సమర్కాండ్ సిల్క్ రూట్‌లోని సంపన్నమైన మరియు అద్భుతమైన నగరం. ఇస్లామిక్
స్వర్ణ యుగ (8-14శతాబ్దం) మహిళా పండితురాలు ఫాతిమా అల్-సమర్కాండి12వ శతాబ్దంలో ఉజ్బెకిస్తాన్‌లోని సమర్కాండ్‌లో
జన్మించారు. మధ్య యుగాల నుండి, సమర్కాండ్ అనేక మంది
ఇస్లామిక్ పండితులకు, ఇస్లామిక్ సైన్స్, కళ మరియు సంస్కృతికి
జన్మస్థలంగా ఉంది.
ఫాతిమా అల్-సమర్కాండి తండ్రి ప్రసిద్ధ హనాఫీ న్యాయవేత్త మరియు సమర్కాండ్
పండితుడు అయిన ముహమ్మద్ ఇబ్న్ అహ్మద్ అల్-సమర్కాండి.
ఫాతిమా తండ్రి ప్రసిద్ధ హనాఫీ న్యాయశాస్త్ర రచన ‘తుఫత్ అల్-ఫుఖా’ రచయిత.
ఫాతిమా విద్యను తన తండ్రి వద్ద అబ్యసించి ఖురాన్, కాలిగ్రఫీ, హదీసులు, ముస్లిం న్యాయంలో ప్రావీణ్యం సంపాదించింది. ఇస్లామిక్ చట్టంలో నిపుణురాలిగా
మారింది
ఫాతిమా వివాహం ఇస్లామిక్ న్యాయ శాస్త్రంలో నిపుణుడైన 'అలా' అల్-దిన్ అల్-కసానితో జరిగింది.), అల్-కసాని లేదా అల్-కషానిగా పిలువబడే 'అలా' అల్-దిన్ అల్-కసాని'12వ శతాబ్దపు సున్నీ ముస్లిం న్యాయవేత్త.
అలా' అల్-దిన్ అల్-కసాని ఫాతిమా తండ్రి రాసిన 'తుహ్ఫత్ అల్-ఫుఖాహా' అనే పుస్తకంపై వ్యాఖ్యానం రాశాడు, దీనికి ‘బదాయి అల్-సనా'యి ఫి తర్తిబ్ అల్-షరా'యి Bada'i al-Sana'i fi Tartib al-Shara'i’ అని పేరు పెట్టారు. అలా అల్ దిన్ సామర్థ్యాన్ని చూసి, అతనికి ప్రసిద్ధ సున్నీ లా స్కూల్ ద్వారా
"మాలిక్ అల్ ఉలామా" అంటే పండితుల రాజు అనే బిరుదు ఇవ్వబడింది, అలా' అల్-దిన్ అల్-కసాని అనేక
విషయాలలో భార్య ఫాతిమా సలహా తీసుకునేవాడు.
ఫాతిమా న్యాయశాస్త్రంలో నైపుణ్యాన్ని సంపాదించి, ఇస్లామిక్ శాస్త్రాల ఉపాధ్యాయురాలిగా కూడా
పనిచేశారు. ఫాతిమా ఇస్లామిక్ చట్టంలో రాణించింది మరియు ఫత్వాలు జారీ చేసెది.ఫాతిమా
చాలా తెలివిగా ఫత్వాలు రాసేది. ఫాతిమా ఫత్వాలు చాలా
జాగ్రత్తగా రాసేది మరియు తండ్రి మరియు భర్త సంతకం చేసిన తర్వాత, ఫత్వాను గ్రహీతకు ఇచ్చేది. ఫాతిమా రాసిన ఫత్వాల
యొక్క ప్రామాణికత మరియు విశ్వసనీయత చాలా రెట్లు పెరిగింది.
ఫాతిమా మరియు ఆమె భర్త ఇద్దరూ సిరియాలోని అలెప్పోకు మారారు. అక్కడ, ఫాతిమా మరియు ఆమె భర్త ఇద్దరూ అలెప్పోలోని ఉమయ్యద్
మసీదులో బోధించడం ప్రారంభించారు. ఫాతిమా పురుషులు మరియు మహిళలకు సమానం గా బోధించింది. ఫాతిమా
అల్-సమర్కాండి తన భర్త అలా అల్-దిన్ కసాని కంటే చాలా జ్ఞానవంతురాలు మరియు ప్రతిభావంతురాలు.
ఫాతిమా అల్-సమర్కాండి గొప్ప పండితురాలు, దయగల
దాతృత్వ మహిళ కూడా. రంజాన్ మాసంలో అలెప్పోలోని న్యాయశాస్త్ర పండితులకు ఆహారం
పెట్టడానికి ఫాతిమా తన కంకణాలను అమ్మేసి భోజనం పెట్టె రంజాన్ సంప్రదాయాన్ని
ప్రారంభించింది
ఫాతిమా అల్-సమర్కాండి తన సమకాలీనులలో చాలా మంది
కంటే చాలా ఎక్కువ నేర్చుకున్న మరియు గౌరవనీయమైన మహిళ.
No comments:
Post a Comment