15
అక్టోబర్ 1912 లో ఢాకా(బంగ్లాదేశ్) నైటింగేల్ బిరుదుతో
సత్కరించబడిన జోహ్రా బేగం కాజీ జన్మించింది. జోహ్రా
బేగం కాజీ, తండ్రి కాజీ
అబ్దుల్ సత్తార్. వైద్యుడు మరియు ప్రసిద్ధ రాజకీయ నాయకుడు. కాజీ అబ్దుల్
సత్తార్ ఆధునిక ఆలోచనాపరుడు మరియు మహిళల ఆధునిక విద్య సమర్ధకుడు.
జోహ్రా బేగం కాజీ బ్రిటిష్ పాలనలో అవిభక్త
భారతదేశంలోని (ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్) రాజ్‌నంద్‌గావ్‌లో జన్మించారు.
జోహ్రా బేగం కాజీ చురుకైన తెలివితేటలు మరియు నిర్భయ
మహిళ. జోహ్రా బేగం కాజీ తన ప్రారంభ విద్యను మొదటి డివిజన్‌లోనే ఉత్తీర్ణురాలైంది. 1928లో, జోహ్రా బేగం కాజీ అలీఘర్ ముస్లిం బాలికల కళాశాలలో చేరి, ఆపై అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం
నుండి ఇంటర్మీడియట్ సైన్స్ డిగ్రీని పొందింది.
జోహ్రా బేగం 1932లో, ఢిల్లీలోని లేడీ హార్డింజ్ మెడికల్
కాలేజ్ ఫర్ ఉమెన్ నుండి ఫస్ట్ క్లాస్ తో బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్
డిగ్రీని పొందింది. జోహ్రా బేగం కాజీ మెడిసిన్
డిగ్రీని పొందిన మొదటి బెంగాలీ ముస్లిం. జోహ్రా బేగం కాజీ సాధించిన విజయానికి వైస్రాయ్
మెడల్ లభించింది. ఆ తర్వాత FCPS (ఫెలో
ఆఫ్ ది కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ అండ్ సర్జన్స్) డిగ్రీని పొందింది.
జోహ్రా బేగం కాజీ మహిళల ఆరోగ్య సమస్యలను అర్థం
చేసుకుంది. ప్రసవ సమయంలో స్త్రీలు మగ వైద్యుల నుండి చికిత్స పొందడం సుఖంగా ఉండరని
మరియు సమాజంలో మహిళల ఆరోగ్యం గురించి ప్రత్యేక అవగాహన లేదని గ్రహించింది.
జోహ్రా బేగం కాజీ, గైనకాలజీలో ప్రత్యేక శిక్షణ పొందింది. లండన్‌లోని
రాయల్ కాలేజ్ ఆఫ్ అబ్స్టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ నుండి స్కాలర్‌షిప్
పొందిన తర్వాత, మహిళల ఆరోగ్యంలో అధికారిక నైపుణ్యాన్ని
అభివృద్ధి చేసుకుంది.
జాతీయ ఉద్యమ సమయం లో జోహ్రా బేగం కాజీ మరియు
ఆమె తోబుట్టువులు గాంధీజీ సేవాగ్రామ్ ఆశ్రమంలో కొంత సమయం గడిపారు.
32
సంవత్సరాల వయస్సులో, జోహ్రా
బేగం కాజీ రాజకీయ
నాయకుడు రజుద్దీన్ భూయాన్‌ను వివాహం చేసుకున్నాడు. జోహ్రా బేగం కాజీ కు 52 సంవత్సరాల వయసులో భర్త మరణించాడు. సొంత
పిల్లలు లేరు, కానీ అనేక మంది అనాథలను దత్తత
తీసుకుంది, వారిని తన సొంత పిల్లల్లాగే పెంచింది, వారికి మెరుగైన జీవితాన్ని మరియు
విద్యను అందించింది.
1947లో భారతదేశం విభజించబడినప్పుడు, జోహ్రా
బేగం కాజీ ఢాకా సమీపంలోని గోపాల్‌పూర్ అనే చిన్న పట్టణంలో శాశ్వతంగా స్థిరపడింది. తన
జీవితాన్ని స్త్రీ ఆరోగ్య సంరక్షణకు
అంకితం చేసింది. జోహ్రా బేగం కాజీ ప్రేరణతో, చాలా
మంది మహిళలు మహిళా డాక్టర్లు అయ్యారు
జోహ్రా బేగం ఢాకా మెడికల్ కాలేజీలో రెసిడెంట్
సర్జన్ పదవిని చేపట్టారు.
1952లో
బెంగాలీ భాషకు మద్దతుగా విద్యార్థులు ప్రదర్శన ఇచ్చినప్పుడు, జోహ్రా బేగం కాజీ విద్యార్థులకు వైద్య సేవలను
అందించడానికి ముందుకు వచ్చింది. అదేవిధంగా, 1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం జరిగినప్పుడు, జోహ్రా బేగం కాజీ గాయపడిన సైనికులు
మరియు యోధులను జాగ్రత్తగా చూసుకోవడం మరియు వారికి వైద్య సౌకర్యాలు అందించడం
ప్రారంభించారు. జోహ్రా బేగం కాజీ ఢాకా జాయింట్ మిలిటరీ కాలేజీలో గౌరవ కల్నల్‌గా
పనిచేస్తోంది.
జోహ్రా బేగం కాజీ గొప్ప వైద్యురాలిగా మాత్రమే కాదు, సమాజంలో నిజంగా మార్పు తీసుకొచ్చిన
మార్గదర్శక మహిళ. 1973లో పదవీ విరమణ చేసిన తర్వాత, జోహ్రా బేగం కాజీ స్థానిక మదర్సాలను
సందర్శించి, విద్యార్థులను ఉన్నత విద్యను
అభ్యసించడానికి ప్రోత్సహించేది. వైద్య రంగంలో విద్యార్థులు తమ భవిష్యత్తును
ఏర్పరచుకోవడానికి మార్గనిర్దేశం చేసేది. పదవీ విరమణ తర్వాత కూడా జోహ్రా బేగం కాజీ ఢాకాలోని
హోలీ ఫ్యామిలీ రెడ్ క్రెసెంట్ హాస్పిటల్‌లో కన్సల్టెంట్‌గా పనిచేశారు.
జోహ్రా బేగం కాజీకి 2002లో బేగం రోకేయా మెడల్ మరియు 2008లో ఎకుషే Ekushey మెడల్ లభించాయి. 7 నవంబర్ 2007న, జోహ్రా
బేగం కాజీ ఈ ప్రపంచానికి వీడ్కోలు పలికారు.
No comments:
Post a Comment