రోగులకు, నిరుపేదలకు స్వస్థత చేకూర్చిన అద్భుతమైన హకీం అజ్మల్
ఖాన్‌తో ముడిపడి అనేక కథలు ఉన్నాయి.
పాశ్చాత్య
సూటు ధరించి, ఒక చిన్న పెట్టెను పట్టుకుని
పారిస్‌లోని ఒక వీధిలో నడుస్తున్న ఒక ప్రాచ్య దేశస్థుడు, నేలపై
దొర్లుతున్న ఒక వ్యక్తిని చూశాడు. అతను వెంటనే తన మందుల పెట్టెలోంచి ఏదో తీసి
అతనికి ఇచ్చాడు.. కొన్ని నిమిషాల తర్వాత, ఆ వ్యక్తి లేచి,
కృతజ్ఞతగా తల ఊపి వెళ్ళిపోయాడు. ఆ ప్రాచ్య దేశస్థుడే హకీం అజ్మల్
ఖాన్.
హకీం
అజ్మల్ ఖాన్ 1925లో ఫ్రాన్స్
పర్యటన సందర్భంగా తన షేర్వానీ, పైజామాలను పక్కనపెట్టి సూటు
ధరించారు. అజ్మల్ ఖాన్ వద్ద ఒక మాయా పెట్టె ఉండేదని, దానిలోంచి
మందులు తీసి దాదాపు అద్భుతాలు సృష్టించేవారని తరతరాల ఢిల్లీవాసులు బలంగా
నమ్మేవారు. ఉదాహరణకు, ఇంగ్లాండ్‌లో నెలసరి అసాధారణంగా
రక్తస్రావం అవుతున్న ఒక మహిళకు, ఇరాక్‌లోని ఒక
పుణ్యక్షేత్రంలో మూర్ఛ వ్యాధిగ్రస్తుడికి హకీం అజ్మల్ ఖాన్ స్వస్థత చేకూర్చారు హకీం అజ్మల్ ఖాన్ రాంపూర్ నవాబు వద్ద
తొమ్మిదేళ్లపాటు అతిథిగా గడిపారు, అక్కడ మరణశయ్యపై ఉన్న ఒక బేగంను బ్రతికించారు.
1927లో హకీం అజ్మల్ ఖాన్ మరణించినప్పటి నుండి, సంవత్సరాలు గడిచేకొద్దీ, కరోల్ బాఘ్‌లోని యునానీ తిబ్బియా కళాశాలను స్థాపించిన ఆ గొప్ప హకీంను ప్రజలు మరిచిపోయినట్లు కనిపిస్తోంది. జామియా మిలియా ఇస్లామియా వ్యవస్థాపకులలో ఒకరైన హకీం అజ్మల్ ఖాన్ 1920లో దాని మొదటి ఛాన్సలర్‌గా కూడా పనిచేసినారు. హకీం సాహిబ్ జామియా మిలియాలో యునానీ వైద్యంలో సాహిత్య మరియు చారిత్రక పరిశోధనల కోసం ఒక సంస్థను స్థాపించాలని నిర్ణయించారు. ప్రతిపాదిత ఈ సంస్థ, ఇప్పటివరకు ఉర్దూ మరియు అరబిక్ భాషలలో మాత్రమే లభ్యమవుతున్న యునానీ వైద్యంపై ఉన్న ప్రాచీన గ్రంథాలను అనువదిస్తుంది.
హకీం
అజ్మల్ ఖాన్, హకీం షరీఫ్ ఖాన్ వంశానికి
చెందినవారు. హకీం అజ్మల్ ఖాన్ తండ్రి హకీం మహమూద్ ఖాన్, షరీఫ్
ఖాన్ యొక్క ముగ్గురు కుమారులలో ఒకడు. అలాగే హకీం మహమూద్ ఖాన్ ముగ్గురు కుమారులలో అజ్మల్ ఖాన్ చిన్నవాడు..
హకీం
అజ్మల్ ఖాన్ 1906లో టిబ్బియా కాన్ఫరెన్స్‌ను
స్థాపించారు. ఏటేటా గడిచేకొద్దీ హకీం అజ్మల్ ఖాన్ ప్రజాదరణ పెరిగింది మరియు వైద్యం,
రాజకీయాలు మరియు మతంపై అతని అభిప్రాయాలను హిందువులు, ముస్లింలు మాత్రమే కాకుండా సి.ఎఫ్. ఆండ్రూస్ మరియు ఢిల్లీ చీఫ్ కమీషనర్
సర్ మాల్కం హేలీ వంటి యూరోపియన్లు కూడా విస్తృతంగా గౌరవించే వ్యక్తిగా పరిగణించబడటం
ప్రారంభించాడు. అజ్మల్ ఖాన్ కంటే ఆరు సంవత్సరాలు చిన్నవాడైన మహాత్మా గాంధీ,
1920లో యునాని టిబ్బియా కళాశాలను ప్రారంభించారు.
గమనించదగ్గ
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అజ్మల్ ఖాన్ మొదట
మొఘల్ అంగర్ఖాలను ధరించడం ప్రారంభించి, ఆ తర్వాత అలీగఢ్
షేర్వానీ, పైజామాలకు మారారు. 1911
మరియు 1925లో అతను చేసిన విదేశీ పర్యటనల కోసం, అలాగే మధ్యలో మధ్యప్రాచ్యంలోని షియా మత ప్రదేశాలకు వెళ్ళినప్పుడు సూట్లు
ధరించారు.
అనేకమంది
రచయితలు తమ రచనలలో హకీం అజ్మల్ ఖాన్ ను ప్రస్తావించారు. అహ్మద్ అలీ తన
"ట్వైలైట్ ఇన్ ఢిల్లీ"నవలలో కథానాయకుడైన మీర్ నిహాల్ పక్షవాతం కు
గురియైనప్పుడు అందుకు కు చికిత్స చేసిన వ్యక్తిగా హకీం అజ్మల్ ఖాన్ ను అందులో
ప్రస్తావించకుండా ఉండలేకపోయాడు. బార్బరా డి. మెట్‌కాఫ్, అజ్మల్ ఖాన్ మరియు అతని కుటుంబంపై ఒక
పాండిత్యపూర్ణమైన పత్రాన్ని రచించినాడు
హకీమ్
సాహిబ్ వద్ద రోగాన్ని నయం చేయడంలో ఎన్నడూ విఫలం కాని ఒక ప్రత్యేకమైన మూలికా సూత్రం
(అమల్-ఇ-తస్ఖీర్) ఉందనే నమ్మకం కొనసాగింది. అజ్మల్ ఖాన్ “మసీహా-ఎ-హింద్!”.అనే పేరు
గడించినాడు.
No comments:
Post a Comment