పంజాబ్‌లోని మాలేర్‌కోట్ల జిల్లాలోని ఒక సిక్కు కుటుంబం మసీదు నిర్మాణం కోసం స్థానిక ముస్లిం సమాజానికి భూమిని విరాళంగా ఇచ్చింది.
ఉమర్‌పురా గ్రామ మాజీ సర్పంచ్ సుఖ్‌జిందర్ సింగ్ నోని మరియు అతని సోదరుడు అవ్నిందర్ సింగ్ మసీదు కోసం 5.5 బిశ్వాస్ విలువైన భూమిని విరాళంగా ఇచ్చారు.
1947 విభజన తర్వాత భారతదేశంలోనే మిగిలి ఉన్న గణనీయమైన ముస్లిం జనాభా కలిగిన పంజాబ్‌లోని ఏకైక జిల్లాగా మాలేర్‌కోట్ల ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది.
గ్రామంలోని ముస్లిం సమాజానికి ప్రార్థనా స్థలం లేకపోవడంతో తరచుగా పొరుగు గ్రామాలకు వెళ్లి ప్రార్థనలు చేయాల్సి వస్తుందని సుఖ్‌జిందర్ సింగ్ వివరించారు.. "మా గ్రామ జనాభాలో దాదాపు 30 శాతం మంది ముస్లింలు, వారికి మసీదు లేదు. నేను మరియు నా సోదరుడు మస్జిద్ కోసం భూమిని దానం చేయాలని నిర్ణయించుకున్నాము" అని ఆయన అన్నారు. విరాళంగా ఇచ్చిన భూమి విలువ రూ. 7–8 లక్షలు ఉంటుందని అంచనా.
జనవరి 12న, 2025న పంజాబ్‌కు చెందిన షాహి ఇమామ్, మొహమ్మద్ ఉస్మాన్ రెహ్మాన్ లుధియాన్వి, సిక్కు-ముస్లిం సమాజ సభ్యుల సమక్షంలో మసీదుకు పునాది వేశారు. సిక్కు కుటుంబం చేసిన చర్యను ప్రేమ మరియు మానవత్వం యొక్క లోతైన సందేశంగా ఇమామ్ ప్రశంసించారు.
ఇతర సిక్కు గ్రామస్తులు కూడా మసీదు నిర్మాణానికి మద్దతు ఇచ్చారు. తేజ్వంత్ సింగ్ రూ. 2 లక్షలు, రవీందర్ సింగ్ గ్రేవాల్ రూ. 1 లక్ష విరాళం ఇచ్చారు. వారి సమిష్టి ప్రయత్నాలు గ్రామంలోని బలమైన సంఘీభావ బంధాలను ప్రదర్శిస్తాయి
మసీదు నిర్మాణ౦ మత సామరస్యానికి చిహ్నంగా మారింది, సహజీవనం మరియు
పరస్పర గౌరవం యొక్క విలువలను బలోపేతం చేసింది. ఇది మాలెర్కోట్లలోని సిక్కు మరియు
ముస్లిం వర్గాల మధ్య ఉమ్మడి చరిత్ర మరియు సద్భావన యొక్క శాశ్వత వారసత్వాన్ని కూడా
హైలైట్ చేస్తుంది.
మూలం: ముస్లిం మిర్రర్, జనవరి 15, 2025
No comments:
Post a Comment