లక్నోలోని ఫిరంగి మహల్ తో ముడిపడి ఉన్న ప్రముఖ
అన్సారీ కుటుంబం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటాన్ని ప్రారంభించింది అన్సారీ
కుటుంబం కు చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు హయతుల్లా అన్సారీ మరియు అతని భార్య
సుల్తానా హయత్ అన్సారీ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు.
భారత స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో, ఫిరంగి మహల్ అనేక మంది ప్రసిద్ధ
వ్యక్తులకు సమావేశ స్థలంగా ఉంది. మహాత్మా గాంధీ, మౌలానా అబ్దుల్ బారి, ముఫ్తీ
రజా అన్సారీ, హయతుల్లా అన్సారీ మరియు అనేక మంది
ప్రముఖ వ్యక్తులు అక్కడికి వెళ్ళేవారు.
హయతుల్లా అన్సారీ భార్య సుల్తానా హయత్ అన్సారీ
మహాత్మా గాంధీచే బాగా ప్రభావితమయ్యారు. సుల్తానా హయత్ అన్సారీ స్వదేశీ ఉద్యమం, ఖిలాఫత్
ఉద్యమం ఉద్యమంలో చురుకుగా పాల్గొంది.
సుల్తానా హయత్ అన్సారీ ప్రముఖ సంఘ సేవిక. సమాజంలో మహిళల తక్కువ స్థితి
గురించి తీవ్ర ఆందోళన చెందారు. మహిళల్లో ప్రబలంగా ఉన్న నిరక్షరాస్యత, లింగ అసమానత, ఆర్థిక ఆధారపడటం మరియు గృహ హింస పట్ల సుల్తానా
హయత్ అన్సారీ కలత చెందింది
గాంధీ స్ఫూర్తితో సుల్తానా హయత్ అన్సారీ మహిళా
హక్కులను సమర్థించారు.
1934లో విద్య, వృత్తి శిక్షణ మరియు మద్దతు ద్వారా
మహిళలకు సాధికారత కల్పించడానికి “బాజ్మ్-ఎ-ఖ్వాతీన్ Bazm-e-Khwateen” అనే మహిళా సంస్థను సుల్తానా హయత్ అన్సారీ స్థాపించారు.
"బాజ్మ్-ఎ-ఖ్వాతీన్" సంస్థ మహిళలకు
సంబంధించిన ప్రతి అంశాన్ని చర్చించింది మరియు మార్గదర్శకత్వం అందించింది.
బాజ్మ్-ఎ-ఖ్వాతీన్ మహిళల విద్యా శాతాన్ని మెరుగుపరచడానికి,సమాజంలో ప్రబలంగా ఉన్న
లింగ అసమానతను తొలగించడానికి తీవ్ర కృషి చేసింది.
"బాజ్మ్-ఎ-ఖ్వాతీన్" సంస్థ ద్వారా గృహ
హింసతో బాధపడుతున్న మహిళలకు కౌన్సెలింగ్ మరియు చట్టపరమైన సలహాలు అందించబడ్డాయి.
నిరాశ్రయులైన మరియు వితంతువులైన మహిళలకు ఆర్థికంగా స్వావలంబన చేయడానికి, తగిన మద్దతు, శిక్షణ మరియు ఆశ్రయం
కల్పించారు.ఆర్థికంగా బలహీనమైన మరియు పేద మహిళలకు వృత్తి శిక్షణ అందించింది.
"బాజ్మ్-ఎ-ఖ్వాతీన్" సంస్థ
సమావేశాలలో, మహిళల ఆలోచనలు, సమస్యలు మరియు అభివృద్ధి సమస్యలను
చర్చించేవారు.శిక్షణా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది.
సుల్తానా హయత్ అన్సారీ నాయకత్వంలో, చాలా మంది మహిళలు "బాజ్మ్-ఎ-ఖ్వాతీన్"
సంస్థలో చేరడం ప్రారంభించారు. "బాజ్మ్-ఎ-ఖ్వాతీన్" సంస్థ సమావేశాలు
లక్నోలోని “జననా పార్క్”లో ప్రతి నెలా జరిగేవి.
ప్రముఖ మహిళా ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ మరియు
స్వాతంత్ర్య సమరయోధురాలు అరుణ ఆసిఫ్ అలీ కూడా "బాజ్మ్-ఎ-ఖ్వాతీన్" సమావేశాలలో
పాల్గొన్నారు.
సుల్తానా హయత్ అన్సారీ, "బాజ్మ్-ఎ-ఖ్వాతీన్"
సమావేశాలకు నాయకత్వం వహించడమే కాకుండా గృహ విషయాలు, వైవాహిక విభేదాలు మరియు ఆర్థిక ఇబ్బందులపై మహిళలకు మార్గనిర్దేశం
చేశారు.
సుల్తానా హయత్ అన్సారీ "బాజ్మ్-ఎ-ఖ్వాతీన్"
సంస్థను 1934 నుండి 1992 వరకు నడిపించారు. ఈ సంస్థ చాలా మంది మహిళల భవిష్యత్తును
తీర్చిదిద్దింది, వారిని స్వావలంబన చేసింది మరియు వారికి
గౌరవప్రదమైన జీవితాన్ని అందించింది.
1992లో
సుల్తానా హయత్ అన్సారీ మరణం తరువాత, ఆమె
కోడలు బేగం షహనాజ్ సిద్రత్ “బాజ్మ్-ఎ-ఖ్వతీన్” నాయకత్వాన్ని చేపట్టారు.
సుల్తానా హయత్ అన్సారీ స్థాపించిన “బాజ్మ్-ఎ-ఖ్వతీన్”
సంస్థ నేటికీ మహిళల ఉజ్వల భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తోంది.
సుల్తానా హయత్ అన్సారీ “బాజ్మ్-ఎ-ఖ్వతీన్”
సంస్థ భారతదేశంలోని పురాతన సంస్థలలో ఒకటి, నేటికీ
విజయవంతంగా పనిచేస్తోంది.
No comments:
Post a Comment