అలీఘర్
ముస్లిం విశ్వవిద్యాలయం (AMU) భారత దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన అనేక మంది
స్వాతంత్ర్య సమరయోధులను తయారు చేసింది. జాతీయ స్వాతంత్ర్య పోరాటంలో AMU సహకారం గురించి తెలుసుకోవడం, మరింత ముఖ్యం. స్వాతంత్ర్య ఉద్యమంలో AMU యొక్క సహకారం యొక్క అధ్యయనం హిందూ-ముస్లిం
ఐక్యతను బలోపేతం చేస్తుంది.
1875లో
స్థాపించబడిన మొహమ్మదో ఆంగ్లో-ఓరియంటల్ కాలేజ్ (MAO కాలేజ్), అలీఘర్ ( తరువాత 1920లో AMUగా మారింది), అనేక మంది స్వాతంత్ర్య సమరయోధులను
తయారు చేసింది, వారిలో
ప్రముఖులు అలీ సోదరులు (మౌలానా షౌకత్ అలీ మరియు మొహమ్మద్ అలీ), అబ్దుల్ గఫార్ ఖాన్ (ఫ్రాంటియర్ గాంధీ), మౌలానా హసరాహిత్, రాజా మహేంద్ర ప్రతాప్ కాబూల్‌లో భారత మొదటి ప్రవాస ప్రభుత్వాన్ని
స్థాపించారు), S. M. టోంకీ, సైఫుద్దీన్ కిచ్లూ కిచ్‌లూ (లెనిన్
శాంతి బహుమతి గ్రహీత), అబ్దుల్
మజీద్ ఖ్వాజా, ఖాజీ అదీల్ అబ్బాసీ, సైత్ యాకూబ్ హసన్, అలీ సర్దార్ జాఫ్రీ, షఫీక్-ఉర్-రెహ్మాన్ కిద్వాయ్, రఫీ అహ్మద్ కిద్వాయ్, రాజా గులాం
హుసేన్, షోహిబ్ ఖురేషి, షేక్ మహ్మద్ అబ్దుల్లా, డా. దాతు (ఆఫ్రికన్ నేషనల్ కాన్ఫరెన్స్
నాయకుడు), అబ్దుల్
మతీన్ చౌదరి (ఇండియన్ సివిల్ లిబర్టీ యూనియన్ వ్యవస్థాపక సభ్యుడు), మజరుల్ హక్, సయ్యద్ అలీ జహీర్, సయ్యద్ హుస్సేన్, సయ్యద్ మీర్ ఖాసిం, సయ్యద్ రవూఫ్ పాషా, తస్సావుక్ అహ్మద్ ఖాన్ షేర్వానీ, యాసీన్ నూరి జెడ్ అహ్మద్, మరియు జాఫర్ అలీ ఖాన్
AMU పూర్వ
విద్యార్థి అయిన పదిహేను మంది ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుల సంక్షిప్త ప్రొఫైల్‌ను
అందిస్తున్నాము (వీరిలో హకీమ్ అజ్మల్ ఖాన్ AMU పూర్వ విద్యార్థి కాదు కానీ AMU ట్రస్టీ సభ్యుడిగా దానితో సంబంధం
కలిగి ఉన్నాడు).
అలీఘర్, ఉత్తరప్రదేశ్:
1.ఖాన్ అబ్దుల్ గఫర్ (1890-1988) Khan Abdul Ghaffar (1890-1988)
ఖాన్ అబ్దుల్ గఫర్ భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన ముస్లిం స్వాతంత్ర్య సమరయోధులలో ఒకరు మరియు "ఫ్రాంటియర్ గాంధీ" అని కూడా పిలుస్తారు. ఖాన్ అబ్దుల్ గఫర్ 1929లో ప్రసిద్ధ ఖుదై ఖిద్మత్గర్ ("దేవుని సేవకులు") ఉద్యమాన్ని ప్రారంభించారు భారతదేశ విభజన కోసం అఖిల భారత ముస్లిం లీగ్ డిమాండ్‌ను ఖాన్ అబ్దుల్ గఫర్ వ్యతిరేకించారు. విభజన తర్వాత, అతను పాకిస్తాన్‌లోనే ఉండి ప్రత్యేక బలూచ్ ప్రావిన్స్ కోసం పోరాడటం ప్రారంభించాడు. 1948 నుండి 1988 వరకు చాలాసార్లు జైలు పాలయ్యాడు మరియు ఎక్కువ సమయం గృహ నిర్బంధంలో ఉన్నాడు. 1988లో మరణించినప్పుడు, పదివేల మంది దుఃఖితులు ఖాన్ అబ్దుల్ గఫర్ అంత్యక్రియలకు హాజరయ్యారు. అదే సమయంలో సోవియట్ దళాలు మరియు ఆఫ్ఘన్ తిరుగుబాటు దళాల మధ్య భారీ పోరాటం జరుగుతోంది, కానీ ఇద్దరూ తమ పోరాటాన్ని నిలిపివేసి గొప్ప నాయకుడికి నివాళులర్పించారు.
2.డాక్టర్ జాకీర్ హుస్సేన్ (1897-1969) Dr.Zakir Husain (1897-1969)
డాక్టర్ జాకీర్ హుస్సేన్ భారతదేశానికి 3వ అధ్యక్షుడిగా పనిచేశారు మరియు భారతదేశానికి మొదటి ముస్లిం అధ్యక్షుడు. ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా వ్యవస్థాపకులలో జాకీర్ హుస్సేన్ ఒకరు. భారత సమాజం విలువ ఆధారిత విద్యతో విద్యను పొందినప్పుడే భారతదేశ స్వేచ్ఛా పోరాటం విజయవంతమవుతుందని నమ్మారు. జాకీర్ హుస్సేన్ జామియా మిలియా ఇస్లామియా వైస్ ఛాన్సలర్‌గా 22 సంవత్సరాలు (1926-48) పనిచేశారు జాకీర్ హుస్సేన్ కు భారతదేశ అత్యున్నత జాతీయ గౌరవం అయిన భారతరత్న లభించింది.
3.సైఫుద్దీన్ కిచ్లూ (1888-1963) Saifuddin Kitchlew (1888-1963)
డాక్టర్
సైఫుద్దీన్ కిచ్లూ యూరప్‌లో తన చదువును పూర్తి చేసి, న్యాయవాద వృత్తిని చేపట్టడానికి
భారతదేశానికి తిరిగి వచ్చారు. బ్రిటిష్ ప్రభుత్వం అపఖ్యాతి పాలైన రౌలట్ చట్టాన్ని
ఆమోదించినప్పుడు డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లూ అమృత్‌సర్ మున్సిపల్ కమిషనర్‌గా
నియమితులయ్యారు. డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లూ త్వరలోనే తన న్యాయవాద వృత్తిని వదిలి
సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. పంజాబ్‌లో నిరసనకు నాయకత్వం వహించినందుకు
మరియు జలియన్‌వాలాబాగ్‌లో సమావేశమైన ముగ్గురి అరెస్టుకు నిరసనగా మహాత్మా గాంధీ
మరియు డాక్టర్ సత్యపాల్‌తో కలిసి డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లూ అరెస్టు చేయబడ్డారు, అక్కడ జనరల్ రెజినాల్డ్ డయ్యర్ మరియు
అతని దళాలు నిరాయుధులైన పౌర సమూహంపై కనికరం లేకుండా కాల్పులు జరిపారు. డాక్టర్
సైఫుద్దీన్ కిచ్లూ భారత యువజన కాంగ్రెస్ వ్యవస్థాపక నాయకుడు కూడా. కిచ్లూ తన
విప్లవాత్మక కార్యకలాపాల కోసం దాదాపు పద్నాలుగు సంవత్సరాలు జైలులో గడిపారు.
పాకిస్తాన్ మరియు భారతదేశ విభజన కోసం ముస్లిం లీగ్ డిమాండ్‌ను డాక్టర్ సైఫుద్దీన్
కిచ్లూ తీవ్రంగా వ్యతిరేకించారు. డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లూ 100వ జయంతి సందర్భంగా ఇండియా పోస్ట్ డాక్టర్
సైఫుద్దీన్ కిచ్లూ చిత్రంతో కూడిన ప్రత్యేక స్మారక స్టాంపును విడుదల చేసింది.
4.అబ్దుల్ మజీద్ ఖ్వాజా (1885-1962) Abdul Majeed Khwaja (1885-1962)
అబ్దుల్
మజీద్ ఖ్వాజా ను ఖ్వాజా సహబ్, అని ప్రేమగా పిలిచేవారు. అబ్దుల్ మజీద్ ఖ్వాజా జామియా మిలియా వైస్ ఛాన్సలర్‌గా
మరియు తరువాత ఛాన్సలర్‌గా పనిచేశారు. జామియా చరిత్ర ఆయన ప్రస్తావన లేకుండా
అసంపూర్ణంగా ఉంటుంది.
అబ్దుల్
మజీద్ ఖ్వాజా అలీఘర్‌లోని MAO కళాశాలలో
విద్యనభ్యసించారు, ఆ
తర్వాత కేంబ్రిడ్జ్‌కు వెళ్లి న్యాయవాద వృత్తిని అబ్యసించారు.
ఖ్వాజా
సహబ్ 1915లో
కాంగ్రెస్ పార్టీలో చేరిన నిబద్ధత కలిగిన సభ్యుడు.ఖ్వాజా సహబ్ జమియత్ ఉలామా-ఇ-హింద్‌తో
ప్రారంభం నుండి అనుబంధం కలిగి ఉన్నారు. అబ్దుల్ మజీద్ క్వాజా డాక్టర్ MA అన్సారీ నేతృత్వంలోని ఖిలాఫత్
ప్రతినిధి బృందంలో (1920) సభ్యుడిగా
ఇంగ్లాండ్ వెళ్లారు.
ఖ్వాజా
సహబ్ MAO కళాశాలలో
జూనియర్ లా ప్రొఫెసర్‌గా, దాని
ట్రస్టీగా మరియు MAO ఓల్డ్
బాయ్స్ అసోసియేషన్ కార్యదర్శిగా కూడా పనిచేశారు.ఖ్వాజా సాహబ్ ఒక ప్రముఖ న్యాయవాది, మరియు పాట్నా హైకోర్టులో చాలా
ప్రసిద్ధి చెందారు. కానీ, సహాయ
నిరాకరణ పిలుపుకు ప్రతిస్పందనగా, తన న్యాయవాద వృత్తిని వదులుకుని, జామియా స్థాపన మరియు నిర్మాణంలో
పాలుపంచుకున్నారు.
అబ్దుల్
మజీద్ క్వాజా ఖిలాఫత్ కాంగ్రెస్‌లో ఉన్నత పదవులు నిర్వహించారు అబ్దుల్ మజీద్
క్వాజా జవహర్‌లాల్ నెహ్రూకు సన్నిహితుడు మరియు హిందూ-ముస్లిం ఐక్యతకుపాటుపడినాడు. .
.
5.హకీమ్ అజ్మల్ ఖాన్ (1868-1927)Hakeem Ajmal Khan (1868-1927)
అజ్మల్
ఖాన్ భారత స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖ నాయకుడు మరియు జామియా మిలియా ఇస్లామియా
వ్యవస్థాపకులలో ఒకరు. అజ్మల్ ఖాన్ భారత జాతీయ కాంగ్రెస్, ముస్లిం లీగ్ మరియు ఆల్-ఇండియా ఖిలాఫత్
కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన ఏకైక వ్యక్తి. అజ్మల్ ఖాన్ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గౌరవనీయ వైద్యుడు మరియు 1892 నుండి 1902 వరకు రాంపూర్ నవాబుకు ప్రధాన
వైద్యుడిగా పనిచేసారు.
1865-70లో
ప్రారంభించబడిన ఉర్దూ వారపత్రిక 'అక్మల్-ఉల్-అక్బర్' కోసం
అజ్మల్ ఖాన్ రచనలు చేసాడు. 1906లో సిమ్లాలో భారత వైస్రాయ్‌ను కలిసి AMU ఏర్పాటు కోసం ఒక మెమోరాండం ఇచ్చిన
ముస్లిం బృందానికి కూడా ఖాన్ నాయకత్వం వహించారు.
అజ్మల్ ఖాన్ ప్రసిద్ధ ఖిలాఫత్ ఉద్యమంలో కూడా భాగమయ్యారు. 1921లో అజ్మల్ ఖాన్ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు
6.హస్రత్ మోహని (1877-1951)Hasrat Mohani (1877-1951)
కమ్యూనిస్ట్
పార్టీ ఆఫ్ ఇండియా సహ వ్యవస్థాపకుడు, హస్రత్ మోహని అనే కలం పేరుతో పిలువబడే
సయ్యద్ ఫజల్-ఉల్-హసన్, భారత
స్వాతంత్ర్య ఉద్యమంలో స్వాతంత్ర్య సమరయోధుడు మరియు ఉర్దూ భాషకు చెందిన ప్రముఖ కవి.
1921లో
హస్రత్ మోహని "ఇంక్విలాబ్ జిందాబాద్" ("విప్లవం
వర్థిల్లాలి!") అనే ప్రముఖ నినాదాన్ని రూపొందించారు. 1921లో హస్రత్ మోహని అహ్మదాబాద్ కాంగ్రెస్
సమావేశంలో భారతదేశానికి పూర్తి స్వాతంత్ర్యం కావాలని డిమాండ్ చేసిన మొదటి వ్యక్తి.
హస్రత్
మోహని 1921లో
అహ్మదాబాద్‌లో ముస్లిం లీగ్ అధ్యక్షుడి అయ్యాడు. భారత రాజ్యాంగ సభలో సభ్యుడిగా హస్రత్
మోహని, విభజన
మరియు కామన్వెల్త్‌లో భారతదేశ సభ్యత్వాన్ని నిరసిస్తూ రాజ్యాంగ ముసాయిదాపై సంతకం
చేయడానికి నిరాకరించారు.హస్రత్ మోహని మత సమైక్యతలో దృఢ విశ్వాసం ఉంచేవాడు.
7.రాజా మహేంద్ర ప్రతాప్ (1886-1979)Raja Mahendra Pratap (1886-1979)
రాజా
మహేంద్ర ప్రతాప్ సింగ్ భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, పాత్రికేయుడు, రచయిత, విప్లవకారుడు. 1915లో కాబూల్ లో ఏర్పడిన ప్రవాస భారత
తాత్కాలిక ప్రభుత్వానికి అధ్యక్షుడు మరియు భారతదేశంలో సామాజిక సంస్కరణవాది.
రెండవ ప్రపంచ యుద్ధంలో 1940లో రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ జపాన్‌లో భారత కార్యనిర్వాహక మండలిని కూడా ఏర్పాటు చేశారు. 1911లో MAO కళాశాలలోని తన తోటి విద్యార్థులతో కలిసి రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ బాల్కన్ యుద్ధంలో కూడా పాల్గొన్నారు. ఆయనను "ఆర్యన్ పేష్వా" అని పిలుస్తారు. 2021లో అలీఘర్‌లో రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ స్టేట్ యూనివర్సిటీని UP ప్రభుత్వం స్థాపించింది.
8.మౌలానా షౌకత్ అలీ (1873-1938) Maulana Shaukat Ali (1873-1938)
అలీ
సోదరులలో పెద్దవాడు మౌలానా షౌకత్ అలీ. తమ్ముడు మొహమ్మద్ అలీకి ఉర్దూ వారపత్రిక హమ్‌దర్ద్
మరియు ఆంగ్ల వారపత్రిక కామ్రేడ్ ప్రచురించడంలో మౌలానా షౌకత్ అలీ సహాయం చేశాడు. 1915లో మౌలానా షౌకత్ అలీ ఒక వ్యాసం
ప్రచురించారు, అందులో
టర్కులు బ్రిటిష్ వారితో పోరాడటం సరైనదేనని పేర్కొన్నారు.. 1919లో, జైలు శిక్ష అనుభవించినప్పుడు, మౌలానా షౌకత్ అలీ ఖిలాఫత్
సమావేశానికి చివరి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సహాయ నిరాకరణ ఉద్యమం (1919–1922) సమయంలో బ్రిటిష్ వారు మౌలానా షౌకత్ అలీ
ని 1921 నుండి 1923 వరకు జైలులో పెట్టారు.
మౌలానా షౌకత్ అలీ విప్లవాత్మక స్వాతంత్ర్య ఉద్యమానికి కూడా మద్దతు దారు. మౌలానా షౌకత్ అలీ 1928 నెహ్రూ నివేదికను వ్యతిరేకించారు. ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని డిమాండ్ చేశారు షౌకత్ అలీ 1930-31లో లండన్‌లో జరిగిన మొదటి మరియు రెండవ రౌండ్ టేబుల్ సమావేశాలకు (భారతదేశం) హాజరయ్యారు. మౌలానా షౌకత్ అలీ 1934 నుండి 1938 వరకు బ్రిటిష్ ఇండియాలో 'సెంట్రల్ అసెంబ్లీ' సభ్యుడిగా పనిచేశారు. మౌలానా షౌకత్ అలీ మధ్యప్రాచ్యం అంతటా పర్యటించి, భారతదేశ ముస్లింలకు మద్దతును మరియు భారతదేశంలో బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం కోసం పోరాటాన్ని పెంపొందించారు.
9.మౌలానా ముహమ్మద్ అలీ జౌహర్ (1878-1931)Maulana Muhammad Ali Jauhar (1878-1931)
మౌలానా
ముహమ్మద్ అలీ జౌహర్ MAO కళాశాలలో
మరియు ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. ముహమ్మద్ అలీ జౌహర్ ఆయన
మహాత్మా గాంధీతో కలిసి సహాయ నిరాకరణ మరియు ఖిలాఫత్ ఉద్యమాన్ని ప్రారంబించారు. ది టైమ్స్, లండన్, ది మాంచెస్టర్ గార్డియన్ మరియు ది
అబ్జర్వర్ వంటి ప్రముఖ భారతీయ మరియు విదేశీ వార్తాపత్రికలలో రచనలు చేసేవారు.
1911
సంవత్సరంలో ముహమ్మద్ అలీ జౌహర్ కలకత్తాలో “ది కామ్రేడ్” పత్రిక ను ప్రారంభించారు. 1913లో హమ్‌దర్ద్ అనే ఉర్దూ దినపత్రికను
ప్రారంభించారు. పౌర ప్రతిఘటన ఉద్యమ౦ పాల్గొన్నారు మరియు రెండు
సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు. మౌలానా ముహమ్మద్ అలీ జౌహర్ జామియా మిలియా
ఇస్లామియా వ్యవస్థాపకులలో ఒకరు మరియు దాని మొదటి వైస్ ఛాన్సలర్.
మౌలానా
ముహమ్మద్ అలీ జౌహర్ 1923లో INC అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మౌలానా
ముహమ్మద్ అలీ జౌహర్ 1930లో
లండన్‌లో జరిగిన మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్లారు. మౌలానా ముహమ్మద్ అలీ జౌహర్ 1931 జనవరి 4న లండన్‌లో మరణించాడు. మౌలానా ముహమ్మద్
అలీ జౌహర్ ను డోమ్ ఆఫ్ రాక్ సమీపంలో జెరూసలేంలో ఖననం చేశారు
10.అబ్దుల్ ఖయ్యూమ్ అన్సారీ (1905-1973)Abdul Qaiyum Ansari (1905-1973)
అబ్దుల్
ఖయ్యూమ్ అన్సారీ ప్రముఖ భారతదేశ స్వాతంత్ర్య సమరయోధుడు. జాతీయ సమైక్యత, లౌకికవాదం మరియు మత సామరస్యం పట్ల
నిబద్ధతకు ప్రసిద్ధి చెందారు. అబ్దుల్ ఖయ్యూమ్ అన్సారీ తాను అధ్యక్షుడిగా ఉన్న
ఆల్-ఇండియా మోమిన్ కాన్ఫరెన్స్ ద్వారా జిన్నా ద్విజాతి సిద్ధాంతానికి వ్యతిరేకంగా
పోరాడారు. పాకిస్తాన్ ఆలోచననే అబ్దుల్ ఖయ్యూమ్ అన్సారీ తీవ్రంగా వ్యతిరేకించారు
అబ్దుల్ ఖయ్యూమ్ అన్సారీ స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక జాతీయ పాఠశాలను స్థాపించాడు. స్వాతంత్ర్య ఉద్యమం లో పాల్గొని 16 సంవత్సరాల వయస్సులోనే అరెస్టు చేయబడి జైలు పాలయ్యారు అబ్దుల్ ఖయ్యూమ్ అన్సారీ సమాజంలోని బలహీన వర్గాలకు మద్దతుదారుడు. అబ్దుల్ ఖయ్యూమ్ అన్సారీ మోమిన్ కాన్ఫరెన్స్ యొక్క అగ్ర నాయకులలో ఒకరు. అబ్దుల్ ఖయ్యూమ్ అన్సారీ INCతో కలిసి 1928లో కలకత్తా లో సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళనలో కూడా పాల్గొన్నారు. అబ్దుల్ ఖయ్యూమ్ అన్సారీ ఒక నిష్ణాతుడైన జర్నలిస్ట్, రచయిత మరియు కవి.
11.అలీ సర్దార్ జాఫ్రీ (1913-2000)Ali Sardar Jafri (1913-2000)
అలీ
సర్దార్ జాఫ్రీ తిరుగుబాటుదారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, శాంతికాముకుడు, రాడికల్
కార్యకర్త, కథా
రచయిత, విమర్శకుడు
డాక్యుమెంటరీ చిత్రనిర్మాత మరియు 20వ శతాబ్దపు ఉర్దూ కవిత్వం యొక్క ప్రముఖ
ఆధునిక కవి. అలీ
సర్దార్ జాఫ్రీ కవిత్వం యొక్క ప్రధాన ఇతివృత్తం కరుణ, ప్రేమ, పట్టుదల మరియు సున్నితత్వం. అలీ సర్దార్ జాఫ్రీ మానవ స్ఫూర్తి యొక్క
ఆదర్శప్రాయమైన మనుగడను తన కవిత్వం లో చిత్రీకరించారు.
అలీ
సర్దార్ జాఫ్రీ ప్రారంభ రచనలు వలసరాజ్యాల నుండి భారతదేశం స్వాతంత్ర్యం పొందాలనే
విరామం లేని కోరికను ప్రతిబింబిస్తాయి.. 1938లోనే, అలీ సర్దార్ జాఫ్రీ కలకత్తాలో జరిగిన ప్రోగ్రెసివ్
రైటర్స్ ఉద్యమం సమావేశంలో పాల్గొన్నారు మరియు దాని ప్రముఖ సమర్ధకుడిగా మారారు.. అలీ
సర్దార్ జాఫ్రీ కవిత్వంపై మార్క్సిజం ప్రభావం చాలా లోతైనది మరియు శాశ్వతమైనది.1986లో AMU అలీ సర్దార్ జాఫ్రీ కి డాక్టరేట్ (డి. లిట్.) ప్రదానం చేసింది
12.కె.ఎం. అష్రఫ్
(1903-1962)K.M.
Ashraf (1903-1962)
కున్వర్ మొహమ్మద్ అష్రఫ్ ఒక ప్రముఖ చరిత్రకారుడు, ఇస్లామిక్ అధ్యయనాల పండితుడు, కమ్యూనిస్ట్ నాయకుడు మరియు హిందూ-ముస్లిం
ఐక్యతకు నాయకత్వం వహించాడు. సహాయ నిరాకరణ ఉద్యమం సమయంలో, కున్వర్ మొహమ్మద్ అష్రఫ్ MAO కళాశాలను విడిచిపెట్టి కొత్తగా ఏర్పడిన జామియా
మిలియాలో చేరాడు. తరువాత కున్వర్ మొహమ్మద్ అష్రఫ్ 1923లో AMUలో M.A. (చరిత్ర) మరియు LL.B. కోర్సులను అభ్యసించడానికి తిరిగి చేరాడు. కున్వర్ మొహమ్మద్ అష్రఫ్ లండన్
విశ్వవిద్యాలయంలోని SOAS నుండి Ph.D. పట్టా పొందాడు.
కున్వర్ మొహమ్మద్ అష్రఫ్ AMU ప్రొఫెసర్ మొహమ్మద్ హబీబ్ ప్రభావంతో సోషలిస్ట్ ఉద్యమంలో చేరాడు. రష్యన్
విప్లవం ద్వారా ప్రేరణ పొంది, 1934లో ఏర్పడిన
కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో కున్వర్ మొహమ్మద్ అష్రఫ్ చేరాడు. 1933-34లో, కున్వర్ మొహమ్మద్ అష్రఫ్ మియో రైతు పోరాటానికి
నాయకత్వం వహించాడు డాక్టర్ కున్వర్ మొహమ్మద్ అష్రఫ్ జవహర్‌లాల్ నెహ్రూకు నమ్మకమైన
సహచరుడు మరియు 1934-45 వరకు AICC సభ్యుడు.
1937-39లో కాంగ్రెస్ పార్టీ యొక్క “ముస్లిం మాస్ కాంటాక్ట్స్ క్యాంపెయిన్ సెల్” కు
కున్వర్ మొహమ్మద్ అష్రఫ్ నాయకత్వం వహించారు. కున్వర్ మొహమ్మద్ అష్రఫ్
భారతీయ ముస్లింలను స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనమని ప్రోత్సహించాడు మరియు దేశ
విభజనను తీవ్రంగా వ్యతిరేకించాడు. కున్వర్ మొహమ్మద్ అష్రఫ్ జవహర్‌లాల్ నెహ్రూ
మరియు మౌలానా ఆజాద్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు వారికి కార్యదర్శిగా
పనిచేశాడు. కున్వర్ మొహమ్మద్ అష్రఫ్ 1948లో దినపత్రిక నయా దౌర్ కు సంపాదకుడు.
కున్వర్ మొహమ్మద్ అష్రఫ్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలో బోధించారు మరియు 1960లో బెర్లిన్‌లోని హంబోల్ట్ విశ్వవిద్యాలయంలో
గెస్ట్ ప్రొఫెసర్‌గా (మధ్యయుగ భారతీయ చరిత్ర) చేరారు. 1962లో కున్వర్ మొహమ్మద్ అష్రఫ్ మరణించారు మరియు
బెర్లిన్‌లోని 'సోషలిస్టుల
స్మశానవాటిక'లో ఖననం చేయబడ్డారు.
13.రఫీ అహ్మద్
కిద్వాయ్ (1894-1954)Rafi
Ahmad Kidwai (1894-1954)
భారత స్వాతంత్ర్య ఉద్యమ కార్యకర్త మరియు సోషలిస్ట్ అయిన రఫీ అహ్మద్
కిద్వాయ్ దేశాన్ని బ్రిటిష్ పాలన నుండి విముక్తి చేయడం కోసం పోరాడారు. MAO కళాశాల పట్టభద్రుడు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ తన గురువుగా భావించి అనేక
సంస్కరణలను తీసుకురావడంలో మరియు అన్యాయానికి వ్యతిరేకంగా అత్యంత దృఢ నిశ్చయంతో
పోరాడడంలో రఫీ అహ్మద్ కిద్వాయ్ చేసిన ప్రయత్నాలు ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయి. రఫీ
అహ్మద్ కిద్వాయ్ చివరి వరకు నిబద్ధత కలిగిన స్వాతంత్ర్య సమరయోధుడు.
రఫీ అహ్మద్ కిద్వాయ్ ఖిలాఫత్ ఉద్యమం మరియు సహాయ నిరాకరణ ఉద్యమం లో
పాల్గొన్నాడు మరియు జైలు శిక్ష కూడా అనుభవించాడు. 1922లో, రఫీ అహ్మద్
కిద్వాయ్ జైలు నుండి విడుదలైన తర్వాత ళ్లి మోతీలాల్ నెహ్రూకు ప్రైవేట్
కార్యదర్శిగా పనిచేశాడు. 1926లో, రఫీ అహ్మద్ కిద్వాయ్ బ్రిటిష్ ఇండియా సెంట్రల్
లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు మరియు 1926 నుండి 1929 వరకు
కాంగ్రెస్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి చీఫ్ విప్‌గా పనిచేసాడు. చేసింది. రఫీ అహ్మద్
కిద్వాయ్ యునైటెడ్ ప్రావిన్సెస్ కాంగ్రెస్ కమిటీకి కార్యదర్శి పదవిని కూడా
నిర్వహించారు.
రఫీ అహ్మద్ కిద్వాయ్ సోషలిస్ట్ ఉద్యమంలో పాల్గొన్నారు. రఫీ అహ్మద్ కిద్వాయ్
1935 లో యునైటెడ్ ప్రావిన్సెస్‌లో పండిట్ గోవింద్
వల్లభ్ పంత్ క్యాబినెట్‌లో రెవెన్యూ మరియు జైలు శాఖలను నిర్వహించే బాధ్యతను
నిర్వహించారు. రఫీ అహ్మద్ కిద్వాయ్ 1946 లో యుపి హోం మంత్రి అయ్యారు.
స్వాతంత్ర్యం తర్వాత, జవహర్ లాల్ నెహ్రూ క్యాబినెట్‌లో రఫీ అహ్మద్ కిద్వాయ్ భారతదేశానికి మొదటి కమ్యూనికేషన్ మంత్రి అయ్యారు.. 1948లో రఫీ అహ్మద్ కిద్వాయ్ ప్రారంభించిన "మీ స్వంత టెలిఫోన్" సేవ ఇప్పటికీ OYT పేరుతో కొనసాగుతోంది; దీని కింద కొత్త టెలిఫోన్ పొందవచ్చు. అదే సంవత్సరంలో, రఫీ అహ్మద్ కిద్వాయ్ కమ్యూనికేషన్ల మంత్రిగా నైట్ ఎయిర్ మెయిల్ సేవను కూడా ప్రారంభించారు.
14.సైత్ యాకూబ్ హసన్
(1875-1940)
Saith Yaqoob
Hasan (1875-1940)
సైత్ యాకూబ్ హసన్ (మౌలానా యాకూబ్
హసన్ సైత్) ఒక భారతీయ వ్యాపారవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు మరియు రాజకీయ నాయకుడు, రాజాజీ
(1937-1939) కింద మద్రాస్ ప్రెసిడెన్సీలో ప్రజా పనులకు క్యాబినెట్ మంత్రిగా
పనిచేశాడు. సైత్ యాకూబ్ హసన్ 1916లో, సైత్ సౌత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా మద్రాస్
లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. సైత్ యాకూబ్ హసన్ INCలో చేరి 1919లో
ఖిలాఫత్ ఆందోళనలలో పాల్గొని ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించారు. సహాయ నిరాకరణ
ఉద్యమంలో పాల్గొన్నందుకు 1921లో మరోసారి జైలు శిక్ష అనుభవించారు.
1923లో సైత్ యాకూబ్ హసన్ కాంగ్రెస్‌కు
రాజీనామా చేసి మద్రాస్ ప్రావిన్స్ ముస్లిం లీగ్‌ను స్థాపించారు. 1937 ఎన్నికలకు
ముందు, సాయిత్
మద్రాస్ ప్రావిన్షియల్ ముస్లిం లీగ్‌ను విడిచిపెట్టి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో
చేరాడు. త్వరలోనే, సైత్
యాకూబ్ హసన్ మద్రాస్ ప్రావిన్షియల్ కాంగ్రెస్ అగ్ర నాయకులలో ఒకడు అయ్యాడు. సైత్
యాకూబ్ హసన్ రెండు దేశాల సిద్ధాంతాన్ని ఖండించాడు మరియు ఐక్య భారతదేశానికి మద్దతు
ఇచ్చాడు.
15. షోబ్ ఖురేషి Shoeb Qureshi
గాంధీజీ నిర్బంధ సమయంలో షోబ్ ఖురేషి ‘హరిజన్’ పత్రికకు
ఎడిటర్ గా పనిచేసారు.
No comments:
Post a Comment