ఉత్తరప్రదేశ్‌లోని
మొరాదాబాద్ జిల్లాలోని సంభాల్ పట్టణం లో ఒక పండితుల కుటుంబం లో మౌలానా ఇస్మాయిల్ సంభాలి 1899లో
జన్మించినారు. మౌలానా ఇస్మాయిల్ సంభాలి తండ్రి మున్షి కిఫాయతుల్లా మరియు తాత పేరు సర్వర్
హుస్సేన్.
మౌలానా ఇస్మాయిల్ సంభాలి తన ప్రాధమిక విద్య అబ్యసించిన తరువాత అరబిక్ విద్యను పొందినాడు. మౌలానా
ఇస్మాయిల్ సంభాలి చిన్న తనం లోనే జాతీయవాదం చే ఆకర్షితుడు అయి స్వాతంత్ర్య
పోరాటంలో పాల్గొనాడు.
జలియన్‌వాలాబాగ్‌లో
జరిగిన అనాగరిక సంఘటనకు నిరసనగా సంబల్‌లో నిరసన సమ్మె జరిగింది మరియు మౌలానా ఇస్మాయిల్ సంబ్లి సంబల్‌లో జరిగిన సామూహిక
సమావేశంలో స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసం ఇచ్చారు. అప్పటినించి మౌలానా
ఇస్మాయిల్, మౌలానా రయీస్-ఉల్
ముకార్రరీన్ (మాస్టర్ వక్త)గా ప్రజాదరణ పొందారు.
ఖిలాఫత్
ఉద్యమం లో మౌలానా
ఇస్మాయిల్ సంభాలి చురుకుగా పాల్గొన్నారు. మరియు ఫిబ్రవరి 22, 1921న అరెస్టు చేయబడి రెండు సంవత్సరాల కఠిన జైలు
శిక్ష విధించబడింది.
మౌలానా
ఇస్మాయిల్ సంభాలి మహాత్మా గాంధీ ప్రారంభించిన శాసనోల్లంఘన ఉద్యమo, ఉప్పు సత్యాగ్రహం లో కూడా చురుకుగా
పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రారంభించిన శాసనోల్లంఘన ఉద్యమంకు జమియతుల్ ఉలేమా మద్దతు ఇస్తామని ప్రతిజ్ఞ చేసింది. జమియతుల్
ఉలేమా “దైరా-ఎ-హరాబియా (యుద్ధ వృత్తం)ను స్థాపించింది. అందులోని ప్రముఖులలో ఒకడైన మౌలానా మొహమ్మద్ ఇస్మాయిల్ సంబ్లి అరెస్ట్
చేయబడి ఆరు నెలల కఠిన కారాగార శిక్ష అనుభవించారు..
మౌలానా
మొహమ్మద్ ఇస్మాయిల్ సంబ్లీ ప్రావిన్షియల్
అసెంబ్లీ ఎన్నికలలో ముస్లిం లీగ్ తరుపున యుపి లోని మొరాదాబాద్ మరియు తహసీల్ బిలారి
నియోజకవర్గాల సంభాల్ నుండి అభ్యర్థిగా ఎన్నికైనారు. శాసనోల్లంఘన ఉద్యమ సమయంలో మౌలానా ఇస్మాయిల్
సంబ్లిని మొరాదాబాద్‌లో అరెస్టు చేసి తొమ్మిది నెలల జైలు శిక్ష విధించారు. ఆగస్టు 1942లో 'భారతదేశాన్ని
విడిచి వెళ్లండి అనే క్విట్ ఇండియా ఉద్యమ
సందర్భం లో ' మౌలానా ఇస్మాయిల్ సంభ్లిని అరెస్ట్ చేసి ఒక సంవత్సరం తర్వాత విడుదల చేసారు.
1946లో, ఎన్నికలలో మౌలానా సంభ్లి ఎన్నికయ్యారు, 1952 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు.
మౌలానా ఇస్మాయిల్ సంభ్లి 1952
ఎన్నికలలో పాల్గొనలేదు మరియు ఢిల్లీలో జమియతుల్ ఉలేమా యొక్క నజీమ్-ఎ-అలాగా
ఉన్నారు. మౌలానా ఇస్మాయిల్ సంభ్లి నాలుగు సంవత్సరాలు జమియత్‌కు సేవలందించారు మరియు
సామాజిక మరియు రాజకీయ వ్యవహారాల్లో బిజీగా ఉన్నారు. 1957లో మౌలానా ఇస్మాయిల్ సంభ్లి జమియత్‌కు
రాజీనామా చేసి సంభల్‌కు తిరిగి వచ్చారు.
1962లో, మౌలానా ఇస్మాయిల్ సంభ్లి మొరాదాబాద్‌లోని
ఇమ్దాడియా మదర్సాలో షేఖుల్ హదీస్‌గా నియమితులయ్యారు మరియు అక్కడ దాదాపు మూడు
సంవత్సరాలు పనిచేశారు.
1974లో, మౌలానా ఇస్మాయిల్ సంభ్లి సాహిత్య పనిలో నిమగ్నమయ్యారు.
“మకలత్-ఎ-తసవ్వుఫ్”, “అఖ్బరుల్ తంజీల్” (ఖురాన్ ప్రవచనాలు)
మరియు “తక్వీద్-ఎ-ఐమ్మా” మౌలానా ఇస్మాయిల్ సంభ్లి రచించిన కొన్ని ముఖ్యమైన
పుస్తకాలు.
మౌలానా ఇస్మాయిల్ సంభ్లి తన చివరి వయస్సులో, బొంబాయిలో రంజాన్ నెలలు గడిపి తరావీహ్ తర్వాత ప్రతి రాత్రి ఖురాన్ అనువాదం మరియు విశ్లేషణపై ఉపన్యాసాలు ఇచ్చారు.
మౌలానా ఇస్మాయిల్ సంభ్లి సుదీర్ఘ అనారోగ్యం
తర్వాత 1975 నవంబర్ 23న తుది శ్వాస విడిచారు.
No comments:
Post a Comment