరు ముస్లిం
· ఉత్తరాఖండ్‌లో మొత్తం తొమ్మిది
మంది గవర్నర్లలో ఒకరు ముస్లిము.
· ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 20 మంది గవర్నర్లలో ఇద్దరు ముస్లింలు.
·
పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 28
మంది గవర్నర్లలో ముగ్గురు ముస్లింలు.
·
ఒడిశాలో మొత్తం 27 మంది గవర్నర్లలో ఏడుగురు ముస్లింలు..
·
పంజాబ్‌లోని మొత్తం 30 మంది గవర్నర్లలో ఇద్దరు ముస్లింలు ఉన్నారు
·
ఛత్తీస్‌గఢ్‌లోని ఆరుగురు గవర్నర్లలో ఒక ముస్లిం కూడా లేరు.
·
అరుణాచల్ ప్రదేశ్‌లోని మొత్తం 19 గవర్నర్లలో ఒక ముస్లిం కూడా లేరు
·
సిక్కింలోని మొత్తం 15 గవర్నర్లలో ఒక ముస్లిం
కూడా లేరు
·
తెలంగాణలోని మొత్తం మూడు గవర్నర్లలో ఒక ముస్లిం కూడా లేరు.
·
జమ్మూ & కాశ్మీర్ ఒక రాష్ట్రంగా 10 మంది గవర్నర్‌లను చూసింది వారిలో ఒక ముస్లిం కూడా లేరు.
· అండమాన్ మరియు నికోబార్
దీవులు, చండీగఢ్, జమ్మూ మరియు కాశ్మీర్ మరియు లడఖ్‌లలో మొత్తం లెఫ్టినెంట్
గవర్నర్లలో ఒక్క ముస్లిము కూడా లేరు.
·
ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR) 21 మంది లెఫ్టినెంట్
గవర్నర్‌లను చూసింది, వారిలో
ఒకరు ముస్లిం - నజీబ్ జంగ్..
·
లక్షద్వీప్-కేంద్రపాలిత
ప్రాంతం లో మొత్తం 35 మంది అడ్మినిస్తేటర్/పరిపాలకులు కలరు
వారిలో ఇద్దరు ముస్లింలు - వజాహత్ హబీబుల్లా, 1987 నుండి 1990 వరకు మరియు ఫరూఖ్ ఖాన్, 2016 నుండి 2019 వరకు.
·
కేంద్రపాలిత ప్రాంతం-పుదుచ్చేరి కు మొత్తం 24 ఎల్-జి కలరు వారిలో ఒకరు ముస్లిం - సాదిక్ అలీ 1981లో కొంతకాలం
ఉన్నారు.
సోర్స్:: క్లారియన్ ఇండియా, జనవరి 22, 2025
No comments:
Post a Comment