జలంధర్‌కు చెందిన అఫ్రిదీ పఠాన్, అలీగఢ్ క్రికెట్ జట్టు కెప్టెన్ అయిన అహ్సన్-ఉల్-హక్, 1901లో డబ్ల్యూ. జి. గ్రేస్ లండన్ కౌంటీ జట్టుపై, మిడిల్‌సెక్స్ తరఫున అరంగేట్రం చేసి, ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన మొదటి భారతీయ ముస్లింగా నిలిచాడు
1895లో, అప్పటి కెప్టెన్ షౌకత్ అలీ (తరువాత
రాజకీయాల్లో చేరిన అలీ సోదరులలో ఒకరు) అఫ్రిదీ పఠాన్ అహ్సన్-ఉల్-హక్ ని ఎంఏఓMAO కాలేజ్ క్రికెట్ XI (ప్రస్తుతం ఏఎంయూAMU) జట్టులోకి తీసుకున్నాడు. ప్రారంభంలో విఫలమైనప్పటికీ
షౌకత్అలీ, అహ్సన్-ఉల్- హక్‌ను జట్టులోనే కొనసాగించాడు. 1898లో, అహ్సన్-ఉల్- హక్ న్యాయశాస్త్రం అభ్యసించడానికి
లండన్‌కు వెళ్ళాడు. ఇంగ్లాండ్‌లో, అహ్సన్-ఉల్- హక్ స్నేహితుడు మరియు షౌకత్ అలీ
సోదరుడైన ముహమ్మద్ అలీ జౌహర్, అహ్సన్-ఉల్- హక్‌కు క్రికెట్ వర్గాలతో సంబంధాలు
ఏర్పరచుకోవడానికి సహాయపడి,
అహ్సన్-ఉల్- హక్ కి హాంప్‌స్టెడ్ క్లబ్ క్రికెట్
జట్టులో ప్రవేశం కల్పించాడు.
1902
నాటికి, అహ్సన్-ఉల్- హక్ ఇంగ్లాండ్‌లో అత్యంత ప్రసిద్ధి
చెందిన క్రికెటర్లలో ఒకడిగా నిలిచాడు, కానీ
భారతదేశానికి తిరిగి వచ్చి న్యాయ సేవల్లో చేరాడు. అహ్సన్-ఉల్- హక్ క్రికెట్ ఆడటం కొనసాగించారు మరియు
అలీగఢ్, ఇతర జట్లకు కూడా కెప్టెన్‌గా
వ్యవహరించారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన శతకాలలో రెండవ స్థానంలో
ఉన్న రికార్డు అహ్సన్-ఉల్- హక్
పేరిట ఉంది. అహ్సన్-ఉల్- హక్
1924లో లాహోర్‌లో 40 నిమిషాల్లో ఈ శతకాన్ని సాధించారు.
రాజకీయ, న్యాయవ్యవస్థలో
ప్రముఖుడైన అహ్సన్-ఉల్- హక్, బీసీసీఐ ఏర్పాటులో కూడా కీలక పాత్ర
పోషించారు.
No comments:
Post a Comment