23 April 2026

విద్య ద్వారా తష్లిమ నష్రిన్ మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు Thashlima Nashrin Became a Symbol of Communal Harmony Through Education

 

 

మదురైకి చెందిన దివ్యాంగురాలైన తష్లిమ నష్రిన్, తమిళనాడు యొక్క 'ఇల్లం తేడి కల్వి' పథకం కింద గ్రామ పిల్లలకు బోధించడానికి స్వచ్ఛంద సేవకురాలిగా పనిచేస్తున్నారు. మురుగన్ ఆలయంలో తరగతులు నిర్వహిస్తూ, మత భేదాలకు అతీతంగా విద్య, మానవత్వం నిలుస్తాయని నిరూపిస్తూ, సాంఘిక సామరస్యానికి ప్రతీకగా తష్లిమ నష్రిన్ నిలిచారు.

తమిళనాడులోని మదురై జిల్లా, మున్నమలైపట్టి గ్రామానికి చెందిన దివ్యాంగురాలు అయిన  తష్లిమ నష్రిన్‌ ఒక సాధారణ ముస్లిం కుటుంబానికి చెందినవారు. తష్లిమ నష్రిన్‌ శారీరక సవాళ్లు ఉన్నప్పటికీ, చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీని విజయవంతంగా పూర్తి చేశారు.

కోవిడ్-19 మహమ్మారి సమయంలో పాఠశాలలు మూతపడటంతో, 1 నుండి 8వ తరగతి విద్యార్థులు తమ చదువులో ఏర్పడే అంతరాన్ని పూడ్చేందుకు, పిల్లలు తమ వయసుకు తగిన ప్రాథమిక నైపుణ్యాలను తిరిగి నేర్చుకునేలా తమిళనాడు ప్రభుత్వం “ఇల్లం తేడి కల్వి” (“మీ ఇంటి వద్దకే విద్య”) పథకాన్ని ప్రారంభించింది.

“ఇల్లం తేడి కల్వి” పథకం కింద, రెగ్యులర్ ఉపాధ్యాయులను నియమించకుండా, ప్రభుత్వం స్థానిక వాలంటీర్లను భాగస్వాములను చేసింది. తద్వారా పిల్లలు వారితో సులభంగా అనుసంధానమై తమ చదువును కొనసాగించగలిగారు. ఈ తరగతులు పాఠశాల భవనాలలో కాకుండా, పిల్లల ఇళ్లకు సమీపంలో దేవాలయాలు, కమ్యూనిటీ సెంటర్లు లేదా బహిరంగ మైదానాలు వంటి ప్రజా ప్రదేశాలలో నిర్వహించబడతాయి.

తమిళనాడు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు, తష్లిమ ఈ కార్యక్రమంలో వాలంటీర్‌గా దరఖాస్తు చేసుకుని, తన గ్రామంలోని స్థానిక పిల్లలకు బోధించే బాధ్యతను స్వీకరించింది.

అయితే, తష్లిమకు తరగతులు నిర్వహించడానికి స్థలం దొరకక ఇబ్బంది ఎదురైనప్పుడు, వెల్లరిపట్టి గ్రామంలోని మురుగన్ ఆలయ ప్రాంగణంలో తరగతులు నిర్వహించమని స్థానిక నివాసితులు సూచించారు. తష్లిమ ఆ సూచనను సంతోషంగా అంగీకరించింది.

తష్లిమ ముస్లిం మహిళ అయినప్పటికీ, పిల్లలకు బోధించడానికి స్థానిక ప్రజలు ఆలయంలో వెంటనే స్థలాన్ని కల్పించారు. తన శారీరక వైకల్యం ఉన్నప్పటికీ, తష్లిమా ప్రతి సాయంత్రం తన గ్రామం నుండి మురుగన్ ఆలయంలోని ప్రశాంతమైన వాతావరణంలో పిల్లలకు పాఠాలు చెప్పడానికి అక్కడికి వెళ్తుంటారు.

తష్లిమ మరియు వెల్లారిపట్టి గ్రామ ప్రజలు కలిసి, సామాజిక సామరస్యానికి ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలిచారు.. తష్లిమా విద్య కోసం మతపరమైన అడ్డుగోడలను పక్కన పెట్టే తమిళనాడు యొక్క “ద్రావిడ నమూనాకు” మరియు మత సామరస్య స్ఫూర్తికి ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.

నేటి తరుణంలో, తష్లిమ నస్రీన్ మత సామరస్యానికి ఒక అసాధారణమైన ప్రతీకగా నిలిచారు. తష్లిమ కథ ఎంతో స్ఫూర్తిదాయకంగానూ, అత్యంత విశేషమైనదిగానూ పరిగణించబడుతోంది.

No comments:

Post a Comment